hyderguda
-
రంగారెడ్డి జిల్లా హైదర్ గూడలో ఇల్లాలి పోరాటం
-
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో కల్తీ చాక్లెట్ల తయారీ.. హైదర్‌గూడలో సుప్రజా ఫుడ్స్ పేరుతో కల్తీ దందా
-
చెట్టు కూలడానికి అధికారుల నిర్లక్షమే కారణమా?
అధికారుల నిర్లక్ష్యం... పాలకుల అలసత్వం ఓ అమాయకుడి ప్రాణాలు పోయేందుకు కారణమైంది. ఎంతో మందికి నీడనిచ్చే భారీ వృక్షానికి జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం చుక్క నీరు పీల్చే అవకాశం ఇవ్వకుండా మొదళ్లల్లో కాంక్రీట్‌తో కప్పేశారు. మరో పక్క బిల్డింగ్ యజమాని బిల్డింగ్ మరమ్మతుల సమయంలో ఈ భారీ వృక్షాన్ని కూల్చేందుకు విశ్వప్రయత్నాలు చేసిన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. బిల్డింగ్ యజమాని, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం, హార్టికల్చర్ల నిర్లక్ష్యమే భారీ వృక్షం కుప్పకూలడానికి.. ఆటోడ్రైవర్ మహ్మద్ గౌస్ మరణానికి కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్: హైదర్‌గూడ సిగ్నల్ వద్ద శనివారం భారీ వృక్షం కూలడంతో ఒక్కసారిగా వాహనదారులు, స్థానికులు ఆందోళన చెందారు. చెట్టు కూలిన ప్రాంతంలో ఉన్న బిల్డింగ్ మూడేళ్ల క్రితం మరమ్మతులు చేశారు. అప్పట్లోనే ఈ చెట్టును ఇక్కడ నుంచి తరలించేందుకు కాంట్రాక్టర్ స్థానిక రాజకీయ నేతలతో కలసి విశ్వప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. గత ఏడాది ఫుట్‌పాత్ నిర్మాణాల్లో భాగంగా సర్కిల్–16కు సంబంధించిన ఇంజినీరింగ్ విభాగం హిమాయత్‌నగర్ వైజంక్షన్ నుంచి హైదర్‌గూడ చెట్టు కూలిన ప్రాంతం వరకు ఫుట్‌పాత్‌లను నిర్మించారు. కాసులకు కక్కుర్తి పడ్డ జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం బిల్డింగ్ యజమానుల మాటలు విని చెట్టు మొదళ్లల్లో మొత్తం కాంక్రీట్ వేసి పూడ్చేశారు. ఒక్క చుక్క నీరు చెట్టు వేర్లుకు తగలకుండా చేశారు. దీనికారణంగా ఏడాదికి పైగా ఒక్క బొట్టు నీటిని పీల్చుకోని ఆ చెట్టు శనివారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఇదే కోవలో మరిన్ని చెట్లు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయనడం ఏమాత్రం సందేహం లేదు. శనివారం కూలిన చెట్టుపక్కనే మరో చెట్టును కూడా కాంక్రీట్‌తో కూల్చేయడం జరిగింది. దీనితో పాటు మరికొన్ని చెట్లు ఇదేతరహాలో ఉన్నాయి. మొద్దునిద్రలో హార్టికల్చర్ విభాగం... చెట్లను సంరక్షించాల్సిన హారి్టకల్చర్ డిపార్ట్మెంట్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. బిల్డింగ్ నిర్మాణాలకు భారీ వృక్షాలు అడ్డు వస్తున్న తరుణంలో కాంట్రాక్టర్లు ఇచ్చే డబ్బుకు దాసోహం అవుతున్న హారి్టకల్చర్ ఆయా ప్రాంతాల్లోని చెట్లను కూల్చేస్తున్నారు. సీసీ ఫుటేజీలకు చెట్ల కొమ్మలు అడ్డొస్తున్నాయి. ట్రాఫిక్‌కు విఘాతం కలిగే వాటిని తొలగించాలంటూ పలుమార్లు నారాయణగూడ ట్రాఫిక్ పోలీసులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పట్టించుకునే నాథుడు హారి్టకల్చర్ శాఖలో లేకపోవడం గమనార్హం. -
భార్య కళ్లేదుటే ఘోరం..చావు బతుకుల మధ్య కొట్టుకుంటూ..
సాక్షి, రాజేంద్రనగర్: ‘మరో నెల రోజుల్లో ఇంటికి వస్తా. అక్కడే ఏదో ఒక పని చేసి బతుకుదాం.. పిల్లాపాపలతో అందరం హాయిగా ఉందాం’ అని చెప్పిన భర్త.. తన కళ్ల ముందే అసువులు బాయడంతో ఆ ఇల్లాలు విలపించిన తీరు అందరి గుండెలను కదిలించింది. ఒంటి నిండా తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుకుంటున్న భర్తను కాపాడాలని కనిపించిన వారి కాళ్లా వేళ్లా పడింది. కానీ.. కట్టుకున్న వాడి ప్రాణాలను కాపాడుకోలేకపోయింది. ఈ హృదయ విదారక ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం కలబురగి జిల్లా సేడం మండలానికి రతన్ (35), మంజూల (32) భార్యభర్తలు. వీరికి ముగ్గురు సంతానం. స్థానికంగా పనులు లేకపోవడంతో.. ఏడాది క్రితం బతుకుదెరువు కోసం రతన్ నగరానికి వలస వచ్చాడు. పాండురంగానగర్ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ స్థానికంగా కూలీ పని చేస్తున్నాడు. ప్రతి నెలా సొంతూరికి వెళ్లి భార్యకు డబ్బులు ఇచ్చి వచ్చేవాడు. కూలీ పనులు దొరక్కపోవడంతో రెండు నెలలుగా గ్రామానికి వెళ్లడం లేదు. దీంతో ఆయన భార్య మంజుల మూడు రోజుల క్రితం భర్త వద్దకు వచ్చింది. రెండు రోజులు భర్తతో ఉండి అప్పటి వరకు జమ చేసిన డబ్బులు తీసుకుని సోమవారం ఉదయం స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధమైంది. మరో నెల రోజులు ఇక్కడే పని చేసి వచి్చన డబ్బుతో తానే వస్తానని భార్యకు చెప్పాడు. ఇక్కడ అంతగా పని దొరకడం లేదని గ్రామానికి వచ్చి పని చేసుకుని మీతోనే ఉంటానన్నాడు. దూసుకు వచ్చి మృత్యువు.. సోమవారం ఉదయం భార్యభర్తలు ఇదే విషయం మాట్లాడుకుని హైదర్‌గూడలోని బస్టాప్ వద్దకు చేరుకున్నారు. బస్టాప్ వద్ద ఉదయం 6 గంటలకు నిలుచుని ఉన్నారు. ఇదే సమయంలో ఆరాంఘర్ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తున్న టస్కర్ వాహనం ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ వేగంగా దూసుకువచ్చింది. బస్టాప్‌లో నిలుచున్న దంపతులిద్దరినీ ఢీకొట్టింది. టస్కర్ చక్రాల కింద నలిగిన రతన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మంజులకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి వరకు తనతో నెల రోజుల్లో గ్రామానికి వస్తానన్న భర్త తన కళ్లెదుటే తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో ఆమె కన్నీరుమున్నీరుగా రోదించింది. భర్త బతికే ఉన్నాడనుకుని కాపాడండంటూ అక్కడ ఉన్నవారిని ప్రాధేయపడింది. ఆమె అభ్యర్థనలు అతడి ప్రాణాలను కాపాడలేకపోయాయి. ప్రమాదానికి కారకుడైన టస్కర్ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయాడు. కేసు దర్యాప్తులో ఉంది. (చదవండి: చిన్నపాటి గొడవ..పూలు కట్ చేసే బ్లేడ్‌తో యువకుడిని..) -
యువకుడితో చనువుగా ఉంటోందని మందలిస్తే..
సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రులు మందలించారని ఓ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతుంది. ఈ విషాద సంఘటన రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్‌గూడలో చోటు చేసుకుంది. హైదర్‌గూడ ప్రాంతానికి చెందిన 14 సంవత్సరాల మైనర్ బాలిక ఓ యువకుడితో చనువుగా ఉంటోందని తల్లిదండ్రులు మందలించారు. దీంతో బాలిక మనస్థాపానికి గురై పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన తల్లిదండ్రులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, చికిత్సను అందిస్తున్నారు. చదవండి: (హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో యువతి మృతదేహం కలకలం) -
భర్తకు వీడియో కాల్ చేసి భార్య ఆత్మహత్య
సాక్షి, రాజేంద్రనగర్: ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ భర్తకు వీడియో కాల్ చేసి భార్య ఉరివేసుకున్న ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నల్గొండ ప్రాంతానికి చెందిన సాయిశివ(28), రాజమండ్రికి చెందిన నాగదేవి(24) ప్రేమించుకున్నారు. 8 నెలల క్రితం కుటుంబ సభ్యులకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. సాయిశివ బెంగళూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా నాగదేవి బ్యూటీషియన్. ఇరువురు హైదర్‌గూడ చైతన్య విలాస్ ప్రాంతంలోని అపార్ట్మెంట్లో కాపురం పెట్టారు. సాయిశివ వారానికి రెండు రోజులు ఇక్కడే ఉండి అయిదు రోజులు బెంగళూర్‌లో విధులు నిర్వహించే వాడు. అతడి కుటుంబం ఎల్బీనగర్ ప్రాంతంలో నివసిస్తోంది. సోదరి వివాహం ఉండటంతో అతడు మూడు రోజుల క్రితం నగరానికి వచ్చాడు. ఎల్బీనగర్లో పెళ్లి పనులు చూసుకుంటున్నాడు. మంగళవారం రాత్రి నాగదేవి వీడియో కాల్ చేసి వెంటనే ఇంటికి రావాలని అతడిని కోరింది. వివాహం అనంతరం వస్తానని తెలపడంతో ఫోన్లో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వీడియో కాల్‌లోనే ఉరి వేసుకుంటున్నానంటూ నాగదేవి తెలిపింది. అపార్ట్మెంట్ పక్కన ఉండే వారికి సాయిశివ ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వాచ్మెన్ సాయంతో తలుపులను బద్దలు కొట్టి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందింది. ఘటన స్థలానికి చేరుకున్న సాయిశివ రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందజేశాడు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: స్పా ముసుగులో వ్యభిచారం: ఏడుగురి రిమాండ్ రోడ్డు ప్రమాదంలో ఎంపీటీసీ దంపతుల మృతి -
బండారు దత్తాత్రేయకు స్వల్ప అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. సోమవారం ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం గురించి అపోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీత మాట్లాడుతూ.. దత్తాత్రేయ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. సీనియర్ కార్డియాలజిస్ట్ శ్రీనివాస్‌రావు ఆయనకు దగ్గరుండి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. రొటీన్ చెక్అప్లో భాగంగానే ఆయన ఆసుపత్రికి వచ్చారని పేర్కొన్నారు. వైద్యపరీక్షల అనంతరం మధ్యాహ్నం ఆయనను డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఆ తర్వాత సాయంత్రం బండారు దత్తాత్రేయ సిమ్లాకు బయలుదేరుతారు. (హిమాచల్ గవర్నర్‌గా దత్తాత్రేయ) చదవండి: ఉద్యోగాలను యాచించొద్దు.. కల్పించాలి: దత్తాత్రేయ -
చూస్తే.. ‘ఫ్లాట్’ అయిపోవాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో ఆధునిక సదుపాయాలతో నిర్మించిన నివాస గృహ సముదాయాన్ని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రారంభించారు. వేద పండితుల సమక్షంలో జరిగిన గృహప్రవేశ పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నివాస సముదాయంలోని భవనాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శాసనసభ కార్యదర్శి వి.నర్సింహాచారి, ఎంపీ జోగినిపల్లి సంతోశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఆదర్శ్‌నగర్, హైదర్‌గూడలోని పాత ఎమ్మెల్యే క్వార్టర్లు శిథిలావస్థకు చేరుకోవడంతో 2012లో కొత్తభవన సముదాయం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎన్నో ఆటంకాల అనంతరం పనులు పూర్తికావడంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి సహాయకులు, సిబ్బంది కోసం కొత్త నివాస గృహాలు అందుబాటులోకి వచ్చాయి. క్వార్టర్స్‌లో ఏర్పాటుచేసిన ఫర్నీచర్ కాంగ్రెస్, మజ్లీస్ సభ్యుల డుమ్మా! కొత్త ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు బీజేపీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ లోధా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో ఎమ్మెల్యేల కోసం నిర్మించిన భవన సముదాయం కొత్త నివాస సముదాయం హైలైట్స్ - ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం 6,01,532 చదరపు అడుగుల విస్తీర్ణంలో 120 ఫ్లాట్లతో మెయిన్ బ్లాక్ నిర్మించారు. మూడు సెల్లార్లు+గ్రౌండ్ ఫ్లోర్+12 ఫ్లోర్లతో ఈ బ్లాక్ సిద్ధమైంది. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 2,500 చదరపు అడుగులు.. అంతస్తుకు 10 చొప్పున ఫ్లాట్లున్నాయి. ఒక్కో ఫ్లాట్‌లో పెద్దల పడక గది, పిల్లల పడక గది, అతిథుల పడక గది, కామన్ టాయిలెట్, కార్యాలయ గది, లివింగ్ అండ్ డైనింగ్ రూం, వంట గది, స్టోర్‌రూంలు ఉన్నాయి. - మెయిన్ బ్లాక్‌లోని సెల్లార్లో 81, ఒకటో సబ్ సెల్లార్లో 94, రెండో సబ్ సెల్లార్లో 101 276 కార్ల పార్కింగ్ సదుపాయం కల్పించారు. - మెయిన్ బ్లాక్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఎమ్మెల్యేల కోసం 150 చ.అడుగుల విస్తీర్ణంతో 23 క్యాబిన్లు, ఒక సెక్యూరిటీ రూం, 6 ప్యాసేజ్ లిఫ్టులు, 2 సర్వీసు లిఫ్టులు, 5 మెట్ల మార్గాలను ఏర్పాటు చేశారు. - ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహాయకుల (అటెం డెంట్ల) కోసం 120 ఫ్లాట్లను నిర్మించారు. ఒక్కో ఫ్లాట్ 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. - సిబ్బంది కోసం 36 ఫ్లాట్లను నిర్మించారు. ఒక్కో ఫ్లాట్ 944 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. - లక్షా 25 వేల 928 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ, మౌలిక సదుపాయాల బ్లాక్‌ను నిర్మిం చారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో 4,128.50 చదరపు అడుగుల విస్తీర్ణంలో సూపర్ మార్కెట్, కిచెన్‌తో కూడిన క్యాంటీన్, స్టోర్‌రూంల సదుపాయం ఉంది. తొలి అంతస్తులో 4,701 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆస్పత్రి, రెండో అంతస్తులో ఇండోర్ గేమ్స్, మూడో అంతస్తులో గ్రంథాలయం/రీడింగ్ హాల్, వ్యాయామశాల, ఆడియో విజువల్ రూం, నాలుగో ఫ్లోర్లో బాంకెట్ హాల్ సదుపాయం కల్పించారు. - భవన సముదాయం అవసరాల కోసం 0.73 ఎంఎల్డీ నిల్వ సామర్థ్యంతో మంచినీటి సంపు నిర్మించారు. - 250 కేఎల్డీ సామర్థ్యంతో మురుగు నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేశారు. -
అన్ని హంగులతో కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్
సాక్షి, హైదరాబాద్: హైదర్‌గూడలో సకల హంగులతో నిర్మితమైన శాసనసభ్యుల నివాస గృహ సముదాయాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రారంభించనున్నారు. నిర్మాణంలో తీవ్ర ఆలస్యం జరిగినా ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం రెండో శాసనసభ కొలువుదీరిన తర్వాత ఈ భవనాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. నాలుగున్నర ఎకరాల సువిశాల విస్తీర్ణంలో దాదాపు రూ.166 కోట్ల వ్యయంతో వీటిని నిర్మించారు. ఎమ్మెల్యేలతోపాటు సిబ్బంది, సర్వెంట్ల కుటుంబాలు కూడా ఉండేందుకు వీలుగా ఈ సముదాయాన్ని సిద్ధం చేశారు. 119 మంది ఎమ్మెల్యేలతోపాటు మరో నియమిత ఎమ్మెల్యే... వెరసి 120 మంది సభ్యులు ఉండేందుకు వీలుగా వీటిని నిర్మించారు. 36 స్టాఫ్ క్వార్టర్లు: ఆరు అంతస్తుల్లో స్టాఫ్ క్వార్టర్లు నిర్మించారు. ఇందులో మొత్తం 36 ఫ్లాట్లు ఉంటాయి. 810 చ.అ. విస్తీర్ణం ఉండే రెండు పడక గదుల ఫ్లాట్లు 12, 615 చ.అ.విస్తీర్ణంలో ఉండే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 24 ఉంటాయి. 12 అటెండెంట్ల ఫ్లాట్లు ఉన్నాయి. ఈ సముదాయం కూడా ఆరు అంతస్తుల్లో ఉంది. ఒక్కో ఫ్లాట్‌ను 325 చ.అ.విస్తీర్ణంలో నిర్మించారు. ఐటీ అండ్ ఎమినిటీస్ బ్లాక్ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఇది ఐదు అంతస్తుల్లో ఉంటుంది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో 4 వేల చ.అ.విస్తీర్ణంలో సూపర్ మార్కెట్, క్యాంటీన్ ఉంటాయి. మొదటి అంతస్తులో కార్యాలయం, హెల్త్ సెంటర్ ఉంటాయి. సెకండ్ ఫ్లోర్లో ఆఫీస్, ఇండోర్ గేమ్స్, స్టోర్ రూమ్ ఉంటాయి. 0.73 ఎమ్మెల్డీ సామర్థ్యంతో భూగర్భ సంప్, ఓ ఎస్టీపీ, 1,000 కేవీ ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. ఇప్పటికే ఉన్న పాత, కొత్త ఎమ్మెల్యే క్వార్టర్లలో ఉండాలనుకుంటున్న ఎమ్మెల్యేలు వాటిల్లోనే కొనసాగే అవకాశముంది. 12 అంతస్తుల్లో... వాహనాలు నిలిపేందుకు సెల్లార్లో మూడంతస్తులు నిర్మించారు. ఇందులో 276 కార్లను నిలిపే స్థలం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో 23 విజిటర్స్ రూమ్‌లు నిర్మించారు. తమను కలిసేందుకు వచ్చే వారితో ఎమ్మెల్యేలు ఈ గదుల్లో భేటీ అవుతారు. ఓ క్లబ్ హౌస్, ఒక వ్యాయామశాల కూడా సిద్ధం చేశారు. ఈ భవనాలు 12 అంతస్తుల్లో నిర్మించారు. ఎమ్మెల్యేలకు 120 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్కోటి 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో మూడు పడక గదులు, హాలు, వంటగది, డ్రాయింగ్‌రూమ్, విజిటర్ రూమ్ ఉంటాయి. ఆరు లిఫ్టులు, 5 మెట్ల దారులు ఏర్పాటు చేశారు. -
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
హైదరాబాద్: అపార్ట్మెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యం మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. శిథిలావస్థకు చేరిన సిమెంట్ బెంచీని పట్టించుకోకపోవడంతో ఓ బాలుడి ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఫిబ్రవరిలో మోనీష్ అనే చిన్నారి ఆడుకుంటూ వెళ్లి స్తంభాన్ని పట్టుకుని విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడిన సంఘటన మరచిపోకముందే మరో చిన్నారి ఆడుకుంటుండగా సిమెంట్ బెంచీ మీద పడటంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ రెండు సంఘటనలూ రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోనే చోటుచేసుకున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దిశాన్శర్మ నగరంలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ.. భార్య మౌనిక, ఇద్దరు కుమారులతో హైదర్‌గూడలోని జనప్రియ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఇద్దరు కుమారుల్లో చిన్నవాడైన దివిత్‌శర్మ(6) గురువారం సాయంత్రం తన అన్నతో కలిసి అపార్టుమెంట్ ఆవరణలోని పార్కుకు వచ్చాడు. అక్కడ స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. పార్కులో కూర్చునేందుకు పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన సిమెంట్ బల్లలు శిథిలావస్థకు చేరాయి. వాటికి అమర్చిన బోల్టులు కూడా విరిగిపోయాయి. ఇవేమీ తెలియని దివిత్‌శర్మ.. ఆడుకుంటూ వెళ్లి ఆ బల్లపై కూర్చున్నాడు. అనంతరం ఒక్కసారిగా దానిపై నుంచి లేచేసరికి ఆ బెంచీ బాలుడిపై పడింది. ఈ ఘటనలో దివిత్‌శర్మ తలకు తీవ్రంగా గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. శుక్రవారం సాయంత్రం బాలుడి అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు నెలల్లో రెండు ఘటనలు.. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలోని క్రీడా మైదానాలు, పార్కులు చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలో గత రెండు నెలల్లో పార్కుల్లో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఫిబ్రవరి రెండో వారంలో పీరంచెరువు పెబల్సిటీలో మోనీష్ అనే చిన్నారి విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడ్డాడు. ఆడుకుంటూ వెళ్లి ఫుట్‌పాత్ పక్కనున్న వీధిదీపం స్తంభాన్ని పట్టుకోగా షాక్ కొట్టి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు విద్యుత్ సరఫరా కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని నిర్ధారించి అతడిని అరెస్టు చేశారు. అమ్మమ్మ ఇంటికి వెళ్లాల్సి ఉండగా.. స్కూలుకి సెలవులు ఇవ్వడంతో దివిత్‌శర్మ అన్న, తల్లితో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం ఆదివారం ఉదయం రైలుకు టికెట్లు కూడా బుక్ చేశారు. రెండు రోజుల్లో అమ్మ మ్మ ఇంటికి వెళ్లాల్సిన తరుణంలో బాలుడు మృతిచెందడంతో ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. పార్క్ నిర్వహణ కోసం నెలనెలా వేలాది రూపాయలు తీసుకుంటున్నప్పటికీ, సరైన వసతులు కల్పించకుండా నిర్వాహకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని అపార్ట్‌మెంట్‌వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు
సాక్షి, గుంటూరు/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల మరణాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో ఓ కార్పొరేట్ కాలేజీ విద్యార్థి అనుమానాస్పద రీతిలో ప్రాణాలు విడిచాడు. హాస్టల్ పైనుంచి దూకి ప్రాణాలు వదిలాడు. ఇటు గుంటూరు పిడుగురాళ్లలో ఎనిమిదో తరగతి విద్యార్థి పాఠశాలలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలు వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. హైదరాబాద్‌లో.. కూకట్పల్లి హైదర్‌నగర్‌లోని చైతన్య కాలేజ్‌లో రెండో సంవత్సరం చదుతువుతున్న అభికుమార్ రెడ్డి అనే విద్యార్థి హాస్టల్ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 5 గంటల ప్రాంతంలో హాస్టల్ భవనం ఐదో అంతస్తు నుంచి అతను దూకేశాడు. అతని స్వస్థలం కృష్ణా జిల్లా కే.రామచంద్రాపురం. అభికుమార్ ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసినట్టు తెలుస్తోంది. అభికుమార్ మృతి పట్ల అతని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐదో అంతస్తు నుంచి దూకినా.. కాలి మీద చిన్న దెబ్బ తప్ప.. గాయాలు కాలేదని అంటున్నారు. చదువు చెప్పమని పంపిస్తే తన కొడుకును శవంగా మార్చేసారని కాలేజీ యాజమాన్యం తీరుపై తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీ వేధింపుల కారణంగానే తమ కొడుకు చనిపోయాడని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. గుంటూరులో.. జిల్లాలోని పిడుగురాళ్ల మండలం లెనిన్ నగర్లో విషాదం చోటుచేసుకుంసది. లెనిన్ నగర్లో ఉన్న మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో 14 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అశోక్ కుమార్ అనే విద్యార్థి ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం అతను ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. శనివారం తాను చదువుతున్న పాఠశాలలోనే అతను ఉరేసుకొని కనిపించాడు. ఈ ఘటనతో అశోక్‌కుమార్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
హైదర్‌గూడలో యువకుడు ఆత్మహత్య
-
హైదర్‌గూడలో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హైదర్‌గూడలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఓ అపార్ట్మెంట్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భవనం గ్రౌండ్ ఫ్లోర్లో చెలరేగిన మంటలు మొదటి అంతస్తుకు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన అపార్ట్మెంట్ వాసులు టెర్రస్‌పైకి వెళ్లారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పింది. భవనంపైన ఉన్న వారిని సురక్షితంగా కిందకు దించారు. ఈ అగ్నిప్రమాదంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లోని 2 ఎరువులు, విత్తనాల దుకాణాలు దగ్ధమయ్యాయి. షార్ట్‌సర్క్యూటే ప్రమాదానికి కారణమని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు రూ. 10 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
హైదర్‌గూడలో వ్యక్తి దారుణ హత్య
రంగారెడ్డి: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ గూడలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నిర్మాణం జరుగుతున్న ఓ ఇంట్లో పారతో తలపై కొట్టడంతో వ్యక్తి మృతిచెందాడు. మృతుడు ఇబ్రహీంపట్నానికి చెందిన రాజు(44) అనే మేస్త్రిగా గుర్తించారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
హైదర్‌గూడ చెప్పుల షాపులో అగ్నిప్రమాదం
-
విజ్ఞాన్ కాలేజ్‌లో ర్యాగింగ్ కలకలం
హైదరాబాద్: నగరంలో మరోసారి ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. హైదర్‌గూడలోని విజ్ఞాన్ కళాశాలలో శుక్రవారం ర్యాగింగ్ కలకలం రేగింది. కళాశాలలో ర్యాగింగ్ జరుగుతోందనే సమాచారంతో రంగంలోకి దిగిన రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ర్యాగింగ్ అంశంతో సంబంధం ఉన్న పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి మరింత సమాచారం రాబడుతున్నారు. -
కల్లు తాగించి.. గొలుసు ఎత్తుకెళ్లారు!
రాజేంద్రనగర్: కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ మహిళ కల్లు తాగడం కోసం కల్లు కంపౌడ్‌కు వెళ్లింది. అక్కడ పరిచయమైన ఇద్దరు మహిళలు ఆమెకు పూటుగా కల్లుతాగించారు. అనంతరం ఆమె మెడలోని బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హైదర్‌గూడలోని ఓ కల్లు దుకాణంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. శనివారం ఉదయం మత్తు నుంచి తేరుకున్న సదరు మహిళ పుస్తెలుతాడు మెడలో కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మత్తుమందు చల్లి చోరీ
హైదరాబాద్ : పట్టపగలు ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు ఇంట్లో ఉన్నవారిపై మత్తు మందు చల్లి ఇంట్లోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన నగరంలోని హైదర్‌గూడ అంకిత్ రెసిడెన్సీలో శనివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సత్యనారాయణరావు ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఆయనతో పాటు ఇంట్లో ఉన్న పనిమనిషిపై మత్తుమందు చల్లి ఇంట్లో ఉన్న 6 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ. 5 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని ఆదివారం గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నారాయణ కాలేజీలో వార్డెన్ ఆత్మహత్య
- ప్రేమ వ్యవహారమే కారణమన్న పోలీసులు - యాజమాన్యం వేధింపులే అంటున్న సహ ఉద్యోగులు హైదరాబాద్: నారాయణ కళాశాలల్లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా అత్తాపూర్ హైదర్‌గూడ నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో ఓ వార్డెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమని పోలీసులు అంటుండగా... యాజమాన్యం వేధింపులే కారణమని తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదర్‌గూడలోని నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో వరంగల్ జిల్లా కొత్తగూడకు చెందిన వేముల విష్ణు(27) రెండేళ్లుగా వార్డెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా, శనివారం రాత్రి ఎవరూ లేని సమయంలో కళాశాలలోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం గమనించిన సిబ్బంది... విషయాన్ని కళాశాల నిర్వాహకులు, పోలీసులకు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విష్ణు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి ఫేస్బుక్ అక్కౌంట్‌ను పరిశీలించిన పోలీసులు... ‘దిస్ ఈజ్ లాస్ట్ డే.. బాయ్ స్వాతి’ అనే పోస్టును గుర్తించారు. దీన్నిబట్టి అతడి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమనే నిర్ధారణకు వచ్చారు. అయితే... దసరా సెలవుల్లో కూడా పనిభారం మోపి యాజమాన్యం ఒత్తిడి తేవడం వల్లనే విష్ణు ఆత్మహత్య చేసుకున్నాడని సహ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. విషయం తెలియగానే... ఈ కళాశాలలో ఉండే సిబ్బంది వెళ్లిపోయి వారి స్థానంలో వేరే బ్రాంచ్‌కు చెందిన ఉద్యోగులు విధుల్లోకి రావడం, ఇంత జరిగినా ప్రిన్సిపాల్ కాలేజీకి రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హైదర్‌గూడలో తలసాని పాదయాత్ర
హైదరాబాద్: నగరంలోని హైదర్‌గూడలో నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మంగళవారం పాల్గొన్నారు. ఆయన హైదర్‌గూడలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. మంత్రితోపాటు పలువురు నేతలు, ఉన్నతాదికారులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. -
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్... పేకాట అడ్డా
టాస్క్‌ఫోర్స్ దాడుల్లో బట్టబయలు 52 మంది అరెస్టు దొరికిన వారిలో రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు రూ. 12 లక్షలు, 60 సెల్ఫోన్లు స్వాధీనం కర్నూలు జిల్లా మాజీ ఎమ్మెల్యే పీఏ పర్యవేక్షణలో వ్యవహారం! హైదరాబాద్: ప్రజా ప్రతినిధులు ఉండాల్సిన చోట వ్యసనాలు రాజ్యమేలుతున్నాయి.. ఎమ్మెల్యేలు నివాసముండే చోట విచ్చలవిడి ‘వ్యవహారాలు’ సాగిపోతున్నాయి. ఇప్పటికే ‘మందు’ బాబులకు అడ్డాగా మారిం దనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్... తాజాగా పేకాట కేంద్రంగా మారింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి చేసిన ఆకస్మిక దాడుల్లో ఈ వ్యవహారం బయటపడింది. పేకాట ఆడుతున్న 52 మందిని ఈ దాడుల్లో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 12 లక్షల నగదు, 60 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రిక్రియేషన్ ముసుగులో నడుస్తున్న పేకాట క్లబ్బులను రాష్ట్ర ప్రభుత్వం కొద్ది నెలల కింద మూసివేసింది. దీంతో ఈ జూదానికి అలవాటు పడినవారు కొత్త కొత్త అడ్డాలను వెతుక్కుంటున్నారు. కొందరైతే ఏకంగా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనే కొంత కాలం నుంచి గుట్టుగా పేకాట నిర్వహిస్తున్నారు. దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని 707, 708 ఫ్లాట్లలో పేకాట ఆడుతున్న 52 మందిని పట్టుకున్నారు. పేకాట రాయుళ్ల కోసం ఇక్కడ ప్రత్యేక భోజన ఏర్పాట్లు, ఆడేందుకు ప్రత్యేక కుర్చీలు సైతం ఏర్పాటు చేసి ఉండడాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆ ఫర్నిచర్‌ను సైతం సీజ్ చేశారు. పట్టుబడిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కర్నూలు, అనంతపురం, హైదరాబాద్, రంగారెడ్డి, విజయవాడ ప్రాంతాలకు చెందిన ఆయా పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేకు పీఏగా పనిచేస్తున్న నర్సింహారెడ్డి, కేశవరెడ్డి అనే వ్యక్తుల పర్యవేక్షణలో ఈ వ్యవహారం జరుగుతోందని సమాచారం. ఈ రెండు క్వార్టర్లలోని ప్రజా ప్రతినిధులు ఇటీవలే ఖాళీ చేయడంతో... పేకాట నడిపిస్తున్నారు. కాగా ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తం నిందితులను నారాయణగూడ పోలీసులకు అప్పగించామని, పట్టుబడినవారిలో రాజకీయ నేతలు, ప్రముఖులు ఉన్నారని డీసీపీ లింబారెడ్డి తెలిపారు.