‘అయ్యా నీకో దండం.. ఇది బైకా ఎడ్ల బండా? | Seven People On The Bike Traffic Police Fine In Vikarabad | Sakshi
Sakshi News home page

‘అయ్యా నీకో దండం.. ఇది బైకా ఎడ్ల బండనుకున్నావా?

Published Wed, Feb 17 2021 8:21 AM | Last Updated on Wed, Feb 17 2021 10:48 AM

Seven People On The Bike Traffic Police Fine In Vikarabad - Sakshi

బషీరాబాద్‌: సెవెన్‌ సీటర్స్‌.. ముఖ్యంగా ఆటోలో చూస్తుంటాం.. అయితే ఇక్కడ బైక్‌పై చూస్తున్నాం.. బైక్‌పై సాధారణంగా ఇద్దరు ప్రయాణిస్తారు. అత్యవసరంగా అయితే ముగ్గురు వెళ్తుంటారు. అది కూడా నేరమే. అయితే ఇక్కడ ఓ బైకుపై ఏడుగురు కూర్చొని వెళ్తున్నారు. ముగ్గురు పెద్దవారు, నలుగురు పిల్లలు. వీరికితోడు ఎక్స్‌ట్రా లగేజీ కూడా. వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండల కేంద్రంలో ఓ వ్యక్తి ఇలా జంబో ఫ్యామిలీతో బైకుపై వెళ్తుండగా పోలీసు తనిఖీల్లో భాగంగా మల్లేశం అనే కానిస్టేబుల్‌ అడ్డుకున్నాడు. ‘అయ్యా నీకో దండం.. ఇది బైకా లేదా ఎడ్ల బండనుకున్నావా?’ అంటూ అతడికి రూ.1,200 జరిమానా విధించాడు. ఈ ఫొటో వికారాబాద్‌ పోలీసులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అది మంగళవారం వైరల్‌ అయ్యింది.

చదవండి: మరి ఆ ఒక్క రోజు..?
చదవండి: రాజకీయంగా ప్రభావం చూపనున్న వర్గీకరణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement