దేవరకద్ర: రోడ్డు ప్రమాదంలో ఓ చిరుత మృతి చెందింది. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం చౌదర్‌పల్లి శివారులోని మన్యంకొండ గుట్టలు, గద్దెగూడెం అడవుల్లో కొన్నేళ్లుగా చిరుతలు సంచరిస్తున్నాయి. తరచూ జాతీయ రహదారిని దాటుతుంటాయి. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఓ చిరుత 167వ జాతీయ రహదారిని దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ చిరుత అక్కడికక్కడే మృతి చెందింది.
ఉదయం వాహనదారులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని డీఎఫ్‌ఓ గంగారెడ్డి, ఎఫ్‌ఆర్‌ఓలు చంద్రయ్య, రజినీకాంత్, బీట్ ఆఫీసర్లు రాజేందర్‌రెడ్డి, శ్రీనివాసులు, సాదిక్, దేవర కద్ర ఎస్‌ఐ భగవంతరెడ్డి పరిశీలించారు. రోడ్డు ను దాటడానికి ముందు చిరుత పాదముద్రలు సమీపంలోని బురదలో స్పష్టంగా కనిపించా యి. చిరుత కళేబరానికి రోడ్డు పక్కనే పొలం లో పశువైద్యాధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. కాగా, ఈ ప్రాంతంలో 2007లో రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొని ఓ చిరుత, 2018లో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మరో చిరుత మృతిచెందాయి.
Comments
Please login to add a commentAdd a comment