నాలుగు మండపాలుగా యాగశాల విభజన  | Maha Yoga Shala Of Lakshmi Narayana Is Divided Into Four Zones | Sakshi
Sakshi News home page

నాలుగు మండపాలుగా యాగశాల విభజన 

Published Fri, Feb 4 2022 2:57 AM | Last Updated on Fri, Feb 4 2022 2:57 AM

Maha Yoga Shala Of Lakshmi Narayana Is Divided Into Four Zones - Sakshi

విద్యుత్‌ కాంతుల్లో యాగశాలలు

లక్ష్మీనారాయణుడి మహా యాగశాలను నాలుగు మండపాలుగా విభజించారు. భోగమండపం, పుష్పమండపం, త్యాగ మండపం, జ్ఞానమండపంగా వీటికి పేరు పెట్టారు. నాలుగు దిక్కుల్లో ఉన్న ఈ మండపాల్లో 114 యాగశాలలున్నాయి. మధ్య శాలలో జీయర్‌ స్వాములతో పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడే భగవంతుని దర్శనం ఉంటుంది. రోజుకు మూడు పూటల పూజా కార్యక్రమాలు ఇక్కడ్నుంచే నిర్వహిస్తారు. మిగతా యాగశాలల్లో రుత్వికులతో యాగ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఒక్కో యాగశాలలో 9 యజ్ఞకుండాలు ఉంటాయి. చతురస్ర కుండం (స్వకయర్‌), యోని కుండం (ఇన్వర్టెడ్‌ హార్ట్‌), అర్థచంద్ర/ధనుష్‌కుండం (హాఫ్‌ మూన్‌), సహదస్ర కుండం (హెక్సాగాన్‌), వృత్త కుండం (సర్కిల్‌), పంచస్ర కుండం (పెంటాగన్‌), త్రికోణ కుండం (ట్రాయాంగ్యులర్‌), అష్ట్రాశమ కుండం (ఆక్టాగాన్‌), పద్మకుండం (లోటస్‌)గా వీటిని పిలుస్తారు. మొత్తంగా 1,035 యజ్ఞ కుండాల్లో 5 వేల మంది రుత్వికులతో యాగం నిర్వహిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement