సాక్షి, హైదరాబాద్ : భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. ఆకాశానికి చిల్లు పడిందా అనేట్లుగా కురుస్తున్న వానలతో భాగ్యనగరం జలమయమైంది. గతవారం కురిసిన వర్షాలు, వరద ప్రభావం నుంచి ఇంకా తేరుకోకముందే నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తడంతో జనం బెంబేలవుతున్నారు. ఇక గతంలో ఎప్పుడు లేని విధంగా భారీ వర్షాలకు భాగ్యనగరంలో బైకులు, కార్లు కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వరదలపై సోషల్ మీడియాల్లో నెటిజన్‌లు ఫన్నీ మీమ్స్ క్రియోట్ చేసి వైరల్ చేస్తున్నారు.
(చదవండి : మంచి పడవ గురించి తెలపండి: బ్రహ్మాజీ)
తాజాగా మరోమారు హైదరాబాద్‌లో భారీ వర్షాలు అని వాతావరణశాఖ హెచ్చరించడంతో ఒక వ్యక్తి తన కారును ఏకంగా తాడుతో ఇంటి గేటుకు కట్టేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘గతంలో తడి, పొడి చెత్త కోసం రెండు బుట్టలను ఇచ్చినట్లు.. ఈ సారి ఒక తాడు, చైన్‌ను ఇస్తే బాగుంటుంది’ అని ఓ వ్యక్తి కామెంట్ చేయగా, పాపం వరద నీటితో తన కారును కొట్టుకొని పోకూడదని అతడు చేసిన ప్రయత్నం ఫలించాలని కోరుకుంటన్నా అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశారు. ఇక భారీ వర్షాలు అంటూ వాతావరణశాఖ హెచ్చరికతో ముందు జాగ్రత్తగా ఇలా తాడుతో కట్టేశారని మరికొంతమంది అతడి ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు.
ఇక హైదరాబాద్ ప్రస్తుత పరిస్థితి గురించి సినీ నటుడు బ్రహ్మాజీ కూడా తనదైన శైలిలో స్పందించారు. ఆయన ఇంటిలోకి నీరు చేరిన ఫొటోలను సోమవారం ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ‘ఇది మా ఇంటి పరిస్థితి.. ఓ మోటరు బోటు కొనాలనుకుంటున్న... దయచేసి మీకు తెలిసిన మంచి పడవ గురించి తెలపండి’అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. (భారీ వరద: కుంగిన పురానాపూల్ వంతెన)
Comments
Please login to add a commentAdd a comment