mixing
-
Hyderabad: క్రేజీ మిక్సాలజీ..! సిటీలో ఆదరణ పెంచుకుంటున్న కాక్టెయిల్ మిక్సింగ్..
సాక్షి, సిటీబ్యూరో: వంటకాలను అందంగా తీర్చిదిద్దే క్యులినరీ ఆర్ట్ కావొచ్చు.. పానీయాలను వైవిధ్యంగా మేళవించే కాక్టెయిల్ మిక్సింగ్ కావొచ్చు.. కాదేదీ కళ కావడానికి అనర్హం అంటోంది ఆధునిక ప్రపంచం.. ఇప్పుడు కాక్టెయిల్ మిక్సింగ్ మిక్సాలజీ పేరుతో మరింత ప్రాచుర్యంలోకి వచి్చంది. ఈ కళను ఒంట బట్టించుకుంటే అత్యాధునిక జీవనశైలితో పాటు అనూహ్యమైన ఆదాయం కూడా అందుతుండటంతో యువత తమలోని కల సాకారం కోసం మిక్సాలజీ కళని క్రేజీగా సాధన చేస్తున్నారు. వీరిని మరింత ప్రోత్సహించేందుకు మిక్సాలజీ ఛాంపియన్ షిప్స్ సైతం జరుగుతున్నాయి. ఇటీవలే ఢిల్లీలో జరిగిన డియాగో రిజర్వ్ వరల్డ్ క్లాస్ బార్టెండింగ్ ఛాంపియన్ షిప్లో టాప్–16లో నిలిచిన వారిలో నగరానికి చెందిన గణేష్ బోయినపల్లి మొదటి స్థానంలో నిలవడం సిటీలో యువతకు ఈ కెరీర్ పట్ల ఉన్న క్రేజ్‌కి ఓ నిదర్శనం.సంప్రదాయ రుచులను ఆధునిక పద్ధతులతో మిళితం చేస్తూ మిక్సాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. క్రాఫ్ట్ కాక్‌టెయిల్‌లు ప్రీమియం స్పిరిట్ల పట్ల పెరుగుతున్న ఆదరణతో సిటీలో కాక్టెయిల్ మేకర్స్ అయిన బార్టెండర్లు తమ కళకు మరింత సానబెట్టుకుంటున్నారు. మరోవైపు నవతరం సైతం ఈ రంగంలోకి ప్రవేశించేందుకు ఉత్సాహం చూపుతోంది.ఉపాధికి ఊతం.. ఒకప్పుడు మిక్సాలజీ తెలిసిన బార్టెండర్లు కేవలం బార్లకు మాత్రమే పరిమితం అయ్యేవారు. అయితే ఇప్పుడు ఫైవ్‌స్టార్ హోటల్స్, లాంజ్‌లు, పబ్స్, క్లబ్స్.. వంటివి బాగా పెరిగాక మిక్సాలజిస్ట్స్గా బార్టెండర్లకు గౌరవప్రదమైన పేరు వచి్చంది. అలాగే మిక్సాలజీ ఒక సబ్జెక్ట్‌గా ప్రాచుర్యంలోకి వచి్చంది. కేవలం ఆల్కహాల్ డ్రింక్స్ మాత్రమే కాకుండా మాక్టైల్స్, పండ్ల రసాలు, ఎనర్జీ డ్రింక్స్.. ఇలా విభిన్న రకాల పానీయాలతో ఈ మిక్సాలజిస్ట్లు వెరైటీ డ్రింక్స్ తయారు చేస్తూ వినియోగదారుల ఆదరణతో పాటు మంచి టిప్స్, రూ.50 వేల వరకూ నెలవారీ ఆదాయం పొందుతున్నారు. దీంతో ఈ ప్రొఫెషన్ ఇప్పుడు యువతకు ప్యాషన్‌గా మారింది.కాక్టెయిల్స్లోనూ హెల్తీ స్టైల్స్..కరోనా తర్వాత వినియోగదారులు సంప్రదాయ పానీయాల వైపు మొగ్గు చూపడం లేదు. దాంతో మిక్సాలజిస్టులు మెనూలను రూపొందించే విధానంలో పూర్తి మార్పు వచ్చింది. సుగంధ ద్రవ్యాలు, మూలికలు పండ్ల వంటి స్థానిక పదార్థాలతో సైతం ప్రయోగాలు చేస్తున్నారు. ఈ మార్పు వల్ల విభిన్నమైన రుచిని అందించే కాక్టెయిల్లకు డిమాండ్ పెరిగింది. మారుతున్న ట్రెండ్లు వినియోగదారుల ప్రాధాన్యతలతో, బార్టెండర్లు తమ కెరీర్‌ను బలోపేతం చేసుకోవడానికి ప్రత్యేకమైన సువాసనగల పానీయాలను రూపొందించడానికి కొత్త పద్ధతులను నిరంతరం అన్వేషిస్తున్నారు.అభ్యాసమే.. అభివృద్ధి..గతంతో పోలిస్తే తాజాగా మేము నిర్వహించిన అల్టిమేట్ బార్టెండింగ్ ఛాంపియన్‌షిప్‌కు అత్యధిక సంఖ్యలో యువత హాజరవడం ఈ రంగంపై పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం. ఈ రంగంలో నైపుణ్యాల అభివృద్ధికి నిరంతర అభ్యాసం అవసరం. బ్రాండ్లు బార్టెండర్లు తమ నైపుణ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడటానికి శిక్షణ, మార్గదర్శకత్వం వనరులను అందించడం వంటివి యువతకు ఊతమిస్తున్నాయి. కాక్టెయిల్లను తయారు చేసేటప్పుడు మిక్సాలజిస్ట్లు తమ నైపుణ్యాలను నిరంతరం సానబెట్టాల్సిందే. తమ పని ఎవరినీ ఆకట్టుకోవడం కాదు. అతిథులను సంతోషపెట్టడం మాత్రమే అని మిక్సాలజిస్ట్లు గుర్తుంచుకోవాలి. – గౌరవ్ షరీన్, ప్రముఖ మిక్సాలజిస్ట్ -
కోవాగ్జిన్, కోవిషీల్డ్ మిక్సింగ్‌కు గ్రీన్ సిగ్నల్
-
పెట్రోల్‌లో ఇథనాల్ మిక్సింగ్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
సాక్షి, వెబ్‌డెస్క్: పెట్రోలు ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే లీటరు పెట్రోలు ధర వంద దాటింది. ఇప్పుడప్పుడే ధర తగ్గుతుందన్న నమ్మకం కూడా లేదు. దీనికి తోడు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం లీటరు పెట్రోలులో 10 శాతం ఇథనాల్‌ను కలిపి అమ్ముతున్నారు. కొత్తగా వచ్చిన ఈ మార్పులకు అనుగుణంగా వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. జులై 9 నుంచి పెట్రోలు దిగుమతులు తగ్గించడంతో పాటు దేశీయంగా రైతులకు ఉపయోగపడేలా ఇథనాల్ వినియోగం పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో రాబోయే ఐదేళ్లలో లీటరు పెట్రోలులో 20 శాతం ఇథనాల్ కలపాలంటూ ప్రధాని మోదీ స్వయంగా చెప్పారు. దీన్ని అనుసరించి జులై 9 నుంచి లీటరు పెట్రోలులో 10 శాతం ఇథనాల్‌ను కలిపి బంకులు అమ్మకాలు సాగిస్తున్నాయి. సాధారణంగా పెట్రోలు, ఇథనాల్ కలపడం వల్ల ఎక్కువ శక్తి విడుదల అవుతుంది. ఇంజన్‌పై పెద్దగా ప్రభావం చూపదు. వాహనం నడిపేప్ప్పుడు పెద్దగా తేడాలు కూడా రావు. అయితే వాహనంలో ఉన్న పెట్రోలు ట్యాంకు నిర్వహాణలో నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవు. నీటితో ఇబ్బందులు తప్పవు పెట్రోలు, ఇథనాల్లను కలిపినా అవి రెండు వేర్వేరు లేయర్లుగానే ఉండి పోతాయి. నీరు పెట్రోలుతో కలవదు, కానీ ఇథనాల్, నీరు త్వరగా కలిసిపోతాయి. వర్షకాలంలో బైకులు బయట పెట్టినప్పుడు, లేదా వాటర్ సర్వీసింగ్‌కి ఇచ్చినప్పుడు ఒక్క చుక్క నీరు పెట్రోలు ట్యాంకులోకి పోయినా సమస్యలు ఎదురవుతాయి. చిన్నీ నీటి బిందువు, తేమ ఉన్నా సరే ఇథనాల్ వాటితో కలిసి పోతుంది. నీరు, ఇథనాల్ కలిసి ప్రత్యేక పొరగా ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఇంజన్ అకస్మాత్తుగా ఆగిపోతుంది. హైవేలపై, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న చోట ఇలా జరిగితే చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. జాగ్రత్తలు పెట్రోల్‌లో ఇథనాల్ శాతం 10కి చేరడంతో వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెట్రోల్ పంప్ డీలర్ అసోసియేషన్లు అవగాహన కల్పిస్తున్నాయి. వారు చెప్పిన వివరాల ప్రకారం ఈ కింది జాగ్రత్తలు తీసుకోవడం మంచింది. - పెట్రోలు పంప్ ట్యాంక్ మూతలను సరిగా పరిశీలించాలి. నీటి బిందువులు, తేమ లోపలికి వెళ్లకుండా గట్టిగా బిగించాలి - వాటర్ సర్వీసింగ్ చేసేప్పుడు ట్యాంకులోకి నీరు వెళ్లకుండా జాగ్రత్త పడాలి - వర్షంలో వాహనాలు ఆపినప్పుడు ట్యాంకుపై నీరు పడకుండా చూసుకోవాలి - ప్రయాణం మధ్యలో వాహనం అకస్మాత్తుగా ఆగిపోతుంటే వెంటనే మెకానిక్‌కి చూపించాలి -
వ్యాక్సిన్ల మిక్సింగ్ వద్దు: వీకే పాల్
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. వ్యాక్లిన్ల మిక్సింగ్ ప్రోటోకాల్‌కి అనుమతి లేదని ప్రకటించింది. నీతీ అయోగ్ సభ్యుడు, వ్యాక్సినేషన్ నిపుణుల కమిటీ చైర్మన్ వీకే పాల్ ఈ విషయాన్ని ప్రకటించారు. వ్యాక్సిన్ల కొరత సమస్య వచ్చినప్పటి నుంచి టీకా మిక్సింగ్ అంశం తెరపైకి వచ్చింది. సైడ్ ఎఫెక్ట్స్ ప్రస్తుతం మనదేశంలో కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకాలు ప్రజలకు అందించారు. దేశంలో చాలా మంది ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని కోవిడ్ తొలి డోస్ టీకాగా తీసుకున్నారు. రెండో డోసు టీకా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తొలి డోసు తీసుకున్న టీకా లభ్యత లేకపోవడంతో మరో కంపెనీ టీకాను రెండో డోసుగా తీసుకొవచ్చా ? ‘ వ్యాక్సిన్ మిక్సింగ్’? క్షేమమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై వ్యాక్సినేషన్ నిపుణుల కమిటీ చైర్మన్ వీకే పాల్ స్పందించారు. ప్రస్తుతానికి టీకా మిక్సింగ్‌ని వ్యాక్సినేషన్ ప్రోటోకాల్‌లో చేర్చలేదని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ మిక్సింగ్ వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నట్టు పరిశోధనల్లో తేలినా.. అదే స్థాయిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నట్టు గుర్తించాలన్నారు. వ్యాక్సిన్ మిక్సింగ్‌పై అంతర్జాతీయంగా పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని వీకే సింగ్ వెల్లడించారు. గడువు మారలేదు ఇక మొదటి, రెండో డోసులకు సంబంధించిన గడువు విషయంలో ఎటువంటి మార్పులు లేవని వీకే సింగ్ స్పష్టం చేశారు. కోవీషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్ 12 వారాలు, కోవాగ్జిన్ రెండు డోసుల మధ్య గ్యాప్ 4 వారాలుగానే ఉందని చెప్పారు. -
వేసవి ఇంటిపంటలకు నారు పోసుకోవలసిందిప్పుడే!
వేసవి ఇంటి పంటల కోసం కూరగాయల నారు పోసుకోవడానికి ఇది తగిన సమయం. కొబ్బరి పొట్టు, వర్మీకంపోస్టు లేదా కంపోస్టు, మట్టి కలిపిన మిశ్రమంలో నారు పోసుకోవచ్చు. నారు పోసుకునే ట్రే లేదా మడి మరీ ఎక్కువ లోతున మట్టి మిశ్రమం వేయనవసరం లేదు. జానెడు లోతు ఉంటే సరిపోతుంది. మట్టి మిశ్రమాన్ని ట్రేలో నింపిన తర్వాత వేళ్లతో లేదా పుల్లతో సాళ్లు మాదిరిగా చేసుకోవాలి. ఆ సాళ్లలో విత్తనాలు విత్తుకున్న తర్వాత పక్కన మట్టిని కప్పి చదరంగా చేయాలి. విత్తనాలు మరీ లోతున పడకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ట్రే పైన గుడ్డ కప్పాలి. తడి ఆరిపోకుండా చూసుకుంటూ.. నీటిని తేలిగ్గా చిలకరించాలి. మట్టిలో విత్తనాలు నీరు చిలకరించినప్పుడు చెదిరిపోకుండా ఉండాలంటే.. పల్చటి గుడ్డను కప్పి.. దానిపైన నీటిని చిలకరించాలి. చలి ఉధృతంగా ఉంది. కాబట్టి విత్తనం మొలక రావాలంటే కొంత వెచ్చదనం కావాలి. నారు పోసుకునే ట్రే పైన పాలిథిన్ షీట్ చుట్టినట్టయితే 5–7 రోజుల్లో మొలక రావడానికి అవకాశం ఉంటుంది. మొలక వచ్చిన తర్వాత పాలిథిన్ షీట్‌ను తీసేయవచ్చు. వేసవిలో కాపు వచ్చే అవకాశం ఉన్న ఏమేమి రకాల కూరగాయలకు ఇప్పుడు నారు పోసుకోవచ్చు? అన్నది ప్రశ్న. చలికాలంలో మాత్రమే వచ్చే నూల్‌కోల్, క్యాబేజి, కాలీఫ్లవర్ వంటì వాటిని ఇప్పుడు విత్తుకోకూడదు. వంగ (గ్రీన్ లాంగ్, పర్పుల్ లాంగ్, పర్పుల్ రౌండ్, గ్రీన్ రౌండ్), మిర్చి (ఎల్లో కాప్సికం, రెడ్ కాప్సికం, గ్రీన్ చిల్లీ, ఆర్నమెంటల్ చిల్లీ), టమాట (సాధారణ రకం, స్ట్రాబెర్రీ టమాట)తోపాటు.. వెల్లుల్లి రెబ్బలు, ఉల్లి, బ్రకోలి, క్యారట్, స్కార్లెట్ రకాలను ఇప్పుడు టెర్రస్‌పై ట్రేలలో ఇంటిపంటల సాగు కోసం విత్తుకోవచ్చు. వేసవిలో కూరగాయలను పొందాలనుకునే వారు వెంటనే విత్తుకోవాలి. – ఉషారాణి (81217 96299), వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు,రాజేంద్రనగర్, సేంద్రియ ఇంటి పంటల సాగుదారు విత్తనాలను ఇలాకప్పేయాలి, ఇలా విత్తుకోవాలి -
కాఫీపొడిలో రంగు...రవ్వలో రంపపు పొట్టు
మంగళగిరి(గుంటూరు): మంగళగిరి పట్టణంలో ఆహార కల్తీ నియంత్రణ అధికారులు శుక్రవారం విస్తతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఆహార కల్తీ నియంత్రణ అధికారి జి. పూర్ణ చంద్రరావు ఆధ్వర్యంలో ఉదయం పదకొండు గంటలనుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. మెయిన్‌బజార్‌లోని చిల్లరకొట్లు, జనరల్ స్టోర్స్‌తో ప్రారంభించి పలు సెంటర్లలోని స్వీట్ షాపులు, హోటళ్లు, దాబాలు, కాఫీ షాప్‌లలో విస్తతంగా సోదాలు నిర్వహించారు. ఆటోనగర్ దాబా హోటల్‌తో పాటు మంగళగిరి విజయవాడ రోడ్లో తాడేపల్లి వరకు పలు హోటళ్లలో ఈ తనిఖీలు జరిగాయి. అనంతరం పూర్ణచంద్రరావు విలేకరులతో మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. పలు దుకాణాలలో గుట్కా, మాణిక్‌చంద్, పాన్‌పరాగ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశామన్నారు. తినుబండారాల ప్యాకెట్లు నిల్వ వున్నవి విక్రయించడాన్ని గమనించామని ఆయా దుకాణాలలో ప్యాకెట్లును స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశామన్నారు. నిత్యావసర వస్తువులు సైతం కల్తీ జరిగినట్లు గుర్తించామన్నారు. పిండి,రవ్వ పదార్థాలలో కొందరు దుకాణదారులు రంపపుపొడి కలపడంతో పాటు కాఫీ పొడిలో రంగు కలుపుతున్నట్లు గుర్తించి ఆయా దుకాణదారులకు నోటీసులు జారీ చేశామన్నారు. ఇక స్వీట్ దుకాణాలు, హోటళ్లలో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉన్నట్టు గుర్తించామని, అదే విధంగా దాబా సెంటర్లలో నిల్వ వున్న కూరలు, లస్సీలతో పాటు పలుపదార్థాల తయారీకి వాడుతున్న నూనెలో కల్తీ జరుగుతోందని, ఆయా యజమానులందరికీ నోటీసులు జారీచేస్తున్నామన్నారు. కర్రీస్ పాయింట్లలో కల్తీ నూనె వినియోగిస్తున్నారని తెలిపారు. ఇక నుంచి నిరంతరం పర్యవేక్షించి కేసులు నమోదు చేయడంతో పాటు హోటళ్లను సీజ్ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఫుడ్‌కంట్రోలర్ వెంకటేశ్వరావుతో పాటు పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ప్రతీవస్తువూ కల్తీనే... మంగళగిరిలో అధికారుల తనిఖీలలో వెలుగు చూసిన వాస్తవాలను చూసి పట్టణవాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. చిన్నపిల్లలు తినే చెకోడీలు, చాక్లెట్లుతో పాటు కాఫీ పొyì లో రంగుపొడి, రవ్వలో రంపపుపొట్టు, హోటళ్లలోని బిర్యాని రైస్‌లో సేమ్యా ఇలా ఏ నిత్యావసర వస్తువు చూసినా కల్తీమయమై ఉండడం పలువురిని ఆందోళనకు గురిచేసింది.S మిఠాయి దుకాణాలతో పాటు తయారు చేసే కేంద్రాలను చూసిన అధికారులు సదరు యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిఠాయిలలో రంగులు ఎక్కువ వాడటంతో పాటు నెలల తరబడి నూనెను బాండిళ్లలో వుంచి తయారు చేయడం వలన అవితినే వారు అనారోగ్యం బారిన పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీనూనెలతో కర్రీస్ అమ్మే పాయింట్స్, నిల్వ ఉన్న పదార్థాలతో నిర్వహిస్తున్న హోటళ్లను చూసి బాబోయ్ ఇవేనా మనం తినేది అంటూ జనం బెంబేలెత్తారు. కొందరికి ముందే సమాచారం.. 15 మంది అధికారులు బందాలుగా ఏర్పడి పట్టణంలో తనిఖీలు నిర్వహించగా ప్రధాన హోటళ్లు, దాబాలకు ముందే సమాచారం అందడం పలు అనుమానాలకు తావిస్తోంది. పలు హోటళ్ళు, దాబాలు,మిఠాయి దుకాణదారులు వారు వాడే నూనె డబ్బాలను, పలు వస్తువులను వేరేచోటకు తరలించడం గమనార్హం.