Cyclone Montha: మోంధా తుపాను నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల. ప్యాడీ రక్షణకు అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్యాడీ రక్షణపై దృష్టి పెట్టీ - వర్షాలతో ధాన్యం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ ఆదేశాలు జారీ చేశారు. రైతు ప్రాధాన్యాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ధాన్యం పై కప్పేందుకు తార్పాలిన్‌లు ఉపయోగించాలి, నిల్వ ఉన్న ధాన్యాన్ని తక్షణమే రైస్ మిల్లులకు తరలించాలి. పంట కోత నిలిపివేయాలి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. 22,433 మంది రైతులకు రూ.431 కోట్లు చెల్లించాం.రాష్ట్ర వ్యాప్తంగా 4,428 కేంద్రాలు ఇప్పటికే ప్రారంభించాం. ప్యాడీ కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు చేస్తే కఠిన చర్యలు. రైతు నష్టపోకూడదు, ప్రభుత్వ ప్రతిష్ట దానిపైనే ఆధారపడింది. అత్యవసర పరిస్థితుల్లో తాను అందుబాటులో ఉంటాం’ అని మంత్రి ఉత్తమ్ భరోసా ఇచ్చారు.


