సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మరోసారి హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. ఈదురు గాలులతో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, సరూర్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్, పంజాగుట్ట, ఎల్‌బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, రాజేంద్రనగర్, కిస్మత్‌పూర్, రాంనగర్, మోహిదీపట్నం, లంగర్‌హౌజ్, అత్తాపూర్‌లో వర్షం పడింది.
దీంతో అనేక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయ్యాయి. పలు చోట్ల రోడ్లపై కూడా భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. జీహెచ్‌ఎంసీ హై అలర్డ్ ప్రకటించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచించింది.
ఎల్‌బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లోని పలు కాలనీలలో భారీగా వరద నీరు చేరి మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షానికి పలు ప్రాంతాలు మొత్తం అంధకారంగా మారాయి. ఇలాగే వర్షం కురిస్తే ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని అయ్యప్ప కాలనీ, బిఎన్ రెడ్డి నగర్ డివిజన్‌లోని హరిహారపురం, తట్టి అన్నారం, హయత్ నగర్ బస్సు డిపో పరిసర ప్రాంతాలలో భారీగా వరద నీరు వచ్చి ఇళ్లలోకి నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment