యువకుడితో చనువుగా ఉంటోందని మందలిస్తే.. | Minor Girl Suicide Attempt in Hyderguda Hyderabad | Sakshi
Sakshi News home page

యువకుడితో చనువుగా ఉంటోందని మందలిస్తే..

Published Sun, Jan 16 2022 8:18 PM | Last Updated on Sun, Jan 16 2022 8:18 PM

Minor Girl Suicide Attempt in Hyderguda Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తల్లిదండ్రులు మందలించారని ఓ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతుంది. ఈ విషాద సంఘటన రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్‌గూడలో చోటు చేసుకుంది. హైదర్‌గూడ ప్రాంతానికి చెందిన 14 సంవత్సరాల మైనర్ బాలిక ఓ యువకుడితో చనువుగా ఉంటోందని తల్లిదండ్రులు మందలించారు. దీంతో బాలిక మనస్థాపానికి గురై పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన తల్లిదండ్రులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, చికిత్సను అందిస్తున్నారు.

చదవండి: (హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లో యువతి మృతదేహం కలకలం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement