PG entrance exams
-
సబ్జెక్ట్‌తో పనిలేకుండా డిగ్రీ, పీజీల్లో ఏ కోర్సులో అయినా చేరొచ్చు
న్యూఢిల్లీ: ఇంటర్మీడియట్లో చదువుకున్న సబ్జెక్టులతో సంబంధం లేకుండా ఇకపై నచ్చిన గ్రూప్‌లో డిగ్రీ, అలాగే డిగ్రీ పట్టభద్రులు నచ్చిన కోర్సులో పీజీ చేసేందుకు అవకాశం కల్పిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) వినూత్న నిర్ణయం తీసుకోనుంది. జాతీయ లేదా యూనివర్సిటీ స్థాయి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఈ వెసులుబాటు కల్పించాలని యూజీసీ యోచిస్తోంది. డిగ్రీ, పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కొత్త ముసాయిదా నిబంధనావళిని యూజీసీ గురువారం వెలువరించింది. ఆయా వివరాలను యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ వివరించారు. ‘‘ లెవల్ 4 లేదా 12వ తరగతి పూర్తిచేసుకున్న విద్యార్థి ఇకపై తనకు నచ్చిన కోర్సు అంటే బీఎస్సీ, బీఏ, ఇలా ఇంటర్మీడియట్ సబ్జెక్టులతో సంబంధంలేకుండా భిన్నమైన కోర్సుల్లో డిగ్రీలో చేరొచ్చు. డిగ్రీ పట్టభద్రులు.. పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోసం తమకు నచ్చిన భిన్నమైన కోర్సుల్లో చేరొచ్చు. నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా డిగ్రీ రెండో ఏడాది, మూడో ఏడాది, నాలుగో ఏడాదిలోనూ చేరొచ్చు. ఎంత మందిని చేర్చుకోవాలనేది ఖాళీలను బట్టి ఆయా యూనివర్సిటీలు నిర్ణయం తీసుకుంటాయి. ఇకపై ప్రధాన సబ్జెక్ట్ నుంచి 50 శాతం క్రెడిట్స్, మిగతా క్రెడిట్స్‌ను నైపుణ్యాభివృద్ధి, అప్రెంటిస్‌షిప్, సబ్జెక్టుల ద్వారా పొందొచ్చు’’ అని జగదీశ్ చెప్పారు. -
ఎస్సై పరీక్ష.. హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నేతృత్వంలో జరుగుతున్న సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై), తదితర సమాన పోస్టుల ప్రిలిమినరీ రాతపరీక్షకు సంబంధించి అభ్యర్థులు శనివారం నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 7, ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగే పరీక్ష కోసం ఆగస్టు 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం అందుబాటులో ఉంటుందని ఆయన వెల్లడించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు వారి ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌ను ప్రింట్ తీసుకోవాలని ఫొటోతో పాటు సెంటర్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 35 పట్టణ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ప్రింట్ తీసుకున్న హాల్‌టికెట్ మొదటి పేజీలో ఎడమ భాగంలో అభ్యర్థులు తమ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను అతికించాలని, అలా అతికించిన హాల్‌టికెట్‌తో వచ్చిన వారినే పరీక్ష కేంద్రానికి అనుమతిస్తామని స్పష్టంచేశారు. పరీక్ష నిబంధనలు ఏమాత్రం ఉల్లంఘించినా అభ్యర్థి పరీక్ష చెల్లదని హెచ్చరించారు. పరీక్ష పత్రం ఇంగ్లిష్–తెలుగు, ఇంగ్లిష్–ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు. 11 నుంచి పీజీ ‘ఎంట్రెన్స్’ ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని వివిధ వర్సిటీల్లో పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 11 నుంచి 22 వరకు ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్లు టీఎస్సీపీగేట్–2022 కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఎంఏ అరబిక్, కన్నడ, మరాఠీ, పర్షియన్, థియేటర్ ఆర్ట్స్ కోర్సులకు సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు తక్కువ వచ్చినందున నేరుగా ప్రవేశాలు కల్పించనున్నట్లు చెప్పారు. టైంటెబుల్, ఇతర వివరాలను ఉస్మానియా.ఏసీ.ఇన్ వెబ్సైట్లో చూడవచ్చు. గెస్ట్ లెక్చరర్ల వేతనం పెంపు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల వేతనాలను ప్రభుత్వం పెంచింది. దీంతో ఒక్కో అధ్యాకుడికి నెలకు రూ.6,480 అదనంగా లభి స్తుంది. ఈమేరకు ప్రభుత్వ కార్యదర్శి రోనాల్డ్ రోస్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరికి ఇప్పటి వరకు ఒక్కో పీరియడ్‌కు రూ.300 చొప్పున, నెలకు 72 పీరియడ్లకు (గ రిష్టంగా) రూ.21,600 వేతనం వచ్చేది. ఇప్పు డు 30% పెంచడంతో పీరియడ్‌కు రూ.390 చొప్పున 72 పీరియడ్లకు రూ.28,080 రానుంది. ఈ పెంపును ప్రభుత్వ జూనియర్ కాలేజీల గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్, ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి నేతలు మాచర్ల రామకృష్ణ, కొప్పిశెట్టి సురేశ్, పోలూరి మురళి స్వాగతించారు. గురుకుల ఐదో తరగతి ప్రవేశాల గడువు పొడిగింపు సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 1వ తేదీలోగా నిర్దేశించిన పాఠశాలలో రిపోర్టు చేయాలని గురుకుల సెట్ కన్వీనర్ రోనాల్డ్‌రాస్ శుక్రవా రం ప్రకటనలో కోరారు. ఈనెల 29వ తేదీతో రిపోర్ట్ చేయాలని ముందుగా గడువు విధించినప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రుల వినతులను పరిగణించి గడువు తేదీని ఆగస్టు 1 వరకు పొడిగించినట్లు ఆయన స్పష్టం చేశారు. 31న సబ్ ఇంజనీర్ పోస్టులకు పరీక్ష సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) లో 201 సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి పరీక్షను ఈనెల 31న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇప్పటికే హాల్‌టికెట్లు పంపిణీ చేశామని, హాల్‌టికెట్లు అందని వారు సంస్థ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. నేడు, రేపు అగ్రి ఎంసెట్ సాక్షి, హైదరాబాద్: వర్షాల కారణంగా వాయి దాపడిన మెడికల్, అగ్రికల్చర్ ఎంసెట్ శని, ఆదివారాల్లో జరగనుంది. పరీక్షకు మొత్తం 94 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో 68, ఏపీలో 18.. మొత్తం 86 పరీక్ష కేంద్రాలను ఎంసెట్ కోసం ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష రోజుకు 2 విభాగాలుగా జరుగుతుందని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక విడత, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు రెండో విడత ఉంటుందని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్థన్ తెలిపారు. వాస్తవానికి ఈ ఎంసెట్ ఈ నెల 14, 15 తేదీల్లో జరగాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో పరీక్షను ఒకరోజు ముందు వాయిదావేశారు. అగ్రికల్చర్ ఎంసెట్ ప్రశ్నపత్రం ‘కీ’ని రెండు రోజుల్లో విడుదల చేస్తామని కన్వీనర్ తెలిపారు. నేడు ఇంజనీరింగ్ ఎంసెట్ ‘కీ’విడుదల ఈ నెల 18 నుంచి 20 వరకూ జరిగిన ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రశ్నపత్రం ‘కీ’ని శనివారం విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ‘సాక్షి’కి తెలిపారు. ఆగస్టు రెండోవారంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాల ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్టు స్పష్టం చేశారు. -
పీజీ ఎంట్రన్స్ టెస్ట్‌కి కామన్ పరీక్ష
-
వచ్చే నెల 18 నుంచి పీజీ ప్రవేశ పరీక్షలు
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష(సీపీజీఈటీ)–2021ను వచ్చే నెల 18 నుంచి 27 వరకు ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు సీపీజీఈటీ కన్వీనర్ ప్రొ.పాండురంగారెడ్డి ఆదివారం తెలిపారు. 84 సబ్జెక్టులకు రాష్ట్రంలోని 12 జోన్లలో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షల షెడ్యూలును ఉస్మానియా, పీజీ అడ్మిషన్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఉదయం 9.30 నుంచి 11 వరకు, మధ్యాహ్నం ఒటి గంట నుంచి 2.30 వరకు, సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు మూడు విభాగాలుగా పరీక్షల సమయాన్ని నిర్ణయించినట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 14 నుంచి వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. 40 వేలకు చేరిన మొత్తం సీట్లు రాష్ట్రంలోని పలు వర్సిటీల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో కొత్తగా 7 వేల సీట్లు పెరగడంతో మొత్తం పీజీ కోర్సుల్లో సీట్ల సంఖ్య 40 వేలకు చేరిందని పాండు రంగారెడ్డి తెలిపారు. సీపీజీఈటీకు ఈ నెల 28తో దరఖాస్తు గడువు ముగిసిందని, ఇప్పటివరకు 75 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన వివరించారు. పరీక్షకు రూ.500 అపరాధ రుసుముతో సెప్టెంబర్ 6 వరకు, రూ.2000 అపరాధ రుసుముతో 12వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. -
కేఎంసీలో హైటెక్ కాపీయింగ్.. లెక్క తేలాలి!
సాక్షి, వరంగల్ : వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల(కేఎంసీ)లో మెడికల్ పీజీ పరీక్షల సందర్భంగా హైటెక్ మాస్ కాపీయింగ్ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల విద్యార్థులకు కేఎంసీలో నిర్వహిస్తున్న సప్లమెంటరీ పీజీ పరీక్షలు రెండ్రోజుల క్రితం ముగిశాయి. కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కళాశాలకు చెందిన విద్యార్థి ఒకరు హైటెక్ విధానంలో కాపీయింగ్ చేస్తూ పట్టుబడిన విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. కాపీ ఇలా.. కేఎంసీలో 15 రోజులు పరీక్షలు జరగ్గా చివరి రోజే వైద్య విద్యార్థి పట్టుబడటం అనుమానాలకు తావిస్తోంది. ఈ విద్యార్థి ఓ కారు తీసుకొచ్చి పరీక్ష గది వెనుక ఉంచారు. కారు డ్రైవర్‌గా సాంకేతిక పరిజ్ఞానమున్న వ్యక్తిని ఉంచి దానికి యాంటీనా బిగించారు. విద్యార్థి మోకాళ్లలో రిసీవర్ ఉంచుకుని వైర్లెస్ ఫోన్ ద్వారా జవాబులు రాసినట్లు సమాచారం. చివరి రోజు అనుమానాస్పదంగా ఉన్న కారును గుర్తించిన పరిపాలనాధికారులు ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎందరున్నారో తేలాలి.. కేఎంసీలో జరిగిన మాస్ కాపీయింగ్ వెనుక కొందరు ఉద్యోగుల హస్తమున్నట్లు తెలుస్తోంది. పరీక్ష నిర్వహణకు ప్రశ్నపత్రాన్ని ఓ ఔట్‌సోరి్సంగ్ ఉద్యోగి డౌన్లోడ్ చేసి తనను ఆశ్రయించిన కొందరు వైద్య విద్యార్థులకు చేరవేసినట్లు సమాచారం. తద్వారా ఆ ప్రశ్నల జవాబు ను విద్యార్థి మైక్ రిసీవర్, వైర్‌లైస్ ఫోన్ ద్వారా తెలుసుకుని కాపీయింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ తతంగానికి సహకరించి నందుకు విద్యార్థులు కొందరు ఉద్యోగు లకు రూ.లక్షల్లో చెల్లించినట్లు సమాచారం. రెగ్యులర్ ఉద్యోగులను కాకుండా ఔట్‌సోరి్సంగ్ వారిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే, కేఎంసీలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తే కాపీయింగ్‌లో ఇంకా ఎందరున్నారనేది తెలుస్తుందని చెబుతున్నారు. యూనివర్సిటీకి వివరాలిచ్చాం.. ఇటీవల నిర్వహించిన మెడికల్ పీజీ సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థిని గుర్తించాం. చాలా తెలివిగా కరోనా నిబంధనలను సాకుగా చేసుకుని హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. మోకాళ్ల వద్ద వైర్లెస్ రిసీవర్ ఉంచుకుని జవాబులు తెలుసుకున్నాడు. ప్రతిమ కళాశాలకు చెందిన ఆ విద్యార్థి వివరాలను కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి అప్పగించాం. తదుపరి చర్యలు యూనివర్సిటీ అధికారులు తీసుకుంటారు. – డాక్టర్ సంధ్య, కేఎంసీ ప్రిన్సిపాల్ 9 నుంచి వ్యవసాయ డిగ్రీ కోర్సుల కౌన్సెలింగ్ రాజేంద్రనగర్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని బైపీసీ స్ట్రీమ్ (హార్టికల్చర్, అగ్రికల్చర్, వెటర్నరీ)లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం ఈనెల 9వ తేదీ నుంచి సంయుక్తం గా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్ తెలిపారు. బీఎస్సీ (హానర్స్) అగ్రికల్చర్ 432 సీట్లు, బీఎస్సీ (హానర్స్) హార్టికల్చర్ 130 సీట్లకు, బీవీఎస్సీ, ఏహెచ్ 158 సీట్లకు, బీఎఫ్ఎస్సీ 36 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో వివరించారు. అడ్మిషన్ పొందిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పిం చి నిర్ణీత ఫీజును వెంటనే చెల్లించాలని సూచించారు. మరిన్ని వివరాలకు www.pjtrau. edu.in లో లాగిన్ కావాలని తెలిపారు. బీఎస్సీ (హానర్స్) అగ్రికల్చర్, బీఎస్సీ (హానర్స్)హార్టికల్చర్ పేమెంట్ కోటా సీట్ల కోసం విడిగా కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. తెలుగు వర్సిటీ పరీక్షలు యథాతథం నాంపల్లి (హైదరాబాద్): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం నిర్వహించే వార్షిక పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని, ఈ నెల 8న జరిగే భారత్ బంద్‌కు పరీక్షలకు ఎలాంటి సంబంధం ఉండదని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రమేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 నుంచి 18 వరకు తెలుగు వర్సిటీ అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరుగుతాయన్నారు. యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులతో పాటుగా బ్యాక్లాగ్ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని వివరించారు. భారత్ బంద్ జరిగే మంగళవారం కూడా పరీక్షలు ఉంటాయని, విద్యార్థులు ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు. నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా.. సాక్షి, హైదరాబాద్: భారత్ బంద్ నేపథ్యంలో మంగళవారం నిర్వహించే పలు పరీక్షలను వర్సిటీలు వాయిదా వేశాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సుల సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా మంగళవారం నాటి పరీక్షలన్నింటినీ వాయిదా వేసినట్లు జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొ. మంజూర్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షలను 10న నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 8 నాటి పాలిటెక్నిక్ డిప్లమా సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేసినట్లు ఎస్బీటీఈటీ కార్యదర్శి శ్రీనాథ్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షలను ఈ నెల 23న నిర్వహిస్తామన్నారు. సీపీజీఈటీ పరీక్షను వాయిదా వేసినట్లు ఉస్మానియా వర్సిటీ వెల్లడించింది. తమ పరిధిలో ఈ నెల 8న జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశామని, 9 నుంచి జరగాల్సిన పరీక్షలు యథావిధిగా ఉంటాయంది. అలాగే, భారత్ బంద్ నేపథ్యంలో కాళోజి హెల్త్ యూనివర్సిటీ పరిధిలో మంగళవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. వాయిదా పడిన బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ సెకండియర్ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. ఈ నెల 9న జరిగే పరీక్షలన్నీ యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించింది. 18న పీజీ..19న డిగ్రీ పరీక్షలు ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 18 నుంచి వివిధ పీజీ కోర్సుల (రెగ్యులర్) రెండో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 19 నుంచి వివిధ డిగ్రీ కోర్సుల ఇయర్ వైజ్ పరీక్షలు జరగనున్నట్లు ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ. శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. ఓయూ ప్రీ–పీహెచ్డీ పరీక్షలు ఈ నెల 28, 30 తేదీలలో నిర్వహిస్తామన్నారు. పీహెచ్డీ విద్యార్థులు జంటనగరాలతో పాటు ఆయా జిల్లాల్లో పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు ఓయూ వెబ్సైట్లో చూడాలని సూచించారు. -
పీజీ ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ నోటిఫికేషన్(సీపీజెట్)ను ఉన్నత విద్యా మండలి శుక్రవారం విడుదల చేసింది. సెప్టెంబర్ 18(శుక్రవారం) నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించారు. ఈ సంవత్సరం సీపీజెట్ ప్రవేశ పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. ఆన్లైన్ ఆధారంగా సీపీజెట్ పరీక్ష నిర్వహించనుంది. కాగా మొత్తం 46 సబ్జెక్ట్‌లలో అక్టోబర్ 31న పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణలోని అన్ని పాత జిల్లాలలో పరీక్షలు జరగనున్నాయని ఉన్నత విద్యా మండలి తెలిపింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సబ్జెక్ట్‌లలో 30వేల సీట్లు ఉన్నాయని, అభ్యర్థులు www.tscpget.com ద్వారా అప్లై చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి పేర్కొంది. -
కామన్ పీజీ ఎంట్రెన్స్‌కు మోక్షమెప్పుడో?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సంప్రదాయ యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్టు (సీపీజీఈటీ) నోటిఫికేషన్‌కు మోక్షం లభించడం లేదు. వాస్తవానికి ఏప్రిల్/మే నెలల్లో నోటిఫికేషన్‌ను జారీ చేసి దరఖాస్తులను స్వీకరించాల్సి ఉన్నా ఆ దిశగా అడుగులు ముందుకు పడలేదు. మూడ్రోజులు గడిస్తే జూలై నెల కూడా ముగియనున్నప్పటికీ సీపీజీఈటీ నోటిఫికేషన్‌ను జారీ చేయలేదు. ఇక డిగ్రీ విద్యార్హతతో ప్రవేశాలు చేపట్టే ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ నోటిఫికేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో (బీఎడ్) ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్, ఎంటెక్‌లో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్ వంటి ప్రవేశ పరీక్షల కోసం మార్చి/ఏప్రిల్ నెలల్లోనే నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులను స్వీకరించారు. ఆలస్య రుసుము లేకుండా ఆ దరఖాస్తుల ప్రక్రియ ఎప్పుడో ముగిసిపోయింది. కరోనా లేకపోతే మే నెలలోనే ఆయా పరీక్షలే ప్రవేశాల కౌన్సెలింగ్ కూడా పూర్తయ్యేది. కరోనా కారణంగా ఇప్పుడు ఆలస్య రుసుముతో వాటి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయినా సీపీజీఈటీ నిర్వహణకు ఇంతవరకు నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు. డిగ్రీ ఉత్తీర్ణులై పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దాదాపు లక్షన్నర మంది సీపీజీఈటీకి పోటీ పడతారు. పైగా ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు యూనివర్సిటీల్లోని పీజీ కోర్సుల్లో ఈ పరీక్ష ద్వారానే ప్రవేశాలు చేపట్టాల్సి ఉంది. అయినా ఎంతో ముఖ్యమైన సీపీజీఈటీని ప్రభుత్వ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో నోటిఫికేషన్ జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సీపీజీఈటీ నిర్వహణ సంస్థ అయినా ఉస్మానియా యూనివర్సిటీ ఈ విషయాన్ని పట్టించుకోవడమే మానేసింది. మొన్నటి వరకైతే సీపీజీఈటీకి కన్వీనర్‌ను కూడా నియమించలేదు. ఇటీవల ప్రొఫెసర్ కిషన్‌ను కన్వీనర్‌గా నియమించింది. ఈ పరిస్థితుల్లో నోటిఫికేషన్ ఎప్పుడు జారీ చేస్తారో, దరఖాస్తులను ఎప్పుడు స్వీకరిస్తారోనని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. పైగా పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారో.. తాము సన్నద్ధమయ్యేందుకు సమ యముంటుందో, ఉండదోనని, ప్రవేశాలు ఎంత ఆలస్యం అవుతాయోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. -
ఓయూ ఆధ్వర్యంలోనే పీజీ ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిధిలోని ప్రైవేటు పీజీ కాలేజీలు, యూనివర్సిటీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టు (సీపీజీఈటీ) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఇందులో 95.88 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు మొత్తం 60 ఉండగా, 53 కోర్సుల్లో ప్రవేశాలకు ఓయూ జూలై 8 నుంచి 20 వరకు నిర్వహించింది. సీట్ల సంఖ్య కంటే దర ఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తక్కువగా ఉండటంతో 7 సబ్జెక్టులను మినహాయించారు. దీంతో 53 సబ్జెక్టుల్లో పరీక్షలు రాసేందుకు 90,354 మంది దరఖాస్తు చేసుకోగా, 78,032 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 74,815 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహత్మాగాం«దీ, పాలమూరు వర్సిటీలు, వాటి పరిధిలోని 264 కాలేజీల్లో 30,884 సీట్లు ఉన్నాయని వివరించారు. ఓయూ ఆధ్వర్యంలోనే కౌన్సెలింగ్ కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని పీజీ సెంటర్ల తొలగింపుపై వర్సిటీలకు సమాచారం లేదన్నారు. ప్రవేశాలు తక్కువగా ఉన్న పీజీ సెంటర్లను తొలగించేందుకు కళాశాల విద్యా శాఖ ఆలోచన చేస్తున్నట్లు తెలిసిందని, అయితే ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదన్నారు. తొలిసారిగా ఆన్లైన్లో.. మొదటిసారిగా రాష్ట్రంలోని అన్ని పీజీ కాలేజీల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించినట్లు ఓయూ రిజి్రస్టార్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సెపె్టంబర్ ఒకటిన తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, మహాత్మాగాం«దీ, పాలమూరు, తెలంగాణ వర్సిటీల్లో సర్టిఫికెట్ల వెరిఫి కేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. -
పీజీ ప్రవేశ పరీక్షలు ఇక ఆన్లైన్లోనే..
సాక్షి, హైదరాబాద్: పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎంట్రెన్స్ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ మేరకు ఆన్లైన్ పీజీ ఎంట్రెన్స్ పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అప్పగిస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. శనివారం టీఎస్సీహెచ్ఈ కార్యాలయంలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లతో ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆన్లైన్ ప్రవేశ పరీక్షల్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగానే పీజీ ప్రవేశాలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. సీట్ల కేటాయింపుల్లో కోర్సుల వారీగా రిజర్వేషన్ల విధానాన్ని పాటిస్తామన్నారు. ఉత్తమ పనితీరు కనబరిచిన విశ్వవిద్యాలయానికి యంగ్ యూనివర్సిటీ అవార్డు, ఉత్తమ పరిశోధన చేసిన అధ్యాపకులకు 12 మందికి అవార్డులు ఇస్తామని ప్రకటించారు. అధ్యాపకులకు ఏటా పునశ్చరణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. ఇకపై విద్యార్థుల నుంచి ధ్రువపత్రాలను ఆన్లైన్లోనే తీసుకోవాలని, ఇందుకు ఫీజులను ఆన్లైన్లోనే చెల్లించాలని సూచించారు. జూన్ 25 నుంచి డిగ్రీ తరగతులు 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం తరగతులను జూన్ 25 నుంచి ప్రారంభిస్తామని పాపిరెడ్డి తెలిపారు. డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పీజీ ప్రవేశాలకు ఇకపై ఒకే పరీక్ష
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేందుకు ఇకపై ఒకటే ప్రవేశ పరీక్షను నిర్వహించేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. వేర్వేరు యూనివర్సిటీల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం వేర్వేరుగా ప్రవేశ పరీక్షల నిర్వహణ సరికాదన్న నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే డిగ్రీ ప్రవేశాలను ఆన్లైన్ చేసినందున పీజీ ప్రవేశాలను ఆన్లైన్ చేయడంతోపాటు ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా అన్ని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 2017-18 విద్యా సంవత్సరంలో దీనిని అమల్లోకి తేవాలని భావిస్తోంది. ప్రస్తుతం ప్రవేశ పరీక్షలను కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షల ద్వారా అర్హత సాధించిన అభ్యర్థులు వివిధ జిల్లాల్లోని యూనివర్సిటీ క్యాంపస్‌లు, పీజీ కాలేజీల్లో చేరుతున్నారు. రాష్ట్రంలో యూనివర్సిటీ క్యాంపస్‌లు, ప్రభుత్వ పీజీ కాలేజీలు 76 ఉండగా, ప్రైవేటు పీజీ కాలేజీలు 444 ఉన్నాయి. వాటిల్లోని 25,285 పీజీ సీట్లను కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. అయితే యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలకు అధిక డిమాండ్ ఉండటంతో విద్యార్థులు రెండు ప్రవేశ పరీక్షలు రాయాల్సి వస్తోంది. పైగా కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష రాసేందుకు హైదరాబాద్, మహబూబ్ననగర్ , రంగారెడ్డి తదితర జిల్లాల అభ్యర్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలు, ఇతర యూనివర్సిటీ క్యాంపస్‌లలో చేరేందుకు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాల విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఒకే యూనివర్సిటీ ద్వారా ప్రవేశ పరీక్షను అన్ని జిల్లాల్లో నిర్వహించి ఆ ర్యాంకుల ఆధారంగా అన్ని యూనివర్సిటీలు, వాటి పరిధిలోని కాలేజీల్లో చేరేలా కౌన్సెలింగ్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై త్వరలోనే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతకంటే ముందుగానే కాకతీయ, ఉస్మానియా, ఇతర యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్లతోనూ దీనిపై సమావేశం నిర్వహించేందుకు ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఉస్మానియా లేదా కాకతీయ యూనివర్సిటీ ఒక్కటే నిర్వహించేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. -
పీజీ ప్రవేశాలకు ఇకపై ఒకే పరీక్ష
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేందుకు ఇకపై ఒకటే ప్రవేశ పరీక్షను నిర్వహించేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. వేర్వేరు యూనివర్సిటీల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం వేర్వేరుగా ప్రవేశ పరీక్షల నిర్వహణ సరికాదన్న నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే డిగ్రీ ప్రవేశాలను ఆన్లైన్ చేసినందున పీజీ ప్రవేశాలను ఆన్లైన్ చేయడంతోపాటు ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా అన్ని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 2017-18 విద్యా సంవత్సరంలో దీనిని అమల్లోకి తేవాలని భావిస్తోంది. ప్రస్తుతం ప్రవేశ పరీక్షలను కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షల ద్వారా అర్హత సాధించిన అభ్యర్థులు వివిధ జిల్లాల్లోని యూనివర్సిటీ క్యాంపస్‌లు, పీజీ కాలేజీల్లో చేరుతున్నారు. రాష్ట్రంలో యూనివర్సిటీ క్యాంపస్‌లు, ప్రభుత్వ పీజీ కాలేజీలు 76 ఉండగా, ప్రైవేటు పీజీ కాలేజీలు 444 ఉన్నాయి. వాటిల్లోని 25,285 పీజీ సీట్లను కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. అయితే యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలకు అధిక డిమాండ్ ఉండటంతో విద్యార్థులు రెండు ప్రవేశ పరీక్షలు రాయాల్సి వస్తోంది. పైగా కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష రాసేందుకు హైదరాబాద్, మహబూబ్ననగర్ , రంగారెడ్డి తదితర జిల్లాల అభ్యర్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలే జీలు, ఇతర యూనివర్సిటీ క్యాంపస్‌లలో చేరేందుకు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాల విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఒకే యూనివర్సిటీ ద్వారా ప్రవేశ పరీక్షను అన్ని జిల్లాల్లో నిర్వహించి ఆ ర్యాంకుల ఆధారంగా అన్ని యూనివర్సిటీలు, వాటి పరిధిలోని కాలేజీల్లో చేరేలా కౌన్సెలింగ్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై త్వరలోనే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతకంటే ముందుగానే కాకతీయ, ఉస్మానియా, ఇతర యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్లతోనూ దీనిపై సమావేశం నిర్వహించేందుకు ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఉస్మానియా లేదా కాకతీయ యూనివర్సిటీ ఒక్కటే నిర్వహించేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది.