
కృష్ణా నీటి వివాదంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి
మూసీ పునరుద్ధరణకు రూ.4 వేల కోట్లు ఇవ్వండి
అఖిల భారత నీటిపారుదల శాఖ మంత్రుల సదస్సులో మంత్రి ఉత్తమ్‌కుమార్ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో తెలంగా ణకు జరుగుతున్న అన్యాయాన్ని నివారించడానికి ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని రాష్ట్ర నీటి పా రుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర జల్‌శక్తి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన 2వ అఖిలభారత నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం జలాశయం, నాగార్జునసాగర్ కుడి కాల్వ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించటాన్ని ఆపాలని కోరారు.
ఏపీ వాడుకుంటున్న నీటిని కచ్చితంగా లెక్కించడానికి టెలిమెట్రీ కేంద్రాలను ఏర్పాటు చేసి కృష్ణా బోర్డు పర్యవేక్షించాలని విన్నవించారు. కృష్ణా జలా ల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి పై కృష్ణా ట్రిబ్యునల్–2 నిర్ణయం వెంటనే వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పాల మూరు–రంగారెడ్డి, సమ్మక్క–సారక్క, సీతా రామ ప్రాజెక్టులకు సత్వరంగా నీటి కేటాయింపులు జరపాలని కోరారు.
సత్వరంగా ఎన్డీఎస్‌ఏ నివేదిక ఇవ్వండి
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, ఇతర బరాజ్‌ల పునరుద్ధరణకు తీసుకోవా ల్సిన శాశ్వత చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సత్వరంగా నివేదిక ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని మంత్రి ఉత్తమ్ కోరారు. ప్రాజెక్టుల్లో పూడిక తీతకు కేంద్రం నిధులు ఇవ్వాలని కోరారు.
గంగా, యమున నదుల శుద్ధికి సహకరించిన తరహాలోనే మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టుకు కేంద్రం ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు రూ.4 వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు గోదావరి నీళ్లను తరలించడానికి మరో రూ.6 వేల కోట్లను కేటాయించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment