కంటోన్మెంట్: తెలంగాణ ఆంధ్రా సబ్ ఏరియా (టాసా) జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీఓసీ)గా మేజర్ జనరల్ రంజీత్ సింగ్ మన్‌రల్ నియమితులయ్యారు. బొల్లారంలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లోని తన కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1990లో ఇంజినీరింగ్ కార్స్ప్‌గా ఉద్యోగంలో చేరిన ఆయన భారత ఆర్మీ మూడో తరం అధికారి. పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ), డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీ (ఐఎంఏ)లో శిక్షణ పొందిన ఆయన ఎన్‌టీసీఎస్ స్కాలర్ షిప్‌ను కూడా అందుకున్నారు.
(చదవండి: తల్లే పిల్లల్ని కిడ్నాప్ చేసింది.. ఎందుకో తెలుసా?)
వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ డిగ్రీ పొందిన ఆయన సికింద్రాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ (సీడీఎం), ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీల్లో ప్రత్యేక కోర్సులు పూర్తి చేశారు. పారాట్రూపర్ అయిన మేజర్ జనరల్ రంజీత్ సింగ్ మన్‌రల్ ఎలైట్ ప్యారాచ్యూట్ బ్రిగేడ్‌లోనూ పనిచేశారు. స్పెషలిస్ట్ ఇంజినీర్ రెజిమెంట్, ఇన్‌ఫ్రాంట్రీ బ్రిగేడ్‌లలోనూ కమాండర్‌గా పనిచేశారు. పుణేలోని కాలేజ్ ఆఫ్ మిలటరీ ఇంజినీరింగ్, డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడెమీల్లో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశారు. నాలుగు కమ్మెండేషన్ అవార్డులను అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment