సాక్షి, హైదరాబాద్: చలిగాలులు, చిటపట కురిసే వాన జల్లుల మధ్య ఎవరైనా గజగజ వణుకుతారు. ఇంటి పట్టున వెచ్చగా ఉండటమే మంచిదనుకుంటారు. కానీ.. ఈ విద్యుత్ సిబ్బంది మాత్రం తమ విధ్యుక్త ధర్మాన్ని తూచ తప్పకుండా నిర్వర్తించి ఔరా.. అనిపించారు.
మంగళవారం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్‌లలో పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్–7లో స్తంభంపై మంటలు వస్తున్నాయంటూ స్థానికులు ఫిర్యాదు చేయడంతో సిబ్బంది రెయిన్‌కోట్లు ధరించి వర్షంలోనే స్తంభంపైకి ఎక్కి మరమ్మతులు చేపట్టారు. జోరు వానలోనూ తమ కర్తవ్యాన్ని నిక్కచ్చిగా నిర్వర్తించిన సిబ్బందిని బస్తీవాసులు అభినందించారు.
చదవండి: హైదరాబాద్ పరిధిలో 68% అధిక వర్షపాతం.. వరద నీరు ఇంకే దారేదీ?
Comments
Please login to add a commentAdd a comment