సాక్షి, హైదరాబాద్: నగరంలో వర్షం కురుస్తోంది. ఆదివారం సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎస్‌ఆర్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, భరత్ నగర్, సనత్ నగర్, సికింద్రాబాద్, పద్మారావు నగర్, సీతాఫల్ మండి, తార్నాక, ఉప్పల్‌లో వర్షం కురుస్తోంది. వర్షంతో పలుచోట్ల కాలనీలు నీట మునగగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు వల్ల పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. 13 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్‌గర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో పలు చోట్ల వర్షం కురిసింది.
Comments
Please login to add a commentAdd a comment