‘మా గ్రామాలను కోట్‌పల్లిలో కలపవద్దు’
Published Sun, Sep 11 2016 3:46 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
రంగారెడ్డి జిల్లా : రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాల కోసం ఉద్యమాలు ఊపందుకున్నాయి. అందులో భాగంలో రంగారెడ్డి జిల్లాలో ప్రజలు తమ గ్రామాలను కొత్తగా ఏర్పడబోయే మండలంలో కలపవద్దంటూ ఆందోళనకు దిగారు.
నాగ సమందర్, గడ్డమీది గంగారం, కొండాపూర్ కలాన్ గ్రామాలకు కోట్‌పల్లి మండలంలో కలపవద్దంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధారూరు మండలకేంద్రంలో తాండూరు-హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో అన్ని పార్టీలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement