
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఖజాగూడ ‘దీ కేవ్ పఫ్ క్లబ్’లో డ్రగ్స్ కలకలం రేపింది. పబ్‌పై పోలీసులు, నార్కొటిక్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 50 మందికి టెస్ట్‌లు చేయగా 24 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. అందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇక.. పట్టబడ్డవారిలో పబ్ నిర్వాహకులు, డీజే ఆపరేటర్లు ఉన్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్ధాలు సేవించిన ఆనవాళ్లు లభించాయి. క్లబ్‌లో ఉన్న 55 మందికి డ్రగ్స్ టెస్టులు చేశామని పోలీసులు చెప్పారు.
కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు
కేవ్ పబ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పబ్‌లో సైకడిక్ట్ డ్రగ్స్ పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వీకెండ్ ముత్తులో తేలడానికి పార్టీ నిర్వహించినట్లు గుర్తించారు. సైకడిక్ట్ పార్టీలో 80 డెసిబుల్స్ సౌండ్ మించి శబ్దంతో డీజే గౌరవ్ హోర్రెతించాడు. గోవా నుంచి డ్రగ్స్ దిగుమతి చేసి విక్రయించినట్లు పోలీసులు తేల్చారు. పట్టుబడ్డ వారంతా రెండు రోజులుగా డీజే ఆర్టిస్ట్ గౌరవ్‌తో కాంటాక్ట్‌లో ఉన్నట్లు గుర్తించారు.
గౌరవ్‌తో కోడ్ లాంగ్వాజీలో డ్రగ్స్ కొరకు కస్టమర్స్ చాటింగ్స్ చేసినట్లు తెలిపారు. డీజే గౌరవ్‌కు హైదరాబాద్‌లో ప్రముఖుల కాంటాక్ట్స్‌పై పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటివరకు పార్టీలో 26 మందికి డ్రగ్స్ తీసుకున్నట్లు పోజిటివ్ వచ్చింది. పబ్ ఓనర్లు ముగ్గురుపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.
