సాక్షి, సూర్యాపేట: చేతకాని దద్దమ్మలు అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని పెద్దచెరువులో 5వ విడత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం రోజున ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొందరు ప్రగతి భవన్‌ను ముట్టడించి అడ్డంకులు సృష్టించాలని చూస్తున్నారు. దేశంలోనే 55 శాతం పంటలు తెలంగాణ రాష్ట్రంలో పండుతున్నాయి.
మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని తీసుకురావడం కోసమే పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చాం. గ్రామాల్లో పల్లె పల్లెల్లో రైతులు ఆనందంగా ఉండటం కోసమే అన్ని వసతులను తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుతుంది. గతంలో గోపాలమిత్ర జీతాలను 3వేల రూపాయల నుంచి 8వేలకు పెంచిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. ఉచితంగా గర్భధారణ పరీక్షలు చేస్తున్నాం. కరోనా సమయంలో కూడా రైతులు పండించిన పంటను కొనుగోలు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే' అంటూ మంత్రి తలసాని పేర్కొన్నారు. (తెలంగాణలో 75వేలు దాటిన కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment