army head quarters
-
టాసా’ జీఓసీగా మేజర్ జనరల్ రంజీత్ సింగ్ మన్రల్
కంటోన్మెంట్: తెలంగాణ ఆంధ్రా సబ్ ఏరియా (టాసా) జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీఓసీ)గా మేజర్ జనరల్ రంజీత్ సింగ్ మన్రల్ నియమితులయ్యారు. బొల్లారంలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లోని తన కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1990లో ఇంజినీరింగ్ కార్స్ప్గా ఉద్యోగంలో చేరిన ఆయన భారత ఆర్మీ మూడో తరం అధికారి. పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ), డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీ (ఐఎంఏ)లో శిక్షణ పొందిన ఆయన ఎన్టీసీఎస్ స్కాలర్ షిప్‌ను కూడా అందుకున్నారు. (చదవండి: తల్లే పిల్లల్ని కిడ్నాప్ చేసింది.. ఎందుకో తెలుసా?) వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ డిగ్రీ పొందిన ఆయన సికింద్రాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ (సీడీఎం), ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీల్లో ప్రత్యేక కోర్సులు పూర్తి చేశారు. పారాట్రూపర్ అయిన మేజర్ జనరల్ రంజీత్ సింగ్ మన్రల్ ఎలైట్ ప్యారాచ్యూట్ బ్రిగేడ్లోనూ పనిచేశారు. స్పెషలిస్ట్ ఇంజినీర్ రెజిమెంట్, ఇన్ఫ్రాంట్రీ బ్రిగేడ్లలోనూ కమాండర్‌గా పనిచేశారు. పుణేలోని కాలేజ్ ఆఫ్ మిలటరీ ఇంజినీరింగ్, డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడెమీల్లో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశారు. నాలుగు కమ్మెండేషన్ అవార్డులను అందుకున్నారు. (చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ వేసి కటకటాల్లోకి..! -
ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో మైనర్ బాలికపై అత్యాచారం
కోల్‌కతాలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన శనివారం సాయంత్రం ఆర్మీ తూర్పు కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌లోని మైనర్ బాలిక ఇంట్లో జరిగింది. బాలిక తండ్రి ఆర్మీ ఉద్యోగి కాగా, బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి ఆర్మీలో కింది స్థాయి (గ్రూప్–డీ) ఉద్యోగి. నిందితుడి నివాసం కోల్‌కతా ఫోర్ట్ విలియంలోని బాలిక ఇంటికి అతి సమీపంలోనే ఉంది. అత్యాచారం చేసిన తరువాత అతను పారిపోవడంతో పోలీసులు మంగళవారం పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లలు రక్షణ) చట్టం కింద అరెస్ట్ చేశారు. కోర్టు ముందు హాజరు పర్చగా, జూన్ 24 వరకు పోలీస్ కస్టడీ విధించింది. -
బుర్కినా ఫాసోలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
-
కాల్పులు, పేలుళ్లతో విరుచుకుపడ్డ ఉగ్రవాదులు
వాగాదువో : పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసో ఉగ్రదాడితో ఉలిక్కిపడింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం నుంచి రాజధాని వాగాదువో నగరంలో ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నారు. కారులో వచ్చిన ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులకు, బాంబు దాడులకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌తోపాటు ఫ్రాన్స్ రాయబార కార్యలయంపై దాడి జరిగినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచిస్తున్నారు.రంగంలోకి దిగిన సైన్యం ఉగ్రవాదులను మట్టుపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. మరోవైపు అమెరికా రాయబార కార్యలయం కూడా ఉగ్రదాడిని ట్విట్టర్లో తెలియజేసింది. కాగా, రెండేళ్ల క్రితం నగరంలోని ఓ టర్కీస్ రెస్టారెంట్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 17 మందిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. -
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పేరు మార్పు
హైదరాబాద్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పేరు మారింది. ఆంధ్రా సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్‌ను ‘తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా’ గా పిలవనున్నారు. ఈ మేరకు రక్షణ శాఖ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఉత్తర్వులు అందాయి. తక్షణమే ఈ మార్పు అమల్లోకి వస్తుందని స్థానిక మిలటరీ పీఆర్ఓ ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రా తమిళనాడు, కర్ణాటక- కేరళ (ఏటీఎన్కె అండ్ కే)గా వ్యవహరించే ఆర్మీ దక్షిణాది కేంద్రాన్ని ఇకపై ‘హెడ్‌క్వార్టర్స్ ఆఫ్ దక్షిణ్ భారత్ ఏరియా’గా వ్యవహరించనున్నట్లు తెలిపారు.