
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రోడ్డు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మంత్రి కోమటిరెడ్డిని ప్రత్యేక హోదా పోరాట సమితి ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాలో మాట్లాడారు. ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశంపై అమలు కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ చెప్పారని గుర్తుచేశారు. అయితే ప్రత్యేక హోదా ఇప్పటికీ అమలుపర్చకపోవడం చాలా బాధకరమని తెలిపారు. ప్రత్యేక హోదా అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి పెట్టాలని అన్నారు. ప్రత్యేక హోదా అమలుపరిచే బాధ్యత ప్రస్తుత మోదీ ప్రభుత్వానిదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment