మత్తుమందు చల్లి చోరీ | Robbery in Hyderguda | Sakshi
Sakshi News home page

మత్తుమందు చల్లి చోరీ

Published Sun, Mar 20 2016 10:12 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Robbery in Hyderguda

హైదరాబాద్ : పట్టపగలు ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు ఇంట్లో ఉన్నవారిపై మత్తు మందు చల్లి ఇంట్లోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన నగరంలోని హైదర్‌గూడ అంకిత్ రెసిడెన్సీలో శనివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సత్యనారాయణరావు ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఆయనతో పాటు ఇంట్లో ఉన్న పనిమనిషిపై మత్తుమందు చల్లి ఇంట్లో ఉన్న 6 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ. 5 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని ఆదివారం గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement