
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్‌ఐఏ పలుచోట్ల సోదాలు నిర్వహించింది. దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసులో మహబూబ్‌నగర్ జిల్లాలో ముత్తు నాగరాజు, వి. సతీష్ , మేడ్చల్‌లోని కొమ్మరాజు కనకయ్య, భద్రాద్రి జిల్లాలో గుంజి విక్రమ్, త్రినాథరావు, జనగామలో సూర సారయ్య, వరంగల్‌లో వేలుపుస్వామి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నిందితుల నుంచి 400 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 500 నాన్‌ఎలక్ట్రిక్ డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని మావోయిస్టు నేత హిడ్మాకు రవాణా చేస్తుండగా ఎన్‌ఐఏ అధికారులు పట్టుకున్నారు. పేలుడు పదార్థాల తయారీకి సంబంధించి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment