harish rao inaugurates dumping yard in siddipet - Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య కార్మికుడి యూనిఫాంలో మంత్రి హరీశ్‌

Published Wed, Feb 3 2021 9:12 AM | Last Updated on Wed, Feb 3 2021 6:32 PM

Harish Rao Inaugurates Dumping Yard In Siddipet - Sakshi

సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని బుస్సాపూర్‌ డంపింగ్‌ యార్డులోని తడి, పొడి చెత్తను వేరుచేసే యంత్రాన్ని మంగళవారం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుడి యూనిఫాం వేసుకుని అక్కడున్న కార్మికులతో కలిసి పనిచేశారు. మంత్రి మాట్లాడుతూ, వ్యర్థం అనుకున్న ప్రతి వస్తువును ఉపయోగకరంగా మార్చుకోవచ్చని చెప్పారు.     

సాక్షి, సిద్దిపేట:  వ్యర్థ పదార్థాలు, మనకు ఇబ్బంది కరంగా ఉన్న చెత్త, చెదారాన్ని కాస్తా ఆలోచించి, కొద్దిపేట శ్రమను జోడిస్తే ఉపయోగకరమైన పదార్థాలుగా, ఎరువులుగా తయారు చేసుకోవచ్చని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట రూరల్‌ మండలం బుస్సాపూర్‌లో చెత్త రీసైక్లింగ్‌ యూనిట్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  సిద్దిపేట పట్టణంలో రోజుకు 40 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందన్నారు.  ఈ తడి, పొడి చెత్తనే వేరు చేసేందుకు రూ. 2.5 కోట్లతో  మానవ ఘన వ్యర్థాల నిర్వాహణ(ఎఫ్‌ఎస్‌టీపీ) కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ఇటుకల తయారీని పరిశీలిస్తున్న  ఆర్థిక మంత్రి హరీశ్‌రావు 

ఇప్పటికే సిరిసిల్లలో తొలుత నిర్మించామన్నారు. ఇలా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిదన్నారు. సెప్టిక్‌ ట్యాంకుల వ్యర్థాన్ని ఎఫ్‌ఎస్‌టీపీకి అందజేయాలన్నారు. దీన్ని ప్రాస్సెస్‌ చేసిన తర్వాత 16వేల లీటర్ల నీటిని పార్కులోని మొక్కలకు అందజేస్తారన్నారు. అదేవిధంగా 800 కేజీల ఎరువు వస్తుందని, ఈ ఎరువును రైతులకు ఉచితంగా అందజేస్తామన్నారు. డంప్‌యార్డులోకి ఎంత చెత్త వస్తుందనే విషయం తెలుసుకునేందరు.

రూ. 12లక్షలతో వే బ్రిడ్జి నిర్మించామన్నారు. అదేవిధంగా తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు రూ. 50లక్షలతో మిషన్‌ కొనుగోలు చేశామని తెలిపారు. వేరుచేసిన తడి చెత్త నుండి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నామన్నారు. అదేవిధంగా రూ. 30లక్షలతో కొనుగోలు చేసిన యంత్రంతో  పొడి చెత్తలోని ప్లాస్టిక్‌ నుంచి సిమెంట్‌ బ్రిగ్స్, ఇతర కుండీలు, అలంకరణ వస్తువులు తయారు చేస్తున్నామన్నారు.  

త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్‌
త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్‌ శుభవార్తను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పనున్నారని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.  కరోనాతో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. త్వరలోనే రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలతో కూడిన నోటిఫికేషన్‌ రానుందని, అందుకోసం జిల్లాలో ప్రత్యేక శిక్షణ కేంద్రాలను యువతకు అందుబాటులో ఉంచడంతో పాటుగా, మెటీరియల్‌ను అందించనున్నట్లు తెలిపారు.   

దశల వారీగా  ప్లాస్టిక్‌ రోడ్లు..
ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఉపయోగకరంగా మార్చే ప్రక్రియలో భాగంగా సిద్దిపేటలో రాబోయే రోజుల్లో ప్లాస్టిక్‌ రోడ్లు వేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ రోడ్ల నిర్మాణం జరుగుతుందని గుర్తు చేశారు. సిద్దిపేటలో కొంత భాగాన్ని ఎంపిక చేసుకొని ప్లాస్టిక్‌ రోడ్లు వేస్తామని, దాని ఫలితాలను బట్టి దశల వారీగా విస్తరిస్తామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement