బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన  | Ramchander, Premender Are BJP MLC Candidates | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన 

Published Tue, Feb 16 2021 2:24 AM | Last Updated on Tue, Feb 16 2021 2:24 AM

Ramchander, Premender Are BJP MLC Candidates - Sakshi

రాంచందర్‌రావు, ప్రేమేందర్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ లో నిలిపే అభ్యర్థులను బీజేపీ సోమవారం ప్రకటించింది. మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు పేరునే ఖరారు చేసింది. నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌ అభ్యర్థిగా ప్రేమేందర్‌రెడ్డి పేరును ఓకే చేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ప్రకటన జారీ చేసినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సోమవారం తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 

పట్టభద్రులు, యువత రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఉన్నారని, మోదీ ప్రభుత్వం పట్ల విశ్వాసం ప్రకటిస్తున్నారని వెల్లడించారు. కాగా, రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డి ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీ తరఫున పోటీలో నిలిచే అభ్యర్థులుగా వీరి పేర్లనే రాష్ట్ర పార్టీ గతంలోనే జాతీయ పార్టీ ఆమోదానికి పంపించింది. అప్పటి నుంచే వీరు తమ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. తమ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో సభలు, సమావేశాలను నిర్వహిస్తూనే ఉన్నారు. ఇప్పుడు పార్టీ అధికారికంగా ప్రకటించడంతో తమ ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు.  

చదవండి: (నేను తొడ కొడితే హరీశ్‌రావుకు హార్ట్‌ఎటాక్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement