బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తే డీలర్‌షిప్‌ రద్దు చేస్తాం | Minister Uttam Kumar Reddy Warns Of Cancelling LPG Dealerships Over Black Market Diversion In Suryapet, More Details Inside | Sakshi
Sakshi News home page

బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తే డీలర్‌షిప్‌ రద్దు చేస్తాం

Mar 12 2026 9:49 PM | Updated on Mar 13 2026 1:18 PM

Minister Uttam Warns LPG Agencies

సూర్యాపేట: ఎల్పీజీ సిలిండర్లను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తే సదరు గ్యాస్‌ ఏజెన్సీల డీలర్‌షిప్‌లు రద్దు చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరతపై మీడియాతో మాట్లాడారు ఉత్తమ్‌,.  ‘ గ్యాస్  కొరతపై రేపు ఆయిల్ కంపెనీలతో జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహిస్తాం. 

కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆయిల్ కంపెనీలకు రెఫరెన్స్ చేసి సామాన్య జన జీవనానికి ఇబ్బంది కలగకుండా ఎల్పీజీ  గ్యాస్ కోసం మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.  ఎల్పీజీ గ్యాస్ విషయంలో ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది. ఎల్పీజీ డీలర్లు సామాజిక సామాన్య ప్రజానికం వద్ద అక్రమాలకు బ్లాక్ మార్కెట్‌లకు తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుని డీలర్ షిప్ రద్దు చేస్తాం’ అని వార్నింగ్‌ ఇచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement