
రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు శనివారానికి సెలవును పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేని వానలు పడుతుండటంతో ప్రభుత్వం విద్యా సంస్థలకు గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో.. శనివారం సెలవును పొడిగించారు. సోమవారం నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment