
ఆర్. కృష్ణయ్యకు వినతిపత్రం అందిస్తున్న దృశ్యం
లిబర్టీ : అన్ని రంగాల్లో వెనుకబడిన ఆరె కటికల సమగ్రాభివృద్ధికి సహకారం అందించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ఆరె కటిక అభివృద్ధి సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం ప్రతినిథులు శుక్రవారం కృష్ణయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించాలని, ఆరె కటిక సమగ్ర అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై ఆర్.కృష్ణయ్య స్పందిస్తూ కార్పొరేషన్ ఏర్పాటుకు మద్దతుగా ఉంటూ పోరాటం సాగిస్తానని వెల్లడించారు. ఆరె కటికలను బీసీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment