సాక్షి, మహబూబ్‌నగర్: తెలంగాణలో రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేశారు. పంటలు పండించిన భూములకే రైతు భరోసా ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. కొండలకు, గుట్టలకు రైతు భరోసా ఇచ్చేది లేదన్నారు.
మంత్రి తుమ్మల మహబూబ్‌నగర్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో పండించే భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తాం. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొండలకు, గుట్టలకు డబ్బులు ఇచ్చింది. ఇలా రూ.25వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి తప్పు జరగదు. ఈసారి పంట వేసిన రైతుకే రైతుభరోసా వస్తుంది. రూ.31వేల కోట్లతో రైతు రుణమాఫీ పూర్తి చేస్తాం.
అలాగే, 22 లక్షల మంది రైతులకు 18వేలు 500 కోట్లు రైతుల ఖాతాలో రుణమాఫీ నిధులు చేశాం. పెండింగ్‌లో ఉన్న రైతులకు ఈనెల ఆఖరిలో రుణ మాఫీ జరుగుతుంది. తెల్లకార్డు లేని రైతులకు కూడా రుణ మాఫీ చేస్తాం. రాష్ట్రంలో ఇంకా మూడు లక్షలకు పైగా రైతులు తెల్లరేషన్ కార్డులు లేని వారు ఉన్నారు. రైతుల ఖాతాలో రుణ మాఫీ వేసే వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వదిలిపెట్టడు. రైతుల రుణ మాఫీ పూర్తి అయ్యాక రైతు భరోసా కింద రూ.20వేల కోట్లు పంట సాగు చేసే రైతులకు వేస్తాము’ అని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్ నేతలపై దాడులే రేవంత్ ఎజెండా: హరీష్‌రావు
Comments
Please login to add a commentAdd a comment