New mandal
-
Inugurthy: మరో కొత్త మండలం... ఇనుగుర్తి
సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఇనుగుర్తిని నూతన రెవెన్యూ మండలంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈమేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు సోమవారం సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్దేశించిన అన్ని అర్హతలు ఇనుగుర్తికి వున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 607 మండలాలుండగా, తాజాగా మరో కొత్త మండలం ఏర్పాటుతో సంఖ్య 608కి పెరగనుంది. (క్లిక్: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. కొత్తగా 13 మండలాలు) -
ఇక 19 మండలాలు..
జిల్లా ఇకనుంచి 19 మండలాలతో పరిపాలన సాగించనుంది. ఇప్పటికే 18 మండలాలతో ఉన్న జిల్లాలో కొత్తగా ఒడ్డెలింగాపూర్ చేరింది. జిల్లా ఆవిర్భావం అనంతరం.. జగిత్యాల నుంచి జగిత్యాల రూరల్, సారంగాపూర్ మండలం నుంచి బీర్పూర్, ధర్మపురి నుంచి బుగ్గారం మండలాలను ఏర్పాటు చేశారు. 32 గ్రామాలతో ఉన్న రాయికల్ మండలకేంద్రం ఇటీవల మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. ఎప్పటినుంచో రాయికల్ మండలాన్ని విభజించి.. రెండు మండలాలు చేయాలనే డిమాండ్ ఉన్నా.. నిజామాబాద్ జిల్లాకేంద్రంలో మంగళవారం టీఆర్ఎస్ చేపట్టిన ఎన్నికల ప్రచారసభలో భాగంగా ఒడ్డెలింగాపూర్‌ను కొత్త మండలం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాయికల్(జగిత్యాల): పరిపాలన సౌలభ్యం కోసం ఇప్పటికే జిల్లాలో కొత్త మండలాలు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రాయికల్ మండలంలోని ఒడ్డెలింగాపూర్ గ్రామాన్ని మండలకేంద్రంగా ప్రకటించారు. ఎన్నోఏళ్లుగా ఒడ్డెలింగాపూర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని గ్రామస్తులు ఎంపీ కల్వకుంట్ల కవిత, కలెక్టర్ శరత్‌కు వినతిపత్రాలు అందించారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఒడ్డెలింగాపూర్‌ను మండలకేంద్రంగా ఏర్పాటు చేస్తామని ఎంపీ కవిత హామీ ఇవ్వగా.. ఆ మేరకు సీఎం కేసీఆర్ నిజామాబాద్ వేదికగా ప్రకటించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గతంలో రాయికల్ మండలంలో 27 గ్రామాలు ఉండేవి. ఇటీవల రాయికల్ పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చారు. మరోవైపు ఆరు కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. రాయికల్ పోను ఆ సంఖ్య 32కు చేరింది. ఒడ్డెలింగాపూర్ మండలంలో 14 గ్రామాలు? రాయికల్ మండలంలో 32 గ్రామాలు ఉండగా.. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఒడ్డెలింగాపూర్లోకి 14 గ్రామాలు వెళ్లనున్నాయి. వీటిలో ఆల్యనాయక్‌తండా, బోర్నపల్లి, చింతలూరు, దావన్‌పల్లి, ధర్మాజీపేట, జగన్నాథపూర్, కైరిగూడెం, కట్కాపూర్, కొత్తపేట, మంక్త్యానాయక్తండా, ఒడ్డెరకాలనీ, తాట్లవాయి, వస్తాపూర్ గ్రామాలు ఒడ్డెలిం గాపూర్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. సీఎం, ఎంపీకి కృతజ్ఞతలు జగిత్యాల నియోజకవర్గంలోనే రాయికల్ మండలంపై ఎంపీ కవిత ప్రత్యేక శ్రద్ధ చూపడంతోపాటు రాయికల్ పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చారు. కొద్దిరోజుల వ్యవధిలోనే రాయికల్ మండలంలోని ఒడ్డెలింగాపూర్ గ్రామాన్ని మండలకేంద్రంగా సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయం. మండల ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. ఎంపీ కవితకు, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. – సంజయ్‌కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే గిరిజనులు అభివృద్ధి చెందుతారు ఒడ్డెలింగాపూర్ గ్రామాన్ని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక మండలంగా ప్రకటించడంతో మండల పరిధిలో ఉన్న 14 గ్రామాల గిరిజనులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వివిధ పనులపై సమయబావంతో పాటు అన్ని రకాల సేవలు అందుతాయి. దీనికి సహకరించిన ఎంపీ కవితకు కృతజ్ఞతలు. – పాలకుర్తి రవి, సర్పంచ్ -
ముస్తాబవుతున్న కార్యాలయాలు
అల్లాదుర్గం: వట్పల్లి గ్రామాన్ని ప్రభుత్వం నూతన మండలం చేయడంతో కార్యాలయాలను ముస్తాబు చేస్తున్నారు. మార్కెట్ యార్డులో ఎంపీడీఓ, తహసీల్దార్, పోలీస్ స్టేషన్ కార్యాలయాల కోసం భవనాలను ఎంపిక చేశారు. భవనాల్లో తాత్కాలికంగా ఫర్నిచర్, బోర్డులను రాశారు. శనివారం జోగిపేట సీఐ వెంకటయ్య పోలీస్ స్టేషన్‌కు కేటాయించిన భవనంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. అల్లాదుర్గంలో పోలీస్ సర్కిల్ కార్యాలయం కోసం కేటాయించిన హౌసింగ్ భవనంలో ఏర్పాట్లు చేపట్టారు. భవనం చుట్టూ పొదలు తొలగించారు. ముందు భాగంలో చదును చేశారు. కార్యాలయాల ప్రారంభం కోసం అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. -
తెరపైకి సీరోలు మండలం
వద్దంటూ నాలుగు పంచాయతీల తీర్మానం అంగీకరించిన కాంపల్లి, సీరోలు గ్రామస్తులు డోర్నకల్/కురవి : నియోజకవర్గంలో కొత్త మండలం పేరు పైకి వచ్చింది. సీరోలును మండలంగా ఏర్పాటు కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు గురువారం డోర్నకల్ మండలంలోని ఆరు, కురవి మండలంలోని ఆరు, మరిపెడ మండలంలో మూడు గ్రామాల్లో కలిపి 15 గ్రామాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహించారు. ఇప్పటివరకు చిన్నగూడూరు, దంతాలపల్లి, ఎల్లంపేటను మండలాలుగా ఏర్పాటు చేయాలని ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళనలు చేపట్టగా, తాజాగా సీరోలు పేరు తెరపైకి వచ్చింది. సీరోలు మండలం ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం డోర్నకల్ మండలం పెరుమాళ్లసంకీస, మన్నెగూడెం, రాయిగూడెం, చిలుకొయ్యలపాడు, అందనాలపాడు, ముల్కలపల్లి, కురవి మండలం సీరోలు, కాంపల్లి, చింతపల్లి, కొత్తూరు (సి), ఉప్పరిగూడెం, తాళ్లసంకీస, మరిపెడ మండలంలోని ఎడ్జర్ల, తండధర్మారం, బాలిన ధర్మారంలో గ్రామసభలు నిర్వహించారు. గ్రామసభలపై ప్రచారం జరగకపోవడంతో ప్రజలు ఎక్కువ సంఖ్యలో రాలేదు. మూడు నెలల క్రితం సీరోలును మండలంగా ఏర్పాటు చేస్తారని ప్రచారం జరిగి నా ఎవరూ నోరు విప్పలేదు. మాజీ ఎమ్మెల్సీ ఏ.వెంకట్‌రెడ్డి స్వగ్రామం సీరోలు కాగా, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి తేజావత్ రాంచంద్రునాయక్ ఇదే గ్రామపంచాయ తీ పరిధిలోని రూప్లాతండా. సీరోలులో పోలీస్‌స్టేషన్, ఆంధ్రాబ్యాంక్, పీహెచ్సీ నిర్వహణకు సరిపడ ఆరోగ్య ఉపకేంద్ర భవనం, ఆర్టీసీ బస్టాండ్ ఉన్నాయి. వ్యతిరేకిస్తున్న ప్రజలు డోర్నకల్ మండలంలో నిర్వహించిన గ్రామసభల్లో సీరోలు కు సమీపంలో ఉన్న మన్నెగూడెం, అందనాలపాడు, చిలుకొయ్యలపాడు గ్రామస్తులు సీరోలు మండలంలో కలి పేందుకు అనుకూలంగా తీర్మానం చేయగా, ముల్కలపల్లి, పెరుమాళ్లసంకీస, రాయిగూడెం ప్రజలు తమ గ్రామాలను డోర్నకల్‌లోనే కొనసాగించాలని తీర్మానం చేశారు. కురవి మండలంలోని సీరోలు, కాంపెల్లి గ్రామాలకు చెందిన వారు అనుకూలంగా తీర్మానం చేయగా, చింతపల్లి, కొత్తూరు (సి), ఉప్పరిగూడెం, తాళ్లసంకీస ప్రజలు కురవి మండలం లోనే కొనసాగించాలని తీర్మానం చేశారు. మరిపెడ మండలంలోని ఎడ్జర్ల, తండధర్మారం, బాలినధర్మారం గ్రామాల వారు కూడా మరిపెడ మండలంలోనే కొనసాగించాలని తీర్మానం చేశారు. తహసీల్దార్ సంజీవ, ఈఓపీఆర్డీ విజయలక్ష్మి, డీటీ శేషగిరిస్వామి, ఆర్ఐ ఫిరోజ్, సర్పంచ్‌లు కాబు, మంగమ్మ, పద్మ, ఉమారాణి, కురాకుల రమణ, ఉపసర్పంచ్ కొంపెల్లి సతీష్, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
‘మా గ్రామాలను కోట్‌పల్లిలో కలపవద్దు’
రంగారెడ్డి జిల్లా : రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాల కోసం ఉద్యమాలు ఊపందుకున్నాయి. అందులో భాగంలో రంగారెడ్డి జిల్లాలో ప్రజలు తమ గ్రామాలను కొత్తగా ఏర్పడబోయే మండలంలో కలపవద్దంటూ ఆందోళనకు దిగారు. నాగ సమందర్, గడ్డమీది గంగారం, కొండాపూర్ కలాన్ గ్రామాలకు కోట్‌పల్లి మండలంలో కలపవద్దంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధారూరు మండలకేంద్రంలో తాండూరు-హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో అన్ని పార్టీలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. -
ఇనుగుర్తిని మండలం చేయాలి
∙రోడ్డుపైనే వంటావార్పు కేసముద్రం : మండలంలోని ఇనుగుర్తిని మండలంగా ఏర్పాటు చేయాలంటూ గ్రామంలో గురువారం ఇనుగుర్తి సాధన సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. అనంతరం రోడ్డుపైనే వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు తొర్రూరు, నెక్కొండ, కేసముద్రం వైపుగా వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ క్రిష్ణారెడ్డి, ఎస్సై ఫణిధర్‌లు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాదాపు 3 గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులు నిలిచిపోయిన వాహనాలను కోమటిపల్లి మీదుగా తొర్రూరు వైపుకు తరలించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం మీ డిమాండ్‌ను ఉన్నతాధికారులకు తెలియపరుస్తామని సీఐ,ఎస్సైలు హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమింపజేశారు. కార్యక్రమంలో సాధన సమితి కన్వీనర్ చిన్నాల కట్టయ్య, కోకన్వీనర్ దార్ల భాస్కర్, వివిధ పార్టీల నాయకులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
24 జిల్లాలకు ఓకే
- సూచనప్రాయంగా ఆమోదం తెలిపిన ప్రభుత్వం - జాబితాలో కొత్తగా సిరిసిల్ల జిల్లా సీఎం నిర్ణయం మేరకు తుది సంఖ్య - కొత్త జిల్లాలు, ఉద్యోగులు, ఆఫీసుల ఏర్పాటుపై కలెక్టర్లతో సీఎస్ భేటీ - కొత్త మండలాల ప్రతిపాదనలకు కట్టడి - తగిన కారణాలుంటేనే ఏర్పాటు చేయాలని సూచన - 50-60కి పరిమితం కానున్న కొత్త మండలాలు - ఒక్కో జిల్లాకు రూ. 80 కోట్లు అవసరం - జిల్లాకు సగటున 1,100 మంది ఉద్యోగులు - ఇప్పటికిప్పుడు కొత్త ఉద్యోగులను ఇవ్వలేం - ఉన్న సిబ్బందితోనే సర్దుబాటు చేయాలన్న సీఎస్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 14 కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సూచనప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇప్పటికే సిద్ధం చేసిన ముసాయిదా జాబితాలోని 23 జిల్లాలకు అదనంగా సిరిసిల్లను కొత్త జిల్లాగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను జోడించింది. మొత్తంగా 24 జిల్లాలతో తుది ముసాయిదాను రూపొందించింది. వీటన్నింటా పాలనాపరమైన సన్నాహాలు ముమ్మరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దసరా నాటికి కొత్త జిల్లా కేంద్రాల నుంచి పరిపాలన ప్రారంభించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సోమవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా, సీఎంవో అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. కొత్త జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు, తాత్కాలికంగా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు, అవసరమైన మౌలిక వసతులు, ఉద్యోగుల కేటాయింపు అంశాలపైనే ఇందులో ప్రధానంగా చర్చించారు. కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలపై తమ ప్రతిపాదనలు, నివేదికలను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు సీఎస్‌కు సమర్పించారు. కొత్త జిల్లాల్లో మండలాలు, వాటి భౌగోళిక స్వరూపంతో నమూనా మ్యాప్‌లను ప్రదర్శించారు. వీటితో పాటు ప్రతిపాదిత జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగుల అవసరాలపై సీసీఎల్ఏ కోరిన నివేదికను అందజేశారు. కొత్త మండలాలు ఎక్కువగా వద్దు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ఎక్కువగా కొత్త మండలాల ఏర్పాటు అవసరం లేదని, తప్పనిసరిగా అవసరమనుకున్న చోటనే కొత్తవి ప్రతిపాదించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 50 నుంచి 60 మండలాల ఏర్పాటు చేయాల్సి వస్తుందని అంచనా వేశారు. హైదరాబాద్‌లో 3 లక్షల జనాభాకు ఒక మండలం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లుగా రోజువారీ రెవెన్యూ కార్యకలాపాలు ఇక్కడ లేనందున.. నగరంలో అంతకు మించి కొత్త మండలాల ప్రతిపాదనలు అక్కర్లేదని నిర్ణయించారు. జిల్లాల్లోనూ కొత్త మండలాలను ప్రతిపాదించేటప్పుడు.. అందుకు తగిన కారణాలను తప్పనిసరిగా విశ్లేషించాలని సీఎస్ కలెక్టర్లకు సూచించారు. పెరిగిన జనాభా కారణమా? పరిధి ఎక్కువగా ఉందా? ప్రజలకు అందుబాటులో లేదా? ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి డిమాండ్ ఉందా? అనే కోణంలో తగిన కారణం చూపించాలన్నారు. దీంతో ముసాయిదాలో ఉన్న 74 కొత్త మండలాల సంఖ్య 50-60కి పరిమితమయ్యే అవకాశముంది. ఉద్యోగుల పంపిణీపై హైపవర్ కమిటీ కొత్త జిల్లాలకు అవసరమైన ఉద్యోగుల పంపిణీపై దృష్టి సారించాలని సీఎస్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల పంపిణీపై మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. శాఖల వారీగా జిల్లా యూనిట్లపై చర్చించేందుకు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, హెచ్‌వోడీలతో వారం రోజుల్లోగా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కొత్త ఉద్యోగులు సాధ్యం కాదు కొత్త జిల్లాలకు అవసరమయ్యే ఉద్యోగులను ఇప్పటికిప్పుడు అదనంగా ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం కలెక్టర్లకు తేల్చి చెప్పింది. వీలైనంత మేరకు ఉన్న ఉద్యోగులనే సర్దుబాటు చేసుకోవాలని సూచించింది. ఇప్పుడున్న జిల్లా రెండు జిల్లాలుగా విభజిస్తే అక్కడికక్కడే ఉద్యోగులను కేటాయించుకొని.. సర్దుబాటు చేయాలని ఆదేశించింది. మూడు జిల్లాలుగా విభజించిన చోట అవసరమైతే అదనంగా కొత్త ఉద్యోగులను కేటాయిస్తామని తెలిపింది. మెప్మా, ఐకేపీ, డ్వామా, డీఆర్డీఏ పరిధిలో అక్కర లేకున్నా పని చేస్తున్న ఉద్యోగులను సర్దుబాటు చేయాల్సి ఉంటుందని సూచించింది. వివిధ శాఖలతో పాటు ఆర్టీసీ తదితర విభాగాల విభజనపైనా చర్చ జరిగింది. ఒక్కో జిల్లాకు రూ.80 కోట్లు కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటుకు సగటున ఒక్కో జిల్లాకు రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్లు అవసరం. ఒక్కో జిల్లాకు సగటున 1,100 మంది నుంచి 1,300 మంది ఉద్యోగులు అవసరమవుతారని లెక్కలేశారు. వీలైనంత మేరకు అందుబాటులో ఉన్న డివిజన్ స్థాయి కార్యాలయాలు, ప్రభుత్వ బంగ్లాలనే జిల్లా కార్యాలయాలుగా మార్చుకోవాలని, అవి సరిపోని పక్షంలోనే అద్దె భవనాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కొత్త కలెక్టరేట్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలతో పాటు నమూనాలపై సమావేశంలో చర్చ జరిగింది. జిల్లాల పునర్విభజన సందర్భంగా అన్ని శాఖలు రికార్డులు భద్రపరచటంలో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎస్, సీసీఎల్ఏ సూచించారు. రికార్డుల తరలింపు, భద్రపరచడం కీలకంగా గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల పునర్విభజనకు సంబంధించిన చట్టం, నోటిఫికేషన్ జారీ చేసిన మార్గదర్శకాలున్న ప్రతులను ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు అందించారు. న్యాయపరమైన చిక్కులేమీ లేకుండా చట్టాన్ని అధ్యయనం చేసి విధివిధానాలను పాటించాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతగిరిలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్! హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పునర్విభజనపై తుది కసరత్తు పూర్తి కాలేదని అధికారులు చెబుతున్నప్పటికీ.. ఇప్పటికే ప్రభుత్వం తయారు చేసిన ముసాయిదాలో హైదరాబాద్, సికింద్రాబాద్, వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలున్నాయి. అదే కోణంలో ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. వికారాబాద్ సమీపంలోని అనంతగిరిలోని టీబీ శానిటోరియంలో తాత్కాలికంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. సీఎం తీసుకునే తుది నిర్ణయం మేరకే జిల్లాల సంఖ్య ఆధారపడి ఉంటుందని సీఎస్ రాజీవ్‌శర్మ అభిప్రాయపడ్డారు. మారిన మండలాలు పాత ముసాయిదాతో పోలిస్తే కొత్త జిల్లాల్లో చేర్చే మండలాలు కొన్ని అటుదిటుగా మారిపోయాయి. ప్రధానంగా కరీంనగర్ జిల్లాలో గతంలో ఉన్న జగిత్యాల, కరీంనగర్ జిల్లాలకు అదనంగా సిరిసిల్లను జిల్లాగా ప్రతిపాదించటంతో మండలాలు మారిపోయాయి. ఉదాహరణకు గతంలో సిద్దిపేట జిల్లాలో ప్రతిపాదించిన ఇల్లంతకుంట మండలాన్ని ఇప్పుడు సిరిసిల్లలో చేర్చారు.