- ∙రోడ్డుపైనే వంటావార్పు
ఇనుగుర్తిని మండలం చేయాలి
Published Fri, Sep 9 2016 12:47 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM
కేసముద్రం : మండలంలోని ఇనుగుర్తిని మండలంగా ఏర్పాటు చేయాలంటూ గ్రామంలో గురువారం ఇనుగుర్తి సాధన సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. అనంతరం రోడ్డుపైనే వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు తొర్రూరు, నెక్కొండ, కేసముద్రం వైపుగా వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ క్రిష్ణారెడ్డి, ఎస్సై ఫణిధర్‌లు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాదాపు 3 గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు.
దీంతో పోలీసులు నిలిచిపోయిన వాహనాలను కోమటిపల్లి మీదుగా తొర్రూరు వైపుకు తరలించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం మీ డిమాండ్‌ను ఉన్నతాధికారులకు తెలియపరుస్తామని సీఐ,ఎస్సైలు హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమింపజేశారు. కార్యక్రమంలో సాధన సమితి కన్వీనర్ చిన్నాల కట్టయ్య, కోకన్వీనర్ దార్ల భాస్కర్, వివిధ పార్టీల నాయకులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement