సిరిసిల్ల కల్చరల్/వేములవాడ: న్యాయవాద వృత్తి లో టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని, ని రంతర అధ్యయనంతోనే రాణించవచ్చని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ టి.మాధవీదేవి పేర్కొన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోర్టు సముదాయంలో రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి (ఏజేసీజే) కోర్టు భవనాన్ని హైకోర్టు మ రో న్యాయమూర్తి జస్టిస్ జె.శ్రీనివాస్‌రావుతో కలిసి శనివారం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో న్యాయవాదులకు దిశానిర్దేశనం చేశారు. ప్రస్తుతం హైకోర్టులో అమలులో ఉన్న వ ర్చువల్ విధానాన్ని రానున్న రోజుల్లో అన్ని కోర్టు లకూ విస్తరిస్తామన్నారు.
జిల్లా కోర్టులోనూ ఈ ఫైలింగ్ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. కోర్టు సముదాయం కోసం కేటాయించిన స్థలం విషయంలో బార్ కౌన్సిల్ ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. జస్టిస్ జె.శ్రీనివాసరావు మాట్లాడు తూ కఠోరశ్రమ, నిజాయితీతో కొనసాగితే న్యాయ వృత్తిలో రాణించడం సులువేనన్నారు. సిరిసిల్ల, జగి త్యాల జిల్లాల న్యాయమూర్తులు ఎన్.ప్రేమలత, నీలిమ, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు కాసుగంటి లక్ష్మణ్‌కుమార్ పాల్గొన్నారు. అనంతరం జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ మాధవిదేవి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు.
భద్రాచలంలో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు
భద్రాచలం అర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ కాజా శరత్ శని వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భద్రాచలంలో ఇప్పటికే ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఉన్నప్పటికీ.. సుమారు 3,000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటికి సంబంధించి సత్వర తీర్పు వెలువరించేందుకే మరో కోర్టు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని చెప్పారు.
భద్రాచలం బార్ అసోసియేషన్ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులను అందించిందని, బార్ అభివృద్ధికి తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండలో ఫ్యామిలీ కోర్టు ప్రారంభం
రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా కోర్టు సము దాయంలో ఫ్యామిలీ కోర్టును హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జి.రాధారాణి శనివారం ప్రారంభించారు. అదేవిధంగా జ్యుడీషియల్ ఎంప్లాయీస్ నూతన సంవత్సర కేలెండర్‌ను ఆవిష్కరించారు. హైకోర్టు జడ్జికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు స్వాగతం పలకగా.. పలువురు జడ్జిలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మొద టి అదనపు జిల్లా జడ్జి తిరుపతి, ఫ్యామిలీ కోర్టు జడ్జి దుర్గాప్రసాద్, ఐదవ అదనపు జిల్లా జడ్జి జి.వేణు పాల్గొన్నారు.
సమస్యలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్తా: జస్టిస్ పుల్లా కార్తీక్
చివ్వెంల(సూర్యాపేట): సూర్యాపేట జిల్లా కోర్టులో నెలకొన్న సమస్యలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హైకోర్టు జడ్జి, సూర్యాపేట జిల్లా పోర్టుఫోలియో జడ్జి జస్టిస్ పుల్లా కార్తీక్ అన్నారు. ఆయన శనివారం సూర్యాపేట జి ల్లాకోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా న్యా యవాదులు సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం ఇచ్చారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ కార్తీక్ మాట్లాడారు.
అంతకుముందు ఆయన పిల్ల లమర్రి శివాలయాన్ని, అర్వపల్లిలోని యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోండ్రాల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment