సాక్షి, వనపర్తి జిల్లా: తెలంగాణలో ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లాలోని నాగవరం బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, వనపర్తి.. జిల్లా అవుతుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదని.. ఇప్పుడు వనపర్తి జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు.
చదవండి: మారనున్న బడుల స్వరూపం.. ‘మన ఊరు- మన బడి’కి సీఎం కేసీఆర్ శ్రీకారం
‘‘గతంలో పాలమూరు జిల్లాలో పరిస్థితులు చూస్తే కన్నీళ్లు వచ్చేవి. తెలంగాణ రాకముందు మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదు. తెలంగాణ వచ్చాక మహబూబ్‌నగర్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలమైంది. పాలమూరు జిల్లా పాలుగారుతోంది. హైదరాబాద్ నుంచి గద్వాల దాకా ధాన్యపు రాశులతో కళకళలాడుతోందని’’ సీఎం అన్నారు.
పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం. పాలమూరు ప్రాంత అభివృద్ధి క్సోం నిరంజన్‌రెడ్డి ఎంతో కష్టపడి పనిచేశారు. నిరంజన్‌రెడ్డి ఈసారి లక్ష ఓట్ల మెజార్టీతో గెలవాలని సీఎం పేర్కొన్నారు. రేపు(బుధవారం) అసెంబ్లీలో తాను ఓ కీలక ప్రకటన చేయబోతున్నానని కేసీఆర్ తెలిపారు. నిరుద్యోగులంతా రేపు ఉదయం 10 గంటలకు టీవీలు చూడాలని కోరుతున్నానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment