సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఇనుగుర్తిని నూతన రెవెన్యూ మండలంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈమేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు సోమవారం సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్దేశించిన అన్ని అర్హతలు ఇనుగుర్తికి వున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 607 మండలాలుండగా, తాజాగా మరో కొత్త మండలం ఏర్పాటుతో సంఖ్య 608కి పెరగనుంది. (క్లిక్: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. కొత్తగా 13 మండలాలు)
Comments
Please login to add a commentAdd a comment