
సాక్షి, హైదరాబాద్: త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. న్యాయమూర్తిగా అత్యధిక కేసులు పరిష్కరించి యూకే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శనివారం ఈ పురస్కారాన్ని న్యాయమూర్తికి అందజేశారు.
2017లో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్ 92 వేల కేసులు పరిష్కరించారు. హైదరాబాద్‌కు చెందిన ఆయన్ను సుప్రీంకోర్టు కొలీజియం 2017లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించింది. అనంతరం త్రిపుర హైకోర్టుకు బదిలీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment