![Married woman ends life in Hyderabad](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/445465.jpg.webp?itok=CnV7c9Pi)
భార్యను బండరాయితో కొట్టి హత్య చేసిన భర్త
మూసాపేట: అనుమానంతో ఓ భర్త బండరాయితో తలపై మోదీ భార్యను హత్య చేసిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మూసాపేటలోని హబీబ్‌నగర్‌లో నివాసముంటున్న అబ్దుల్ రహీం, ఎండీ నస్రీం బేగంలు భార్యాభర్తలు. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. భార్య గృహిణి కాగా అబ్దుల్ రహీం నాంపల్లిలోని కేర్ ఆసుపత్రిలో వార్డు బాయ్‌గా పనిచేస్తున్నాడు.
కొన్ని నెలలుగా అబ్దుల్ రహీం భార్యను అనుమానిస్తూ ఘర్షణలకు దిగుతున్నాడు. ఈ క్రమంలో హబీబ్‌నగర్ నుంచి ఇల్లు ఖాళీ చేసి కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లోని రాజీవ్‌గాంధీ నగర్‌లో ఉండేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం ఈమేరకు భార్యాభర్తలు ఇద్దరూ రాజీవ్‌గాంధీ నగర్‌లోని కొత్త ఇంటికి శుభ్రం చేసేందుకు వెళ్లారు. నస్రీం బేగం ఇంటిని శుభ్రం చేసి విశ్రాంతి తీసుకుంటుండగా..అబ్దుల్ రహీం సడన్‌గా ఓ బండరాయి తీసుకువచ్చి ఆమె తలపై బలంగా మోదాడు.
దీంతో తీవ్రంగా గాయపడిన నస్రీం బేగం అక్కడికక్కడే మృతి చెందింది. హత్యకు ముందు కూడా గొడవ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య చేసిన వెంటనే అబ్దుల్ రహీం బాలానగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కూకట్‌పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment