
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హైదర్‌గూడలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఓ అపార్ట్‌మెంట్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో చెలరేగిన మంటలు మొదటి అంతస్తుకు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన అపార్ట్‌మెంట్ వాసులు టెర్రస్‌పైకి వెళ్లారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పింది.
భవనంపైన ఉన్న వారిని సురక్షితంగా కిందకు దించారు. ఈ అగ్నిప్రమాదంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లోని 2 ఎరువులు, విత్తనాల దుకాణాలు దగ్ధమయ్యాయి. షార్ట్‌సర్క్యూటే ప్రమాదానికి కారణమని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు రూ. 10 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment