
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ నోటిఫికేషన్(సీపీజెట్)ను ఉన్నత విద్యా మండలి శుక్రవారం విడుదల చేసింది. సెప్టెంబర్ 18(శుక్రవారం) నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించారు. ఈ సంవత్సరం సీపీజెట్ ప్రవేశ పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. ఆన్లైన్ ఆధారంగా సీపీజెట్ పరీక్ష నిర్వహించనుంది. కాగా మొత్తం 46 సబ్జెక్ట్లలో అక్టోబర్ 31న పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణలోని అన్ని పాత జిల్లాలలో పరీక్షలు జరగనున్నాయని ఉన్నత విద్యా మండలి తెలిపింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సబ్జెక్ట్‌లలో 30వేల సీట్లు ఉన్నాయని, అభ్యర్థులు www.tscpget.com ద్వారా అప్లై చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment