Indian Military Academy
-
టాసా’ జీఓసీగా మేజర్ జనరల్ రంజీత్ సింగ్ మన్రల్
కంటోన్మెంట్: తెలంగాణ ఆంధ్రా సబ్ ఏరియా (టాసా) జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీఓసీ)గా మేజర్ జనరల్ రంజీత్ సింగ్ మన్రల్ నియమితులయ్యారు. బొల్లారంలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లోని తన కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1990లో ఇంజినీరింగ్ కార్స్ప్గా ఉద్యోగంలో చేరిన ఆయన భారత ఆర్మీ మూడో తరం అధికారి. పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ), డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీ (ఐఎంఏ)లో శిక్షణ పొందిన ఆయన ఎన్టీసీఎస్ స్కాలర్ షిప్‌ను కూడా అందుకున్నారు. (చదవండి: తల్లే పిల్లల్ని కిడ్నాప్ చేసింది.. ఎందుకో తెలుసా?) వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ డిగ్రీ పొందిన ఆయన సికింద్రాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ (సీడీఎం), ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీల్లో ప్రత్యేక కోర్సులు పూర్తి చేశారు. పారాట్రూపర్ అయిన మేజర్ జనరల్ రంజీత్ సింగ్ మన్రల్ ఎలైట్ ప్యారాచ్యూట్ బ్రిగేడ్లోనూ పనిచేశారు. స్పెషలిస్ట్ ఇంజినీర్ రెజిమెంట్, ఇన్ఫ్రాంట్రీ బ్రిగేడ్లలోనూ కమాండర్‌గా పనిచేశారు. పుణేలోని కాలేజ్ ఆఫ్ మిలటరీ ఇంజినీరింగ్, డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడెమీల్లో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశారు. నాలుగు కమ్మెండేషన్ అవార్డులను అందుకున్నారు. (చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ వేసి కటకటాల్లోకి..! -
Bavajipalem: దేశసేవలో పునీతం
సాక్షి, గుంటూరు: ఆ గ్రామం తరతరాలుగా దేశసేవలో తరిస్తోంది. భారత సైన్యంలో సేవలందించని గడపలు ఆ ఊళ్లో లేవు. ప్రతి ఇంటి నుంచి ఇద్దరు, ముగ్గురు, నలుగురు సైన్యంలో చేరి దేశానికి సేవచేసినవారు ఉంటారు. భారత సైనిక వ్యవస్థలో గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం బావాజీపాలెం గ్రామానికి ప్రత్యేక స్థానం ఉంది. బావాజీపాలెం గ్రామంలో 300 కుటుంబాలున్నాయి. గ్రామస్తులంతా ముస్లింలే. దేశ రక్షణకు ప్రాణాలు పణంగా పెట్టి సైన్యంలో చేరాలంటే చాలామంది యువకులు తటపటాయిస్తుంటారు. అయితే ఈ గ్రామంలోని తల్లిదండ్రులు మాత్రం బిడ్డలను సైన్యంలోకి పంపడాన్ని కర్తవ్యంగా భావిస్తారు. యువకులు సైతం సైన్యంలో చేరేందుకు ఉత్సాహంగా అడుగులు వేస్తారు. గ్రామంలోని 98 శాతం ఇళ్లలో సైనికులు, మాజీ సైనికులు ఉన్నారు. దీంతో బావాజీపాలెం మిలటరీ గ్రామంగా ప్రసిద్ధి చెందింది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు గ్రామం నుంచి కొందరు యువకులు సైన్యంలో చేరారు. ఆ స్ఫూర్తితో తరువాతి తరాలు సైన్యంలో చేరడానికి ఆసక్తి చూపాయి. ఇప్పటివరకు ఈ గ్రామం నుంచి 500 మంది సైన్యంలో చేరి దేశానికి సేవలందించారు. ప్రస్తుతం గ్రామస్తులు 50 మందికి పైగా సైన్యంలో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆర్మీ 1965 చైనా యుద్ధం, 1971 పాకిస్తాన్ యుద్ధం, 1999 కార్గిల్ వార్ ఇలా సరిహద్దుల్లో భారత్ జరిపిన ప్రతి పోరాటంలో బావాజీపాలెం సైనికులు పాల్గొన్నారు. తరతరాలుగా దేశ రక్షణకు జవాన్లను అందిస్తున్న ఈ గ్రామాన్ని 1978లో భారత ఆర్మీ దత్తత తీసుకుంది. మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ సహకారంతో వాటర్ స్కీమ్‌ను చేపట్టి గ్రామంలో వాటర్ ట్యాంకు నిర్మించి తాగునీటి సమస్యను తీర్చింది. యువతకు ఆదర్శం చెడు సహవాసాలతో దురలవాట్లకు బానిసలుగా మారి, డబ్బు కోసం నేరాలకు పాల్పడి భవిష్యత్ నాశనం చేసుకుంటున్న ఎందరో యువకులకు బావాజీపాలెం యువత ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామంలో ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన ప్రతి యువకుడూ సైన్యంలో చేరడానికి ప్రయత్నిస్తాడు. మాజీ సైనికుల అనుభవాలే తమకు పాఠాలని, సైన్యంలో చేరేందుకు ప్రేరణలని గ్రామ యువకులు చెబుతారు. గ్రామానికి చెందిన మాజీ, ప్రస్తుత సైనికులు సైన్యంలోకి వెళ్లడానికి ఇష్టం ఉన్న యువతకు ఎలా సన్నద్ధం అవ్వాలనే విషయమై సలహాలు, సూచనలు ఇస్తుంటారు. కర్తవ్యంగా భావిస్తాం నేను 1988 నుంచి 2005 వరకు భారత ఆర్మీలో సేవలందించాను. మా తాత, తండ్రి, సోదరుడు కూడా సైన్యంలో పనిచేశారు. భారత సైన్యంలో సేవలందించడం కర్తవ్యంగా మా గ్రామంలోని ప్రతి ఒక్కరూ భావిస్తారు. గ్రామంలో పుట్టిన అమ్మాయిలు సైనికులను పెళ్లాడటానికి ఇష్టపడతారు. జమ్మూకశ్మీర్, త్రిపుర, అస్సాం సహా వివిధ రాష్ట్రాల్లోని దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ప్రతి యూనిట్లో బావాజీపాలెం సైనికులు ఉంటారు. 1994లో మా గ్రామంలో ప్రత్యేకంగా బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఆ బ్యాంక్‌ను ప్రస్తుతం మూసివేశారు. దీంతో మాజీ సైనికులు, ప్రస్తుతం సేవలందిస్తున్న సైనికుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. వినియోగదారుల సర్వీస్ సెంటర్‌ను బ్యాంక్ ఏర్పాటు చేసినప్పటికీ అందులో పూర్తిస్థాయిలో బ్యాంక్ సేవలు లభించడం లేదు. తిరిగి బ్యాంక్‌ను గ్రామంలో ఏర్పాటు చేసి సమస్య తీర్చాలి. – నజీర్ అహ్మద్, మాజీ సైనికుడు, బావాజీపాలెం గ్రామ సర్పంచ్ మా కుటుంబం అంతా సైనికులమే మేం ఐదుగురు సోదరులం. అందరం భారత సైన్యంలో చేరి సేవలంధించాం. సైన్యంలో చేరి దేశానికి సేవలందించడం గొప్ప వరం. ఆ వరం మా కుటుంబంలో అందరికీ లభించడం అదృష్టంగా భావిస్తాం. మా గ్రామం సహా నిజాంపట్నం మండలం, చుట్టుపక్కల గ్రామాల్లో వందలమంది మాజీ, ప్రస్తుతం సేవలందిస్తున్న సైనికులు ఉన్నారు. వీరి సౌకర్యార్థం క్యాంటీన్‌ను ఏర్పాటు చేయాలని గతంలో చాలాసార్లు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశాం. మా ప్రాంతంలో ఆర్మీ యూనిట్ లేకపోవడం వల్ల క్యాంటీన్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని చెప్పారు. మొబైల్ క్యాంటీన్‌ను ఏర్పాటు చేసినా మాకు ఎంతో ఉపయోగపడుతుంది. – ఎండీ అయూబ్, మాజీ సైనికుడు, బావాజీపాలెం -
భరతమాతకు ట్రిపుల్ సెల్యూట్
ఈ ముగ్గురి నేపథ్యం.. అతి సాధారణం. కష్టాలకు ఎదురొడ్డుతూనే ‘పది’లో సత్తా చాటారు. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించి తమ కలల సాకారం వైపు కదిలారు. ఇంజినీరింగ్ విద్యలో నైపుణ్యం చూపి కొలువులను తమ వద్దకు రప్పించారు. అయితే దేశ రక్షణ కంటే తమ కుటుంబం, ఉద్యోగం ఏవీ ఎక్కువ కాదని భావించి, నెలకు లక్షలు తెచ్చిపెట్టే కొలువులను తృణపాయంగా త్యజించి, భరతమాత సేవలో పునీతులవుతున్నారు.. సాక్షి, నూజివీడు : ముగ్గురూ అతి సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారే. చదువులో ప్రతిభ చాటి నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. భారీ వేతనాలతో కూడిన ఉన్నత ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చినా కాదనుకున్నారు. దేశ రక్షణలో తాము భాగస్వాములు కావాలనే లక్ష్యంతో సైన్యంలో చేరి కెప్టెన్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ ముగ్గురు వీరులు.. మహాధీరులై భరత మాత సేవలో పునీతులవుతున్నారు. ఆర్మీలో కెప్టెన్లుగా సేవలందిస్తున్న వారి నేపథ్యాన్ని ఓసారి పరికిస్తే.. కూలీ కొడుకు.. ఆర్మీ కెప్టెన్ బర్నాన యాదగిరి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలోని శేఖరపురం. తండ్రి గురవయ్య హైదరాబాద్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీలో దినసరి కూలీ కాగా, తల్లి తులసమ్మ పోలియో వల్ల ఇంటివద్దే ఉంటోంది. యాదగిరి పదో తరగతిలో 94.5 శాతం మార్కులతో ఉత్తీర్ణుడై, 2008 ఫస్ట్బ్యాచ్లో ట్రిపుల్ ఐటీలో చేరాడు. 83.4 శాతం మార్కులతో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. అనంతరం టెక్ మహేంద్ర సంస్థలో ఉద్యోగంలో చేరినా.. సంతృప్తి చెందక మాతృభూమికి సేవ చేయాలనే లక్ష్యంతో 2015లో యూపీఎస్సీ నిర్వహించిన సీడీఎస్, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ లను పూర్తిచేశాడు. మరోవైపు క్యాట్ పరీక్షలో 93.4 శాతంతో ప్రతిభను చాటి ఐఐఎం ఇండోర్‌లో ప్రవేశం పొంది, దేశ భద్రతా రంగం వైపు అడుగు వేశాడు. 2016 జూలై 8న ఇండియన్ మిలటరీ అకాడమీ శిక్షణలో రాణించి ‘టెక్నికల్ గ్రాడ్యుయేషన్’ కోర్సులో టాపర్‌గా నిలిచి కెప్టెన్‌గా సేవలందిస్తున్నాడు. శివారు ప్రాంతం నుంచి కెప్టెన్‌గా.. చిరుమామిళ్ల సీతారామకృష్ణతేజ స్వగ్రామం విజయనగరం జిల్లా శృంగవరపుకోట. తండ్రి వైన్‌షాపులో గుమస్తా కాగా.. తల్లి నాగమణి మృతి చెందారు. 2008 తొలి బ్యాచ్‌లో ట్రిపుల్ ఐటీలో చేరిన సీతారామకృష్ణతేజ మెకానికల్ ఇంజినీరింగ్‌లో 8.4 జీపీఏతో ఉత్తీర్ణత సాధించాడు. 17వ స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) నిర్వహించిన ఇంటర్వ్యూలో అర్హత సాధించి డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో 2015 జూన్ 23 నాటికి శిక్షణ పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత కమిషన్డ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించి అసోం, అరుణాచల్ ప్రదేశ్‌లో బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రస్తుతం రాజస్థాన్‌లోని మోడిఫైడ్ ఫీల్డ్‌లో కెప్టెన్ ర్యాంక్‌లో పర్మినెంట్ కమిషన్డ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పేద కుటుంబాల్లో నుంచి వచ్చి ట్రిపుల్ ఐటీలో ఉత్తమ ప్రతిభతో ఇంజినీరింగ్ విద్యను పూర్తిచేసి.. సైన్యంలో కెప్టెన్లుగా పనిచేస్తున్న యాదగిరి, సురేంద్రనాథ్, కృష్ణతేజలు నేటి విద్యార్థులకు స్ఫూర్తిప్రదాతలు.. ఉన్నతోద్యోగం వదిలి..దేశసేవకు నడుం బిగించి.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన నాదెళ్ల సురేంద్రనాథ్ ట్రిపుల్ ఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఇండియన్ ఆర్మీలో కెప్టెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సురేంద్రనాథ్ తండ్రి వెంకట్రావు ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుండగా.. తల్లి లక్ష్మి సాధారణ గృహిణి. 2009–15బ్యాచ్‌కు చెందిన సురేంద్రనాథ్ టీసీఎస్‌లో క్వాలిటీ అస్యూరెన్స్ కన్సల్టెంట్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో ఉద్యోగాలను వదిలేసి ఆర్మీవైపే అడుగులు వేశాడు. ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ పూర్తిచేసి శిక్షణ పొంది భారత సైన్యంలో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ప్రస్తుతం అసోంలో కౌంటర్ (తిరుగుబాటు) ఆపరేషన్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. వ్యాయామ అధ్యాపకుడు నవీన్ అందించిన ప్రోత్సాహంతోనే తాను ఆర్మీలోకి అడుగుపెట్టానని పేర్కొంటున్నాడు. -
ఆర్మీ అధికారిగా కూలీ కొడుకు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లో ఇండియన్ మిలటరీ అకాడమీ (ఐఎంఏ). శనివారం సాయంత్రం కొత్త బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్ పూర్తయింది. కార్యక్రమం పూర్తయ్యాక కొత్త ఆర్మీ ఆఫీసర్లంతా సంబరాల్లో మునిగిపోయారు. అందులో ఓ యువకుడు మాత్రం ప్రేక్షకుల్లో ఉన్న మామూలు దుస్తులు ధరించిన దంపతుల దగ్గరికెళ్లి నిలుచున్నాడు. మిలటరీ డ్రెస్సులో వచ్చిన యువకుడిని చూసి వారికి ఆనందం ఆగలేదు. అటు ఆ యువకుడి పరిస్థితీ అలాగే ఉంది. ఆ ముగ్గురూ ఆనందంగా హత్తుకుని ఉద్వేగానికి లోనయ్యారు. మొత్తం సంబరాల్లో వీరి వైపే అందరి దృష్టి మరలింది. ఆ యువకుడు తెలంగాణకు చెందిన బర్నాన యాదగిరి కాగా.. వారిద్దరూ అతని తల్లిదండ్రులు. రూ.100 కూలీయే ఆధారం బర్నాన గున్నయ్య హైదరాబాద్‌లోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో దినసరి కూలీ. రోజుకు సంపాదించే వంద రూపాయలే ఆ కుటుంబానికి ఆధారం. తల్లికి పోలియో. దీంతో ఈమె ఇంటికే పరిమితమయ్యారు. చిన్నప్పటినుంచీ చదువుల్లో ముందుండే యాదగిరి.. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తిచేశాడు. ఇదే సమయంలో ఓ అమెరికా కంపెనీ నుంచి భారీ ప్యాకేజీతో ఉద్యోగం వచ్చినా వద్దనుకున్నాడు. క్యాట్ పరీక్షలో 93.4శాతం స్కోరు సాధించటంతో ఐఐఎం ఇండోర్ నుంచి ఉన్నత విద్య అవకాశం తలుపులు తట్టింది. దీన్నీ తిరస్కరించాడు. పేదరికం వెక్కిరిస్తున్నా మాతృభూమికి సేవచేయాలనే లక్ష్యంతో ఐఎంఏ పరీక్ష రాసి ఎంపికయ్యాడు. అంతేకాదు, ఐఎంఏ శిక్షణలోనూ ‘టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు’లో ప్రతిష్టాత్మక సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. తమ కొడుకు ఆర్మీ ఆఫీసరన్న విషయం డెహ్రాడూన్‌కు వెళ్లేంతవరకూ ఆ తల్లిదండ్రులకు తెలియదు. ‘మా నాన్న రోజుకు రూ.60కే కూలీకి వెళ్లిన రోజులు నాకు గుర్తున్నాయి. ఆర్థిక సమస్యలు డబ్బుకోసం ఆశపడలేదు. మాతృభూమికి సేవచేయటాన్ని మించిన ఆనందం ఇంకెక్కడ ఉంటుంది’ అని యాదగిరి ఉద్వేగంగా పేర్కొన్నాడు. -
భద్రతా సవాళ్లపై ప్రసంగించిన మోదీ
డెహ్రాడూన్: డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో శనివారం నిర్వహించిన సైనిక దళాల కమాండర్ల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశం ఎదుర్కొంటోన్న భద్రతా సవాళ్లపై తన ఆలోచనల్ని ఈ సందర్భంగా ప్రధాని పంచుకున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు సదస్సులో చర్చించిన అంశాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. నేవీ, ఆర్మీ, వాయుసేన అధిపతులు నివేదికలు సమర్పించారు.