komati redd venkata reddy
-
యాదాద్రి కాదు ఇకపై యాదగిరి గుట్టనే: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి కాదు ఇకపై యాదగిరిగుట్టగా పిలువబుడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తూ త్వరలోనే జీఓ విడుదల చేస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు. ఆయన శనివారం మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడాడు. ‘ఎమ్మెల్యే కేటీఆర్ ఇప్పటికీ తండ్రి కేసీఆర్ చాటు కొడుకే. నేను ఉద్యమాలు చేసి వచ్చాను. మేం జీరో బిల్ ఇచ్చినట్టు.. కేటీఆర్‌కి జీరో నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి మాట్లాడడం వృథా. ఫ్లోర్ లీడర్ ఇవ్వకపోతే హరీష్ కూడా బీజేపీలోకి పోతాడు. కాళేశ్వరం కట్టిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డ ఎందుకు పోలేదు?. ... కాళేశ్వరం పనికిరాదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ప్రజలే కేసీఆర్‌ను నామరూపాలు లేకుండా చేశారు. ఎంపీ అభ్యర్థులపై అంతర్గత సర్వే జరుగుతోంది. భువనగిరి నుండి పోటీ చేయమని రాహుల్ గాంధీని కోరాను. భువనగిరి, ఖమ్మం, నల్గొండలో.. దక్షిణాదిలో టాప్ మెజార్టీ వస్తుంది. మోదీ కంటే రాహుల్ గాంధీ ఎక్కువ మెజారిటీతో గెలుస్తారు’ అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. -
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: తెలంగాణ మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రోడ్డు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మంత్రి కోమటిరెడ్డిని ప్రత్యేక హోదా పోరాట సమితి ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాలో మాట్లాడారు. ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశంపై అమలు కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ చెప్పారని గుర్తుచేశారు. అయితే ప్రత్యేక హోదా ఇప్పటికీ అమలుపర్చకపోవడం చాలా బాధకరమని తెలిపారు. ప్రత్యేక హోదా అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి పెట్టాలని అన్నారు. ప్రత్యేక హోదా అమలుపరిచే బాధ్యత ప్రస్తుత మోదీ ప్రభుత్వానిదని తెలిపారు. -
త్వరలో తెలంగాణాకి ప్రియాంకగాంధీ
-
మీరు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడలేరు!
సాక్షి, భువనగిరి: కరోనా మహమ్మారి కారణంగా దేశంలో లాక్డౌన్ విధించిన కారణంగా తీర్థయాత్రలకు వెళ్లిన దాదాపు వెయ్యి మంది తెలుగువాళ్లు కాశీలో చిక్కుకుపోయారు. వీరిలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పోచంపల్లి మండలం దేశ్‌ముఖ్ గ్రామానికి చెందిన బుచ్చయ్యతో పాటుగా 25 మంది ఉన్నారు. వీరితో పాటు సంగారెడ్డికి చెందిన 16 మంది, కరీంనగర్ జిల్లావాసి ఒకరు ఉన్నారు. లాక్డౌన్ కారణంగా కాశీలో చిక్కుకుపోయిన వారందరూ 60 ఏళ్లు పైబడిన వారే. అయితే తాము బీపీ, షుగర్లతో బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంట తీసుకువెళ్లిన మందులు, డబ్బులు అయిపోయాయని చాలా ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. సీఎం కేసీఆర్, కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డిలే తమని ఆదుకోవాలని విన్నవించుకుంటున్నారు. అయితే విషయం తెలుసుకున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. కాశీలో చిక్కుకున్న వారికి వెంటనే వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలని కోరారు. వారిని సాధ్యమైనంత త్వరగా వారి స్వస్థలాలకు చేర్చాలని కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కిషన్‌రెడ్డి అక్కడి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వారికి అన్ని ఏర్పాట్లు చేసి వారి స్వస్థలాలకు పంపుతామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హామీ ఇచ్చారు. తెలంగాణలో 47కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు -
పొత్తులొద్దు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో ఇతర పార్టీ లతో పొత్తులొద్దని కాంగ్రెస్ నాయకులు పార్టీ అధిష్టానానికి తేల్చి చెప్పారు. కూటమి కట్టొద్దని, ఒంటరిగా పోటీ చేస్తేనే గెలుస్తామని, లేకుంటే మళ్లీ పుట్టి మునగడం ఖాయమని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. పొత్తుల్లో జరిగిన జాప్యంతో పాటుగా, తెలంగాణలో చంద్రబాబు ప్రచారం కొంపముంచిందని, ఈ రెండు తప్పులను లోక్‌సభ ఎన్నికల్లో పునరావృతం కాకుం డా చూసుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమీక్షతో పాటు పంచాయతీ, లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేం దుకు టీపీసీసీ నేతలు వరుసగా రెండోరోజు శనివారం గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. మహబూ బ్‌నగర్, నాగర్‌కర్నూలు, ఖమ్మం, నల్లగొండ, భువన గిరి లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల పరిస్థితిపై నేతలు చర్చించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ టీడీపీతో పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి తీరని నష్టం కలిగించిందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబుతో పొత్తు అంశాన్ని రాష్ట్ర ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో టీఆర్ఎస్ విజయవంతమైనందునే ఘోర పరాభవం ఎదురైం దని, లేదంటే కనీసం 40– 45 స్థానాల్లో గెలిచే వారమన్నారు. లోక్‌సభ స్థానాల అభ్యర్థులను త్వరగా ప్రకటించాలని సూచించారు. నాన్చుడు ధోరణి వీడాలి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై దూకుడుగానే వెళ్లాలని, ఇకనైనా నాన్చుడు ధోరణి వీడాలని సమావేశంలో నేతలు నిర్ణయించారు. ఈవీఎంల విషయంలో న్యాయపోరాటం చేస్తూనే ప్రజాసమస్యలపై స్పం దించాలని, ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయిం చారు. ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు మాత్రం పొత్తుల విషయంలో భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశా రు. పార్టీ పెద్దలు మాట్లాడుతూ ఏఐసీసీ నిర్ణయం మేరకే టీడీపీతో పాటు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని, లోక్‌సభ ఎన్నికల్లో ఎలా ముం దుకెళ్లాలన్న దానిపై మరోమారు అధిష్టానంతో మాట్లాడతామని చెప్పినట్టు సమాచారం. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, మాజీ మం త్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జి.చిన్నారెడ్డి, నాగం జనార్దనరెడ్డి, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సీతక్క, చిరుమర్తి లిం గయ్య, హర్షవర్ధన్‌రెడ్డి, హరిప్రియానాయక్, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, వంగాల స్వామిగౌడ్ తది తరులు పాల్గొన్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన ముఖ్యనేతలు డీకే అరుణ, రేవంత్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, పొడెం వీరయ్యలు గైర్హాజరయ్యారు. టీడీపీతో పొత్తుతోనే ఓటమి: కోమటిరెడ్డి తెలుగుదేశంతో పొత్తుతోనే ఉద్యోగులు, యువత పార్టీకి దూరమయ్యారని, పొత్తుల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. సమీక్ష అనంతరం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మహాకూటమి వద్దని అసెంబ్లీ ఎన్నికల ముందే చెప్పానని, లోక్‌సభ ఎన్నికల్లో కూడా పొత్తులు వద్దని సూచించానని తెలిపారు. కూటమి గెలిస్తే చంద్రబాబు పాలన సాగిస్తారనే ప్రచారంతో పాటు ఎవరికి సీటు వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో కార్యకర్తలు అయోమయానికి గురయ్యారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులు లేకుండా పోటీ చేస్తే 7 నుంచి 8 స్థానాలు గెలుస్తామన్నారు. తాను నల్లగొండ లోక్‌సభ నుంచి పోటీచేస్తానని, హైకమాండ్ అవకాశం ఇస్తే విజయం సాధించి తీరతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
టీడీపీతో పొత్తు లేకపోయినా తాము గెలుస్తాం
-
‘కోమటిరెడ్డి’కి గన్మెన్ల తొలగింపు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి గన్మెన్లను తొలగించారు. ఈ మేరకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులనుంచి జిల్లా పోలీసులకు మూడు రోజుల కిందటే ఈ ఉత్తర్వులు అందాయి. శాసనసభ బడ్జెట్ సమావేశాల మొదటిరోజు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ సభ్యులు ఆయన ప్రసంగానికి అడ్డుపడ్డారు. ఈ సందర్భంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో స్పీకర్ ఎస్.మధుసూదనాచారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్న టూ ప్లస్ టూ గన్మెన్లను తొలగించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. కాగా, మూడు రోజుల కిందట ఇంటెలిజెన్స్ విభాగంనుంచి ఉత్తర్వులు కూడా అందాయని సమాచారం. కాగా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఈ మేరకు జిల్లా పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారని తెలుస్తోంది. తనను హత్య చేయడానికే గన్మెన్లను తొలగించారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గన్మెన్ల తొలగింపు ఉత్తర్వులు జిల్లా పోలీసుశాఖకు చేరడం, వారు నోటీసులు జారీ చేయనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కుట్రదాగి ఉంది కోమటిరెడ్డికి గన్మెన్లను తొలగించడం వెనుక కుట్ర దాగి ఉందని ఆయన అనుచరవర్గం ఆరోపిస్తోంది. ఇటీవల కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడు మున్సిపల్ చైర్పర్సన్ భర్త శ్రీనివాస్ హత్య జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తనకు ప్రాణభయం ఉందని శ్రీనివాస్ గన్మెన్లను కేటాయిం చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కాగా శ్రీనివాస్‌కు ఎలాంటి గన్మన్లను కేటాయించని నేపథ్యంలోనే ఆయన హత్య జరగడం సంచలనం సృష్టించింది. మంత్రిగా పనిచేసిన ఒక సీనియర్ నేతకు గన్మెన్లను ఎలా తొలగిస్తారని ఆయన అనుచర వర్గం ప్రశ్నిస్తోంది. పోలీసులు మంగళవారం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గన్మెన్లకు తొలగింపునకు సంబంధించి నోటీసులు జారీ చేస్తామని చెబుతున్నా, వాస్తవానికి సోమవారంనుంచే ఆయన గన్మెన్లను తీసేశారని చెబుతున్నారు. ఈ కారణంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఏదైనా హాని తలపెడతారేమోనన్న అనుమానాలను ఆయన అనుచర వర్గం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ పరిణామాల అన్నింటి నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ నాయకత్వం ప్రభుత్వ చర్యను ఖండిస్తూ ఆందోళనలు చేపట్టే ఆకాశం ఉంది. మరోవైపు కోమటిరెడ్డి శాసనసభ్యత్వం రద్దుకు సంబంధించి మంగళవారం హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. మరోవైపు ప్రభుత్వం తనకు గన్మెన్లను తొలగించడాన్ని కోమటిరెడ్డి సీరియస్‌గానే పరిగణిస్తున్నారని, ప్రభుత్వం తనపై చేస్తున్న కుట్రలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న యోచనలో ఉన్న ట్టు ఆయన అనుచర నేతలు చెబుతున్నారు. -
బంగారు తెలంగాణ బాటలు కనిపిస్తలేవా?
సాక్షి, హైదరాబాద్: ‘బంగారు తెలంగాణ’పై గురువారం శాసనసభలో ఆసక్తికర చర్చ జరిగింది. గురుకుల పాఠశాలలపై చర్చ సందర్భంగా అధికార పార్టీ సభ్యుడు వివేకానంద మాట్లాడారు. తన ప్రసంగంలో పలుమార్లు ‘బంగారు తెలంగాణ’పదాన్ని ఉచ్ఛరించారు. అనంతరం మాట్లాడిన కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ‘‘ఇందాక వివేకానంద తన ప్రసంగంలో 20 సార్లు బంగారు తెలంగాణ పదాన్ని వాడారు. అసలు ఈ బంగారు తెలంగాణ అంటే ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇదో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది..’’అని వ్యాఖ్యానించారు. అసలు మంచి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, రైతులకు కనీస మద్దతు ధర ఉండటమే తన దృష్టిలో బంగారు తెలంగాణ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని ‘‘బంగారు తెలంగాణ వారాలు, నెలల్లో ఆవిష్కృతం కాదు.. దాని కోసం నిర్మాణాత్మక ప్రస్థానాన్ని ప్రారంభించాం. కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు కానన్ని గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినం. వారు బంగారు మంచాలేస్తే మేం పీకి పాడుచేసినమా?’’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంటు, అప్పులు.. ఇలా కాం గ్రెసోళ్లకు రెండు మూడు అంశాలు ఉన్నాయని, ఎప్పుడు చూసినా వాటినే చెప్తుంటారని, ఈ తీరు చూసి జనం నవ్వుతున్నారన్నారు. వారు రాష్ట్రాన్ని కారు చీకట్లు చేస్తే, తాము వెలుగులు తేలేదా, బంగారు తెలంగాణ దిశగా వేస్తున్న బాటలు కనిపిస్తలేవా? అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ప్రతి మండలానికి, రెండు మూడు చొప్పున గురుకులాలు ఏర్పాటు చేస్తామన్నారు. -
ఏడుపే !
మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి ఉబలాట పడుతున్న ఆశావహుల ఆనందానికి అవధుల్లేవు.. ఒకవిధంగా వారు ఎగిరి గంతేస్తున్నారు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందే మున్సిపల్ ఎన్నికలు జరగనుండడంతో తమ భారమంతా ఇక, ఎమ్మెల్యే పదవులకు పోటీ పడనున్న నేతలే భరిస్తారన్న ధీమాతో ఉన్నారు. మరోవైపు ఆయా పార్టీలకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలపై మున్సిపోల్స్ పెద్ద భారాన్నే మోపనున్నాయి. ఒక వైపు అభ్యర్థుల ఎంపిక.. మరోవైపు వారి ఎన్నికల ఖర్చులు.. ఇంకోవైపు టికెట్ దక్కని వారిని బుజ్జగించడం వెరసి... ఇపుడు వారి పరిస్థితి సంకటంగా మారింది..!! పాతవి, కొత్తవి కలిపి ఈసారి జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలకు ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో రాజకీయ పార్టీల్లో హడావిడి మొదలైంది. పార్టీ గుర్తుల మీద జరుగుతున్న ఎన్నికలు కావడంతో మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ‘పబ్లిక్ పల్స్’ను పట్టిం చనున్నాయి. అదే మాదిరిగా, మున్సిపాలిటీల్లో వచ్చిన ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపిక కత్తిమీది సాము కానుంది. నల్లగొండ, మిర్యాలగూడ, భువనగిరి, సూర్యాపేట, కోదాడ మున్సిపాలిటీలు, హుజూర్నగర్, దేవరకొండ నగర పంచాయతీలు కలిపి మొత్తం ఏడు నియోజకవర్గాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. సహజంగానే ఈ ఏడు చోట్లా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ప్రధానపార్టీల నేతలు తమ పార్టీల పక్షాన బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వెలువడే మున్సిపల్ ఫలితాలలతో ఆయా పార్టీలపై ప్రజాభిప్రాయం స్పష్టంగానే తెలిసే అవకాశముంది. దీంతో గెలుపు గుర్రాలను ఎంపిక చేసి బరిలోకి దింపండం, వారి ఎన్నికల ఖర్చులు భరించడం నేతలకు తలకు మించిన భారం కానుంది. ప్రధానంగా నాలుగు చోట్ల జనరల్ మహిళలకు చైర్పర్సన్ పీఠాలు రిజర్వు కావడంతో ఆయా మున్సిపాలిటీల్లో తమకంటే తమకు టికెట్ కావాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్యేలుగా ఉండి, మళ్లీ గెలవాలనుకుంటున్న వారు, ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందేనని భావిస్తున్న నేతల కు మున్సిపల్ అభ్యర్థుల ఎంపిక భారం కానుంది. ఒకరికి టికెట్ ఇచ్చి, మరొకరికి నిరాకరిస్తే అసంతృప్తుల జాబితా పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీనివల్ల పార్టీ మార్పిళ్లకూ అవకాశం లేదన్న భయం వీరిని వెంటాడుతోంది. మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నిల పరోక్ష పద్ధతిన జరుగుతున్నందున మెజారిటీ వార్డుల్లో కౌన్సిలర్లను గెలిపించుకోవడం, గెలిచిన కౌన్సిలర్లలో అందరినీ ఒప్పించి చైర్పర్సన్ అభ్యర్థిని ఎంపిక చేసి గెలిపించడం ఆయా మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యేలపై ముం దున్న ప్రధాన కర్తవ్యం. అందరినీ ఏకతాటిపైకి తెచ్చి, గుంపుల గొడవల్లేకుండా చూసుకుంటూ మున్సిపల్ ఎన్నికలను ముగించి, ఆ వెంటనే తన ఎన్నికలకు సిద్ధం కావడం అన్నది వీరి ఆందోళన కలిగిస్తోంది. మాజీ వార్డు కౌన్సిలర్లలో మెజారిటీ తిరిగి టికెట్లు ఆశిస్తున్న వారే. అదే మాదిరిగా, ఇన్నాళ్లూ నమ్ముకుని వెంట తిరిగి పనిచేసినందుకు తమకు అవకాశం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టే వారి సంఖ్యా తక్కువేం కాదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నల్లగొండలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సూర్యాపేటలో ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి, కోదాడ, హుజూర్‌నగర్‌లలో ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలపై భారం పడనుంది. ఇక, మిర్యాలగూడలో మాజీ మంత్రి జానారెడ్డి బాధ్యత తీసుకోనున్నారు. ఇక్కడి ఫలి తాలు, అసంతృప్తులు నేరుగా ఆయన ఎన్నికను ప్రభావితం చేయకున్నా, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై ప్రభావం చూపుతాయి. దేవరకొండలో ఎమ్మెల్యే బాలూనాయక్పైనా ప్రభావం పడనుంది. ఇక భువనగరిలో అధికార కాంగ్రెస్ నుంచి అభ్యర్థుల ఎంపిక , గెలిపించుకునే బాధ్యత ఎవరు తీసుకుంటారన్న అం శంపై స్పష్టత రావడం లేదు. టీడీపీ ఎమ్మెల్యే ఉమపై దీని ప్రభావం ఉండనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం ఇలా.. దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారిపై మున్సిపల్ ఎన్నికల భారం పడడం ఖాయంగా కనిపిస్తోంది. -
ఆనందం
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్: క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, ఓటమితో కుంగి పోకుండా విజయానికి నాందిగా భావించాలని మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని ఎన్జీ కాలేజీ గ్రౌండ్స్‌లో మూడు రోజులపాటు జరిగిన కోమటిరెడ్డి ప్రతీక్ స్మారక తెలంగాణ అంతర్‌జిల్లాల స్థాయి పురుషుల సీనియర్ హాకీ చాంపియన్‌షిప్ పోటీలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. క్రీడాకారులు మంచి తర్ఫీదుతో సాధన చేయాలన్నారు. పట్టుదలతో లక్ష్యసాధన కు కృషి చేస్తే విజయం తప్పక సిద్ధిస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం లో కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా అన్ని జిల్లాల్లో క్రీడల అభివృద్ధికి మౌలిక వసతులు కల్పించి గ్రామీణక్రీడాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తానన్నారు. జేసీ హరిజవహర్‌లాల్ మాట్లాడుతూ సమష్టికృషితో ముందుకు సాగితే విజయం తధ్యమని నిరూపించే క్రీడ హాకీ అన్నారు. ఎస్పీ డాక్టర్ టి. ప్రభాకర్‌రావు మాట్లాడుతూ జాతీయ క్రీడ హాకీకి మనదేశంలో ఎంతో ఆదరణ ఉండేదన్నారు. ఒలింపిక్స్‌లో మనదేశం తరచూగా బంగారు పతకాలు సాధించిందని గుర్తుచేశారు. ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జగదీష్ యాదవ్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లా హాకీ జట్టు రాష్ట్రంలో ప్రథమస్థానంలో ఉండేదని, ప్రస్తుత టోర్నమెంట్ నిర్వహణతో క్రీడాకారులను పునురుత్తేజం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఏజేసీ నీలకంఠం, హాకీ ఇండి యా జాయింట్ సెక్రటరీ ఎం.నిరంజన్‌రెడ్డి, డీఎస్డీఓ ఎండి.మక్బూల్ అహ్మద్, హాకీ నల్లగొండ అధ్యక్షుడు ఎం.గోపి, కార్యదర్శిజి. శ్రీనివాస్, ఇర్ఫాన్ అలీ, ఓవైస్ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు. వెటరన్ హాకీ క్రీడాకారులను సన్మానించారు. విజేతలకు బహుమతి ప్రదానం తెలంగాణ అంతర్‌జిల్లాల స్థాయి పురుషుల సీని యర్ హాకీ చాంపియన్‌షిప్‌ను నిజామాబాద్ జిల్లా జట్టు కైవసం చేసుకుంది. బుధవారం నిజామాబాద్-నల్లగొండ జిల్లా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మొదటి హాఫ్ హోరాహోరీగా సాగినా ఆ తరువాత నిజామాబాద్ జిల్లా జట్టు విజృంభించింది. చివరకు 4-1 గోల్స్‌తో విజయం సాధించింది. ఉదయం జరిగిన సూపర్‌లీగ్ పోటీల్లో నల్లగొండ జట్టు 2-0 గోల్స్ తేడాతో వరంగల్‌పై విజయం సాధించింది. నిజామాబాద్ జట్టు 6-1 గోల్స్ తేడాతో వరంగల్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. విన్నర్స్‌గా నిలిచిన నిజామాబాద్ జట్టుకు రూ.25వేల నగ దు, షీల్డ్‌ను అందజేశారు. అలాగే రన్నర్స్‌గా నిలిచిన నల్లగొండ జట్టుకు రూ. 10వేల నగదు, ట్రోఫి, తృతీయస్థానంలో నిలిచిన వరంగల్ జట్టుకు రూ.5వేల నగదు, షీల్డ్‌ను అందజేశారు. ఉత్తమ క్రీడాకారులు టోర్నమెంటులో ఉత్త మ ప్రతిభ కనబర్చిన వివిధ జిల్లాల క్రీడాకారులకు వ్యక్తిగత బహుమతులు అందజేశారు. బెస్ట్గోల్ కీపర్ : జావీర్(నిజామాబాద్), బెస్ట్బ్యాక్ : ఆజం(నల్లగొండ) బెస్ట్హఫ్: శివకృష్ణ(వరంగల్) బెస్ట్ పార్వర్డ్ : సాగర్ (నిజామాబాద్) వెల్ప్లేయర్స్ జట్టు : కరీంనగర్