
సాక్షి, రాజన్న సిరిసిల్ల: స్కూటీ డిక్కీలో నాగుపాము దర్శనమివ్వడంతో ఓ రైతు బెంబేలెత్తిపోయాడు. వెంటనే ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ మెంబర్‌కు సమాచారమిచ్చాడు. అతడు వచ్చి నాగుపామును పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లడంతో ఊపిరిపీల్చుకున్నాడు. తంగళ్లపల్లి మండలం రామన్నపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కాగా పోచయ్య అనే రైతు స్కూటీ డిక్కీ తెరవగానే అందులో దాగున్న నాగుపాము కనిపించింది. దీంతో.. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ మెంబర్ వీరేందర్‌కు ఫోన్ చేశాడు. ఈ క్రమంలో.. నాగుపామును పట్టుకున్న వీరేందర్ దానిని అడవిలో వదిలేసి వచ్చాడు.
చదవండి: రాళ్ల భూముల్లోనూ ఇక పంట సిరులు!
Comments
Please login to add a commentAdd a comment