
సాక్షి, హైదరాబాద్: సింగరేణి వచ్చే ఏడాది 177 జూనియర్ అసిస్టెంట్, 39 మైనింగ్ ఇంజనీర్, 10 ఇండస్ట్రియల్ ఇంజనీర్, 6 ఐటీ ఇంజనీర్‌తో పాటు ఇతర కేటగిరీల పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఏడేళ్ల కాలంలో 58 ప్రత్యక్ష నియామకాల నోటిఫికేషన్ల ద్వారా 3,498, కారుణ్య వారసత్వ నియామకాల ద్వారా 12,553 కలిపి మొత్తం 16,040 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు సింగరేణి సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
చదవండి: APPSC: 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు..
ఒత్తిళ్లతో అర్హులకు అన్యాయం జరిగే అవకాశముందని ఇంటర్వ్యూల విధానాన్ని పూర్తిగా తొలగించి కేవలం రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వివరించింది. రాత పరీక్ష జరిగిన రోజునే ఫలితాలు వెల్లడించి, ఎలాంటి అపోహలకు తావు లేకుండా ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేసినట్లు పేర్కొంది. ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతుందని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు.
చదవండి: హైదరాబాద్ ఆర్‌ఆర్‌ఆర్.. 320 కి.మీ.
Comments
Please login to add a commentAdd a comment