అలరించిన బాలగాన గంధర్వులు | Singer SP Balasubramanyam Birth Day Special | Sakshi
Sakshi News home page

అలరించిన బాలగాన గంధర్వులు

Published Mon, Jun 24 2024 9:32 AM | Last Updated on Mon, Jun 24 2024 9:32 AM

Singer SP Balasubramanyam Birth Day Special

దివికేగిన ‘బాలు’ స్మృతిలో భువిలోని బాలలు గాన నివాళులర్పించారు. ప్రముఖ సినీ గాయ కులు స్వర్గీయ ఎస్‌పీ బాల సుబ్రహ్మణ్యం నివాళిగా నగరానికి చెందిన మ్యూజిక్‌ రేడియో స్టేషన్‌ మ్యాజిక్‌ 106.4 ఎఫ్‌ఎమ్‌ ఆధ్వర్యంలో ఎస్పీబీ జయంతి రోజున బాల గాన గంధర్వులు – సీజన్‌ 4 ఫైనల్స్‌ ఆదివారం జరిగాయి. ఈ పోటీలో 15 ఏళ్ల లోపు బాల బాలికలు వందలాదిగా పోటీపడ్డారు. వీరిలో టాప్‌ 5 కంటెస్టెంట్స్‌ కూకట్‌ పల్లిలోని నెక్సస్‌ మాల్‌ వేదికగా ఫైనల్స్‌లో పోటీపడ్డారు. 

వీరిలో విశ్వదత్త (9) విజేతగా నిలవగా, లిఖిల, శ్రీ వైష్ణవిలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. న్యాయనిర్ణేతలు సంగీత దర్శకులు అనూప్‌ రూబెన్స్, హరిణి, సాయి చరణ్‌ పాటలు పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆర్జేలు నాని, రవళి, ప్రతీక,  సంగీత తమ వ్యాఖ్యానంతో ఆకట్టుకున్నారు. మ్యాజిక్‌ 106.4 ఎఫ్‌ఎమ్‌ ప్రతినిధులు బద్రినాథ్, ధీరజ్, కృష్ణమోహన్, భవానీ  పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement