హైదరాబాద్: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. రాగల 24 గంటల్లో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
సోమవారం ఉదయం నుంచి నగరంపై ముసురు అలుముకుంది. క్రమంగా చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వాన కురుస్తోంది. మరికొన్ని గంటల్లో ఇది భారీ వర్షంగా మారొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని నగరవాసులకు సూచన చేస్తోంది జీహెచ్‌ఎంసీ.
☁️ మరోవైపు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని.. మరో మూడు రోజులపాటు ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తోంది.
☁️ ఇక తెలంగాణ రాష్ట్రంపై నైరుతి రుతుపవనాల ప్రభావం సాధారణంగా ఉంది. 18వ తేదీన వాయువ్య బంగాళాఖాతం లో తుఫాను సర్కులేషన్ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
☁️ వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని ఉత్తర ఒడిశా గంగా పశ్చిమ బెంగాల్ తీరాలలో దాని ఆనుకొని ఉన్నఒడిశా గంగాపశ్చిమ బెంగాల్ ,జార్ఖండ్ లపై అల్ప పీడనం ప్రభావం కనిపిస్తోంది. అసోసియేటెడ్ సైక్లోనిక్ సర్కులేషన్ నైరుతి వైపు వంగి ట్రోపోస్పిరికల్ విస్తరించి ఉంది.
☁️ రానున్న మూడు(నాలుగు) రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ అయ్యింది.
☁️ కొమరం భీమ్ ఆసిఫాబాద్, అదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ,వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లోనీ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: వందేభారత్‌కు మంటలు.. తప్పిన ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment