Railway Ticket Booking Temporarily Suspends | Find Dates and Time - Sakshi
Sakshi News home page

రైల్వే రిజర్వేషన్‌ సేవలు తాత్కాలిక నిలిపివేత 

Published Fri, Aug 20 2021 8:37 AM | Last Updated on Fri, Aug 20 2021 1:09 PM

Railway Ticket Reservation Service Temporarily Stopped - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైల్వే రిజర్వేషన్‌ సేవలను ఈ నెల 21 నుంచి పలు సమయాల్లో తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టంలో డిజాస్టర్‌ రికవరీ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. ఇందుకోసం చార్టింగ్, కరెంట్‌ బుకింగ్, పీఆర్‌ఎస్‌ ఎంక్వైరీ, టికెట్‌ రద్దు, చార్జీలు వాపసు పొందడం వంటి పీఆర్‌ఎస్‌ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.

ఈ మేరకు 21వ తేదీ రాత్రి 11.45 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు, తిరిగి 22వ తేదీ రాత్రి 11.45 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు సేవలు నిలిచిపోతాయి. ఈ వేళల్లో ప్రారంభమయ్యే అన్ని రైళ్ల మెయిన్‌ చార్టులు, కరెంట్‌ బుకింగ్‌ చార్టులు ముందుగానే సిద్ధం చేయనున్నారు. (చదంవడి: కృత్రిమ మాంసం, రక్తం, పాలు, పెరుగు తయారీ ఇలా..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement