హైదరాబాద్, సాక్షి: హైడ్రా.. ఈ పేరు వినబడగానే ఓ ఉలిక్కిపాటు కనిపిస్తోంది తెలంగాణ అంతటా. ఎక్కడ తమ ఇళ్లు, బిల్డింగులపై బుల్డోజర్లు దూసుకొస్తాయో అని బెంబేలెత్తిపోతున్నారు కొందరు. అయితే..
హైడ్రా విధులు కేవలం కట్టడాల కూల్చివేత మాత్రమే కాదు. ఇంకా చాలానే ఉన్నాయి. చెరువుల సుందరీకరణతో విపత్తుల నిర్వహణ, ట్రాఫిక్ నిర్వహణలో సహకారం వంటి కార్యక్రమాల్లో భాగం కానుంది. ఈ క్రమంలో ఇప్పుడు హైడ్రా వలంటీర్లు తెరపైకి వచ్చారు.
హైడ్రా వలంటీర్లు ఇకపై హైదరాబాద్‌లోని ముఖ్యమైన జంక్షన్‌లలో, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కనిపించనున్నారు. ట్రాఫిక్ పోలీసులకు వీళ్లు సహాయకులుగా పని చేయనున్నారు. ఇప్పటికే గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ 50 మంది హైడ్రా డీఆర్‌ఎఫ్ సిబ్బంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. త్వరలో హైడ్రా రేడియం జాకెట్లతో వీళ్లు సిగ్నల్స్ దగ్గర కనిపించనున్నారు.
హైడ్రా ట్రాఫిక్ వలంటీర్ల పేరిట ముఖ్యమైన కూడళ్లు, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులకు తోడుగా సేవలందించనున్నట్టు హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ ఇది వరకే ప్రకటించారు.
ఇదీ చదవండి: రండి బాబూ రండి..హైడ్రా అప్రూవ్డ్ ఇళ్లు కొనండి!
Comments
Please login to add a commentAdd a comment