
శంషాబాద్: పర్యావరణ హితమైన కార్యకలాపాలతో ఇప్పటికే మూడుసార్లు గ్రీన్ ఎయిర్‌పోర్టు విభాగంలో అవార్డు దక్కించుకున్న జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(గెయిల్).. మరోసారి ఘనత సాధించింది. ఆసియా పసిఫిక్ విభాగంలో ఏటా 25 మిలియన్ల ప్రయాణికుల సామర్థ్యం కలిగిన విమానాశ్రయాల కేటగిరీలో జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయానికి గ్రీన్ ఎయిర్‌పోర్టు గోల్డెన్ అవార్డును అంతర్జాతీయ విమా నాశ్రయ మండలి అందజేసిందని ఎయిర్‌పోర్టు వర్గాలు గురువారం వెల్లడించాయి.
విమానాశ్రయం పరిసరాల్లో వాయు నాణ్యత మెరుగుపర్చడం, సౌరశక్తి వినియోగం, ఇంధ నాన్ని ఆదా చేయడం, వాయు ఉద్గారాలను తగ్గించేందుకు తీసుకున్న చర్యల ఆధారంగా ఈ అవార్డును మరోసారి సొంతం చేసుకున్న ట్లు గెయిల్ సీఈఓ ప్రదీప్ ఫణీకర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment