మిక్సాలజిస్ట్‌గా మారడంపై యూత్‌లో ఆసక్తి
సిటీలో వర్క్‌షాప్స్, శిక్షణ తరగతులకు యువత
మిక్సాలజీ, బార్టెండింగ్ ఛాంపియన్‌షిప్స్ కూడా షురూ..
సాక్షి, సిటీబ్యూరో: వంటకాలను అందంగా తీర్చిదిద్దే క్యులినరీ ఆర్ట్ కావొచ్చు.. పానీయాలను వైవిధ్యంగా మేళవించే కాక్‌టెయిల్ మిక్సింగ్ కావొచ్చు.. కాదేదీ కళ కావడానికి అనర్హం అంటోంది ఆధునిక ప్రపంచం.. ఇప్పుడు కాక్‌టెయిల్ మిక్సింగ్ మిక్సాలజీ పేరుతో మరింత ప్రాచుర్యంలోకి వచి్చంది. ఈ కళను ఒంట బట్టించుకుంటే అత్యాధునిక జీవనశైలితో పాటు అనూహ్యమైన ఆదాయం కూడా అందుతుండటంతో యువత తమలోని కల సాకారం కోసం మిక్సాలజీ కళని క్రేజీగా సాధన చేస్తున్నారు. వీరిని మరింత ప్రోత్సహించేందుకు మిక్సాలజీ ఛాంపియన్ షిప్స్ సైతం జరుగుతున్నాయి. ఇటీవలే ఢిల్లీలో జరిగిన డియాగో రిజర్వ్ వరల్డ్ క్లాస్ బార్టెండింగ్ ఛాంపియన్ షిప్‌లో టాప్–16లో నిలిచిన వారిలో నగరానికి చెందిన గణేష్ బోయినపల్లి మొదటి స్థానంలో నిలవడం సిటీలో యువతకు ఈ కెరీర్ పట్ల ఉన్న క్రేజ్‌కి ఓ నిదర్శనం.
సంప్రదాయ రుచులను ఆధునిక పద్ధతులతో మిళితం చేస్తూ మిక్సాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. క్రాఫ్ట్ కాక్‌టెయిల్‌లు ప్రీమియం స్పిరిట్‌ల పట్ల పెరుగుతున్న ఆదరణతో సిటీలో కాక్‌టెయిల్ మేకర్స్ అయిన బార్టెండర్‌లు తమ కళకు మరింత సానబెట్టుకుంటున్నారు. మరోవైపు నవతరం సైతం ఈ రంగంలోకి ప్రవేశించేందుకు ఉత్సాహం చూపుతోంది.
ఉపాధికి ఊతం..
ఒకప్పుడు మిక్సాలజీ తెలిసిన బార్టెండర్లు కేవలం బార్లకు మాత్రమే పరిమితం అయ్యేవారు. అయితే ఇప్పుడు ఫైవ్‌స్టార్ హోటల్స్, లాంజ్‌లు, పబ్స్, క్లబ్స్.. వంటివి బాగా పెరిగాక మిక్సాలజిస్ట్స్‌గా బార్టెండర్లకు గౌరవప్రదమైన పేరు వచి్చంది. అలాగే మిక్సాలజీ ఒక సబ్జెక్ట్‌గా ప్రాచుర్యంలోకి వచి్చంది. కేవలం ఆల్కహాల్ డ్రింక్స్ మాత్రమే కాకుండా మాక్‌టైల్స్, పండ్ల రసాలు, ఎనర్జీ డ్రింక్స్.. ఇలా విభిన్న రకాల పానీయాలతో ఈ మిక్సాలజిస్ట్‌లు వెరైటీ డ్రింక్స్ తయారు చేస్తూ వినియోగదారుల ఆదరణతో పాటు మంచి టిప్స్, రూ.50 వేల వరకూ నెలవారీ ఆదాయం పొందుతున్నారు. దీంతో ఈ ప్రొఫెషన్ ఇప్పుడు యువతకు ప్యాషన్‌గా మారింది.
కాక్‌టెయిల్స్‌లోనూ హెల్తీ స్టైల్స్..
కరోనా తర్వాత వినియోగదారులు సంప్రదాయ పానీయాల వైపు మొగ్గు చూపడం లేదు. దాంతో మిక్సాలజిస్టులు మెనూలను రూపొందించే విధానంలో పూర్తి మార్పు వచ్చింది. సుగంధ ద్రవ్యాలు, మూలికలు పండ్ల వంటి స్థానిక పదార్థాలతో సైతం ప్రయోగాలు చేస్తున్నారు. ఈ మార్పు వల్ల విభిన్నమైన రుచిని అందించే కాక్‌టెయిల్‌లకు డిమాండ్ పెరిగింది. మారుతున్న ట్రెండ్‌లు వినియోగదారుల ప్రాధాన్యతలతో, బార్టెండర్‌లు తమ కెరీర్‌ను బలోపేతం చేసుకోవడానికి ప్రత్యేకమైన సువాసనగల పానీయాలను రూపొందించడానికి కొత్త పద్ధతులను నిరంతరం అన్వేషిస్తున్నారు.
అభ్యాసమే.. అభివృద్ధి..
గతంతో పోలిస్తే తాజాగా మేము నిర్వహించిన అల్టిమేట్ బార్టెండింగ్ ఛాంపియన్‌షిప్‌కు అత్యధిక సంఖ్యలో యువత హాజరవడం ఈ రంగంపై పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం. ఈ రంగంలో నైపుణ్యాల అభివృద్ధికి నిరంతర అభ్యాసం అవసరం. బ్రాండ్‌లు బార్టెండర్లు తమ నైపుణ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడటానికి శిక్షణ, మార్గదర్శకత్వం వనరులను అందించడం వంటివి యువతకు ఊతమిస్తున్నాయి. కాక్‌టెయిల్‌లను తయారు చేసేటప్పుడు మిక్సాలజిస్ట్‌లు తమ నైపుణ్యాలను నిరంతరం సానబెట్టాల్సిందే. తమ పని ఎవరినీ ఆకట్టుకోవడం కాదు. అతిథులను సంతోషపెట్టడం మాత్రమే అని మిక్సాలజిస్ట్‌లు గుర్తుంచుకోవాలి. – గౌరవ్ షరీన్, ప్రముఖ మిక్సాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment