breaking news
Cyclone Montha
-
కర్షకుడిపై బాబు సర్కారు కర్కశం
ఏ పల్లెకెళ్లినా ఒకటే దృశ్యాలు.. ఏ రైతును కదిలించినా ఒకటే వేదన. వరి మొదలుకొని పత్తి వరకు..అరటి మొదలు బొప్పాయి వరకు ఏ పంట చూసినా మొలలోతు ముంపులో నానుతున్నాయి. వరికంకులు నేలనంటి కుళ్లిపోతున్నాయి. వరిచేలు జీవం లేని పచ్చిక బయళ్లు మాదిరిగా తయారయ్యాయి. పత్తి, మొక్కజొన్న, లంక గ్రామాల్లో సాగుచేసిన అరటి, బొప్పాయి, పసుపు తోటలు నేలకూలి రైతుల ఆశలను చిదిమేశాయి. రైతులు ఇంత కష్టంలో ఉంటే ఆదుకోవాల్సిన కూటమి సర్కారు వారిపై కనికరం, కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది. కర్కశంగా వారిని గాలికొదిలేసింది. పంట నష్టనమోదు మొక్కుబడిగా చేస్తోంది. ఇన్పుట్ సబ్సిడీ మంజూరును అటకెక్కించింది. ధాన్యం కొనుగోలుపై డ్రామాలు ఆడుతోంది. ఇప్పటికే ఉచిత పంటల బీమాకు ఎగనామం పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని ప్రతి రైతుకూ రూ.40వేలు చొప్పున ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.ఐదువేలు ఇచ్చి చేతులు దులుపుకుంది. తుపాను మిగిల్చిన తీరని నష్టంతో రైతులు తీవ్ర వేదనతో ఉంటే సీఎం చంద్రబాబు సతీమణితో కలిసి లండన్ టూర్‌కు వెళ్లడం, ఆయన తనయుడు నారా లోకేశ్ సతీమణితో కలిసి క్రికెట్ మ్యాచ్కంటూ ముంబై వెళ్లడంపై రాష్ట్ర రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. కనీస కనికరం, బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న కూటమి దుష్టపాలనపై ధ్వజమెత్తుతోంది.ఈయన పేరు వళ్లుం మురళీకృష్ణ. ఊరు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కాగుపూడి. ఈయనకు సొంతంగా రెండెకరాలుండగా, కౌలుకు మరో 8 ఎకరాలు తీసుకొని ఖరీఫ్‌లో స్వర్ణ రకం వరి సాగు చేశారు. ఎకరాకు రూ.40వేల వరకు పెట్టుబడి పెట్టారు. కౌలుతో కలుపుకుంటే ఎకరాకు రూ.60వేలకుపైగా ఖర్చయింది. ఆరుగాలం కంటిపాపలా సాకిన పంట ఏపుగా పెరిగింది. ఎకరాకు 40 బస్తాలు వస్తాయని ఆశపడ్డారు. కానీ మోంథా తుపాను అతని ఆశలను అంతమొందించింది. పంటను పూర్తిగా దెబ్బతీసింది. ఇప్పుడు రెల్లుపురుగు పంటను తినేస్తుంది. ఎకరాకు 25 బస్తాలకు మించి వచ్చే పరిస్థితి లేదు. దీనిని కోయడానికి ఎకరాకు రూ.15వేలు పెట్టుబడి పెట్టాలి. వచ్చినదంతా కౌలుకే పోతోంది. పెట్టుబడి కూడా రాకపోగా ఇంకా ఎకరాకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు నష్టం మిగులుతుందని మురళీ కృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి పరిహారం వస్తుందో రాదో అనే అయోమయం నెలకొందని, బీమా కూడా చేయించుకోలేదని, పది ఎకరాలకు కలిపి తీవ్ర నష్టం వాటిల్లుతుందని కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఈయన పేరు యార్లపాటి సత్తిపండు.. ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన ఈ రైతు ఆరెకరాల 75 సెంట్లు కౌలుకు తీసుకొని పీఎల్ రకం వరి సాగు చేశారు. ఎకరాకు రూ.30వేలు పెట్టుబడి పెట్టారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, ధాన్యం షావుకారుల నుంచి నూటికి రూ.2, రూ.3 వడ్డీకి అప్పులు చేసి పెట్టుబడి పెట్టారు. సర్కారు కౌలు కార్డు ఇవ్వలేదు.. పెట్టుబడి సాయం రాలేదు. తుపాను వల్ల కురిసిన వర్షంతో ధాన్యం గింజలు పొల్లు కింద రాలి పోతున్నాయి. ఊకైపోతున్నాయి. 25 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎకరాకు 16 బస్తాలు కౌలుకు ఇవ్వాలి. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటట్టు లేదు. దీంతో సత్తిపాండు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. (పంపాన వరప్రసాదరావు) ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి సాక్షి ప్రతినిధి : ఇప్పటికే ఏడాదిన్నరగా వరుస విపత్తులతో అల్లాడుతున్న రైతులపై ఇప్పుడు మోంథా తుపాను విరుచుకుపడి పంటలను పూర్తిగా తుడిచిపెట్టేసింది. వరి రైతుకు తీరని నష్టం మిగిల్చింది. ఎకరాకు 25 బస్తాలూ రాని దుస్థితి నెలకొంది. ఇప్పటికే భారీగా పెట్టిన పెట్టుబడులూ రాకపోగా, ఇప్పుడు తడిచిన పంట కోతకు మరింత చేతి చమురు వదిలించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దాదాపు అన్ని పంటలదీ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఫలసాయంపై రైతులు ఆశలు వదిలేసుకున్నారు. ప్రభుత్వ సాయమైనా వస్తుందేమోనని ఎదురు చూస్తున్నా.. ఆ దాఖలాలు కానరావడం లేదు. సర్కారు వారిపై కనీస కనికరం చూపడం లేదు. బాధ్యత లేకుండా కర్కశంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా ప్రకృతి ప్రకోపానికి బలైన రైతులు తమ ఇబ్బందులను ఏకరువు పెడుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు. కృష్ణ, ఎన్టీఆర్, ఏలూరు, ఉభయ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ ఏ జిల్లాకు వెళ్లినా క్షేత్రస్థాయిలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కర్షకుల కన్నీటి గాధలు గుండెలను పిండేస్తున్నాయి. అన్నదాతల దీనస్థితిని కళ్లకు కట్టే ప్రయత్నమే ఈ సాక్షి గ్రౌండ్ రిపోర్ట్.. కౌలురైతులకు కోలుకోలేని దెబ్బ గోదావరి, కృష్ణా డెల్టాలో వ్యవసాయం చేసే రైతుల్లో కౌలురైతులే అధికం. వరితో సహా ప్రధాన పంటలు సాగు చేసే రైతుల్లో నూటికి 70–80 శాతం మంది వారే. మోంథా తుపాను ప్రభావానికి వారికి అపార నష్టం వాటిల్లింది. కళ్లెదుటే పంట కుళ్లిపోతుంటే వారంతా కన్నీరు మున్నీరవుతున్నారు. గడిచిన ఏడాదిగా కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన కౌలు రైతులు తాజాగా తుపాను ప్రభావంతో కోలుకోలేని విధంగా నష్టపోయారు. వరి కౌలు రైతులు ఎకరాకు 16–20 బస్తాలు భూ యజమానికి ఇచ్చు కోవాల్సిందే. ఇతర వాణిజ్య పంటలకైతే ఎకరాకు ఏడాదికి రూ.40వేలు కిస్తీ కట్టాల్సిందే. ఏడాదిన్నరగా కౌలు కార్డుల్లేక.. పెట్టుబడి సాయం అందక, బ్యాంకుల నుంచి పంట రుణాలకు నోచుకోక అప్పుల సాగు చేస్తున్న వీరంతా వరుస విపత్తులతో కకావికలమవుతున్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, ధాన్యం షావుకారుల వద్ద రూ.2, రూ.3 వడ్డీలకు అప్పులు చేసి కష్టాల ఊబిలో కూరుకుపోయారు. ప్రతి కౌలు రైతుకూ రూ.3లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు అప్పులు ఉన్నట్టు చెబుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఎకరాకు 40 బస్తాలకు పైగా దిగుబడి వస్తుందని ఆశపడ్డారు. ఇప్పటికే ఎకరాకు సగటున రూ.35 వేల నుంచి 40వేల వరకు పెట్టుబడి పెట్టేశారు. ఇప్పుడు అదంతా బూడిదలో పోసిన పన్నీరైందని కుమిలిపోతున్నారు. కిస్తీకి కూడా సరిపోయే పరిస్థితి లేదు.. వరిని యంత్రాలతో కోస్తే కానీ ఉన్న కొద్దిపాటి పంట చేతికొచ్చే పరిస్థితిలేదు. అయితే యంత్రాలతో ఎకరా కోతకు నాలుగైదు గంటలు పడుతుందని, గంటకు రూ.3 వేల నుంచి రూ.4వేలు యంత్రాల నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. దీనికి ఎంత చూసుకున్నా.. ఎకరాకు రూ.15వేలు అదనంగా ఖర్చయ్యేలా ఉందని ఆవేదన చెందుతున్నారు. ఇంతా కష్టపడి తీరా కోసి ఆరబెట్టినా 20–25 బస్తాలకు మించి వచ్చే పరిస్థితి లేదు. దాంట్లో 17 బస్తాలు కౌలుగా భూ యజమానికే ఇవ్వాలి. ఇక మాకు మిగిలేది ఏమిటంటూ కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటంతా తడిసి ముద్దవడంతో అధిక తేమశాతంతోపాటు రంగుమారే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల వరి గింజలకు మొలకలొచ్చేశాయి. మరొక వైపు రెల్ల పురుగు నేలనంటిన దుబ్బులును కొరికేస్తోంది. వడ్లు నేలరాలిపోయి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. ఇన్ని కష్టాలు పడి ఒబ్బిడి చేసినా మద్దతు ధర మాట దేవుడెరుగు కొనేవారుండరన్న ఆందోళన రైతుల్లో సర్వత్రా నెలకొంది. అరటి, బొప్పాయి, మొక్కజొన్న, పసుపు రైతులైతే తమకు పెట్టుబడి కాదు కదా.. కనీసం భూ యజమానికి కీస్తీకిచ్చేందుకు కూడా మిగలదని లబోదిబోమంటున్నారు.అన్నదాతల్లో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహంతుపాను వేళ ప్రభుత్వం ఇంతలా నిర్లక్ష్యం ప్రదర్శించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందెన్నడూ ఇలాంటి దుస్థితి చూడలేదని, కనీసం పంట నష్టం అంచనాల కోసం తమ పొలాల వైపునకు అధికారులు రావడం లేదని, రైతు సేవా కేంద్రాలకు వెళ్తే రాస్తాంలే అంటూ సమాధానాలు చెబుతున్నారని దువ్వకు చెందిన అప్పారావు అనే కౌలు రైతు సాక్షి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను దెబ్బకు తాము పెట్టుబడిని సైతం కోల్పోతున్నామని వరి రైతులు, తాము లక్ష నుంచి లక్షన్నర వరకు నష్టపోతున్నామని అరటి తదితర వాణిజ్య పంటల రైతులు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఆదుకోక పోతే తమకు అ«ధోగతే అని, వ్యవసాయం మానుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదని స్పష్టం చేస్తున్నారు.వైఎస్ జగన్ హయాంలో నాడు అడుగడుగునా అండగా..గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రకృతి విపత్తు సంభవిస్తే ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలిచింది. 2023 డిసెంబర్లో సంభవించిన మిచాంగ్ తుపాను సమయంలో ఇదేరీతిలో పంటలు ముంపునకు గురైన వేళ రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే) సిబ్బంది రైతులతో కలిసి పంట చేలల్లోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టడంతోపాటు నష్ట పరిహార నమోదు ప్రక్రియ వేగంగా చేపట్టారు. ముంపునకు గురైన పంటలను ఎలా రక్షించుకోవాలో సూచనలు, సలహాలు అందించారు. అప్పటి వైఎస్ జగన్ సర్కారు పంట నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ వేగంగా చెల్లించడంతోపాటు ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసింది. ఆఖరికి తడిచిన, రంగు మారిన ధాన్యాన్నీ గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేసింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మచ్చుకైనా కనిపించడం లేదు. అధికారులెవరూ పొలాలవైపు కన్నెత్తి చూడడం లేదు. కిందిస్థాయి సిబ్బంది తూతూమంత్రంగా పంటనష్ట అంచనాలను ప్రాథమికంగా నమోదు చేస్తున్నారు. ఇన్పుట్ సబ్సిడీకి మంగళం పాడేందుకు సర్కారు కుటిలయత్నం చేస్తోంది. ధాన్యం కొనుగోలుకూ డ్రామాలు ఆడుతోంది.ఇంకా నీటి ముంపులోనే లక్షలాది ఎకరాలు తుపాను తీరం దాటి నాలుగు రోజులు గడిచినా లక్షలాది ఎకరాలు ఇంకా ముంపునీటిలోనే ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు, గుమ్మడిదుర్రు, అనిగండ్ల పాడు, మాగొల్లు, విజయవాడ రూరల్, ఎన్టీఆర్ జిల్లా ఏటూరు, తోటరావుల పాడు, చింతలపాడు, ఏలూరు జిల్లా ఉంగుటూరు, పశ్చిమగోదావరి జిల్లా దువ్వ, జగన్నాధపురం, మిలట్రీ మాధవరం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పెనికేరు,, ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి, అంబాజీపేట మండలం గంగలకుర్రు, కాకినాడ జిల్లా కరప, వేళంగి తదితర గ్రామాల్లో పంట చేలు నేటికీ ముంపునీటిలోనే ఉన్నాయి. రావులపాలెం మండలం ఈతకోట, పి. గన్నవరం, మామిడి కుదురు మండలాల్లో పలు గ్రామాల్లో నేలకొరిగిన అరటితోటలు సైతం ముంపునీటిలో ఉన్నాయి. రైతాంగ కష్టాలు వదిలి షికార్లు దుర్మార్గం మోంథా తుపాను వల్ల వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉచిత పంటల బీమా ఎత్తేయడంతో కర్షకులు తీవ్రంగా దెబ్బతిన్నారు. ఇన్పుట్ సబ్సిడీ సర్కారు ఇవ్వాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. రైతులు ఇంత కష్టంలో ఉంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు ఇతర ప్రాంతాలకు షికార్లకు వెళ్లడం దుర్మార్గం. – వి.కృష్ణయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం ఇదేనా పాలకుల చిత్తశుద్ధి? మోంథా తుపాను దెబ్బకు లక్షలాది ఎకరాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అన్నదాతలకు అండగా నిలవాల్సింది పోయి కూటమి నేతలు రాష్ట్రాన్ని వదిలి షికార్లు చేస్తుండడం ఎంతవరకు సమంజసం. ఇదేనా పాలకుల చిత్తశుద్ధి? – ఎం.హరిబాబు, ప్రధాన కార్యదర్శి ఏపీ కౌలురైతుల సంఘం రైతులు పుట్టెడు కష్టాల్లో ఉంటే పాలకుల టూర్లు తుపాను బారిన పడి తీవ్రంగా నష్టపోయి రైతులు పుట్టెడు కష్టాల్లో ఉంటే వారిని ఆదుకోవాల్సింది పోయి సీఎం టూర్లు చేయడం ఏమిటి? తుపాను నష్టాన్ని తక్కువగా చూపేందుకు సర్కారు యత్నిస్తోంది. వైఎస్సార్ కడప జిల్లా సి. కె. దిన్నె మండలం కోలుములపల్లి తదితర గ్రామాలలో తుపాను, దానికంటే ముందు కురిసిన అధిక వర్షాలతో దెబ్బతిన్న చామంతి పూల తోటలను ఏ అధికారీ పరిశీలించలేదు. ఇదే జిల్లాలో పోరుమామిళ్ల, బద్వేలు రూరల్, కాజీపేట, మైదుకూరు, బి. మఠం మండలాలలో జరిగిన పంట నష్టం గురించి అధికారులు చూసిన పాపాన పోలేదు. ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. – జీఎస్ ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్శి ఏపీ రైతు సంఘం ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలి రైతులను కూటమి ప్రభుత్వ పెద్దలు గాలికొదిలారు. రాష్ట్రంలో ఈ–పంట నమోదు పూర్తిస్థాయిలో జరగలేదు. పంటనష్ట నమోదు మొక్కుబడిగా సాగుతోంది. ఇన్పుట్ సబ్సిడీ అందని ద్రాక్షగా ఉంది. దెబ్బతిన్న పంటలను గిట్టుబాటు ధరకు సర్కారే కొనాలి. గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలి. – పి.జమలయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ, కౌలురైతుల సంఘం 25 బస్తాలు కూడా వచ్చేటట్టు లేదు మాకు కాగుపాడు ఆయకట్టులో రెండున్నర ఎకరాల పొలం ఉంది. సొంతంగానే సాగు చేస్తున్నాం., మరో 15 రోజుల్లో కోతకోసే వాళ్లం. ఇంతలోనే మోంథా తుపాను ముంచేసింది. వంద బస్తాలు అవ్వాల్సింది. ఎకరాకు 25 బస్తాలకు మించి పంట దిగుబడి వచ్చేటట్టు లేదు. – గండికోట నాగయ్య, కాగుపాడు, ఏలూరు జిల్లా పెట్టుబడి కూడా రాని దుస్థితి పెట్టుబడి వస్తాదో రాదో అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎకరంన్నరలో స్వర్ణ సాగు చేశా. మంచి దిగుబడి వస్తుందని ఆశగా ఎదురు చూశాం. మోంథా తుపాను మా ఆశలను నాశనం చేసింది. ఎకరాకు 20 బస్తాల దిగుబడి కూడా వచ్చేటట్టు లేదు. కనీసం పెట్టుబడి కూడా మిగలదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – దొడ్డి మోహనరావు, కౌలురైతు, యర్రమళ్ల, ఏలూరు జిల్లా -
ఈనెల 4న కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
విజయవాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 4వ తేదీన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారు మోంథా తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. మోంథా తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటనకు సంబంధించిన పర్యటన వివరాలను వైఎస్సార్సీపీ నేతలు తలశిల రఘురాం, పేర్ని నానిలు వెల్లడించారు. ఉచిత పంటల బీమాతో రైతులకు శ్రీరామ రక్ష: వైఎస్ జగన్ -
‘వైఫల్యాలను కప్పిపుచ్చడానికే డ్రామాలు.. ఎవన్ ఎక్కడ’
సాక్షి, తాడేపల్లి: మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవటంలో చంద్రబాబు నిష్ణాతుడు అని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. ఆలయాల్లో దుర్ఘటనలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. కాశీబుగ్గ ప్రమాదం, తుపాను వైఫల్యాలను కప్పి పుచ్చటానికే మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు అని తెలిపారు. టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ అని చెప్పుకొచ్చారు.మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘కాశీ బుగ్గ ప్రమాద మృతులకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలి. ఆలయం ప్రైవేటు వారిదంటూ తప్పించుకోవాలనుకుంటే కుదరదు. వేల మంది భక్తులు ఆలయానికి వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది?. వీటికి సమాధానం చెప్పకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తామంటే జనం సహించరు. మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవటంలో చంద్రబాబు నిష్ణాతుడు. ఆలయాల్లో దుర్ఘటనలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?. డైవర్షన్ రాజకీయాలు చంద్రబాబుకు కొత్త కాదు.కాశీబుగ్గ ప్రమాదం, తుపాను వైఫల్యాలను కప్పి పుచ్చటానికే జోగి రమేష్ అరెస్టు. నకిలీ మద్యం గురించి మాట్లాడినందుకు జోగిని అరెస్టు చేశారు. ప్రతి మూడు సీసాల్లో ఒకటి నకిలీ మద్యమే. డైవర్షన్ బాబు.. చంద్రబాబు. ప్రజలను కాపాడటానికి అధికారంలోకి వచ్చారా? లేక డైవర్షన్ రాజకీయాలు చేయడానికా?. జయచంద్రారెడ్డి, ఆయన తమ్ముడు, పీఏలను ఎందుకు వదిలేశారు?. జనార్ధనే నకిలీ మద్యం కేసు నిందితుడు. టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ జరిగింది. దాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు. అమెరికాకు కూడా తెలియని టెక్నాలజీ నా దగ్గర ఉందనే చంద్రబాబు నకిలీ మద్యం తయారవుతున్న విషయం తెలియలేదా?.టెక్నాలజీ ఏది బాబూ?కాశీబుగ్గలో జనం తొక్కిసలాట గురించి నీ టెక్నాలజీ ముందే చెప్పలేదా చంద్రబాబు?. తిరుపతి తొక్కిసలాటలో భక్తులు చనిపోతే మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?. సింహాచలం, కాశీబుగ్గ ఘటనలు ప్రభుత్వ వైఫల్యాలే. చంద్రబాబు లండన్ ఎందుకు వెళ్లారో ప్రజలకు ఎందుకు చెప్పలేదు?. మొదట అధికారిక పర్యటన అన్నారు, ఇప్పుడు వ్యక్తిగత పర్యటన అని అంటున్నారు. చంద్రబాబు వ్యక్తిగత పనులు ఏం ఉన్నాయో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. తుపాను కంట్రోల్ చేశానని చెప్పుకున్న చంద్రబాబు మరి ఎనిమిది మంది ఎలా చనిపోయారో చెప్పాలి.అందుకే ఎల్లో మీడియా జాకీలు..వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్లయితే నష్టం తగ్గేది. పంట నష్టం అంచనాలు సాయంత్రానికే తెలిసేవి. ఎకరానికి లక్ష రూపాయల చొప్పున నష్టం జరిగింది. దానిపై ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు?. రైతులను ఆదుకోకుండా తుపాను వారియర్స్‌కు సత్కారం అంటూ మరొక ఈవెంట్ చేశారు. వైఎస్ జగన్ పాలనలో ఒక్క హిందూ ఆలయంలో ఇలాంటి దుర్ఘటన జరిగిందా?. చంద్రబాబు పాలనా దక్షుడు కాదని ఎల్లో మీడియాకు కూడా తెలుసు. కానీ, ఆయన సీఎంగా ఉంటేనే వాటాలు పంచుకోవచ్చని ఎల్లో మీడియా జాకీలు వేస్తోంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
చంద్రబాబు.. అంత భయమెందుకు?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టిమళ్లించడానికి, నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ జోగి రమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు. నకిలీ మద్యం కేసులో టీడీపీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబు అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగిరమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు. జోగిరమేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.గత 18 నెలలుగా ప్రభుత్వం మీది.. పాలన మీది. పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది. పట్టుబడ్డవారిలో మీ పార్టీనుంచి ఎన్నికల్లో పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు, మీతోనూ, మీ కొడుకుతోనూ, మీ మంత్రులతోనూ, మీ ఎమ్మెల్యేలతోనూ, అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారే. మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అంతా అమ్మేది, మీరు తీసుకు వచ్చిన మీ ప్రైవేటు లిక్కర్ షాపుల్లోనే, మీ కార్యకర్తలు, నాయకులు నడిపే బెల్టుషాపుల్లోనే, పర్మిట్ రూముల్లోనే. మరి తయారీ మీది, చేసిన వారు మీవారు, అమ్మేదీ మీరే, కాని బురదజల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మావాళ్లని..@ncbn గారూ.. మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగిరమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు. జోగిరమేష్… pic.twitter.com/ros9R1o0xY— YS Jagan Mohan Reddy (@ysjagan) November 2, 2025నిన్న కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టిమళ్లించడానికి, మోంథా తుపాను కారణంగా కుదేలైన రైతు గోడును పక్కదోవపట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడి, దుర్మార్గానికి ఒడిగట్టారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటిరోజే అరెస్టుకు దిగారంటే చంద్రబాబుగారు.. మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థం అవుతోంది. నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం, మీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబుగారూ? ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీ జేబులో ఉన్న సిట్ మీరు ఏం చెప్తే అది చేస్తుంది. మీరు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా? ఇలాంటి రాక్షస పాలనలో మీ నుంచి ఏమి ఆశించగలం’ అని విమర్శలు చేశారు. -
మోంథా తుపాన్.. లోకేష్‌కు నెట్ ప్రాక్టీస్!
రాష్ట్రాన్ని మోంథా తుపాను వణికించింది. రైతులను, మత్స్యకారులను ఇతర చిరు జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. నాలుగైదు రోజులు ప్రజలు ఇళ్ళకే పరిమితమైపోయి గుమ్మం దాటి బయటికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వ అధికారులు సైతం తమ స్థాయిల్లో శ్రమించి తుపాను నష్టాన్ని.. కష్టాన్ని తగ్గించడానికి కృషి చేశారు. అయితే, ఈ మొత్తంలో మోంథా తుఫానుపై ప్రభుత్వ సహాయ చర్యలు.. నష్ట నివారణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వాటి అమలు తదితర అంశాలు అన్ని లోకేష్ బాబుకు ఉపకరించేలా ఉన్నాయి. అటు లోకేష్, చంద్రబాబు ఇద్దరు కూడా తుపాను నష్టాన్ని తగ్గించడంలో తీవ్రంగా కృషి చేశారు అని రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వివిధ శాఖల అధికారులు, మంత్రులను ఆదేశిస్తూ సమన్వయపరుస్తూ లోకేష్ అత్యద్భుత పనితీరు కనబరిచారని తెలుగుదేశం నాయకులతో పాటు అధికార యంత్రాంగం సైతం సర్టిఫికెట్లు ఇస్తూ వస్తోంది.అంటే రాష్ట్రంలో తుపాను నష్టాన్ని తగ్గించడంలో చంద్రబాబు కన్నా లోకేష్ మరింత సమర్థవంతంగా పనిచేశారు అనేది తెలుగుదేశం వాదన. ఇది వాదన కాదు లోకేష్ బాబుకు స్థాయికి నుంచి ఎలివేషన్లు ఇస్తూ ఆయన సామర్ధ్యాన్ని ప్రజల్లోకి మరింత గొప్పగా తీసుకువెళ్లడానికి టీడీపీతో పాటు దాని అనుబంధ మీడియా సోషల్ మీడియా వ్యవస్థలకు కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి. క్యాబినెట్లో కేవలం ఒక మంత్రిగా ఉన్న లోకేష్ అన్ని శాఖలను సమన్వయపరుస్తున్నారని వివిధ శాఖలపై అవగాహన పెంచుకొని ఆ మంత్రులను సైతం కమాండ్ చేస్తూ మార్గదర్శకునిగా నిలబడ్డారని టీడీపీ సోషల్ మీడియా విభాగం ఇప్పటికే ఎలివేషన్లు ఇస్తుంది. తెలుగుదేశం నాయకులు, మంత్రులు కూడా లోకేష్ సామర్థ్యాన్ని గొప్పగా చెబుతూ ఆయనకు తిరుగులేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు.లోకేష్ ప్రాక్టీస్ కోసం మోంథా సహాయ చర్యలు..వాస్తవానికి ప్రస్తుత ప్రభుత్వ కాలంలోనే అంటే 2029 ఎన్నికలలోపే లోకేష్‌ను ముఖ్యమంత్రిగా ప్రతిష్టించాలన్నది చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి అభీష్టంగా కనిపిస్తున్నది. దీనికి సపోర్టివ్ అన్నట్లుగా ఇప్పటికే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం లోకేష్ బాబుకు ఎనలేని ప్రాధాన్యమిస్తూ చంద్రబాబు సమక్షంలోనే చినబాబును ముఖ్యమంత్రిగా చేయాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే లోకేష్ సత్తాను, సమర్ధతను చాటుకోవడానికి ఈ తుఫాను సహాయ చర్యలు.. ముందస్తు ఏర్పాట్లు.. ప్రజలకు పునరావాస కల్పన.. విద్యుత్ పునరుద్ధరణ.. వంటి పనులన్నీ లోకేష్ సునాయాసంగా చేసేసినట్లుగా తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. అంటే ఈ విపత్తు.. లోకేష్‌కు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఉపయోగపడిందని టీడీపీ భావిస్తోంది. ఇక, ఆయన అన్ని పనులు చేసేయగలుగుతున్న నేపథ్యంలో లోకేష్‌ను ఇక ముఖ్యమంత్రిగా చేసేయాల్సిందే అన్నట్లుగా డిమాండ్లు వస్తున్నాయి. నెట్ ప్రాక్టీస్ బాగా చేసి బ్రహ్మాండమైన పనితీరు కనబరుస్తున్నందున ఆయన్ను ముఖ్యమంత్రిగా చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు.మరోవైపు.. మోంథా తుఫాను రైతులను, ఇతర ప్రజలను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిన లోకేష్‌కు మాత్రం ప్రయోజన కార్యగా మారిందని.. ఆయన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఆ ఉత్పాతం ఒక అవకాశంగా మారిందని తెలుగుదేశం నాయకులు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే లోకేషను ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయాల్సిందే అన్నట్లుగా ఎలివేషన్లు ఇస్తున్నారు. దీనికి జనసేనాని పవన్ కళ్యాణ్, కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఏమంటారో చూడాలి.-సిమ్మాదిరప్పన్న. -
నష్టపరిహారం కావాలంటే.. మీ ధాన్యం కొనం
సాక్షి, అమరావతి: విపత్తు సంభవించి పంట నష్టం వాటిల్లినప్పుడు మిగిలిన పంటను ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. మొలకలొచ్చినా.. రంగుమారినా.. నూకలైనా సరే మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ.. కూటమి ప్రభుత్వం మోంథా తుపాను వేళ పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులను నట్టేట ముంచేలా వ్యవహరిస్తోంది. కక్షగట్టినట్టుగా వారిపై కుట్రలకు పాల్పడుతోంది. ఉదారంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఓ వైపు ఇన్‌పుట్‌సబ్సిడీ ఏదోవిధంగా ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే.. ఇన్పుట్ సబ్సిడీ వంకతో పంటను కొనేందుకు మొహం చాటేస్తోంది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి దుస్థితి చూడలేదని రైతులు లబోదిబోమంటున్నారు. మోంథా తుపాను వల్ల కష్టాల్లో ఉండగా తమను గాలికి వదిలేసి సీఎం చంద్రబాబు లండన్ పర్యటనకు వెళ్లడం ఏమిటని అన్నదాతలు నిలదీస్తున్నారు.నిండా మునిగినా.. పంట నష్టపరిహారం ఇచ్చేందుకు సవాలక్ష నిబంధనలు విధిస్తున్న ప్రభుత్వం కనీసం ఒబ్బిడి చేసుకున్న పంటనైనా కనీస మద్దతు ధరకు కొనే పరిస్థితి లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని రైతులు వాపోతున్నారు. మీ పేరు తుది జాబితాలో చేర్చాలంటే.. మీ పంటను కొనే అవకాశం ఉండదని తెగేసి చెబుతుండటం రైతులను విస్మయానికి గురిచేస్తోంది. తుపాను మింగేయగా మిగిలిన పంటను మిల్లర్ల ఇచ్చే రేటు మీకు నచ్చితే అమ్ముకోవచ్చని, కొనుగోలు కేంద్రాల్లో కొనే అవకాశాలు లేవని అధికారులు తెగేసి చెబుతున్నారు. ముంపునకు గురైన పంటలో తేమ శాతం అధికంగా ఉంటుందని, రంగు మారి, మొలకలొచ్చే అవకాశం ఉండటంతో తాము మద్దతు ధర ఇచ్చే ప్రసక్తే లేదని మిల్లర్లు,దళారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులు గగ్గోలు పెడుతున్నారు. పుట్టెడు కష్టాల్లో ఉన్న తమను ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి దేశంలో ఎక్కడా లేని నిబంధనలు విధించడంపై వారంతా మండిపడుతున్నారు. అన్ని పంటలకూ ఇదే పరిస్థితి 18 నెలల్లో వివిధ వైపరీత్యాలు, కరువు కాటకాలకు సంబంధించి 5.50 లక్షల మంది రైతులకు రూ.595 కోట్ల మేర పంట నష్టపరిహారం చెల్లించలేదు. ఎన్నిసార్లు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం పైసా కూడా జమ చేయలేదు. ఈమాత్రం దానికి హడావుడి చేయడం తప్ప తమను ఆదుకున్న దాఖలాలు లేవని రైతులు వాపోతున్నారు. మోంథా కారణంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయినట్టు రైతులు చెబుతుండగా.. ప్రాథమిక అంచనా ప్రకారమే 3.75 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అంచనా వేసిన ప్రభుత్వం దాన్ని కూడా ఏ విధంగా కోత వేయాలా అని ఆలోచిస్తోంది. శుక్రవారం రాత్రికే పంట నష్టం అంచనాల సర్వే పూర్తి చేయాల్సి ఉండగా.. శనివారం సాయంత్రానికి 47 శాతమే సర్వే పూర్తయింది. ఉద్యాన పంటలకు తొలుత 62,595 ఎకరాలుగా పేర్కొనగా.. చివరికి 14,700 ఎకరాలకు పరిమితం చేశారు. తొలుత 24,570 మంది రైతులకు నష్టం వాటిల్లిందని పేర్కొన్న ప్రభుత్వం రైతుల సంఖ్యను 14,165 మందికి కుదించింది. వ్యవసాయ పంటలకు తొలుత 3.75 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు గుర్తించగా.. శనివారం సాయంత్రానికి 2.39 లక్షల ఎకరాల్లో పరిశీలన పూర్తి చేసి 1.02 లక్షల ఎకరాల్లోనే పంటలు 33 శాతానికిపైగా దెబ్బతిన్నట్టు అంచనా వేసినట్టుగా చెబుతున్నారు.24 గంటల్లో తుది జాబితాలు సాధ్యమేనా? ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలంటే ఎంత వేగంగా చేసినా కనీసం వారం లేదా 10 రోజులు సమయం పడుతుంది. మోంథా తుపాను గతనెల 28న తీరం దాటింది. కనీసం బృందాలు కూడా వేయకుండా ఆగమేఘాల మీద 29న ప్రభుత్వం మార్గదర్శకాలతో కూడిన సర్క్యులర్ జారీ చేసింది. 30వ తేదీ నుంచి తుది అంచనాల రూపకల్పన చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది. కనీసం వారం రోజులకు పైగా సమయం పట్టే ఈ జాబితాల రూపకల్పనకు కేవలం 24 గంటలు మాత్రమే ప్రభుత్వం గడువునిచ్చింది. 31వ తేదీలోగా పూర్తిచేసి నవంబర్ 1న తుది జాబితాలు పంపాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో అభ్యంతరాల స్వీకరణకు కనీసం ఒక్కరోజు కూడా గడువు ఇవ్వలేదు. దీంతో పంట నష్టం అంచనాల రూపకల్పన ప్రహసనంగా తయారైంది.పంట నష్టం అంచనాల్లో నిబంధనలకు పాతర ఐదేళ్లూ అండగా నిలిచినవైఎస్ జగన్ ప్రభుత్వం వరదలు, తుపానులు, అధిక వర్షాలు వంటి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు అడుగడుగునా అండగా నిలిచేది. విపత్తు వేళ నేనున్ననంటూ రైతులకు భరోసా కల్పించడమే కాకుండా.. నష్టపోయిన ప్రతి ఎకరాకు దెబ్బతిన్న ప్రతి రైతుకు అదే సీజన్ చివరిలో పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అణాపైసలతో సహా లెక్కగట్టి మరీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేవారు. పైగా ఎవరైనా మిగిలి పోయారేమోనని బూతద్దం పెట్టి మరీ వెతికి సాయం అందించేవారు. అంతకుముందు ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలతో సహా వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న 24.80 లక్షల మంది రైతులకు రూ.2,558.07 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని అందజేసింది. మరోవైపు పైసా భారం పడకుండా గత ప్రభుత్వం వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్ల బీమా పరిహారం అందించి సంపూర్ణంగా ఆదుకుంది. ఇలా ప్రతి సందర్భంలోనూ వైఎస్ జగన్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలిచింది. ఇలాంటి నిబంధనలు ఎప్పుడూ చూడలేదు పంట మొత్తం తుపాను దెబ్బకు నేలపాలైంది. రైతులు, కౌలు రైతుల పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ప్రభుత్వం జీవో నంబర్–1 ద్వారా నష్టపరిహారం అరకొరగా పెంచి ప్రతి రైతును ఆదుకుంటామని ప్రకటనలు చేస్తోంది. కానీ, క్షేత్రస్థాయిలో 33 శాతం పైన పంట నష్టపోయిన రైతుల పేర్లు రాస్తున్నారు. ఇది దారుణం. పైగా ఆ సర్వే నంబర్లలో ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేది లేదని చెప్పడం సిగ్గుచేటు. 33 శాతం నష్టపరిహారం రాస్తే మిగిలిన పంటను ఎక్కడ అమ్ముకోవాలి? అలవికాని నిబంధనలు పెట్టి రైతును నష్టాల ఊబిలోకి నెట్టేయడం దుర్మార్గం. ప్రభుత్వం ఉదారంగా రైతులను ఆదుకోవాలి – ఎం.హరిబాబు, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలురైతుల సంఘం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బీమా డబ్బులు అందాయి..వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతుల తరఫున పంటల బీమా చెల్లించడంతో మిచాంగ్ తుపాను వల్ల దెబ్బతిన్న నిమ్మ చెట్లకు రూ.4,500, ఎకరం పొలంలో వరినాట్లు నష్టపోయినందుకు రూ.4 వేలు మా ఖాతాల్లో జమ చేశారు. రైతుల పక్షాన పంటల బీమా నగదు చెల్లించి ఉంటే బాగుండేది. – వెన్నపూస రంగమ్మ, మహిళా రైతు, కల్యాణపురం, పొదలకూరు మండలం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాఈ కౌలు రైతు పేరు నంద్యాల రాంబాబు. ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన ఈయన 4 ఎకరాల్లో వరి వేశారు. ‘బ్యాంకులో బంగారం తాకట్టుపెట్టి రూ.1.62 లక్షలు అప్పు తెచ్చి పంట మీద పెట్టాను. తీరా పంట చేతికొచ్చే సమయంలో తుపాను దెబ్బ తీసింది. పంట పూర్తిగా నేలనంటేసింది. పెట్టుబడి చేతికి వచ్చేలా కనిపించడం లేదు. ఇప్పటివరకు అధికారులెరూ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. అంతా బాగుంటే 30ృ40 బస్తాల దిగుబడి వచ్చేది. పడిపోయిన పంటను మెషిన్‌తో కోస్తే 15 బస్తాలు కూడా రావు. పైగా నేలవాలిన పంటను కోయడానికి అధిక కిరాయి అడుగుతారు. ఎకరాకు 18 బస్తాలు కౌలు చెల్లించాలి’ అని రైతు రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కోసిన పంటను కొనుగోలు చేస్తారా అంటే అదీ కనిపించడం లేదని, రైతు సేవా కేంద్రానికి వెళ్లి అడిగితే నష్ట పరిహారం కోసం రాస్తే సంచులు ఇచ్చేది లేదని చెబుతున్నారని వాపోయారు. ఎన్యుమరేషన్లో పేరు రాస్తే.. మిగిలిన పంటను ఒబ్బిడి చేసుకున్నా ప్రభుత్వం కొనదట. బయట అమ్ముకోవాలని సలహా ఇస్తున్నారు. దళారులకు అమ్మితే ఆ వచ్చే నాలుగు డబ్బులు కూడా రావు. చేసిన అప్పులు ఎలా తీర్చాలి? భూ యజమానికి ఏ విధంగా కిస్తీ కట్టాలో తెలియడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు. -
ఉచిత పంటల బీమాతో రైతులకు శ్రీరామ రక్ష
సాక్షి, అమరావతి: మోంథా తుపాన్ మేనేజ్మెంట్లో సీఎం చంద్రబాబు మాటలు పిట్టల దొరని మైమరపిస్తున్నాయని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. రైతులకు శ్రీరామరక్షలా నిలిచే ఉచిత పంటల బీమాను రద్దు చేయడం.. ఆర్బీకేల నిర్వీర్యం.. ఈ –క్రాప్ వ్యవస్థ, ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధానాన్ని నీరుగార్చి రైతు వెన్ను విరగ్గొట్టడం బెటర్ మేనేజ్మెంట్ అవుతుందా? అని సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. తుపానులైనా.. వరదలైనా.. కరువైనా.. వైపరీత్యాల నుంచి రైతులను ఆదుకోవడంలో ప్లానింగ్ అంటే ఇదీ అని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసి భరోసాగా నిలిచిందని గుర్తుచేస్తూ శనివారం తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. » చంద్రబాబు గారూ.. తుపాను పరిస్థితులను గొప్పగా మేనేజ్మెంట్ చేశానంటూ మీకు మీరే గొప్పలు చెప్పుకోవడం పిట్టలదొర మాటల్లా ఉన్నాయి. తుపానైనా, వరదలైనా, కరువైనా.. అలాంటి వైపరీత్యాల వల్ల నష్టపోకుండా, రైతు కుటుంబాలకు శ్రీరామ రక్షగా, భద్రతగా నిలిచే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేయడం బెటర్ మేనేజ్మెంట్ అవుతుందా? మీరు అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని ఉద్దేశపూర్వకంగా రద్దు చేసి రైతుల గొంతు కోయడం వాస్తవం కాదా? ఇది మీ తప్పిదం కాదా? మోంథా తుపాను కారణంగా సుమారు 15 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. పంటల బీమాలేని ఇంత మంది రైతులకు ఇప్పుడు దిక్కెవరు? మరి మీది ఏరకంగా మంచి మేనేజ్మెంట్ అవుతుంది? » మా ప్రభుత్వ హయాంలో 84.8 లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా పరిధిలో ఉన్నారు. ఇందులో 54.55 లక్షల మంది రైతులు రూ.7,802 కోట్ల మేర పంట నష్ట పరిహారం అందుకున్నారన్నది వాస్తవం కాదా? ఇలాంటి విపత్తుల వేళ ‘ఉచిత పంటల బీమా’ రైతులకు శ్రీరామరక్ష కాలేదా? » ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తమకు తాముగా ప్రీమియం కట్టుకోవడంతో కేవలం 19 లక్షల మంది రైతులు మాత్రమే పంటల బీమా పరిధిలో ఉన్నారు. ఇక మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి? అయినా సరే మీరు అద్భుతంగా పని చేశానని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా? వీరందరికీ గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఈ–క్రాప్, ఉచిత పంటల బీమా జరిగి ఉంటే ఈ విపత్తు సమయంలో ఎంతో భరోసాగా ఉండేది కదా? » మీ 18 నెలల కాలంలో సుమారు 16 సార్లు ప్రతికూల వాతావరణం, వైపరీతాల్యలతో రైతులు నష్టపోయారు. రైతులకు ఇవ్వాల్సిన రూ.600 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని బకాయి పెట్టారు! ఒక్క పైసా కూడా పంట నష్ట పరిహారం కింద ఇవ్వలేదు. మరి మీరు చేసింది మంచి మేనేజ్మెంట్ ఎలా అవుతుంది? » ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఈ – క్రాప్ వ్యవస్థను, ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధానాన్ని నీరుగార్చారు. ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో పంటల పెట్టుబడికి తోడుగా నిలిచిన ‘రైతు భరోసా’ స్కీమ్‌ను మీరు రద్దు చేశారు. అన్నదాతా సుఖీభవ కింద ఏటా రూ.20,000 చొప్పున ఈ రెండేళ్లకు రూ.40,000 ఇవ్వాల్సి ఉండగా చివరకు కేవలం రూ.5,000 మాత్రమే ఇచ్చి రైతుల వెన్ను విరగ్గొట్టారు. ఇది మంచి ప్లానింగ్ అంటారా? మీకు ప్లానింగ్ ఉంటే ఇలా చేస్తారా? » తుపాను పరిస్థితులను మీరు గొప్పగా మేనేజ్ చేసి ఉంటే 8 మంది ఎందుకు చనిపోయారు? ఇంత దారుణమైన ప్లానింగ్ వల్ల చనిపోయినా, రైతులు మరణించినా మీలో ఏ కోశానా మంచి చేయాలన్న ఉద్దేశం కనబడదు. అన్నీ అబద్ధాలే. అన్నీ లేనిపోని గొప్పలు చెప్పుకోవడమే. ప్లానింగ్ అంటే ఇదీ..! » దశాబ్దాలుగా వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలకు పరిష్కారంగా మా ప్రభుత్వంలో విప్లవాత్మక నిర్ణయాలు! » దేశంలోనే తొలిసారిగా ఆర్బీకేల ఏర్పాటు. విత్తనం నుంచి పంట విక్రయం దాకా రైతులకు అండగా, వారి చేయిపట్టుకుని నడిపించే వ్యవస్థ. » ప్రతి గ్రామంలో అగ్రికల్చర్ అసిస్టెంట్, గ్రామ–వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో ఆర్బీకేలను మిళితం చేయడం. » దేశంలోనే తొలిసారిగా ఉచిత పంటల బీమాతో రైతుకు భరోసా. మళ్లీ సీజన్ వచ్చే నాటికి రైతుల చేతికి పంట నష్టపరిహారం. » ఏ సీజన్లో పంట నష్టం జరిగితే, ఆ సీజన్ ముగిసేలోగా రైతుకు ఇన్పుట్ సబ్సిడీ. » దేశంలోనే తొలిసారిగా రైతు సాగుచేసే ప్రతి పంటనూ ఈ–క్రాప్ చేయడం. పంట నష్టం జరిగితే శరవేగంగా ఎన్యుమరేషన్ పూర్తి చేసి ఈ–క్రాప్ డేటా ఆధారంగా రైతులను ఆదుకోవడం. » రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ద్వారా సీఎం యాప్ (కాంప్రహెన్షివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్, ప్రైస్, అండ్ ప్రొక్యూర్మెంట్)తో గిట్టుబాటు ధరలు రాని రైతులను ఆదుకోవడం. వెంటనే ఆర్బీకేల పరిధిలో పంటల కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలవడం. » ప్లానింగ్ అంటే ఇదీ చంద్రబాబూ! వీటన్నింటినీ మీరు పథకం ప్రకారం నాశనం చేశారు. మరి మీది మంచి మేనేజ్మెంట్ ఎలా అవుతుంది? మీది ముమ్మాటికీ ఇన్ సెన్సిట్ అండ్ ఇన్ కాంపిటెంట్ గవర్నెన్స్. మీది మంచి ప్లానింగ్, మంచి మేనేజ్మెంట్ అని చెప్పుకుంటున్నారంటే దాని అర్థం.. లేని దానికి గొప్పలు చెప్పుకోవడం, ఫోటో షూట్లు, పబ్లిసిటీ మాత్రమే!! -
రిలయన్స్ ఫౌండేషన్ కృషికి ప్రశంసలు
'మోంథా' తుఫాను సమయంలో బలహీన వర్గాల ప్రజలను రక్షించడంలో మరియు ఆర్థిక నష్టాన్ని తగ్గించడంలో రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) చేసిన కృషిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రశంసించారు.తుఫానులు, వరదలు, ఇతర ప్రమాదాల గురించి అప్రమత్తం చేసి, వారి ప్రాణాలను, జీవనోపాధిని రిలయన్స్ ఫౌండేషన్ కాపాడుతుంది. 'మోంథా' తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని సమీపిస్తున్న సమయంలో, తుఫాను తీరం దాటడానికి మూడు రోజుల ముందు, అంటే అక్టోబర్ 25 నుంచే, రాష్ట్ర మత్స్య, వ్యవసాయ శాఖలు, ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, INCOIS & IMDతో కలిసి రిలయన్స్ ఫౌండేషన్ సకాలంలో హెచ్చరిక సందేశాలను, జాగ్రత్త సలహాలను అందించింది. తుఫాను ప్రభావం తగ్గించడానికి కృషి చేసిన అన్ని సంస్థలను ముఖ్యమంత్రి అభినందించారు.తుఫాను సమయంలో తమ ప్రయత్నాలలో భాగంగా, రిలయన్స్ ఫౌండేషన్ 1.65 లక్షల మంది రైతులు & సముద్ర మత్స్యకారులను చేరుకుంది. వీరిలో అప్పటికే సముద్రంలో ఉన్నవారు కూడా ఉన్నారు. తుఫాను సమీపిస్తున్న తీరు, గాలి, సముద్ర పరిస్థితుల గురించి వారికి నిర్దిష్ట సమాచారం అందించింది. తుఫాను మార్గంలో ఉన్న మత్స్యకారులకు ఒడ్డుకు తిరిగి రావడానికి, వారి పడవలు, వలలు మరియు ఇతర ఆస్తులను భద్రపరచడానికి సహాయపడే లక్ష్యంగా మొబైల్ ఆధారిత సలహాలను అందించారు.రియల్ టైమ్ సమాచారాన్ని అందించడానికి 24/7 పనిచేసిన టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ అక్టోబర్ 26 - 28 మధ్య 600 పైగా కాల్స్‌కు స్పందించింది. భారతదేశం అంతటా గ్రామీణ సమాజాల సంక్షేమానికి కట్టుబడి ఉన్న రిలయన్స్ ఫౌండేషన్, ఒక దశాబ్దానికి పైగా, ప్రమాదాల సమయంలో ప్రాణ, జీవనోపాధి నష్టాన్ని నివారించడానికి కీలక సమాచారాన్ని వ్యాప్తి చేస్తోంది. -
పిట్టలదొరలా బాబు మాటలు.. ప్లానింగ్ అంటే మాది: వైఎస్ జగన్
మోంథా తుపాను నిర్వహణపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొట్టుకుంటున్న గప్పాలు మాములుగా ఉండడం లేదు. అయితే ఆ ప్రకటనలు పిట్టలదొరని మైమరపిస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబుగారు.. తుపాను పరిస్థితులను గొప్పగా మేనేజ్మెంట్ చేశానంటూ మీకు మీరుగా గొప్పలు చెప్పుకోవడం చూస్తుంటే, అవన్నీ పిట్టలదొర మాటల్లా ఉన్నాయి.తుపానైనా, వరదలైనా, కరువైనా... ఇలాంటి వైపరీత్యాల వల్ల నష్టపోకుండా రైతుల కుటుంబాలకు శ్రీరామ రక్షగా, భద్రతగా నిలిచే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దుచేయడం, బెటర్ మేనేజ్ మెంట్ అవుతుందా?.. మీరు అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని ఉద్దేశ పూర్వకంగా రద్దు చేసి, రైతుల గొంతు కోయడం వాస్తవం కాదా? ఇది మీ తప్పిదం కాదా?.. మోంథా తుపాను కారణంగా సుమారు 15 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. పంటల బీమాలేని ఇంతమంది రైతులకు ఇప్పుడు దిక్కెవరు? మరి మీది ఏరకంగా మంచి మేనేజ్ మెంట్ అవుతుంది?.. మా ప్రభుత్వ హయాంలో 84.8 లక్షలమంది రైతులు ఉచిత పంటల బీమా పరిధిలో ఉన్నారు. ఇందులో 54.55 లక్షలమంది రైతులు, రూ.7,802 కోట్లు పంట నష్ట పరిహారం అందుకున్నారన్నది వాస్తవం కాదా? ఇలాంటి విపత్తుల వేళ "ఉచిత పంటల బీమా” రైతులకు శ్రీరామ రక్ష కాలేదా?ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తమకు తాముగా ప్రీమియం కట్టుకోవడంతో కేవలం 19లక్షల మంది రైతులు మాత్రమే పంటల బీమా పరిధిలో ఉన్నారు. ఇక మిగిలిన రైతుల పరిస్థితి ఏంటి? అయినా సరే మీరు అద్భుతంగా పనిచేశానని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా? వీరందరికీ గతంలో, వైయస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నట్టుగా, అందరికీ ఇ-క్రాప్, అందరికీ ఉచిత పంటల బీమా జరిగి ఉంటే, ఈ విపత్తు సమయంలో వీరందరికీ ఎంతో భరోసాగా ఉండేది కదా?.. మీ 18 నెలల కాలంలో సుమారు 16 సార్లు ప్రతికూల వాతావరణం, వైపరీత్యాలతో రైతులు నష్టపోయారు. రైతులకు ఇవ్వాల్సిన రూ.600కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయి పెట్టారు? ఒక్కపైసా కూడా పంట నష్ట పరిహారం కింద ఇవ్వలేదు. మరి మీరు చేసింది మంచి మేనేజ్మెంట్ ఎలా అవుతుంది?.. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఇ-క్రాప్ వ్యవస్థను, ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధానాన్ని నీరుగార్చారు. ఉచిత పంటలబీమాను రద్దుచేశారు. గత వైయస్సార్ సీపీ ప్రభుత్వంలో పంట పెట్టుబడికి తోడుగా ఉండే "రైతు భరోసా” స్కీంను రద్దుచేసి, అన్నదాతా సుఖీభవ కింద ఏటా రూ.20,000 చొప్పున ఈ రెండేళ్లకు రూ.40,000 ఇవ్వాల్సి ఉండగా, చివరకు కేవలం రూ.5,000 మాత్రమే ఇచ్చి, రైతు వెన్ను విరగొట్టారు. ఇది మంచి ప్లానింగ్ అంటారా? మీకు ప్లానింగ్ ఉంటే ఇలా చేస్తారా? అంటూ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన. తుపాను పరిస్థితులను మీరు గొప్పగా మేనేజ్ చేసి ఉంటే 8 మంది ఎందుకు చనిపోయారు? ఇంత దారుణమైన ప్లానింగ్ వల్ల చనిపోయినా, ఇంత దారుణంగా రైతులు మరణించినా మీలో ఏ కోశానా మంచి చేయాలన్న ఉద్దేశం కనబడదు. అన్నీ అబద్ధాలే, అన్నీ లేని గొప్పలు చెప్పుకోవడమే.. తుపాను నిర్వహణపై బాబుగారివి పిట్టలదొర మాటలు!ఇది Insensitive and Incompetent Governance!Full details attached- https://t.co/h5EYnE97XX pic.twitter.com/rM42S9Ca4T— YS Jagan Mohan Reddy (@ysjagan) November 1, 2025అసలు ప్లానింగ్ అంటే మాదే..దశాబ్దాలుగా వ్యవసాయరంగంలో ఉన్న సమస్యలకు పరిష్కారంగా మా ప్రభుత్వంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. దేశంలోనే తొలిసారిగా ఆర్బీకేల ఏర్పాటు. విత్తనం నుంచి పంట విక్రయం దాకా రైతులకు అండగా, వారిని చేయిపట్టుకుని నడిపించే వ్యవస్థ తీసుకొచ్చాం. ప్రతి గ్రామంలో అగ్రికల్చర్ అసిస్టెంట్, గ్రామ-వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో ఆర్బీకేలను మిళితం చేశాం. దేశంలోనే తొలిసారిగా ఉచిత పంటల బీమాతో రైతుకు భరోసా. మళ్లీ సీజన్ వచ్చే నాటికి రైతుల చేతికి పంట నష్టపరిహారం అందించాం. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే, ఆ సీజన్ ముగిసేలోగా రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. .. దేశంలోనే తొలిసారిగా రైతు సాగుచేసే ప్రతి పంటనూ ఇ-క్రాప్ చేశాం. ఇ-క్రాప్ డేటా ఆధారంగా పంట నష్టం జరిగితే శరవేగంగా ఎన్యుమరేషన్ పూర్తిచేసి రైతులను ఆదుకున్నాం. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధితో, CMAPP (Comprehensive Monitoring of Agriculture, Price, and Procurement)తో గిట్టుబాటు ధరలు రాని రైతులను ఆదుకున్నాం. వెంటనే ఆర్బీకేల పరిధిలో పంటల కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలిచాం.చంద్రబాబుగారూ.. ప్లానింగ్ అంటే.. ఇదీ. వీటన్నింటినీ మీరు పథకం ప్రకారం నాశనం చేశారు. మరి మీది మంచి మేనేజ్మెంట్ ఎలా అవుతుంది? మీది ముమ్మాటికీ insensitive and incompetent Governance. మీరు మంచి ప్లానింగ్, మంచి మేనేజ్మెంట్ అని చెప్పుకుంటున్నారంటే దాని అర్థం లేనిదానికి గొప్పలు చెప్పుకోవడం, ఫొటో షూట్లు, పబ్లిసిటీ మాత్రమే అంటూ జగన్ ట్వీట్ చేశారు. -
అన్నం పెట్టే అన్నదాతను ఆదుకోవడంలో చంద్రబాబు నిర్లక్ష్యం
-
బాబు మామూలోడు కాదు.. తుఫాన్ ను ఏపీకి తప్పించి.. తెలంగాణకు మళ్లించిన ధీరుడు..!
-
ఎలివేషన్స్ సీఎం.. తుపాను దెబ్బ.. చేతులెత్తేసిన బాబు
-
వదలని వరద.. బురద
వరంగల్ అర్బన్/హన్మకొండ: సాక్షిప్రతినిధి, ఖమ్మం: అక్కన్నపేట(హుస్నాబాద్): డిండి: వరంగల్ నగరంలోని పలు కాలనీలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. వర్షం తగ్గి మూడు రోజులు గడిచినా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద నీరు వస్తుండటం వల్ల తాము ఏమీ చేయలేమని బల్దియా అధికారులు చేతులెత్తేయడం పట్ల కాలనీల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌లో మోంథా తుపానుతో 45 కాలనీలు నీట మునిగాయి. అందులో 39 కాలనీల్లో నీటి ఉధృతి పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో బాధితులు ఇళ్లల్లోకి చేరుకున్నారు. కానీ, ఇళ్లన్నీ బురదతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బురద మేటలను తొలగించి ఇళ్లను శుభ్రం చేసుకునే పనుల్లో నిమగ్నయ్యారు.హనుమకొండ పరిధిలోని వివేక్‌నగర్, అమరావతి నగర్, టీవీ టవర్ కాలనీ, కుడా కాలనీ, నందితా నగర్, రాంనగర్, రాజాజీ నగర్లో ఏ ఇంటిని చూసినా పేరుకు పోయిన ఒండ్రు మట్టిని తొలగిస్తూ కనిపించారు. విద్యార్థుల పుస్తకాలు, సర్టిఫికెట్లు బయట ఆరబెట్టారు. వరంగల్ ఎగువన ఉన్న చెరువులు మత్తళ్లు పోస్తుండటంతో వరద కొనసాగుతోంది. దీంతో హంటర్ రోడ్డులోని ఎన్టీఆర్ నగర్ కాలనీ, సంతోషిమాత కాలనీ, బృందవన కాలనీ, అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని శివనగర్, మైసయ్య నగర్, ఎన్ఎన్ నగర్, బీఆర్ నగర్ కాలనీల్లో ఇళ్లు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. సూమారు 300 కుటుంబాలు ఇంకా పునరావాస కేంద్రాల్లోనే ఉన్నాయి. వరద తాకిడికి నగరంలోని పలుచోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. హనుమకొండలోని 100 ఫీట్ల రోడ్డు గోపాల్పూర్ చెరువు నుంచి సమ్మయ్య నగర్ క్రాస్ వరకు పూర్తిగా పాడైంది. శాంతించిన మున్నేరు: మోంథా తుపాను కారణంగా ఖమ్మంలో ఉప్పొంగి ప్రవ హించిన మున్నేరు వాగు శుక్రవారం శాంతించింది. గురు వారం రాత్రి ఖమ్మం కాల్వొడ్డు సమీపాన 26 అడుగుల మేర ప్రవహించగా, శుక్రవారం 15 అడుగులకు తగ్గింది. దీంతో పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులు ఇళ్లకు చేరుకున్నారు. మున్నేరు పరీవాహకంలో ఖమ్మం నగరంలోని కాలనీలతోపాటు ఖమ్మంరూరల్ మండలం జలగం నగర్ లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది.బ్యాక్ వాటర్‌తో పలు కాలనీలు నిండిపోయాయి. మరోపక్క ఆకేరు నదికి భారీగా వరద చేరింది. గురువారం తిరుమలాయపాలెం మండలం రాకాసితండా వద్ద సీతారామ అక్విడక్ట్‌ను ఆనుకుని నది ప్రవహించింది. వరద తగ్గినా కాలనీల్లోని రోడ్లు, ఇళ్లలో బురద చేరటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుపాను కారణంగా ఖమ్మం జిల్లాలో వరి, పత్తితో పాటు ఇతర పంటలు దాదాపు 62,400 ఎకరాల్లో దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమి కంగా అంచనా వేశారు. అనధికారికంగా మరో 15 వేల ఎకరాలపై ప్రభావం చూపినట్లు సమాచారం.శ్రీశైలం హైవేపై బ్రిడ్జికి మరమ్మతునల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు సమీపంలో హైదరాబాద్ – శ్రీశైలం రహదారిపై కోతకు గురైన బ్రిడ్జి పునురుద్ధరణ పనులు శుక్రవారం కొనసాగాయి. వరద ప్రవాహం తగ్గటంతో అధికారులు రోడ్డు మరమ్మతు పనులను వేగవంతం చేశారు. ఈ మార్గం గుండా నాలుగు రోజుల నుంచి రాకపోకలు నిలిచిపోవడంతో హైదరాబాద్, దేవరకొండ, కల్వకుర్తి, శ్రీశైలం, మద్ది మడుగు, ఉమామహేశ్వరం, అచ్చంపేట, తెల్కపల్లి, నాగర్‌కర్నూల్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గల్లంతైన దంపతుల మృతదేహాలు లభ్యం‘అమ్మ, చెల్లితో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకొందామని భర్తతో కలిసి బైక్‌పై బయలుదేరి, సిద్దిపేట జి ల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లి శివారులో వా గు దాటుతుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయిన దంపతులు ప్రణయ్, కల్పన మృతదేహాలు శుక్రవారం ల భించాయి. దీంతో మృతదేహాల వద్ద బంధువులు, కు టుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. కల్పన పుట్టిన రోజే డేత్డేగా మారడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషా దాన్ని నింపింది. ఘటనపై ప్రణయ్ తండ్రి ఇసంపల్లి ప్ర భాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చాతరాజు ప్రశాంత్ తెలిపారు. -
అందని సాయంపై ఆగ్రహజ్వాల
మర్రిపాలెం(విశాఖ జిల్లా)పూసపాటిరేగ(విజయనగరం జిల్లా)/కాకినాడ రూరల్: మోంథా తుపాను బాధితులకు నష్టపరిహారం అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. దొడ్డిదారిన పచ్చచొక్కాలకు పరిహారాన్ని పరిమితం చేసింది. అసలైన బాధితులను మోసగించింది. పునరావాస కేంద్రాల్లో నిద్రించిన వారికే పరిహారం అంటూ సాకులు వెతికింది. వాస్తవానికి తుపాను సమయంలో బంధువుల ఇళ్లలో తలదాచుకోవాలని అధికారులు, సిబ్బందే సూచించి.. ఇప్పుడు పరిహారానికి ఎగనామం పెట్టడంపై బాధితులు భగ్గుమంటున్నారు. ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. దీంతో బాధితులకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యేలు మెల్లిగా జారుకుంటున్నారు. వాంబేకాలనీవాసుల ఆగ్రహం మోంథా తుపాను ప్రభావంతో విశాఖపట్నం 51వ వార్డు మాధవధార వాంబే కాలనీలో ఇళ్లు పెచ్చులూడిపోయాయి. తుపాను సమయంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు కాలనీలో ఇళ్లను పరిశీలించి బాధితులను మాధవధార మాధవస్వామి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లాలని సూచించారు. అయితే సిబ్బంది మాత్రం అవకాశం ఉన్నవారు బంధువుల ఇళ్లకు వెళ్లాలని చెప్పారు. ఆ సమయంలో అందరి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు తీసుకుని వారి పేర్లు కూడా నమోదు చేసుకున్నారు. పునరావాస కేంద్రానికి 60 కుటుంబాలు వెళ్లగా, మరికొందరు బంధువుల ఇళ్ల వద్ద తలదాచుకున్నారు. తీరా నష్టపరిహారం విషయానికి వచ్చేసరికి అధికారులు చాలామందికి ఎగనామం పెట్టారు. వాంబేకాలనీలో 80 కుటుంబాలు ఉండగా, శుక్రవారం మాధవధార ఆర్టీవో కార్యాలయం సమీపంలోని కార్యాచరణ ప్రణాళిక కార్యాలయం(పీ–4)లో జరిగిన పరిహారం పంపిణీ కార్యక్రమంలో 30 కుటుంబాలకు మాత్రమే నిత్యావసరాలతోపాటు రూ.3వేల నగదు అందించారు. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజును నిలదీశారు. ఎమ్మెల్యే వారికి నచ్చజెప్పే యత్నం చేయగా.. వారు వినలేదు. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు లక్ష్మి, పైడిపల్లి సత్యవతి, నాగమణి తదితరులు మాట్లాడుతూ తమకు తక్షణం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జనసేన ఎమ్మెల్యే నాగమాధవిపై బాధితుల ఆగ్రహం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవికి శుక్రవారం చేదు అనుభవం ఎదురయింది. మోంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు బియ్యం పంపిణీకి వచి్చన ఆమెను కోనాడ గ్రామ బాధితులు నిలదీశారు. గ్రామంలో 590 మత్స్యకార కుటుంబాలు ఉంటే కేవలం మత్స్యకార భరోసా అందిన 27 కుటుంబాలకే బియ్యం ఇవ్వడంపై ధ్వజ మెత్తారు. ఎమ్మెల్యేను నిలదీశారు. అందరికీ బియ్యం అందించాలని డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే బియ్యం పంపిణీ చేయకుండానే పోలీసుల సాయంతో గ్రామం నుంచి వెళ్లిపోయారు. అనంతరం కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డిని కలిసిన మత్స్యకార నాయకులు అందరికీ బియ్యం అందించాలని వినతిపత్రం అందించారు. గత ప్రభుత్వంలో వివక్ష లేకుండా సాయం పంపిణీ చేశారని వివరించారు. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యేకూ నిరసన సెగ కాకినాడ రూరల్ మండలం పోలవరం, సూర్యారావు పేట గ్రామాలలోని మత్స్యకారులకు శుక్రవారం బియ్యం పంపిణీ చేయడానికి వచ్చిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీని తుపాను బాధితులు నిలదీశారు. నేమాం గ్రామ పరిధిలోని సూర్యారావుపేటలో సుమారు 245 మత్స్యకార కుటుంబాలు ఉంటే కేవలం 48 కుటుంబాలనే నష్టపరిహారానికి ఎంపిక చేయడం తగదని నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకారుల్లో ఎక్కువ మంది టీడీపీ సానుభూతిపరులు ఉండడం గమనార్హం. దీంతో ఎమ్మెల్యే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అనంతరం తమ్మవరం గ్రామ పరిధిలోని పోలవరంలోనూ ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. గ్రామంలో 250 కుటుంబాలు ఉంటే 77 కుటుంబాలను ఎంపిక చేయడమేమిటని ప్రశ్నించారు. అందరికీ ఇస్తేనే తీసుకుంటామని సరుకులు తీసుకునేందుకు నిరాకరించారు. అలాగే సూర్యారావుపేటలో సులభ్ కాంప్లెక్స్ నిర్మించకపోవడంతో స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. -
మోంథా నష్టం రూ.5,244 కోట్లు
సాక్షి, అమరావతి: మోంథా తుపాను నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. 17 శాఖలు, రంగాలలో రూ.5,244 కోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొంది. పూర్తిస్థాయిలో వివరాలు వస్తే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ శుక్రవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఈ నివేదిక పంపారు. తక్షణ ఆర్థిక సాయం చేయాలని కోరారు. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉందని, 1.38 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోని 2.96 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు దెబ్బతిన్నాయని, 1.74 లక్షల మంది రైతులు రూ.829 కోట్ల వరకు నష్టపోయినట్లు వివరించారు. 249 మండలాల్లోని 1,434 గ్రామాలు, 48 పట్టణాలపై ప్రభావం ఉందని, 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర బృందాలను పంపాలని కోరారు. 12,215 హెక్టార్లలో రూ.40 కోట్ల విలువైన ఉద్యాన పంటలు దెబ్బతినగా 23,979 మంది రైతులకు నష్టం వాటిల్లిందని, ఆక్వారంగంలో 32 వేల ఎకరాల్లోని రూ.514 కోట్ల విలువైన పంటను రైతులు కోల్పోయారని తెలిపారు. 2,261 పశువులు మృతిచెందాయన్నారు. 2,817 విద్యుత్ స్తంభాలు నేలకొరగ్గా, 429 కి.మీ. మేర తీగలు తెగిపడ్డాయి. ఈ శాఖకు రూ.19 కోట్ల నష్టం జరిగింది. నీటి పారుదల శాఖకు రూ.234 కోట్ల మేర నష్టం కలిగింది. 23 జిల్లాలలోని 3,045 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అంగన్వాడీలు, పాఠశాలలు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, చేనేత మగ్గాలు అన్నీ కలిపి రూ.122 కోట్ల నష్టం వాటిల్లింది. బాగా దెబ్బతిన్న రోడ్లు.. మృతులు ముగ్గురు రోడ్లు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో నష్టం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. తుపానుతో ముగ్గురు చనిపోయారని వెల్లడించారు. 4,794 కి.మీ. మేర ఆర్అండ్బీ రోడ్లు, 311 కల్వర్టులు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయని, రూ.2,774 కోట్ల నష్టం వాటిల్లిందని వివరించారు. 18 జిల్లాల్లోని 862 కి.మీ. మేర పంచాయతీరాజ్ రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు పాడవడంతో రూ.454 కోట్ల నష్టం జరిగిందని, 48 పట్టణాల్లోని రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు ధ్వంసమయ్యాయని, వీటి పునరుద్ధరణకు రూ.109 కోట్లు కావాలని నివేదికలో వివరించారు. -
చేలో నీళ్లు.. రైతుకు కన్నీళ్లు
సాక్షి నెట్వర్క్: మోంథా తుపాను రాష్ట్రంలో రైతులను నిలువునా ముంచేసింది. వరి, మొక్కజొన్న, అరటి, పత్తి, తదితర పంటలకు, ఉద్యాన తోటలకు తీరని నష్టం వాటిల్లింది. ఎక్కడ చూసినా పడిపోయిన అరటి తోటలు, నేలకొరిగిన వరి పనలే దర్శనమిస్తున్నాయి. కూరగాయల పంటలు పూర్తి స్థాయిలో తుడిచి పెట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వర్ణనాతీతంగా మారింది. చేలను ముంచెత్తిన నీళ్లు ఇంకా బయటకు వెళ్లలేదు. ఫలితంగా పంట ఇంకా నీటిలోనే మురిగిపోతోంది. నీట మునిగిన, నేలకొరిగిన పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అధికారులు మెజారిటీ శాతం మునిగిన పంటను పూర్తిగా పరిశీలించిన పాపానపోలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ‘సాక్షి’ బృందం క్షేత్ర స్థాయిలో పంటల పరిస్థితిని పరిశీలించింది. తమకు జరిగిన నష్టంపై ప్రతి చోటా రైతులు ఏకరువు పెట్టారు. నేలకొరిగిన పంటను కాపాడుకోవడంలో భాగంగా పొలంలో ఉండిపోయిన నీటిని బయటకు పంపేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తూ రైతులు పలు చోట్ల కనిపించారు. పడిపోయిన వరి పంటను కట్టలు కట్టుకుంటున్నారు. అధికారులు వస్తే జరిగిన నష్టాన్ని చూపాలని ఆత్రంగా ఎదురు చూస్తూ కనిపించారు. కాగా, తుపాను ప్రభావం కంటే సర్కారు నిర్లక్ష్యంతోనే ఎక్కువ నష్టపోతున్నామని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర రైతాంగంలో ఆందోళన » శ్రీకాకుళం జిల్లాలో మోంథా తుపాను 23 మండలాలపై ప్రభావం చూపింది. 82 గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం నియోజకవర్గాల్లో ఎక్కువగా నష్టం జరగ్గా, మిగతా నియోజకవర్గాల్లో ఓ మాదిరి నష్టం సంభవించింది. ఇచ్ఛాపురం మండలంలోని రత్తకన్న, తులిగాం, ఇన్నేషుపేట, కోట»ొమ్మాళి మండలంలోని గుంజిలోవ తదితర గ్రామాల్లో రైతులు తమ పొలాల్లో చేరిన నీటిని బయటికి పంపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. » విశాఖ జిల్లాలో భీమిలి నియోజకవర్గంలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాలతోపాటు పెందుర్తి మండలంలోనూ తుపాను బీభత్సం సృష్టించింది. వరి మొదళ్లు కుళ్లిపోయాయి. మళ్లీ.. పంటని నిలబెట్టుకోవాలంటే.. నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాతే సాధ్యమవుతుందని రైతులు చెబుతున్నారు. అయితే.. వరద నీరు మొత్తం పోయేందుకు మరో 15 రోజుల సమయం పడుతుందని ఈలోగా.. పంట మొత్తం కుళ్లిపోతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. » పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం, సాలూరు రూరల్, పాచిపెంట, మక్కువ, బలిజిపేట, సీతానగరం, పాలకొండ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, భామిని తదితర మండలాల్లో వరి, పత్తి, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పాచిపెంట, కురుపాం, సాలూరు, కొమరాడ తదితర మండలాల్లో పత్తి పంట తడిసి ముద్దయ్యింది. » అనకాపల్లి జిల్లావ్యాప్తంగా 15,800 ఎకరాల్లో పంటలు నష్టపోతే... అధికారులు మాత్రం 2వేల ఎకరాలే చూపిస్తున్నారు. 13,800 ఎకరాల్లో వరి, 2వేల ఎకరాల్లో చెరకు, వెయ్యి ఎకరాల్లో బొప్పాయి, అపరాలు, కూరగాయలు, కొబ్బరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 60వేల ఎకరాల భవిష్యత్తు ప్రశ్నార్థకం! కాకినాడ జిల్లాలో ఏలేరు పొంగి ప్రవహిస్తూండటంతో సుమారు 60 వేల ఎకరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానంగా వరి, మిర్చి, పత్తి, దొండ తదితర పంటలు దెబ్బతిన్నాయి. పిఠాపురం, గొల్లప్రోలు, గోకవరం, పెద్దాపురం, సామర్లకోట, కరప, తాళ్లరేవు తదితర మండలాల పరిధిలోని పెనుగుదురు, నడకుదురు, వేములవాడ, వేలంగి, కొవ్వూరు, చెందుర్తి, చేబ్రోలు, పవర, పనసపాడు, సర్పవరంలో వరి పంట వెన్నుల వరకు నీట మునిగింది. పొలాల్లోని ముంపునీరు బయటకు వెళ్లే దారి లేక పంటను కాపాడుకునేందుకు కొన్నిచోట్ల రైతులు వరి దుబ్బులను కట్టలుగా కట్టి రోడ్డుపైకి తెచ్చి మాసూలు చేసుకుంటున్నారు. కేంద్రాలకు వచ్చిన వారికే పరిహారమట! డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రాథమిక అంచనా ప్రకారం 76,709 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. ఉద్యాన పంటలు 3,935 ఎకరాల్లో దెబ్బ తిన్నాయి. కేవలం సహాయ పునరావాస కేంద్రాలకు వచ్చిన వారికి మాత్రమే నగదు పరిహారం అందిస్తామని చెప్పడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. గోదారి జిల్లాల్లో గుండెకోత తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా పడిపోయిన అరటి తోటలు, నేలకొరిగిన వరి పనలే దర్శనమిస్తున్నాయి. కూరగాయల పంటలు పూర్తి స్థాయిలో తుడిచిపెట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వర్ణనాతీతంగా మారింది. జిల్లాలో తుపాను ప్రభావం 209 గ్రామాల్లో కినిపించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూరల్, వీరవాసరం, నరసాపురం రూరల్ పరిధిలోని తాడేరు, బేతపూడి, తుందుర్రు, కంశాల బేతపూడి, మత్స్యపురిలో వరి పంట వెన్నుల వరకు నీట మునిగిపోయి ఉంది. ముంపునీరు లాగక పొట్టలు కుళ్లిపోయి ధాన్యం తాలుగా మారిపోతూ, వెన్నులు ఎండిపోతున్న పరిస్థితులు కనిపించాయి. ఈ ప్రాంతంలోని తొక్కోడి డ్రెయిన్‌లోని పూడిక ముంపు నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉండటంతో పొలాల్లోకి నీరు ఎగదన్నుతోంది. కొన్నిచోట్ల రైతులు ఇంజన్లు పెట్టి నీటిని తోడుకుంటున్నారు. కోతకు పనికిరాదన్న భావనతో తాడేరులో పశువుల కోసం పంటను కోసేస్తున్న పరిస్థితి కనిపించింది. » ఏలూరు జిల్లాలో మోంథా తుపాను అన్నదాతకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. వాస్తవానికి తుపాను నేపథ్యంలో జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ బలమైన ఈదురుగాలుల ప్రభావంతో వరి కంకులు నేలకొరిగాయి. మరోవైపు రోజుల తరబడి పంట చేల్లో నీళ్లు నిలిచిపోవడంతో కొన్నిచోట్ల పంట కుళ్లిన పరిస్థితి. ‘సరిగ్గా ఇంకో 15 రోజులు ఆగితే కోతలు పూర్తయ్యేవి. కనీసం పెట్టుబడులైనా దక్కేవి. కోతలకు ముందు తుపాను విరుచుకుపడటంతో వరి కంకులు నేలకొరిగాయి. పర్యవసానంగా మళ్లీ ఎకరానికి రూ.20 వేలు పెట్టుబడి అనివార్యంగా మారిన పరిస్థితి’ అని రైతులు వాపోతున్నారు. కృష్ణ కృష్ణా.. ఆదుకునే వారేరీ? ఉమ్మడి కృష్ణా జిల్లాలో పంటలు నీటి పాలవ్వడంతో అరకొర పంటనైనా రక్షించుకుందామనే తాపత్రయంలో అన్నదాతలు ఉన్నారు. కంకిపాడు, పునాదిపాడు, ఉప్పలూరు, మంతెన గ్రామాల్లో రైతులు నేలవాలిన వరిపైరును దుబ్బులుగా కడుతూ మిగిలిన పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేల వాలిన వరి పైరును నిలగట్టేందుకు కూలీల కోసం చేతిలో చిల్లిగవ్వ లేక పలువురు రైతులు పంట చేను వైపు దీనంగా చూస్తున్న పరిస్థితులు కనిపించాయి. పొలాల్లో నిలిచిన నీరు పంట బోదెల్లోకి సైతం మళ్లక పోవటంతో పొలాల్లో ఉన్న వరి దుబ్బులను నిలగట్టి పంట నష్టాన్ని నివారించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకు కూలీల ఖర్చు అదనపు భారంగా మారింది. ఒక్కొక్కరికి రూ 330 చొప్పున కూలీ చెల్లిస్తూ వరి దుబ్బులను నిలగడుతున్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందన్న∙నమ్మకం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కదిలిస్తే కన్నీరై పారుతోంది » గుంటూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వరి, పత్తి, మిర్చి, అరటి, పసుపు, కూరగాయలు, పూలు, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. క్షేత్ర స్థాయిలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. బురదమయమైన పొలాలు, ఇంకా నీట నానుతున్న పంటలు, పంటను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న పాట్లు, ఇప్పటికే తెచ్చిన అప్పులకు తోడు పంటను కాపాడుకునేందుకు కొత్త అప్పుల కోసం పడే తిప్పలు, ఎరువుల కోసం అరువు కోసం దీనంగా వెతికే చూపులు.. ఇలాంటి దృశ్యాలు ఊరూరా కనిపిస్తున్నాయి. » భారీ వర్షాలకు బాపట్ల జిల్లా అతలాకుతలమైంది. వరి, పత్తి, మినుము, సోయాబీన్, మొక్కజొన్న, అరటి, బొప్పాయి, కూరగాయలు, ఆకుకూరల పంటలు నీటి పాలయ్యాయి. పర్చూరు వాగు, రొంపేరులు పొంగి పొర్లడంతో పర్చూరు, కారంచేడు, చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లో శుక్రవారం నాటికి 50 వేల ఎకరాల్లో వరి పంట నీటిలోనే ఉండిపోయింది. నల్లమడ డ్రైన్, ఈపూరుపాలెం స్రైట్ కట్, పేరలి డ్రైన్లు పొంగి పొర్లడంతో బాపట్ల పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాలు నీట మునిగాయి. ప్రజలు ఇప్పటికీ నీటిలో ఉన్న పొలాలను చూపించారు. » ప్రకాశం జిల్లాలో ఏ రైతును పలకరించినా కన్నీరు పెట్టుకుని, గద్గద స్వరంతో దీనగాధను వినిపిస్తున్నారు. ప్రధానంగా నష్టపోయిన పంటల్లో సింహ భాగం పత్తిదే. కొన్ని ప్రాంతాల్లో ఒక తీత పత్తిని తీయగా జిల్లా వ్యాప్తంగా 90 శాతం మంది రైతులు ఒక తీత కూడా తీయలేదు. తీద్దామని సన్నద్ధమయ్యే లోపు వరుసబెట్టి కురిసిన వర్షాలు, ఆపై మోంథా తుపాను అన్నదాత నెత్తిన పిడుగులా పడింది. వరి, పొగాకు, సజ్జ, మొక్కజొన్న, మినుము పంటలకు కూడా నష్టం వాటిల్లింది. నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన గోపతోటి శామ్యూల్ 50 ఎకరాల్లో వరి పంట సాగు చేశాడు. అంతా నీటిలో మునిగి పోయిందని, నాలుగు రోజులైనా పంట ఇంకా నీటిలోనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కురిచేడు మండలం గంగ దొనకొండ గ్రామానికి చెందిన కసిబిసి వెంకటేశ్వర్లదీ ఇదే పరిస్థితి. అయితే ఇతను 20 ఎకరాల్లో నల్ల బర్లీ పొగాకు సాగు చేయగా, పంట నీట మునిగింది. » శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వరి, మినుము, జొన్న, వేరుశనగ, తమలపాకు, అరటి, బొప్పాయి, పసుపు తదితర పంటలకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. ఆయా శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో ఇంత వరకు ఎన్యుమరేషన్ చేపట్టలేదని రైతులు చెబుతున్నారు. వరి పంట కోత దశ సమయంలో పూర్తిగా నీట మునిగి మొలకలెత్తాయి. గింజ ధాన్యం కూడా తీసుకునే పరిస్థితి లేకుండా పోయిందని కర్షకులు కంటతడ పెడుతున్నారు. » నంద్యాల జిల్లాను తుపాను అతలాకుతలం చేసింది. వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సగానికి సగం పంట తుడిచి పెట్టుకుపోయింది. ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో వరి, వేరుశనగ, ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. పరిహారం పరిహాసం! మోంథా తుపాను వల్ల కలిగిన నష్టంకన్నా, ప్రభుత్వం రైతులకు పెడుతున్న కష్టమే వారిని ఎక్కువగా బాధ పెడుతోంది. కళ్ల ముందు పంట నష్టపోయి పొలం గట్టున నీళ్లు నిండిన కళ్లతో నిలబడి తమను ప్రభుత్వం ఆదుకోకపోతుందా అనే ఆశతో రైతులు చూస్తుంటే.. అధికారులు అలా వచ్చి పైపైన చూసి.. అబ్బే ఇది పరిహారం చెల్లించాల్సిన నష్టం కాదు.. దీనికి ఏమాత్రం పరిహారం రాదన్నట్లు చులకనగా చూసి వెళ్లిపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెయ్యెత్తులో ఉన్న చెరుకు పంట నిలువునా నీట మునిగినా, అబ్బే ఇదొక నష్టమే కాదన్నట్లుగా అధికారులు చూస్తున్నారని వాపోతున్నారు. తుపాను పంట నష్టాన్ని లెక్కించే క్రమంలో అధికారులు ఒక ప్రామాణికతను నిర్ధారించారు. రైతు వేసిన మొత్తం పంటలో 30 శాతం నష్టం జరిగితేనే దానికి పరిహారం ఇవ్వదగిందిగా లెక్కలోకి వేస్తున్నారు. అంతకన్నా తక్కువ నష్టం జరిగితే పైసా కూడా పరిహారం రాదు. ఈ మేరకు ప్రభుత్వం దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి పంటల బీమా ప్రీమియం చెల్లించే బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకోవడంతో బీమా సంస్థల నుంచి ఏమాత్రం పరిహారం వచ్చే అవకాశం లేదు. దీంతో ప్రభుత్వం దయతలచి ఇచ్చే సాయం తప్ప, దర్జాగా రైతులకు దక్కే బీమా పరిహారం ఇప్పుడు దక్కకుండా పోయింది. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతుల తరఫున పంటల బీమా ప్రీమియం చెల్లించేది. దీంతో ఏదైనా విపత్తుల్లో పంటలకు నష్టం వస్తే సదరు బీమా సంస్థలు ఇన్సూరెన్స్ కింద పరిహారం చెల్లించేవి. ఈ క్రమంలో గత ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలోని మొత్తం 54.55 లక్షల మంది రైతులకు రూ.7,802 కోట్లు బీమా రూపంలో వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం బీమా చెల్లించకపోవడంతో కేవలం పంట రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే సదరు బ్యాంకులు బీమా ప్రీమియం చెల్లించడంతో కేవలం 19 లక్షల మందికి మాత్రమే అరకొరగా పరిహారం దక్కే అవకాశం ఉంది. ఈ లెక్కన మిగతా వారు పూర్తిగా నష్టపోయినట్లే అని అధికారులే స్పష్టంచేస్తున్నారు. పరిహారం వస్తుందో రాదో... మొక్కజొన్న పొత్తులు కోసి నూర్పిడికి సిద్ధంగా ఉంచాం. ఈలోగా వర్షం వచ్చి మొత్తం పొత్తులను తడిపేసింది. రంగుమారిపోయి నాణ్యత తగ్గిపోయాయి. వీటిని కొనుగోలు చేస్తారో లేదో తెలియడం లేదు. ఇప్పటివరకు జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. పంట నష్టానికి పరిహారం వస్తుందో రాదో తెలియదు. అంతా దైవా«దీనం. వేసిన పంటలు చేతికి వచ్చేవరకు నమ్మకంలేకపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం అంటేనే భయంగా ఉంది. – చందక నారాయణమ్మ, పెరిపి గ్రామం, చీపురుపల్లి మండలం, విజయనగరం జిల్లా పశువుల మేతగా అయినా పనికొస్తుందని.. ఏడు ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. ప్రస్తుతం పంట పొట్ట దశకు చేరింది. విత్తనం నుంచి దమ్ము, నాట్లు, ఎరువులు, పురుగు మందుల కోసం ఇప్పటికే ఎకరానికి రూ.20 వేలు వరకు ఖర్చయ్యింది. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో మాయదారి తుపాను వచ్చింది. వర్షాల వలన రోజుల తరబడి పొట్టల పైవరకు నీరు నిలిచిపోయింది. వరి వెన్నులు కుళ్లిపోతుండటంతో నీరు లాగగానే పైరు పడిపోతుంది. కంకులు తాలుగా మారిపోతాయి. పశువులకు మేతగా అయినా పనికొస్తుందని ఇప్పుడే కోసేస్తున్నాం – పెంటపాటి త్రిమూర్తులు, తాడేరు, భీమవరం రూరల్, ప.గోదావరి జిల్లా వ్యవసాయం అంటేనే వణుకు పుడుతోంది ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు ప్రకృతి రైతులను ఇబ్బంది పెడుతూ ఉంటే వ్యవసాయం చేయాలంటేనే వణుకు పుడుతోంది. పంట పండించే వరకు ఎరువుల కోసం పాట్లు పడవలసి వచ్చింది. చేలో వేద్దామంటే యూరియా కూడా దొరకలేదు. అదేదో గట్టెక్కామనుకుంటుంటే పంట వచ్చిన సమయంలో పొలాన్ని ముంపు నీరు ముంచేసింది. సొంత పొలం రెండు ఎకరాలు, తొమ్మిది ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాను. గింజ గట్టిపడుతున్న సమయంలో ముంపునకు గురై, నీటిలో నిండిపోయింది. రూ.10 వేలు అయినా చేతికొస్తుందో లేదో. – ఇంటి వెంకట్రావు, రైతు, వీకే రాయపురం, సామర్లకోట మండలం కౌలు రైతుకు ఏమీ లేవు దేవుడు మాన్యం రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నా. స్వర్ణ రకం సాగు చేశాను. ఇంకో 20 రోజుల్లో పంట చేతికివచ్చే తరుణంలో తుపాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు అంతా తారుమారైంది. కౌలురైతు కావడంతో ఎలాంటి సాయం దక్కదని ఆందోళనగా ఉంది. ఏ అధికారీ ఇప్పటి వరకు పొలం వైపు రాలేదు. – సీమల జానరాజు, చిన్న రైతు, పెదపాడు, ఏలూరు జిల్లా రైతు పరిస్థితి దయనీయం నాకు సెంటు పొలం లేదు. స్టూవర్టుపురం రెవెన్యూ పరిధిలోని 10 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాను. ఎకరాకు రూ.10 వేల చొప్పున ముందే రూ.లక్ష చెల్లించాను. ఇప్పటికీ పైర్లు నాట్లువేసి 70 రోజులు అయ్యింది. ఒక్కో ఎకరాకు రూ.30 వేల చొప్పున ఖర్చుచేశాను. 10 ఎకరాలకు రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టాను. నా పొలం మొత్తం నీటిలో మునిగింది. మాలాంటి రైతుల పరిస్థితి దయనీయం. – కుంచాల లక్ష్మారెడ్డి, బేతపూడి, బాపట్ల జిల్లా పెట్టుబడీ రాదు ఈ చిత్రంలో ఉన్న రైతు పేరు మద్దిపాటి హరే రామకృష్ణ. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు గ్రామంలో 7 ఎకరాల్లో వరి సాగు చేశారు. తుపాను ప్రభావంతో వీచిన భారీ ఈదురుగాలులు, వర్షాలకు వరి పంట తుడిచిపెట్టుకుపోయింది. 7 ఎకరాల్లో పంట నేల కొరిగింది. ఇప్పటికే పంట సాగుకు ఎకరానికి రూ.30 వేలు చొప్పున రూ.2.50 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టారు. వరి గింజ గట్టిపడే దశకు వచ్చింది. మరికొన్ని రోజుల్లో కోతలకు సిద్ధమవుతుండగా ప్రకృతి కన్నెర్ర చేసింది. తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పంట మొత్తం నేలకొరిగింది. ప్రస్తుతం ఆ వరి పనలు కట్టేందుకు ఎకరానికి మరో రూ.10 వేలు వెచ్చించాల్సి వస్తోంది. మరో రూ.70 వేలు అదనపు భారం పడుతోంది. దీంతోపాటు ఎకరానికి 40 బస్తాల ధాన్యం దిగుబడి అందుతుందని భావిస్తే.. ప్రస్తుతం 20 నుంచి 25 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు రైతు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రతి రోజూ 20 మంది కూలీలకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున కూలి ఇచ్చి పనలు కట్టిస్తున్నారు. మొక్క బతుకుతుందో లేదో.. ఈ రైతు పేరు చాగంరెడ్డి రామకోటి రెడ్డి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు గ్రామానికి చెందిన ఈ రైతు ఈ ఏడాది తొమ్మిది ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశాడు. మొక్క ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఈ దశలో తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పైరు నీట మునిగింది. ఒక రోజంతా కష్టపడి ఇంజిన్లతో పొలంలో నిలిచిన నీటిని బయటకు పంపాడు.రెండవ రోజు నేలవాలిన మొక్కలను పైకి లేపుతున్నారు. మూడవ రోజు బలం మందులు పిచికారీ చేశాడు. ఇప్పటి వరకు ఈ రైతుకు ఎకరాకు సుమారు రూ. 60వేల నుంచి రూ. 70 వేల వరకు ఖర్చు అయ్యింది. కౌలు అదనం. ఇప్పుడు ఆయిల్ ఇంజిన్లు, ఎరువుల ఖర్చు అదనం. ఇంతా చేసినా మొక్క బతుకుతుందో లేదో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. పడిపోయిన చేను కోసేస్తున్నాడు ఈ రైతు పేరు చప్పగడ్డి నాగేశ్వరరావు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం ఖండేపల్లి గ్రామం. 1.20 ఎకరాల్లో వరి పంట వేశాడు. ఆర్ఆర్ వరి రకం వేయడంతో త్వరగా పండేసింది. మరో పది రోజుల్లో కోత కోయాలనుకునేలోపే తుపాను దెబ్బతో పంట మొత్తం మునిగిపోయి నేలకొరిగింది. నిన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ వచ్చి చూసి ఫొటో తీసుకుని వెళ్ళిపోయింది. పరిహారం ఇస్తారో లేదో ఎవరూ చెప్పడం లేదు. నేలకొరిగిన పొలాన్ని కోసేస్తున్నాడు. కోసి ఎండ పెడితే ఏదో కొద్దిగానైనా ధాన్యం చేతికొస్తుందనే ఆశతో ఇలా చేస్తున్నాడు. పెట్టుబడి కూడా చేతికి రాదని, పొలాన్ని చూస్తే ఏడుపు వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆశలన్నీ వరదపాలుఈ రైతు పేరు మేర్నిడి గంగరాజు. కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామం. 8వ ఏట నుంచే వ్యవసాయం పనుల్లో ఉన్నాడు. రెండు ఎకరాలు సొంత పొలంతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నాడు. వాతావరణం అనుకూలించడంతో వరిచేలు ఈనిక పూర్తయి గింజ తోడుకునే దశకు చేరుకుంది. ఈ సమయంలో మోంథా తుపాను నట్టేట ముంచేసింది. మొత్తం ఐదు ఎకరాల్లో పంట నేలనంటేసింది. గింజ పాలు తోడుకునే దశలో ఉండడంతో పువ్వారం రాలిపోయింది. ఎకరాకు 45 నుంచి 50 బస్తాల వరకు దిగుబడి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ఆశలన్నీ వరదలో కొట్టుకుపోయాయని చెబుతున్నాడు. అంచనాలో సగం దిగుబడి కూడా రాదని వాపోతున్నాడు. -
ఎకరానికి రూ. 10 వేలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో మోంథా తుపాను వల్ల నష్టపోయిన రైతులు, ప్రజలను ఆదుకుంటామని, ఎవరూ అధైర్యపడవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో 12 జిల్లాల్లో తుపాను ప్రభావం ఉందని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇస్తామని ప్రకటించారు. వరదల్లో ఇల్లు మునిగిన వారికి రూ.15 వేలు, పూర్తిగా కూలిపోతే ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు.మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, వరంగల్ పశి్చమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్లు, అధికారులతో కలిసి నగరంలోని వరద ప్రభావిత కాలనీలు సమ్మయ్యనగర్, పోతననగర్, రంగంపేటలో పర్యటించారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి వరదలపై సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత 12 జిల్లాల కలెక్టర్లు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. తక్షణమే నివేదికలు ఇవ్వండి.. తుపాను ప్రభావంపై వెంటనే పూర్తిస్థాయి నివేదికలు అందించాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ‘రాష్ట్రంలో 12 జిల్లాల్లో మోంథా తుపాను ప్రభావం ఉంది. ఏడు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులు అక్కడి కలెక్టర్లతో సత్వరం సమీక్షలు నిర్వహించి నివేదికలు సిద్ధం చేయాలి. వరదలు తగ్గుముఖం పట్టినందున వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టాలి. చెత్తను తొలగించి, శానిటేషన్ చేయాలి. కలెక్టర్లు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు పంపాలి. వరదల వల్ల మరణించినవారి జాబితాలను పారదర్శకంగా ఇచ్చేలా పోలీసు శాఖ వెంటనే ఎఫ్ఐఆర్లు నమోదుచేసి నివేదికలు అందించాలి.మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం ఇస్తాం. వరదల వల్ల మేకలు, గొర్రెలు మృతి చెందితే రూ.5 వేలు, పెద్ద పశువులు మృత్యువాత పడితే రూ.50 వేలు ఇచ్చేలా పశుసంవర్ధక శాఖ నివేదికలు పంపాలి. పత్తి, వరి చేతికి వచ్చే ముందు నష్టం జరిగితే ఎకరానికి రూ.10 వేలు ఇస్తాం. నీట మునిగిన పంటతోపాటు ఇసుక మేటలు వేసిన ప్రాంతాల బాధిత రైతులకు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా అవసరాన్ని బట్టి రూ.లక్ష వరకు సాయం చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు అంచనాలు తయారు చేయాలి. ఇల్లు మునిగినవారికి రూ.15 వేలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి.వరదలకు ఇళ్లు కూలి నిరాశ్రయులైన వారికి ప్రత్యేక కోటా కింద ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేయాలి. అర్హులకు ప్రభుత్వ స్థలంలో ఇంటి పట్టాలు ఇచ్చే అంశంపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలి. వరద ప్రాంతాలపై అన్ని జిల్లాల నుంచి నివేదికలు వచ్చాక మరోసారి సమీక్ష నిర్వహిస్తాం’అని సీఎం తెలిపారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి జిల్లా కలెక్టర్లు, అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిస్థితిని అంచనా వేయాలని సీఎం ఆదేశించారు. వార్షిక నివేదికలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతోపాటు ఎన్ని క్షేత్రస్థాయి పర్యటనలు చేశారన్న వివరాలు కూడా చూస్తామని చెప్పారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించేలా స్పెషల్ చీఫ్ సెక్రెటరీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై నిర్లక్ష్యం వల్లే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావటంలేదని అన్నారు.ఈ విషయంలో పారదర్శకత లోపం కనిపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బాగా పనిచేసేవారికి ప్రభుత్వం నుంచి ప్రశంసలు కూడా ఉంటాయని తెలిపారు. వరదలపై వెంటనే పూర్తి నివేదికలు పంపిస్తే కేంద్ర ప్రభుత్వానికి పరిహారం కోసం పంపుతామని, ఇందు కోసం ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. వరద నీటి నిర్వహణపై నీటిపారుదల శాఖ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయం లేక సమస్యలు పెరుగుతున్నాయని అసహనం వ్యక్తంచేశారు. అన్ని శాఖలు ఇరిగేషన్ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. నాలాల కబ్జాదారులపై ఉక్కుపాదం.. వరంగల్ నగరంలో నాలాల నిర్వహణ సరిగా లేకపోవటం వల్లే తరచూ వరదలు వస్తున్నాయని సీఎం అన్నారు. చెరువులోకి వెళ్లే నాలాలు కబ్జాకు గురైతే ఆ కబ్జాలను తప్పక తొలగించాలని ఆదేశించారు. ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని, పదిమంది కోసం పదివేల ఇళ్లు నీట మునుగుతున్నాయని అన్నారు. జీవితకాలం కష్టపడి సంపాందించుకున్న ఇంటి సామగ్రి, పిల్లల సరి్టఫికెట్లు వంటి కీలక వస్తువులు నీటి పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. నాలాల కబ్జాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అధికారుల కమిటీ వేయాలని ఆదేశించారు. కాలనీవాసుల గోడు విన్న సీఎంసమ్మయ్యనగర్, పోతననగర్, రంగంపేట కాలనీల్లో పర్యటించిన సీఎం.. బాధితులతో మాట్లాడారు. బాధితులు సీఎంకు తమ సమస్యలు ఏకరువు పెట్టగా.. ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం వరద నష్టంపై హనుమకొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫొటోల ఎగ్జిబిషన్ పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులతో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, కేఆర్ నాగరాజు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తదితరులు పాల్గొన్నారు. -
కల్తీ నెయ్యిపై మరో డ్రామా.. తుఫాను నష్టంపై బాబు డైవర్షన్
-
అది నేనే కనిపెట్టా తమ్ముళ్లూ.. తుఫాను సహాయక చర్యలపై అబద్దాలు
-
మోంథా తుఫాన్ కు ఎంత ధైర్యం.. బాబు గారు సీఎంగా ఉంటే వస్తదా?
-
పరామర్శ కాదు.. డ్రామా.. పవన్ పై మహిళా రైతుల ఆగ్రహం
-
అదిరిందయ్యా చంద్రం.. పట్టిందయ్యా దరిద్రం
-
24 గంటల ముందు వచ్చారు.. 48 గంటల్లో వెళ్లిపోయారు
-
ఎంతటి విపత్తు వచ్చినా ఆదుకోవాలి
సాక్షి, హైదరాబాద్: మోంథా తుపాను ప్రభావిత జిల్లాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, ఆ జిల్లాల్లోని ఉద్యోగుల సెలవులు రద్దు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఎంతటి విపత్తు వచ్చినా ప్రజలను ఆదుకునేందుకు జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఉద్యోగులు, అధికారులు, ఇన్చార్జి మంత్రులు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఉండాలని నిర్దేశించారు.వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, ముంపు గ్రామాలు, కాలనీల్లో ఉంటున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తగిన సహాయం అందించాలని చెప్పారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వానల వల్ల ప్రధానంగా వరి, పత్తి పంటకు నష్టం వాటిల్లిందని మంత్రులు, కలెక్టర్లు సీఎం దృష్టికి తెచ్చారు. ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలతోపాటు, హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద నష్టం ఎక్కువగా ఉందని అంచనాకు వచ్చారు. కొనుగోళ్లపై రోజూ నివేదికలు వరి కోతలు మొదలయ్యాయని, అనుకోని ఉపద్రవం ఏది వచ్చినా రైతులకు ఆవేదన మిగులుతుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘వర్షంతో చాలాచోట్ల ధాన్యం తడిసిపోయింది. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోవటం, రైతులు నష్టపోవటం ఆందోళన కలిగించింది. కళ్లాల్లో, ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే దగ్గర్లోని గోదాములు, మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలి.అవి అందుబాటులో లేని చోట దగ్గరలోని ఫంక్షన్ హాళ్లలో నిల్వ చేయాలి’అని రేవంత్ కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోళ్లకు సంబంధించి రోజూ సాయంత్రం రిపోర్టు తెప్పించుకోవాలని, రిపోర్ట్ ఇవ్వని వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. వర్షాలకు ధాన్యం తడవకుండా తగినన్ని టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలని, విధానపరమైన నిర్ణయాలు అవసరమైతే వెంటనే సివిల్ సప్లయిస్ కమిషనర్, సీఎస్ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 16 జిల్లాలపై తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిందని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయండి వరంగల్‌లో వరద బాధితులకు అందించే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, 24 గంటలు పరిస్థితిని పర్యవేక్షించేందుకు వీలుగా కలెక్టరేట్లో టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. రాష్ట్రస్థాయిలోనూ కమాండ్ కంట్రోల్ సెంటర్లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే హైదరాబాద్ నుంచి హైడ్రా బృందాలను, అవసరమైన సామగ్రిని పంపించాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. వెంటనే అవసరమైనన్ని పడవలను అక్కడికి పంపించాలని, వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఎస్డీఆర్ఎఫ్సిబ్బందిని తక్షణమే తరలించాలని చెప్పారు. ఎక్కడైనా వరదలో ఇళ్లపై కప్పులు, బంగ్లాలపై చిక్కుకున్న కుటుంబాలకు డ్రోన్ల ద్వారా తాగునీరు, ఆహార ప్యాకెట్లు సరఫరా చేయాలని ఆదేశించారు. శుక్రవారం ఉదయం వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. విద్యుత్‌శాఖ అప్రమత్తంగా ఉండాలి ఈదురు గాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా విద్యుత్‌శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చెప్పారు. రోడ్లపై బ్రిడ్జిలు, లో లెవల్ కాజ్‌వేల వద్ద, దెబ్బతిన్న రోడ్ల వద్ద ట్రాఫిక్‌ను మళ్లించాలని సూచించారు. అవసరమైనచోట అత్యవసర వైద్య సేవలు అందించేలా వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ కలెక్టర్లను అప్రమత్తం చేయాలని ప్రకృతి విపత్తుల శాఖను ఆదేశించారు. వర్షాలతో ఖమ్మం జిల్లాలో డీసీఎం వ్యాన్, డ్రైవర్ వాగులో కొట్టుకుపోవటం దురదృష్టకరమని సీఎం అన్నారు.ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, విపత్తుల నిర్వహణ విభాగం స్పెషల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ పాల్గొన్నారు. నిధుల సమస్య లేదు: డిప్యూటీ సీఎం భట్టి సహాయ, పునరావాస చర్యలు చేపట్టడానికి నిధుల సమస్య లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలెక్టర్లకు స్పష్టం చేశారు. కలెక్టర్లు ఎస్డీఆర్ఎఫ్ నిధులు వినియోగించుకుని 30 రోజుల్లోగా ర్యాటిఫై చేయాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేబినెట్ సహచరులు ముందుగానే హెచ్చరించడం వల్ల ప్రాణ, భారీ ఆస్తినష్టం జరగకుండా నివారించామని చెప్పారు. రాబోయే 24 గంటలు కలెక్టర్లు, ఇతర అధికారులు తుపాను మాన్యువల్ దగ్గర పెట్టుకొని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు అప్రమత్తమై పత్తి తడవకుండా టార్పాలిన్లు కప్పడం, గోదాముల్లోకి పత్తి పంటను షిఫ్ట్ చేయడంతో పంటను కాపాడుకోగలిగామన్నారు. విద్యుత్ శాఖ మొత్తం సహాయక చర్యల్లో నిమగ్నమైందని తెలిపారు. దెబ్బతిన్న సబ్స్టేషన్లను వెంటనే మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరా ఇబ్బంది లేకుండా చేసినట్లు చెప్పారు. -
రైతుకు భరోసా ఏదీ?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుకు భరోసా లేకుండా చేశారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోంథా తుపాను బీభత్సం సృష్టించిందని... 15 లక్షల ఎకరాల్లో పంటలపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమా పక్కాగా అమలయ్యేదని, రైతుల తరఫున బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించేదని, విపత్తుల కారణంగా పంట నష్టపోతే రైతులకు బీమా పరిహారం దక్కేదని గుర్తుచేశారు. కానీ, కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసిందని, ఇప్పుడు బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న రైతులకు మాత్రమే పంటల బీమా సదుపాయం ఉందని, మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలి? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. బాబు సృష్టించిన మరో విపత్తు ఇది అంటూ మండిపడ్డారు. మోంథా తుపాను నేపథ్యంలో గురువారం వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను కారణంగా సంభవించిన నష్టం, తర్వాత ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ఆరా తీశారు. తుపాను సమయంలో పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా నిలవడాన్ని ప్రశంసించారు. పంట నష్టం అంచనాల్లో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చూడాలని, ప్రభుత్వం ఏ తప్పిదానికి ప్రయత్నించినా గట్టిగా ప్రశ్నించాలని, ఆ తప్పిదాన్ని సవరించుకునేలా చొరవ చూపాలని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే... తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీ అందరికీ అభినందనలు మోంథా తుపాను వచ్చినప్పటి నుంచి, ప్రజలతో మమేకమవుతూ మీమీ ప్రాంతాల్లో అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. పార్టీ పిలుపు మేరకు మీరంతా చాలా చక్కగా, చురుగ్గా పనిచేస్తున్నారు. రైతులు, ప్రజలకు తోడుగా ఈ తుపానులో నిలిచారు. అందుకు మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. రైతులకు తోడుగా నిలవాలి మోంథా తుపాను బీభత్సం ఎక్కువే ఉంది. తీవ్రత తగ్గినా, రైతులపై చాలా ప్రభావం చూపింది. పంటలకు చాలా నష్టం జరిగింది. పొట్ట దశకొచ్చిన పంటలు భారీ వర్షాలకు నేలకొరిగాయి. దీంతో దిగుబడి దారుణంగా పడిపోయే పరిస్థితి ఏర్పడింది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు, అక్కడినుంచి రాయలసీమలోని కర్నూలు, కడప, అన్నమయ్య, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో కూడా మోంథా ప్రభావం ఉంది. 25 జిల్లాలు, 396 మండలాలు, 3,320 గ్రామాల పరిధిలో ప్రభావం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు తోడుగా నిలవాల్సి ఉంది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలపై మోంథా ప్రభావం చూపింది. ఇందులో 11 లక్షల ఎకరాల్లో వరి పంట ఉంది. 1.15 లక్షల ఎకరాల పత్తి, 1.15 లక్షల ఎకరాల వేరుశనగ, 2 లక్షల ఎకరాల మొక్కజొన్న, మరో 2 లక్షల ఎకరాల ఉద్యాన పంటల మీద మోంథా తుపాను ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో పంట నష్టం అంచనాల్లో రైతులకు తోడుగా నిలవాలి. పార్టీ నాయకులంతా రైతులకు అండగా ఉంటూ పనిచేయాలి. జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు ఇది ‘మ్యాన్ మేడ్ కెలామిటీ’ చంద్రబాబు హయాంలో నష్టపోయిన రైతుల పరిస్థితి చూడాల్సి ఉంది. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఈ–క్రాప్ వ్యవస్థ పక్కాగా ఉండేది. రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) సమర్థంగా పనిచేసేవి. వాటిలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఉండి సేవలందించేవారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు కలిసి పనిచేయడం వల్ల ప్రతి రైతుకు భరోసా దక్కేది. నాడు దాదాపు 85 లక్షల మంది రైతులకు దాదాపు 70 లక్షల ఎకరాల్లో ఉచిత పంటల బీమా అమలు చేశాం. కానీ, ఈ రోజు కేవలం 19 లక్షల ఎకరాలకు మాత్రమే, 19 లక్షల మంది రైతులకు మాత్రమే పంటల బీమా ఉంది. ఎవరైతే బ్యాంకులో రుణం తీసుకున్నారో వారికే పంటల బీమా సదుపాయం ఉంది. బ్యాంకర్లు రుణాలిచ్చినప్పుడు, ఇన్సూ్యరెన్స్ కట్టించారు కాబట్టి, కేవలం 19 లక్షల రైతులకు మాత్రమే బీమా ఉంది. మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలి? నాటి 85 లక్షల మంది రైతులు, 70 లక్షల ఎకరాలకు ఉచిత బీమా ఎక్కడ...? ఇప్పుడు కేవలం 19 లక్షల మంది రైతులకు, 19 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా ఎక్కడ...? దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ఏడాది ఖరీఫ్, రబీతో పాటు, ఈ ఏడాది కూడా ఏ సీజన్లోనూ ఏ పంటకూ ప్రభుత్వం బీమా ప్రీమియం కట్టలేదు. కాబట్టి ఇది కచ్చితంగా మ్యాన్ మేడ్ కెలామిటీ (మానవ తప్పిదం కారణంగా సంభవించిన విపత్తు). కాబట్టి మనం పార్టీపరంగా రైతులకు అండగా నిలవాలి. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ జీరో ఈ ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ కూడా లేదు. గత ఏడాది జూన్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ 16 నెలల్లో 16 సార్లు తీవ్ర విపత్తులు, తుపాన్లు ఉత్పన్నమయ్యాయి. వీటికి అదనంగా మోంథా తుపాను తోడైంది. దీంతో రైతుల నడ్డి విరిగింది. తుపాను వల్ల 8 మంది చనిపోతే చంద్రబాబు క్రెడిట్ తీసుకోవడం ఏంటి? ఏ ఒక్క మనిషి కూడా చనిపోకుండా ఉంటే క్రెడిట్ తీసుకున్నా అర్థం ఉంటుంది. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో అన్ని ప్రకృతి విపత్తుల్లో 16 మంది మాత్రమే చనిపోయారు. ఇక కూటమి పాలనలో ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందింది? ఎంతమంది రైతులకు ప్రభుత్వం తోడుగా నిలిచింది అని చూస్తే ఈ ప్రభుత్వం తరఫున అందిన సాయం గుండుసున్నా. చివరకు ఈ–క్రాప్ కూడా చేయకుండా రైతులను నిర్లక్ష్యం చేశారు. అయినా వారి లెక్కల ప్రకారం దాదాపు 5.5 లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపేణా దాదాపు రూ.600 కోట్లు సబ్సిడీ ఇవ్వాలి. అదికూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మిర్చి క్వింటాల్ రూ.11,781కు కొంటామన్నారు. కానీ, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. పొగాకు కొనుగోలు చేస్తామన్నారు. కానీ, ఎక్కడా ఆ పని చేయలేదు. మామిడి కిలో రూ.12కు కొంటామన్నారు. ఒక్క రైతుకూ మేలు చేయలేదు. ఉల్లి క్వింటాల్‌కు రూ.1,200కు కొంటామన్నారు. కానీ, అక్కడా చేతులెత్తేశారు. ఆ తర్వాత హెక్టారుకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పి, అది కూడా ఇవ్వకుండా మోసం చేశారు. రైతుల కష్టాలకు చంద్రబాబు బాధ్యుడు రాష్ట్రంలో ఈ–క్రాప్ లేదు. దాన్ని నీరుగార్చారు. ఆర్బీకేలను నిరీ్వర్యం చేశారు. ఉచిత పంటల బీమా ఎత్తేశారు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. దీంతో రైతులు చాలా నష్టపోయారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. అందుకే ఇదంతా మ్యాన్ మేడ్ కెలామిటీ. అదే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 54.55 లక్షల రైతులకు తోడుగా నిలుస్తూ రూ.7,802 కోట్లతో ఉచిత పంటల బీమా పరిహారం ఇప్పించాం. ప్రతి ఎకరాకు ఈ–క్రాప్ చేసి, నాడు ప్రభుత్వమే బీమా ప్రీమియం కట్టింది. రైతులపై ఎలాంటి భారం వేయలేదు. కానీ, ఈ ప్రభుత్వంలో అన్నీ మానవ తప్పిదాలే. అవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు తుపాను రూపంలోనూ చాలా నష్టం వస్తోంది. అన్నదాత సుఖీభవ కింద రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చి, చంద్రబాబు మోసం చేశాడు. అందుకే ఈ రోజు రైతులకు జరుగుతున్న నష్టం, వారి కష్టాలకు చంద్రబాబు బాధ్యుడు. ఆయన తప్పిదాల వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నష్టం అంచనా పక్కాగా జరిగేలా చూడాలి ఇప్పుడు రైతులకు మనం తోడుగా నిలవాలి. పంట నష్టం అంచనాలో అండగా ఉండాలి. నష్టం అంచనా పక్కాగా జరిగేలా చూడాలి. ఏ ఒక్క రైతుకూ నష్టం కలగకుండా, వారి తరపున నిలవాలి. మాట్లాడాలి. ప్రజలు కానీ, రైతులు కానీ, పారీ్టకి సంబంధించినవారు కానీ.. ఎవరు కూడా ఎక్కడా మిస్ కాకుండా, ప్రభుత్వం కావాలని తప్పు చేయాలని చూస్తే, వాటిని గట్టిగా ప్రశ్నించాలి. రైతులకు మంచి జరిగేలా చూడాలి. నష్టం అంచనాలో ఎక్కడా, ఏ లోపం లేకుండా పూర్తి చొరవ చూపాలి. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, వైవీ సుబ్బారెడ్డి, కారుమూరి వెంకటనాగేశ్వరరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు, పార్టీ జిల్లాల అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, మజ్జి శ్రీనివాసరావు (చిన్నశీను), శతృచర్ల పరీక్షిత్‌రాజు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, కేకే రాజు, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ముదునూరి ప్రసాదరాజు, దూలం నాగేశ్వరరావు, పేర్ని నాని, దేవినేని అవినాష్, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మేరుగు నాగార్జున, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కేవీ ఉషశ్రీ చరణ్, పోచిమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, ఆకెపాటి అమర్నాథ్రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్‌బాబు, అబ్బయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు, పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్‌కుమార్‌రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇంచార్జి చుండూరి రవి, పార్టీ నాయకులు ఆలూరు సాంబశివారెడ్డి, కడప మాజీ మేయర్ సురేష్, చల్లా మధుసూదన్ రెడ్డి తదితరులు కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.ఉద్యమంలా కోటి సంతకాల సేకరణ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం కొనసాగుతోంది. అందులో భాగంగా కోటి సంతకాల సేకరణ చేస్తున్నాం. ఈ కార్యక్రమం కింద నియోజకవర్గాల్లో నవంబరు 11న ర్యాలీలు నిర్వహించాలి. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 28నే అనుకున్నా, మోంథా తుపాను కారణంగా వాయిదా వేయడం జరిగింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పేద విద్యార్థులకు వైద్య విద్య చేరువ అవుతుంది. మరోవైపు ఆ ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయి. తద్వారా ప్రజలకు మంచి వైద్య సేవలు అందుతాయి. -
బాబు గప్పాలకు ఆకాశమే హద్దు!
సాక్షి, అమరావతి: చెప్పేవారు చంద్రబాబు అయితే వినేవాడు వెర్రి వెంగళప్ప.. సీఎం చంద్రబాబు గురువారం నిర్వహించిన మీడియా సమావేశం అచ్చం ఇలాగే సాగింది. వినేవాళ్లు ఏమనుకుంటారో అన్న స్పృహ కూడా లేకుండా ఆద్యంతం ఆయన గప్పాల ప్రవాహం సాగింది. ఈయనకు ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్ కూడా బుర్రకథలో మాదిరిగా తానాతందానా అన్నట్లుగా వంతపాడారు. ఆ వివరాలు..1. ఏ రిజర్వాయర్‌లోకి ఎంత నీరు వస్తుందో, ఎంత నీటిని విడుదల చేయాలో టెక్నాలజీతో ఇప్పుడు తెలుసుకున్నట్లు ముఖ్యమంత్రి గొప్పగా చెప్పారు. నిజానికి.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) దేశంలోని ముఖ్యమైన జలాశయాల ప్రత్యక్ష నిల్వ సామర్థ్యాన్ని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు బులెటిన్లు విడుదల చేస్తుంది. ఏ పరివాహక ప్రాంతంలో ఎంత వర్షం కురుస్తుందో.. తద్వారా ఏ ప్రాజెక్టుకు ఎంత నీరు వస్తుందనే విషయాన్ని రాష్ట్రాలకు చెప్పే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. కానీ, చంద్రబాబు మాత్రం ఇప్పుడే టెక్నాలజీ ద్వారా ఈ విషయాన్ని ఔపోశన పట్టినట్లు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అలాగే, ఎప్పటి నుంచో ప్రతీ రిజర్వాయర్‌కు నీటి పర్యవేక్షణ విధానం ఉంది. వరదలు, వర్షాల ఆధారంగా ఏ ప్రాజెక్టుకు ఎన్ని క్యూసెక్కులు వస్తున్నాయో చూసుకుని దాని కింద ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం సంవత్సరాల తరబడి కొనసాగుతోంది. కొత్తగా ఇప్పుడు టెక్నాలజీతో ఈ అంశాన్ని కనుగొన్నట్లు సీఎం చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా, అతిశయోక్తిగా ఉంది. 2. భూగర్భ జలాలను కూడా రియల్ టైమ్‌లో పర్యవేక్షించినట్లు చంద్రబాబు చెప్పారు. ఈ విషయంలో కూడా దశాబ్దాల తరబడి పర్యవేక్షణ విధానం కొనసాగుతోంది. సెన్సార్లు రియల్ టైమ్ మానిటరింగ్ ఎప్పటి నుంచో ఉంది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో ఇందుకు సంబంధించిన వివరాలు ఏ రోజుకా రోజు దొరుకుతాయి. కొత్తగా ఈ ప్రభుత్వంలో తెచ్చిందేమీ కాదు.3. అన్ని టెక్నాలజీలను అనుసంధానం చేయడంతో పాటు డ్రోన్స్, సీసీ కెమెరాల ద్వారా ఎక్కడ వరద నీరు ఉందో గుర్తించి ఆ నీటిని డ్రై చేశామని సీఎం చెప్పారు. ఇలాంటి రియల్ టైమ్ వ్యవస్థ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా లేదన్నారు. అయితే, డ్రోన్లు, సీసీ కెమెరాలు కూడా కొత్తగా వచ్చినవి కావు. ఎప్పటి నుంచో ఉన్నాయి. అన్ని ప్రభుత్వాలు వీటిని అవసరమైనప్పుడల్లా అవసరమైన మేరకు ఉపయోగిసూ్తనే ఉన్నాయి. 4. రాష్ట్రంలోని అన్ని కుటుంబాల్లో ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు జియో ట్యాగింగ్ చేశామన్నారు. నిజానికి.. ఈ విధానం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడో అమలుచేశారు. ఇళ్లకు గత ప్రభుత్వంలోనే జియో ట్యాగింగ్ చేశారు. చంద్రబాబు చెప్పినట్లు కొత్తగా వచ్చిన విధానమేమీ కాదు ఇది. 5. తుపానులు, వరదలకు సంబంధించి ఉత్తమ మాన్యువల్ రూపొందించినట్లు కూడా చంద్రబాబు గొప్పగా చెప్పారు. కరువు నియంత్రణకు బ్రిటీష్ కాలం నుంచే ఈ మాన్యువల్స్ ఉన్నాయన్నది ముఖ్యమంత్రికి తెలీదనుకోవాలా!?6. తుపాను కదలికలను గంట గంటకు టెక్నాలజీ ద్వారా పర్యవేక్షిస్తూ పౌరులకు 28 రకాల సూచనలతో మెసేజ్‌లు పంపుతూ అప్రమత్తం చేశామని ఐటీ శాఖ కార్యదర్శి కె. భాస్కర్ చెప్పారు. 5000 సచివాలయాల పరిధిలో జాగ్రత్తలు తీసుకుని ముందస్తు హెచ్చరికలను పౌరులకు జారీచేశామన్నారు. వాస్తవానికి.. ఫోన్లలో మెసేజ్‌లు పంపే విధానం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనూ కొనసాగింది. అప్పట్లో సచివాలయాల వారీగా ఇంటింటినీ మ్యాపింగ్ చేసి పౌరులకు అవసరమైన సమాచారాన్ని మెసేజ్‌ల రూపంలో పంపించేవారు. కానీ, ఇప్పుడే ఈ విధానం అమలుచేస్తున్నట్లు ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటోంది. 7. అవసరమైన వారికి మెడిసిన్స్ పంపించామన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేసి ప్రజలను ఆదుకునే సంప్రదాయం దశాబ్దాల కిందట నుంచి ఉంది. దీని ద్వారా ప్రజలు తమ ఇబ్బందులు ప్రభుత్వానికి చెప్పుకుని సాయం పొందడం ఇప్పుడు కొత్తేమీ కాదు.8. కాకినాడ దగ్గర తీరం దాటుతుందనుకుంటే 15 కిలోమీటర్ల తరువాత నర్సాపురం దగ్గర తీరం దాటిందని భాస్కర్ చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం బొక్కబోర్లా పడింది. కాకినాడలో కాకుండా అంతర్వేది వద్ద తుపాను తీరాన్ని దాటింది. అలాగే, వర్షం ఎక్కడ, ఎప్పుడు ఎంత పడుతుందో ముందస్తుగా చెప్పే విధానం ఎప్పటి నుంచో ఉంది. ఈ విషయంలోనూ ప్రభుత్వం అట్టర్‌ఫ్లాప్ అయింది. ఓ విధంగా మోంథా దాగుడుమూతలు ఆడిందని చెప్పి నవ్వులపాలయ్యారు.9. టెక్నాలజీతో వాహనాలను ట్రాకింగ్ చేశామని.. ఇదే తొలిసారన్నారు. ఇది కూడా ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే.. ఆర్టీసీ బస్సుల రాకపోకలను తెలుసుకునేందుకు ఆ సంస్థ తన అధికారిక యాప్‌లోనే ప్రయాణికులకు బస్సుల ట్రాకింగ్ ఆప్షన్ కల్పించింది. అలాగే, నేరాలకు సంబంధించి పోలీసులూ వాహనాలు ట్రాక్ చేస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. 10. మొబైల్, ఇంటెర్నెట్ కమ్యునికేషన్ వ్యవస్థను పక్కాగా చేశామన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటినుంచో అమల్లో ఉంటే సీఎం చంద్రబాబు, ఐటీ కార్యదర్శి భాస్కర్ ఇప్పుడు తామే కనిపెట్టి అమలుచేసినట్లు చెప్పుకోవడం నవ్వు పుట్టిస్తోంది. -
సంక్షోభాలు, తుపాన్లు వస్తే అమెరికా మనలా ఎదుర్కోలేదు
సాక్షి, అమరావతి: ఉపగ్రహ చిత్రాలతో మోంథా తుపాన్ పరిస్థితిని అంచనా వేశామని, భారీవర్షాలు, గాలుల తీవ్రతపై ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. అన్ని టెక్నాలజీలను అనుసంధానించి రియల్‌టైమ్ గవర్నెన్స్‌లో మోంథా కదలికలను పసిగట్టామని, తద్వారా వర్షాలు పడే గ్రామాలను ముందే గుర్తించామని తెలిపారు. కానీ, వర్షాలు అక్కడ కాకుండా వేరేచోట కురిశాయన్నారు. ఓ విధంగా మోంథా దాగుడుమూతలు ఆడిందన్నారు. తుపాన్‌ను టెక్నాలజీ సాయంతో ఎలా ఎదుర్కొన్నామనే అంశాన్ని గురువారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు వివరించారు. ‘‘మెరికాలో సంక్షోభం వస్తే మేనేజ్ చేయలేరు. తుపాన్లు వచ్చినా ఎదుర్కోలేరు. మనం 16 నెలల్లో టెక్నాలజీ వ్యవస్థను తయారు చేశాం. దానిని వినియోగించి అద్భుతంగా ఎదుర్కోగలిగాం. ఏ రిజర్వాయర్‌లో, ఏ చెరువులో ఎంత నీరుందో గుర్తించాం. ఎక్కడెక్కడ పెద్దఎత్తున ప్రవాహాలు వస్తాయో ఊహించి అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేశాం. మరణాలు, ఆస్తి నష్టం బాగా తగ్గించాం. వరద నీటితో పాటు పడిపోయిన చెట్లను వెంటనే తొలగించాం. గతంలో తుపాన్ ప్రభావం తగ్గిన వారం రోజుల వరకు కోలుకునే పరిస్థితి ఉండేది కాదు’’ అని వివరించారు. ‘‘మోంథా బీభత్సం సృష్టించింది. కాకినాడ దగ్గర ఊహిస్తే వేరేచోట తీరం దాటింది. ఇక్కడినుంచి తెలంగాణ వెళ్లింది. వరంగల్‌లో ఒకేసారి 43 సెంటీమీటర్లు వర్షం పడింది. రాష్ట్రంలో మోంథా కారణంగా రూ.5,265.51 కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించాం. పూర్తిస్థాయిలో అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపిస్తాం’’ అని తెలిపారు. పంటలకు రూ.829 కోట్లు, ఉద్యాన రంగంలో రూ.39 కోట్లు, సెరీకల్చర్‌కు రూ.65 కోట్లు, ఆక్వా రంగంలో రూ.1,270 కోట్లు, ఆర్‌అండ్‌బీకి రూ.2,079 కోట్లు, మున్సిపల్ శాఖలో రూ.109 కోట్లు, జల వనరుల విభాగంలో రూ.207 కోట్లు, పంచాయతీరాజ్ రూ.8 కోట్లు, విద్యుత్ శాఖ రూ.16 కోట్లు, పశుసంవర్ధక శాఖలో రూ.71 లక్షల నష్టం వాటిల్లిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 120 పశువులు చనిపోయాయని తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఎదురుచూసే వారి కోసం రూపొందించిన ‘నైపుణ్యం’ పోర్టల్ ఉద్యోగాల గేట్ వేగా ఉండాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రతి నెల, ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని ఆదేశించారు.వరి తినేవారు ఉండరు..టెక్నాలజీ వినియోగం ద్వారా ఆరోగ్య రంగంలో రూ.4, 5 వేల కోట్లు, సాగు నీటి ఎత్తిపోతల విద్యుత్ చార్జీల్లో రూ.8 వేల కోట్ల బడ్జెట్ తగ్గిస్తామని చంద్రబాబు తెలిపారు. ‘‘ఉపగ్రహం ద్వారా పంట ఉత్పత్తి అంచనా వేస్తాం. దానిప్రకారం మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంది. రైతులు ఖరీఫ్, రబీలోనూ వరి పంటనే వేస్తున్నారు. వరి తినేవారు ఉండరు. డిమాండ్ ఉన్న పంటలు వేస్తేనే లాభసాటి. ఈ ఖరీఫ్‌లో 37 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాం’’ అని పేర్కొన్నారు. -
ప్రియుడ్ని కాపాడబోయి.. కళ్లెదుటే జలసమాధై..
సాక్షి, నెట్వర్క్: మోంథా తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో వాగులు, వంకలు ఉప్పొంగటంతో ఆరుగురు మరణించారు. పలువురు గల్లంతయ్యారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పని నాగేంద్రం (58) బుధవారం సాయంత్రం హనుమకొండలో విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా గ్రామానికి వెళ్లే కల్వర్టు వద్ద వరదనీటిలో పడి చనిపోయాడు. వరంగల్ నగరంలోని ఎస్ఆర్ నగర్‌కు చెందిన అడపా కృష్ణమూర్తి అనే వృద్ధుడు వరదనీటిలో పడి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టులో కోల రామక్క (80) ఇంట్లో పడుకోగా వర్షానికి గోడ కూలి చనిపోయింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గట్టుకిందిపల్లెకు చెందిన పులి అనిల్ (30) ఖిలావరంగల్ సమీపం చింతల్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై బైక్‌పై వెళ్తుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. ప్రేమికుడిని కాపాడే ప్రయత్నంలో.. హైదరాబాద్ నుంచి బైక్‌పై వస్తున్న ఓ ప్రేమజంట జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలంలో వరదలో చిక్కుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన శ్రావ్య (19), రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నకర్తమేడేపల్లికి చెందిన బరిగెల శివకుమార్ కలిసి బైక్‌పై వెళ్తుండగా తిమ్మంపేట గ్రామ శివారులోని బోల్ల మత్తడి కల్వర్టు వద్ద ప్రమాదం జరిగింది. వరద ఉధృతికి శివకుమార్ బైక్‌తో సహా కొట్టుకుపోతుండగా శ్రావ్య అతన్ని కాపాడేందుకు వరదలోకి రావడంతో ఆమె కూడా కొట్టుకపోయింది.శివకుమార్ చెట్టుకొమ్మల సహాయంతో ప్రాణం కాపాడుకోగా, గల్లంతైన శ్రావ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. భీమదేవరపల్లి మండలానికి చెందిన ప్రణయ్ (28), కల్పన (24) దంపతులు బుధవారం బైక్‌పై సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు వెళ్తుండగా మోత్కులపల్లి వాగులో కొట్టుకుపోయారు. వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. ప్రస్తుతం కల్పన గర్భవతిగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు.ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జిల్లా కలెక్టర్ హైమావతికి ఫోన్ చేసి ఆరా తీశారు. దంపతుల బాధిత కుటుంబాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓదార్చారు. మహబూబాబాద్ మండలం రెడ్యాలకు చెందిన పులిగుజ్జు సంపత్ (30) జంపన్నవాగు (చిన్నవాగు) కల్వర్టుపై వరదలో కొట్టుకుపోయిన మరణించాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తిలో తన ఇంటిలో పడుకున్న గద్దల సూరమ్మ (58)పై గురువారం తెల్లవారుజామున గోడ కూలి పడడంతో చనిపోయింది. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన రాచ కృష్ణవేణి (45) తన భర్త ప్రభాకర్‌తో కలిసి గురువారం బైక్‌పై వెళ్తుండగా మజీద్‌పూర్– బాటసింగారం గ్రామాల మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న వరద కాల్వలో పడిపోయారు. స్థానికులు ప్రభాకర్‌ను కాపాడగా, కృష్ణవేణి నీట మునిగి మృతిచెందింది. హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని మల్లికుదుర్లలోని కోళ్ల ఫారాల్లో వర్షాలతో సుమారు 15 వేల కోళ్లు మృతి చెందాయి. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని సూరిపల్లి గ్రామానికి చెందిన బోళ్ల కుమారస్వామికి చెందిన 25 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. నాగర్‌కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ గ్రామ శివారులో పొలానికి వెళ్లిన రైతులు బుధవారం దుందుభి వాగు మధ్యలో చిక్కుకుపోయారు. తాడు సహాయంతో పోలీసు సిబ్బంది అవతలి ఒడ్డుకు చేరుకొని గురువారం రైతులకు ఆహారం అందజేశారు. వారు రెండు రోజులు అక్కడే ఉండనున్నారు. కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తడంతో మానకొండూర్ రూరల్ మండలం శ్రీనివాస్‌నగర్ శివారులో వాగు ఒడ్డున ఉన్న 16 వేల బాతులు కొట్టుకుపోయాయి. -
AP: క‘న్నీరే’ మిగిలింది
నేను కౌలు భూమి 20 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాను. రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. తీరా వరి కోతకు వచ్చి కోసుకునే సమయంలో తుపాను దెబ్బకు పదెకరాల్లో పంట నేలవాలిపోయింది. కొంత పంట నీట మునిగింది. నోటి కాడ కూడు లాగేసినట్టైంది. ప్రభుత్వం, అధికారులు నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలి. లేకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోతాం. – వడిశ మహేశ్వరరావు, రైతు, ధవళపేట, శ్రీకాకుళం ఎనిమిది ఎకరాల పొలంలో కేఎన్ఎం రకం వరి పంట సాగు చేశాం. రూ.4 లక్షల వరకు పెట్టుబడులు పెట్టి, నానా చాకిరి చేస్తే పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురవడం వల్ల మొత్తం నష్టపోయాం. నష్టపోయినట్లు అధికారులకు తెలిపినా ఇప్పటికీ పట్టించుకున్న నాథుడే లేడు. ఏ అధికారి రాలేదు. కనీసం నష్టపోయిన రైతుల నుంచి వివరాలైన తెలుసుకుంటే పరిహారం వస్తుందనే ఆశ ఉండేది. ఇప్పుడు ఆ ఆశ కూడా లేదు. – పెయ్యల శ్రీకాంత్, ఉప్పలపాడు, నెల్లూరు జిల్లా సాక్షి, అమరావతి: అన్నదాతకు కన్నీరే మిగిలింది. రెక్కల కష్టాన్ని మోంథా తుపాను తుడిచిపెట్టేసింది. ఏపుగా ఎదిగిన వరి కంకులు తలలు వాల్చాయి. కళ్లేదుటే కుళ్లిపోతున్నాయి. మురుగనీటి డ్రెయిన్లలో సకాలంలో పూడిక తీయకపోవడం వల్ల ముంపునీరు దిగే మార్గం లేక ఓ వైపు గోదావరి డెల్టా రైతులు గగ్గోలు పెడుతుంటే.. కృష్ణా డెల్టా పరిధిలో ముంపునీటిని మళ్లించేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. మరొక వైపు కాకినాడ జిల్లాలో ఏలేరు, సుద్దగడ్డ రిజర్వాయర్లు, బాపట్ల జిల్లాలో పర్చూరు వాగు పొంగి ప్రవహిస్తూ పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. అయినా సర్కారు పట్టించుకోవడం లేదు. మరొక వైపు ముంపు లేని ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు మొక్కుబడిగా సాగుతున్నాయి. పూర్తిగా ముంపునకు గురైన పంట చేల వైపు బృందాలు కన్నెత్తి చూడకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏడాదిగా పలు విపత్తుల బారిన పడిన సందర్భాల్లో పంట నష్టపోయిన తమకు పైసా పరిహారం కూడా అందలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులను తలపిస్తున్న చేలు పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. లక్షలాది ఎకరాల్లో వరి కంకులు నేలరాలాయి. చేలల్లో ముంపునీరు పోయే మార్గం లేక రైతులు తలలుబాదుకుంటున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చెరువులను తలపిస్తున్న పంట పొలాలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. డ్రెయినేజీ వ్యవస్థను కూటమి సర్కారు గాలికి వదిలేయడంతో డ్రెయిన్లు పూడిపోయి అధ్వానంగా మారాయి. దీంతో మోంథా ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నీటి ప్రవాహం సవ్యంగా సాగే పరిస్థితి లేకపోవడంతో నీరు పంట చేలను ముంచెత్తింది. దీనికితోడు అవుట్‌పాల్ స్లూయిస్సు, స్ట్రయిట్ కట్లు నిర్వహణ వైఫల్యం కూడా పంట పొలాల మునకకు కారణంగా కనిపిస్తోంది. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంకలో నేలమట్టమైన అరటి తోట పొంగి ప్రవహిస్తున్న ఏలేరు, సుద్దగడ్డ రిజర్వాయర్లు కాకినాడ జిల్లాలో ఏలేరు, సుద్దగడ్డ జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. ఏలేరులో ఇప్పటికే 22 వేల క్యూసెక్కుల నీరు చేరింది. కిందకు ఏడువేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో ఒకటి రెండ్రోజుల్లో గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లోని పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు. ఇప్పటికే పిఠాపురం బ్రాంచి కెనాల్ కింద 15 వేల ఎకరాలు ముంపునకు గురయ్యాయి. మరో 30వేల నుంచి 50వేల ఎకరాలు ముంపునకు గురవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని నరసాపురం, పాలకొల్లు, ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గాల్లో ముంపునకు గురైన వేలాది ఎకరాల్లోని పంటలను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతం, బాపట్లతోపాటు పలు జిల్లాల్లో పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు పంట చేలను ముంచెత్తుతున్నాయి. బాపట్ల జిల్లాలో మినుము, పత్తి, సోయాబీన్ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొక్కజొన్న పంటలు సగానికిపైగా దెబ్బతిన్నాయి. లంకల్లో అరటి, బొప్పాయి పంటలు తుపాను ధాటికి పూర్తిగా నేల మట్టమయ్యాయి. దీంతో రైతులు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. పంట నష్ట అంచనాలను పారదర్శకంగా పూర్తిచేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోతామని ఆవేదన చెందుతున్నారు.శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పాతదేవరాయపల్లిలో నేలవాలిన వరి మొలకెత్తిన దృశ్యం పంటంతా నీట మునిగిపోయిందినేను రెండు ఎకరాల్లో వరి పంట వేశాను. రూ.45 వేలు వరకు ఖర్చు చేశాను. పొట్ట దశలో వరి పంట ఉండగా తుపాన్ వల్ల పంటంతా నీట మునిగిపోయింది. నోటి కాడ కూడు లాగేసినట్టైంది. – పోతు ఈశ్వరరావు, చిన అప్పనపాలెం, బుచ్చెయ్యపేట మండలం, అనకాపల్లి జిల్లామొక్కజొన్న పొత్తులు తడిచిపోయాయి ఈ ఏడాది సుమారు 50 సెంట్లు విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేశా. పంట కంకులు (పొత్తులు) విరిచి నూర్పిడికి సిద్ధం చేశా. తుపాన్‌తో కంకులు తడిచిపోయాయి. మొలకలు వచ్చాయి. ప్రభుత్వం ఆదుకోకపోతే అప్పుల్లో కూరుకుపోతాం. – కత్తుల రాధ, జుమ్మువలస, విజయనగరం జిల్లానారు మడి కొట్టుకుపోయింది నాకు సిద్దిగుంటపాళెం సమీపంలో 3 ఎకరాల పొలం ఉంది. ఈ పొలాన్ని సాగు చేసే నిమిత్తం ఈ నెల 27న 10 సెంట్ల విస్తీర్ణంలో నారుమడి తయారు చేసి 90 కిలోల బిపీటీ విత్తనాలను చల్లుకున్నాను. తుఫాన్‌కు నారుమడి కొట్టుకుపోయింది. – కొక్కముళ్ళ పెంచలయ్య, నెల్లిపూడి, వాకాడు మండలం, తిరుపతి జిల్లా గుర్రపు డెక్కతో నీళ్లన్నీ చేలోనే.. తుపాన్‌తోపాటు కాలువల్లో గుర్రపుడెక్క పేరుకుపోవడం వల్ల చేలు నీటమునిగాయి. డెక్క సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదు. సమస్యను మంత్రి నిమ్మల రామానాయుడుకు వివరించినా ఫలితం లేదు. ఇప్పుడు తీరని నష్టం జరిగింది. – పిట్టా రత్నరాజు, ఆగర్రు, పాలకొల్లు మండలం, పశ్చిమగోదావరి జిల్లా పంట మొత్తం చేజారిపోయింది 8 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేశా. ఎకరానికి రూ.40 వేలు ఖర్చయింది. 105 బస్తాలు కౌలు ఇవ్వాలి. తుపాన్ వల్ల పంట మొత్తం దెబ్బతింది. తీవ్రంగా నష్టపోయాను. సర్కారు ఆదుకోవాలి. – గరువు శ్రీను, శివదేవుని చిక్కాల, పాలకొల్లు మండలం, పశ్చిమగోదావరి జిల్లామొక్కజొన్న దెబ్బతింది ఐదు ఎకరాల్లో మొక్కజొన్న వేస్తే అధిక వర్షాలకు రెండు ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. మిగిలిన మూడు ఎకరాల్లో పంట కోత కోసి ఆరబోస్తే తుఫాన్‌కు భారీ వర్షం కురిసి కల్లాల్లో ఆరబోసిన పొత్తులు తడిచిపోయింది. దీనిని ఎలా అమ్మాలో కూడా తెలియని దుస్థితి. ప్రభుత్వం స్పందించి తడిచిన పంటను కొనాలి. – సుబ్బన్న, రైతు, కరివేన, నంద్యాల జిల్లాతుపాను తుడిచిపెట్టేసింది గొడవర్రులో 60 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేశాను. ఎకరాకు రూ.30 వేలు పైగా పెట్టుబడి అయ్యింది. తుపాను కారణంగా మొత్తం వరి చేలు పూర్తిగా పడిపోయాయి. కంకులు నీటిలో నానుతున్నాయి. తాలు, తప్ప తప్ప మరేమీ చేతికి వచ్చేట్టు లేదు. తుపాను పూర్తిగా పంటను తుడిచేసింది. అధికారులు సమగ్రంగా నష్టం నమోదు చేసి ఆదుకోవాలి. – కురగంటి నాగేశ్వరరావు, కౌలురైతు, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణాజిల్లా మొక్కలు విరిగిపడితేనే పరిహారమట! 8 నెలల క్రితం బొప్పాయి మొక్కలు నాటుకున్నాను. ఆరు ఎకరాల్లో పంట సాగు చేసా. నిండు కాపుతో కోత దశలో ఉంది. తుఫాన్‌తో పంటంతా దెబ్బతింది. ఆరు ఎకరాలకు రూ.5 లక్షలు అప్పుచేసి పెట్టుబడి పెట్టా. ఒక్క రూపాయి వచ్చే పరిస్థితి లేదు. ఉద్యానవనశాఖ అధికారుల దృష్టికి విషయం తీసుకెళితే మొక్కలు గాలికి విరిగిపడితేనే పరిహారం వస్తుందంటున్నారు. ఇదెక్కడి విడ్డూరమో అర్థం కావడం లేదు. – దమ్మని చంద్రమోహన్, శింగరపల్లె, బేస్తవారిపేట మండలం, ప్రకాశం జిల్లాకౌలు రైతులను ఆదుకోవాలి నేను 22 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. పంట పూర్తిగా నేలకొరిగింది. ఎకరానికి రూ.30 వేల చొప్పన పెట్టుబడి పెట్టాను. సుమారు రూ.6.5 లక్షల వరకూ పంట నష్టం వచ్చింది. కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – యామసాని శివకుమార్, కౌలు రైతు, బిక్కవోలు, తూర్పు గోదావరి జిల్లావరి పంటకు మొలకలొచ్చాయి 10 కుంటల్లో వరి పంట సాగు చేశాను. రూ.20 వేలు ఖర్చు అయ్యింది. వరి పంట కోత దశకు వచ్చింది. 15 రోజులు తర్వాత కోత కోద్దామనుకున్నా. ఈలోగా వచ్చిన మొంథా తుఫాన్ కొంప ముంచింది. వరి పంట నేలవాలి మొలకలు వచ్చాయి. సర్కారు న్యాయం చేసి పరిహారం అందించాలి. – కుమార్‌స్వామి రెడ్డి, రైతు, టి.పుత్తూరు, తవణంపల్లె మండలం, చిత్తూరు జిల్లా తుపాను మా కొంప ముంచింది.. మాకు కాగుపాడు ఆయకట్టులో రెండున్నర ఎకరాల పొలం ఉంది. సొంతంగా సాగు చేశాం. వంద బస్తాలు అవ్వాల్సింది. 60 బస్తాలు కూడా అవ్వుతాదో లే§దో అర్థం కావడం లేదు. పైగా ఆ పంటను పోగుచేసేందుకు అదనపు ఖర్చులు చేయాల్సి వస్తుంది. కోత మిషన్ ఖర్చులు అదనంగా అవుతాయి. తుఫాన్ మా కొంపముంచింది. – గండికోట నాగయ్య, ఉంగుటూరు, ఏలూరు జిల్లా -
అన్నదాత విలవిల
సాక్షి, నెట్వర్క్: మోంథా తుపాను రాష్ట్రంలో అన్నదాతను నిండా ముంచింది. భారీ వర్షాలు, వరదలకు లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలతోపాటు సిద్దిపేట జిల్లాలోనూ దాదాపు 4.47 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. సవివరంగా పంట నష్టాన్ని అంచనా వేస్తే మరో రెండు లక్షల ఎకరాలు పెరగొచ్చని చెబుతున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం వరి పంట 2,82,379 ఎకరాలు, పత్తి 1,51,707 ఎకరాలు, మొక్కజొన్న 4,963 ఎకరాలు, మిరప 3,613 ఎకరాలు, పప్పుధాన్యాలు 1,228 ఎకరాలు, వేరుశనగ పంట 2,674 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. దాదాపు 2,53,033 రైతులు పంటలు నష్టపోయినట్లు చెబుతున్నారు. నాలుగున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టంకరీంనగర్ జిల్లాలో 4,47,864 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరి 2,82,379 ఎకరాల్లో, పత్తి 1,51,707, మొక్కజొన్న 4,963, మిర్చి 3,613, వేరుశనగ 2,674, పప్పుదినుసు పంటలు 1,228, ఉద్యానవన పంటలు 1,300 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. పెద్దపల్లి జిల్లాలో 196 మంది రైతులకు చెందిన 271 ఎకరాల్లో వరి, జగిత్యాల జిల్లాలో 19,128 ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా వేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ తెలిపారు. ఇందులో 17,982 ఎకరాల్లో వరి, 1146 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లిందని వివరించారు. నష్టం లక్ష ఎకరాలపైనే..ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మోంథా తుపాను రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. 46,299 మంది రైతులకు చెందిన 1,27,156 ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నల్లగొండ జిల్లాలో 30,359 మంది రైతులకు సంబంధించిన 61,511 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 310 గ్రామాల్లో 35,487 ఎకరాల్లో వరి, 25,919 ఎకరాల్లో పత్తి, 105 ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. సూర్యాపేట జిల్లాలో 21,107 మంది రైతులకు చెందిన 64,939 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఇందులో వరి 54,006 ఎకరాలు, పత్తి 10,933 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 54 గ్రామాల్లో 430 మంది రైతులకు చెందిన 706.30 ఎకరాల వరి పంట 33 శాతం వరకు దెబ్బతింది. నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నెల కావస్తున్నా ఇంతవరకు వేగంగా కొనుగోళ్లు సాగడం లేదు. జిల్లాలో 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ వానాకాలం సీజన్లో కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఇంతవరకు 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. వరంగల్ జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో నష్టంఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,29,228 మంది రైతులకు చెందిన దాదాపు 2 లక్షల ఎకరాల్లో వేసిన వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. ఒక్క వరంగల్ జిల్లాలోనే 80,500 మంది రైతులకు చెందిన 1,30,000 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. హనుమకొండ జిల్లాలో 34,820 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. జనగామ జిల్లాలో 25,796 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 5,500 ఎకరాల్లో నష్టంసంగారెడ్డి జిల్లాలో బుధవారం కురిసిన వర్షానికి సుమారు 5,500 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనావేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. నిర్మల్ జిల్లాలో సుమారు 250 ఎకరాల వరకు పత్తి, వరికి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. మంచిర్యాల జిల్లాలో వరి, పత్తి పంటలకు అధికంగా నష్టం జరిగింది. 3,351 ఎకరాల్లో నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆసిఫాబాద్ జిల్లాలో పత్తికి నష్టం వాటిల్లింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 36,970 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఖమ్మంలో 66 వేల ఎకరాల్లో పంట నష్టంఖమ్మం జిల్లాలో 43,104 మంది రైతులకు చెందిన 62,400 ఎకరాల్లో వరి, పత్తి, పప్పుధాన్యాలు, ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3,124 మంది రైతులకు చెందిన 4,452 ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయని గుర్తించారు. సిద్దిపేట జిల్లా పంట నష్టం వాటిల్లింది. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో వరద నీరు నాలుగు అడుగుల మేర పారటంతో ధాన్యం కొట్టుకుపోయింది. జిల్లాలో 88 మెట్రిక్ టన్నుల ధాన్యం వరదకు కొట్టుకపోయిందని గుర్తించారు.ఎకరాకు రూ.10 వేల పరిహారం: మంత్రి తుమ్మలమోంథా తుపాన్ కారణంగా ఇళ్లు, పశువులు, పంటలతో పాటు ఇతర ఆస్తులు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనాలు వచ్చాయని, కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రమే ఎకరాకు రూ.10 వేల పరిహారం చెల్లిస్తుందని మంత్రి ప్రకటించారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తుమ్మల తెలిపారు. తల్లడిల్లిన తారవ్వఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లెదుటే మురికి కాల్వలోకి కొట్టుకుపోవటంతో మహిళా రైతు తారవ్వ బోరున విలపించింది. హుస్నాబాద్ వ్య వసాయ మార్కెట్‌కు పది ట్రాక్టర్ల వడ్లను హుస్నాబా ద్ మండలం పోతారం (ఎస్) గ్రామానికి చెందిన కేడిక తారవ్వ తీసుకువచ్చింది. భారీ వర్షానికి దాన్యమంతా మురికి కాల్వలోకి కొట్టుకుపోయింది. మార్కెట్‌కు వచ్చిన కలెక్టర్ కాళ్ల మీద పడి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రాధేయపడింది. కష్టమంతా నీటి పాలు ఈమె పేరు నేనావత్ బుజ్జి, నల్లగొండ జిల్లా చందంపేట మండలం నక్కలగండి తండాలో తనకున్న ఐదెకరాలతోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగుచే సింది. పత్తి చేతికందే సమయంలో మోంథా తుపాన్ కారణంగా నీటిపాలైందని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. రూ.2.50 లక్షల వరకు తాను పెట్టిన పెట్టుబడి నష్టపోయానని, ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతోంది.అప్పే మిగిలిందిపది ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వరి సాగు చేశాను. పెట్టుబడి రూ.2.50 లక్షలు కాగా, కౌలు కోసం రూ.1.65 లక్షలు చెల్లించాల్సి ఉంది. అంతా బాగుంటే అప్పులు, పెట్టుబడి పోగా రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుందని అనుకున్నా. కానీ అకాల వర్షంతో వరి పంట మొత్తం నీరు నిలిచింది. మాయదారి వాన నా కడుపు కొట్టింది. – పచ్చిపాల రవి, సుర్దేపల్లి, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లాపంట నష్టపోయి.. రైతు ఆత్మహత్యలింగాపూర్ (ఆసిఫాబాద్): మోంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు పంట నష్టపోయి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. లింగాపూర్ మండలం సీతారాంనాయక్ తండాకు చెందిన జాదవ్ బలిరాం (59) ఎనిమిది ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న సాగు చేశాడు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో చేను చూసేందుకు వెళ్లాడు. భారీ వర్షానికి పంటలు దెబ్బతినడంతో అక్కడే పురుగుల మందు తాగాడు. గమనించిన గ్రామస్తులు సిర్పూర్(యూ) ఆస్పత్రికి.. అనంతరం పరిస్థితి విషమించడంతో ఉట్నూర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. -
Telangana: ఓరుగల్లు క‘న్నీరు’
సాక్షి, నెట్వర్క్: మోంథా తుపాను దెబ్బకు వరంగల్ నగరం కన్నీరు పెడుతోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కురిసిన కుంభవృష్టితో వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని 141 కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. గురువారం కూడా కాలనీలు, రహదారులపై మోకాలిలోతు నీళ్లు నిలిచి ఉండటంతో జనజీవనం స్తంభించింది. ఇళ్లలోకి వరద నీరు చేరి నిత్యావసరాలు, విలువైన వస్తువులన్నీ తడిసిపోవటంతో ప్రజలు ఆకలిదప్పులతో అలమటించే పరిస్థితి ఏర్పడింది. ముంపు బాధితులను డీఆర్ఎఫ్, ఎస్‌జీఆర్‌ఎఫ్, పీజీ ఎఫ్టీ బృందాలు పడవల సహాయంతో పునరావాస కేంద్రాలకు తరలించాయి. ఇళ్ల పైకప్పులపై తలదాచుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం అందించారు. గురువారం సాయంత్రానికి వరదనీరు తగ్గినా బురద ఉండడంతో దుర్వాసనతో ప్రజలకు తిప్పలు తప్పలేదు. ఎస్ఆర్ నగర్‌లోని ఓ ఇంట్లోకి వరద నీరు చేరడంతో అనారోగ్యానికి గురై మంచంలో ఉన్న వ్యక్తి నీటిలో పడి చనిపోయాడు. ప్రముఖుల పర్యటన: వరంగల్‌లోని ఎన్ఎన్ నగర్, బీఆర్ నగర్లో మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ సత్యశారద గురువారం పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. రామన్నపేటలో మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ అలంకార్ జంక్షన్లో వరదనీటి ప్రవాహ తీరును కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ పరిశీలించారు. నయీంనగర్ బ్రిడ్జి, జవహర్ కాలనీ, దేవరాజ్ కాలనీ, వడ్డెపల్లి శ్యామల గార్డెన్ ప్రాంతాల్లో బల్దియా కమిషనర్ పర్యటించారు. ఎంపీ కడియం కావ్య లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసానిచ్చారు. ఒక్కసారిగా తన్నుకొచ్చిన వరద: ఐనవోలు మండలం కొండపర్తి చెరువు కట్టకు గండిపడంతో ఆ నీళ్లంతా కొత్తపల్లి, భట్టుపల్లి చెరువు నుంచి నేరుగా బొందివాగు నాలా ద్వారా హంటర్ రోడ్డు పరిసరాలను ముంచెత్తింది. బంధం చెరువు, బెస్తం చెరువు, ఉర్సు రంగసముద్రం చెరువుల మత్తళ్లు పొంగి నగరాన్ని ముంచెత్తాయి. కొన్నిచోట్ల రోడ్లపైకి వచ్చిన నీళ్లలో యువకులు వలలు వేసి చేపలు పట్టారు. ఆక్రమణలే సమస్యకు కారణం.. వరంగల్ నగరం ఏటా వర్షాకాలంలో ముంపునకు గురవుతోంది. ముఖ్యంగా బెస్తం చెరువు, ఉర్సు రంగ సముద్రం, బంధం చెరువు, వడ్డెపల్లి చెరువు, గోపాల్పూర్ చెరువు, చిన్నవడ్డెపల్లి చెరువు, బొందివాగు నాలా, కట్టమల్లన్న నుంచి చిన్నవడ్డెపల్లికి వచ్చే నాలా, అగర్తాలా నాలా, సాకారాశి కుంట నాలా తదితర నీటి వనరులు అక్రమణకు గురికావడంవల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. సరైన మురుగు నీటి నిర్వహణ వ్యవస్థ లేకపోవడం కూడా ముంపునకు కారణమవుతోంది. రూ.100 కోట్లతో నయీంనగర్ నాలాను పటిష్టం చేయటంతో కొన్ని కాలనీలు వరద ముంపు నుంచి తప్పించుకున్నాయి. 2020 సెపె్టంబర్లో భారీ తుపాన్‌కు వరంగల్ నగరంలో వరద ముంచెత్తి ఏడుగురు వ్యక్తులు కొట్టుకుపోయారు. 171 కాలనీలు వారం రోజులపాటు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఐదేళ్ల తరువాత మోంథా తుపాను వరంగల్‌ను అతలాకుతలం చేసింది. నగరంలోని 141 కాలనీలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. నేడు సీఎం రేవంత్‌రెడ్డి ఏరియల్ సర్వే... నీట మునిగిన వరంగల్ మహానగరం సహా ఉమ్మడి జిల్లాలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అకాల వర్షం, వరదలపై ఉమ్మడి వరంగల్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ లో పర్యటిస్తానని తెలిపారు. భయం గుప్పిట్లోనే పరీవాహకం మోంథా తుపాన్ ప్రభావంతో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని కాల్వ ఒడ్డు వద్ద మున్నేటి వరద ప్రవాహం గురువారం సాయంత్రం 5 గంటలకు 25.80 అడుగుల మేర నమోదైంది. బుధవారం మధ్యాహ్నం నుంచి వర్షం లేకున్నా మున్నేరుకు వరద పెరుగుతుండడంతో పరీవాహక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వరద ఉధృతి దృష్ట్యా బుధవారం సాయంత్రం నుంచే కొందరిని పునరావాస కేంద్రాలకు తరలించారు. గురువారం వెంకటేశ్వరనగర్, పద్మావతినగర్, మోతీనగర్, పెద్దమ్మతల్లి గుడి వెనుక రోడ్డు, ధంసలాపురం కాలనీల్లోకి వరద నీరు చేరింది. ఖమ్మం నయాబజార్ కళాశాలకు 100 కుటుంబాలు, ధంసలాపురం పాఠశాలకు 30 కుటుంబాలను తరలించారు. ఖమ్మం–బోనకల్ రహదారిపై నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. ఐదుగురు మృతి.. పలువురు గల్లంతు మోంథా తుపాన్ ప్రభావంతో వాగులు, వంకలు ఉప్పొంగటంతో ముగ్గరు వ్యక్తులు మరణించారు. పలువురు గల్లంతయ్యారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పని నాగేంద్రం (58) బుధవారం సాయంత్రం హనుమకొండలో విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా గ్రామానికి వెళ్లే కల్వర్టు వద్ద వరదనీటిలో పడి చనిపోయాడు. వరంగల్ నగరంలోని ఎస్ఆర్ నగర్‌కు చెందిన అడపా కృష్ణమూర్తి అనే వృద్ధుడు వరదనీటిలో పడి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టులో కోల రామక్క (80) ఇంట్లో పడుకోగా వర్షానికి గోడ కూలి చనిపోయింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గట్టుకిందిపల్లెకు చెందిన పులి అనిల్ (30) ఖిలావరంగల్ సమీపం చింతల్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై బైక్‌పై వెళ్తుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. హైదరాబాద్ నుంచి బైక్‌పై వస్తున్న ఓ ప్రేమజంట జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలంలో వరదలో చిక్కుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన శ్రావ్య (19), రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నకర్తమేడేపల్లికి చెందిన బరిగెల శివకుమార్ కలిసి బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వరద ఉధృతికి శివకుమార్ బైక్‌తో సహా కొట్టుకుపోతుండగా శ్రావ్య అతన్ని కాపాడేందుకు ప్రయత్నించి వరదలో పడిపోయింది. శివకుమార్ చెట్టుకొమ్మల సహాయంతో ప్రాణం కాపాడుకోగా, గల్లంతైన శ్రావ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. భీమదేవరపల్లి మండలానికి చెందిన ప్రణయ్ (28), కల్పన (24) దంపతులు బుధవారం బైక్‌పై సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు వెళ్తుండగా మోత్కులపల్లి వాగులో కొట్టుకుపోయారు. వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. ప్రస్తుతం కల్పన గర్భవతిగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జిల్లా కలెక్టర్ హైమావతికి ఫోన్ చేసి ఆరా తీశారు. దంపతుల బాధిత కుటుంబాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓదార్చారు. మహబూబాబాద్ మండలం రెడ్యాలకు చెందిన పులిగుజ్జు సంపత్ (30) జంపన్నవాగు (చిన్నవాగు) కల్వర్టుపై వరదలో గల్లంతయ్యాడు. గురువారం గాలింపు చేపట్టగా వాగుకు కొంతదూరంలో సంపత్ మృతదేహం లభ్యమైంది. అదేవిధంగా హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తిలో తన ఇంటిలో పడుకున్న గద్దల సూరమ్మ (58)పై గురువారం తెల్లవారుజామున గోడ కూలి పడడంతో చనిపోయింది. హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని మల్లికుదుర్లలోని కోళ్ల ఫారాల్లో వర్షాలతో సుమారు 15 వేల కోళ్లు మృతి చెందాయి. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని సూరిపల్లి గ్రామానికి చెందిన బోళ్ల కుమారస్వామికి చెందిన 25 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. నాగర్‌కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ గ్రామ శివారులో పొలానికి వెళ్లిన రైతులు బుధవారం దుందుభి వాగు మధ్యలో చిక్కుకుపోయారు. తాడు సహాయంతో పోలీసు సిబ్బంది అవతలి ఒడ్డుకు చేరుకొని గురువారం రైతులకు ఆహారం అందజేశారు. వారు రెండు రోజులు అక్కడే ఉండనున్నారు. హైదరాబాద్ – శ్రీశైలం హైవేపై వాహనాల దారిమళ్లింపు నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టు కుడి భాగంలో నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ గ్రామ శివారులో ఉన్న అలుగు నీటి ప్రవాహం ధాటికి హైద్రాబాద్–శ్రీశైలం హైవేపై బ్రిడ్జి వద్ద రోడ్డు బుధవారం అర్థరాత్రి కొట్టుకుపోయింది. దీంతో అధికారులు రాకపోకలు నిలిపి వేశారు. వాహనాలను నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి మీదుగా అచ్చంపేట మండలం హాజీపూర్ చౌరస్తా నుంచి శ్రీశైలం, అచ్చంపేటకు పంపిస్తున్నారు. కొట్టుకపోయిన రోడ్డు పునరుద్ధరణ పనులు గురువారం ప్రారంభించారు. మరోసారి తెరపైకి ‘లైడార్ సర్వే’హైదరాబాద్ నగరంలోని జలాశయాలు, చెరువులు, నాలాల అక్రమణదారులపై హైడ్రా ద్వారా ఉక్కుపాదం మోపుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అదే తరహాలో వరంగల్లోనూ ఓ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుచేయాలని భావిస్తోంది. హైడ్రా తరహాలో వాడ్రాను తీసుకురావాలని ఇప్పటికే సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, వరంగల్‌లోని చెరువులపై లైట్ డిటెక్షన్ అండ్ రేజింగ్ (లైడార్) సర్వే చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతంలోనే ఈ సర్వే చేయాలనుకున్నా అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా మోంథా తుపానుతో నగరం మొత్తం నీట మునగటంతో మళ్లీ లైడార్ సర్వే తెరపైకి వచ్చింది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని 75 చెరువులపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) సహకారంతో సర్వే నిర్వహించాలని భావిస్తున్నారు. -
ఆపత్కాలంలో ఆసరా ఏది?
తెలుగు రాష్ట్రాలను కంటి మీద కునుకు లేకుండా చేసిన మొంథా తుపాను చివరకు ప్రశాంతంగా ముగిసినా ఎడతెరిపి లేని వర్షాలతో లక్షలాది ఎకరాల పంటలకు తీవ్ర నష్టం కలిగించింది. రెండు చోట్లా నదులూ, వాగులూ, వంకలూ, గెడ్డలూ ఉద్ధృతంగా ప్రవహించి కట్టలు తెంచుకుని జనావాసాలను ముంచెత్తాయి. సముద్రంలో పెను తుపానుగా బలపడి ప్రళయ భీకర రూపంతో భయపెడుతూ వచ్చిన తుపాను, తీరానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఏర్పడిన ‘విండ్ షీర్’(గాలికోత) ధాటికి విచ్ఛిన్నమై శాంతించిందని వాతావరణ నిపుణులంటున్న మాట. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంతాల్లో 15 లక్షల ఎకరాల్లోని వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో వరి విస్తీర్ణమే 11 లక్షలంటున్నారు. తెలంగాణలో దాదాపు 14 జిల్లాలు మొంథా ప్రభావంతో కుండపోత వర్షాలతో ఇక్కట్లపాలయ్యాయి. పలు జిల్లాల్లో పంటలు దెబ్బతినటంతో పాటు కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం సైతం నీట మునిగింది. ప్రకృతి వైపరీత్యాల ఆనవాళ్లను ముందుగా గుర్తించే సాంకేతికత అందుబాటులో కొచ్చి తుపాను తాకిడి ప్రాంతాల్లోని ప్రజలను సహాయ శిబిరాలకు తరలించటం సులభ మవుతోంది. కానీ అది మాత్రమే సరిపోదు. విపత్తులొస్తే... పంట నష్టం ఏర్పడితే జరగ గల నష్టాన్ని అంచనా వేసుకుని పంటల బీమా పథకాలను అమలు చేయాలి. ఇన్పుట్ సబ్సిడీలివ్వాలి. రైతులకు ఆసరాగా నిలిచే ‘రైతు భరోసా’ వంటి పథకాలుండాలి. ఆర్బీకేలు అన్ని విధాలా సాయపడాలి. పంట దిగుబడులకు గిట్టుబాటు ధరలుండాలి. ఎన్నో తుపాన్లు చూశానని ఏపీ ముఖ్యమంత్రి స్వోత్కర్షకు పోతున్నారు. నిజమే... ఆయన వచ్చి నప్పుడల్లా అయితే తుపాన్లు లేదా కరువు కాటకాలు రివాజైన సంగతి తెలుసు. మరి ఎన్నో తుపాన్లు చూసిన నేతకు ఆపత్కాలంలో అక్కరకొచ్చే ముందస్తు చర్యలు తీసు కోవాలన్న స్పృహ ఎందుకు అడుగంటింది? అంతకుముందు జగన్ ప్రభుత్వ హయాంలో 85 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగేలా దాదాపు 70 లక్షల ఎకరాల్లో ఉచిత పంటల బీమా పథకం అమలు చేశారు. అందువల్ల విపత్తుల బారిన పడిన 54.5 లక్షలమంది రైతులకు రూ. 7,802 కోట్లు బీమా పరిహారం లభించింది. కానీ తన ఏలుబడి మొదల య్యాక బాబు వీటన్నిటినీ ఎలా విస్మరించగలిగారు? ఆర్బీకేలను భ్రష్టుపట్టించారు. ఇన్పుట్ సబ్సిడీలు అటకెక్కాయి. నిరుడూ, ఈ ఏడాదీ ఈ సబ్సిడీల రూపేణా ఒక్క రూపాయి అందించింది లేదు. బాబు సర్కారు నిర్వాకం వల్ల ఇప్పుడు పంట రుణాలు తీసుకున్న 19 లక్షల మంది రైతులకు మాత్రమే బ్యాంకులు కల్పించిన బీమా సదు పాయం ఉంది. మొంథా వల్ల తీవ్రంగా నష్టపోయిన మిగతా 66 లక్షల మంది రైతులు ఏం కావాలి? ‘రైతు భరోసా’ పేరు మార్చి ‘అన్నదాత సుఖీభవ’ అన్నారు. పేరేదైతేనేం... ఈ రెండేళ్లలో ప్రతి రైతుకూ ఇంతవరకూ రూ. 40,000 చొప్పున నగదు అందాలి. కానీ ఇచ్చిందెంత? కేవలం రూ.5,000! అనుభవశాలి చేయాల్సిన పనేనా ఇది?! ప్రభుత్వం నుంచి ఏదో రూపేణా సాయం అందుతుంటే, పంటలకు బీమా సదు పాయం ఉంటే, దిగుబడులకు గిట్టుబాటు ధరలు అందజేస్తే ఇలాంటి కష్టకాలంలో నిండా మునిగిపోయామన్న దిగులు రైతులను ఆవరించేది కాదు. అవన్నీ ఎగ్గొట్టినందుకు దోషిగా నిలబడాల్సింది పోయి రైతులతో ఆయన పరిహాసమాడుతున్నారు. ప్రచార యావ శ్రుతి మించి ఆర్టీజీఎస్ కేంద్రంలో కూర్చుని తుపాను నిలువరించినట్టు తెగ ప్రచారం చేసుకుంటున్నారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలు తిండి, నీళ్లు లేక అలమటిస్తున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలు అసలు చూస్తున్నారా? అక్కడక్కడ తూ తూ మంత్రంగా సాయం చేసి చాటుకోవటం తప్ప బాధితులందరికీ అందజేయాలన్న సంకల్పం ఏదీ? కొన్నిచోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ తదితర పక్షాలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనటం కొంత ఊరట. ఎన్టీఆర్ జిల్లాలో ఒక పునరావాస కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ అందించిన ఆహారం తీసుకున్నారన్న కక్షతో అక్కడివారిని టీడీపీ పెత్తందార్లు వెళ్లగొట్టిన వైనం తెలుసా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. డబుల్ ఇంజన్ సర్కారని చెప్పుకుంటున్నారు గనుక బాధిత రైతులందరికీ తక్షణ సాయం అందించాలి. నష్టం అంచనాలు పక్కాగా ఉండాలి. నష్టపోయినవారికి సాధ్యమైనంత త్వరగా పూర్తి పరిహారం అందేలా చూడాలి. -
మోంథా ఎఫెక్ట్: వరంగల్ అతలాకుతలం (ఫోటోలు)
-
మీడియాపై సీఎం చంద్రబాబు అసహనం
సాక్షి,విజయవాడ: మోంథా తుపాను నివేదికపై మీడియా ప్రశ్నలకు సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘మీకు సంచలన వార్తలే కావాలి, వాస్తవం అవసరం లేదు’అంటూ ఆయన మీడియాపై ఘాటుగా స్పందించారు.గురువారం ఏపీలో బీభత్సం సృష్టించిన మోంథా తుపాను ప్రభావంపై మీడియా ప్రతినిధులు చంద్రబాబును ప్రశ్నించారు. ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టం) ద్వారా తుపాను ప్రభావానికి సంబంధించిన సమాచారం తక్షణమే తెలుసుకున్నామని తెలిపారు. అయితే, ‘ఆ డేటాను కేంద్రానికి పంపించారా?’ అని మీడియా ప్రశ్నించడంతో చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యారు. ‘అన్నీ రియల్ టైమ్‌లో ఎలా సాధ్యమవుతాయి?’ అంటూ మీడియాకు ఎదురు ప్రశ్న వేశారు. ‘మీకు సెన్సేషన్ వార్తలు కావాలి, రియాలిటీ అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు. కేంద్రానికి ఇంకా నివేదిక పంపించలేదని, త్వరలో పంపించాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు. -
Cyclone Montha: ఖమ్మం టౌన్లోకి వస్తున్న వరద నీరు
-
Vidadala: ఇది చిలకలూరిపేట రైతుల పరిస్థితి.. ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఒక్కటే
-
Cyclone Montha: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణపై మహిళా రైతుల ఫైర్
-
ఓట్లు కావాలి.. సమస్యలు పట్టవా..? పవన్‌పై మహిళా రైతుల ఫైర్
సాక్షి, కృష్ణా జిల్లా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మహిళా రైతులు మండిపడ్డారు. కోడూరు మండలంలో మోంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పవన్ పరిశీలించారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అడుగడుగునా ఆంక్షలు విధించారు. ఆదర్శ రైతులను పట్టించుకోని పవన్ కళ్యాణ్.. దెబ్బతిన్న పంటలను తూతూ మంత్రంగా పరిశీలించారు.తమ కష్టాలను వినకుండా.. తమకు కలిసే అవకాశం ఇవ్వకపోవడంపై మహిళలు మండిపడ్డారు. కేవలం ఒకే రైతు కుటుంబంతో మాట్లాడితే అందరి సమస్యలు ఎలా తెలుస్తాయంటూ మండిపడ్డారు. మా ఓట్లు కావాలి.. కానీ మా సమస్యలు మీకు పట్టవా అంటూ నిలదీశారు.మరోవైపు, పవన్ కల్యాణ్ జిల్లా పర్యటన వేళ.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కోడూరు-అవనిగడ్డ ప్రధాన రహదారిలో ట్రాఫిక్ డైవర్షన్ విధించారు. ట్రాఫిక్ మళ్లింపుపై జనాలకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం, పైగా చుట్టు తిరిగి రావాల్సి రావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. కోడూరు మండలంతో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం పర్యటించారు. అయితే.. ఆయన పర్యటన కోసం పోలీసులు విధించిన డైవర్షన్ జనాలు 20 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
Montha Cyclone: వామ్మో....వారంలో మరో పెనుతుఫాను
-
Montha Cyclone: పార్టీ కేడర్ కు దిశానిర్దేశం చేసిన వైఎస్ జగన్
-
సముద్రంలో బంగారం.. బయటపడ్డ అసలు నిజం
-
‘కూటమి సర్కార్ రైతుల నడ్డి విరిచింది’
సాక్షి, తాడేపల్లి: తుపాను కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మోంథా తుపాను నేపథ్యంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావంపై పార్టీ నేతలతో చర్చించారు.‘‘పైరు పొట్ట దశలో ఉన్నప్పుడు తుపాను దెబ్బపడింది. దీనివల్ల దిగుబడులు బాగా దెబ్బతింటాయి. నేలకొరిగిన పంట తిరిగి నిలబడ్డం కష్టమయ్యే పరిస్థితి. దాదాపు 25 జిల్లాల్లో ప్రభావం చూపింది. ఉన్న సమాచారం ప్రకారం 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 11 లక్షల ఎకరాల్లో వరి పంటకు నష్టం దాటిల్లింది. 1.14 లక్షల ఎకరాల్లో పత్తి, 1.15 లక్షల ఎకరాల్లో వేరు శనగ, 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.9 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయి. పార్టీ పరంగా రైతులకు తోడుగా నిలబడాలి’’ అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ‘‘మన ప్రభుత్వంలో ఆర్బీకేల వ్యవస్థ అప్రమత్తంగా ఉండేది. ప్రతి పంటకూ ఇ-క్రాప్ చేసే వాళ్లం. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు సమన్వయంతో గట్టిగా పనిచేసేది. ఉచిత పంటలబీమాతో రైతులకు భరోసా ఉండేది. 80 లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండేది. 70 లక్షల ఎకరాల పంట బీమా పరిధిలో ఉండేది. ఇవాళ ప్రీమియం కట్టిన రైతులు 19 లక్షలమందికి మాత్రమే బీమా అందుబాటులో ఉంది. మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం అండగా ఉండాలి...ఈ 16 నెలల్లో అల్పపీడనలు, వాయుగుండాలు, తుపాన్లు కారణంగా 16 వచ్చాయి. ఎంతమందికి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందింది, నష్టపోయిన రైతులను ఎంతమందిని ఆదుకున్నారు చూస్తే.. గుండుసున్నాయే కనిపిస్తుంది. ఏ రైతునూ ఆదుకున్న పరిస్థితి లేదు. ఇ-క్రాప్ అందించిన పరిస్థితి కూడా లేదు. వాళ్లు వేసిన అరకొర లెక్కల ప్రకారమే 5.5 లక్షలమంది రైతులకు రూ.600 కోట్లు పెండింగ్‌లో పెట్టారు. మిర్చికి క్వింటాలుకు రూ.11,781కి కొనుగోలు చేస్తామన్నారు ఒక్క రూపాయికూడా రైతుకు ఇవ్వలేదు. పొగాకును కొనుగోలు చేస్తామ న్నారు దిక్కూ మొక్కూ లేదు. మామిడిని కిలో రూ.12లకు కొనుగోలు చేస్తామన్నారు. ఒక్క రైతుకూ మంచి చేయలేదు. తర్వాత హెక్టారుకు రూ.5౦వేలు ఇస్తామన్నారు. అదికూడా ఇచ్చిన పాపాన పోలేదు...ఇ-క్రాప్ నీరుగార్చారు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే పరిస్థితి లేదు. ఏ పంటకూ గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ మానవ తప్పిదాలు. మన హయాంలో మనమే ప్రభుత్వం తరఫున ప్రీమియం కట్టి 54.55 లక్షల మంది రైతులకు రూ.7800 కోట్లు ఇన్సూరెన్స్ ఇప్పించగలిగాం. కాని ఇవాళ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ ప్రభుత్వం రైతుల నడ్డి విరిచింది’’ అంటూ వైఎఎస్ జగన్ మండిపడ్డారు. -
పవన్ పర్యటన.. జనం పాట్లు
సాక్షి, కృష్ణా జిల్లా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జిల్లా పర్యటన వేళ.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కోడూరు - అవనిగడ్డ ప్రధాన రహదారిలో ట్రాఫిక్ డైవర్షన్ విధించారు. ట్రాఫిక్ మళ్లింపుపై జనాలకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం, పైగా చుట్టు తిరిగి రావాల్సి రావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. కోడూరు మండలంతో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం పర్యటించారు. అయితే.. ఆయన పర్యటన కోసం పోలీసులు విధించిన డైవర్షన్ జనాలు 20 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక తన పర్యటనలో భాగంగా.. కృష్ణాపురం వద్ద నేలకొరిగిన పంటలను పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఆపై అవనిగడ్డ సబ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించి.. స్థానిక ప్రజాప్రతినిధులతో, అధికారులతో సమీక్షించారు. ‘కుదర్లేదు కాని... కుదిరితే ఆ మోంథా తుపానును పట్టుకుని తిప్పికొట్టేవారు..!’’ ‘‘ఎన్నో తుపాన్లను సమర్థంగా అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది. ఆయన సలహా కోసం ఇతర రాష్ట్రాల సీఎంలే సంప్రదించేవారు..’’ ఇదీ సీఎం చంద్రబాబు గురించి ఎల్లో మీడియాలో సాగుతున్న భజన. విపత్తులను కూడా రాజకీయ మైలేజీకి వాడుకోవడంలో దిట్ట అయిన చంద్రబాబు ఇప్పుడు తుపానును అవకాశంగా తీసుకున్నారు.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి👉చంద్రబాబు ప్రచార ‘విపత్తు’ -
Montha Cyclone: మొంథా తుఫానుపై వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
-
తుఫాన్ ప్రభావంతో అతలాకుతలమైన వరంగల్
-
Kasu Mahesh Reddy: ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి
-
నోటికాడి ధాన్యం తడిసి ముద్దవటంతో బోరున ఏడ్చిన రైతు
-
Montha Cyclone: వైఎస్ జగన్ ఆదేశాలతో సహాయక చర్యల్లో పాల్గొన్న పార్టీ కేడర్
-
దున్నపోతుపై వర్షం కురిసినట్టు.. పూలవర్తి నానికి మోహిత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
-
రేపు వరంగల్‌కు సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రతీ ఒక్కరు ఫీల్ట్‌లో ఉండాల్సిందే.. రిపోర్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే, రేపు వరంగల్, హుస్నాబాద్‌లో పర్యటించనున్నట్టు తెలిపారు. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ వేముల శ్రీనివాసులు, డీజీపీ శివధర్ రెడ్డి, HMWSSB ఎండీ అశోక్ రెడ్డి, తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.అధికారులపై చర్యలుంటాయ్.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘అన్ని విభాగాలు సంయుక్తంగా పనిచేయాలి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై పౌరసరఫరాల విభాగం ఎప్పటికప్పుడు కలెక్టర్లకు తగిన సూచనలు చేయాలి. ప్రతీ కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించాలి. అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గర లోని ఫంక్షన్స్ హాల్స్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలి. ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ప్రతీ 24 గంటల పరిస్థితిపై ప్రతిరోజు కలెక్టర్‌కు రిపోర్ట్ అందించాలి. రిపోర్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలిజిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సంయుక్తంగా ఒక మానీటరింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలి. దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ట్రాఫిక్‌ను డైవర్ట్ చేయాలి. చెరువులు, వాగులు, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, లో లెవల్ కల్వర్టుల దగ్గర పరిస్థితులను గుర్తించి స్థానికులను ముందుగానే అలర్ట్ చేయాలి. 16 జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనిపై ముందస్తు చర్యలు తీసుకున్నా. ఇది వరి కోతల కాలం.. అనుకోని ఉపద్రవం రైతులకు ఆవేదన మిగులుస్తోంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అందరి సెలవులు రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నాం. ఈదురు గాలులతో విద్యుత్ అంతరాయం కలగుండా విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు అవసరమైతే తప్ప రోడ్లపైకి రాకుండా అవగాహన కల్పించాలి. అవసరమైన చోట అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలిహైడ్రా సేవలు వినియోగించుకోండి.. వరంగల్‌లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అవసరమైన చోట హైడ్రా సేవలను వినియోగించుకోవాలి. 24 గంటలు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలి. అధికారులతో సమన్వయం చేసుకుని ఉమ్మడి జిల్లాల మంత్రులు కలెక్టర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సంబంధిత జిల్లా ఇంచార్జ్ మంత్రికి తెలపాలి. వాగులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలను అప్రమత్తం చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలి. ప్రాజెక్టుల ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ప్రాణనష్టం, పశు నష్టం, పంట నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్కరి ప్రాణాలకు నష్టం జరగడానికి వీల్లేదురేపు వరంగల్, హుస్నాబాద్ పర్యటన.. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ్టి వరంగల్ ఆకస్మిక పర్యటన వాయిదా వేసుకున్నా. రేపు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తా. తుఫాను ప్రభావిత జిల్లా ఇంచార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలి. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. -
ముగిసిన వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, తాడేపల్లి: మోంథా తుపాను నేపథ్యంలో వైఎస్సార్సీపీ పార్టీ నేతలతో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తుపాను తర్వాత జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, పంట నష్టం వంటి వివరాలను పార్టీ కేడర్‌ను అడిగి తెలుసుకోనున్నారు.బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలన్న వైఎస్ జగన్ పిలుపు మేరకు పార్టీ నాయకులు, శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేశారు. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకూ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ కార్యకర్తలు తుపాను బాధితులకు బాసటగా నిలిచారు.ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించడంలో, వారికి ఆహారం అందించడంలో సేవలందించారు. తుపానువల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన బాధితులకు భరోసా ఇవ్వడంతో పాటు వివరాలను సేకరించారు. వాటిని వీడియో కాన్ఫరెన్స్‌లో వైఎస్ జగన్‌కు వివరించారు. పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమాలపై నేతలను వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. -
శ్రీశైలం-హైదరాబాద్ హైవే బంద్!
సాక్షి, హైదరాబాద్: మోంథా తుపాను తెలంగాణపై విరుచుకుపడింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో భారీ వర్షాల కారణంగా శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు తెగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌లోని ఉప్పునుంతల మండలం లత్తిపూర్ వద్ద జాతీయ రహదారి రోడ్డు తెగిపోయింది. డిండి ప్రాజెక్టు అలుగుపోయడంతో జాతీయ రహదారి కోతకు గురైంది. దీంతో 765 హైవేపై హైదరాబాద్- శ్రీశైలం వైపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను అచ్చంపేట మండలంలోని హాజీపూర్ మీదుగా మళ్లించారు. వంగూరు మండలం చింతపల్లి, కొండారెడ్డిపల్లి మీదుగా వాహనాలు ప్రయాణం చేస్తున్నాయి.కొట్టుకుపోయిన హైదరాబాద్- శ్రీశైలం నేషనల్ హైవే ఏమయినా ఇజ్జత్ ఉందా సోయి లేని సంజయ్? @bandisanjay_bjp లక్షల కోట్లు టోల్ వసూల్ చేసి మోడీ సర్కార్ కట్టే రోడ్ల నాణ్యత ఇట్లా ఉంది 👇👇pic.twitter.com/KRoYsnFWBY— MBR (@BharathMBNR) October 30, 2025రైల్వే ట్రాక్‌లపై వర్షపు నీరు..మరోవైపు.. ఎడతెరపి లేని వర్షానికి ఉమ్మడి వరంగల్ జిల్లా చిగురుటాకులా వణికింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో భారీ వర్షం కురిసింది. గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డోర్నకల్ రైల్వే స్టేషన్లో సుమారు రెండు కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నీట మునిగింది. రైల్వే ట్రాక్‌పై మూడు అడుగుల ఎత్తులో నీరు ప్రవహించగా, జేసీబీల సాయంతో అధికారులు 12 గంటలు శ్రమించి నీటిని తొలగించారు. ముందు జాగ్రత్తగా వేగం నియంత్రించి నెమ్మదిగా రైళ్ల రాకపోకలు సాగిస్తున్నారు.హైదరాబాద్ - శ్రీశైలం రాకపోకలు బంద్...హైదరాబాద్ శ్రీశైలం రోడ్డులో విపరీతమైన వాహనాల రద్దీ ఉంటుంది...వారందరికీ చేరే వరకు ఈ పోస్ట్ షేర్ చేయండిఉప్పునుంతల మండలం లతీపూర్ గ్రామ సమీపంలోని హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపై రాత్రి కురిసిన భారీ వర్షానికి కొట్టుకపోయిన నేషనల్ హైవే రోడ్ pic.twitter.com/wsY6AjyY3X— Bhaskar Reddy (@chicagobachi) October 29, 2025లోతట్టు ప్రాంతాలు జలమయం హుజూరాబాద్ డివిజన్లోని జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, శంకరపట్నం, సైదాపూర్ మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. హుజూరాబాద్‌లోని డిపో క్రాస్ రోడ్ వద్ద గల కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది. హుస్నాబాద్‌లో పలు దుకాణాలు, ఇండ్లలోకి వరద నీరు చేరింది. బస్టాండ్ ఆవరణ వరద నీటితో కుంటను తలపించింది. భారీ వర్షాల నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా వరంగల్‌లో పలు ప్రాంతాలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. డోర్నకల్ రైల్వేస్టేషన్ జలమయం | #Dornakal #RailwayStation #Submerged #CycloneMontha pic.twitter.com/PjCJy5ENJK— Sakshi TV Official (@sakshitvdigital) October 29, 2025 -
కేబినెట్ లోకి కొత్త మంత్రి.. అన్నదాతపై తుఫాను పంజా
-
హైదరాబాద్-వరంగల్ హైవేపై భారీగా వరద!
మోంథా తుపాన్ ఓరుగల్లును పూర్తిగా ముంచెత్తింది. ట్రై సిటీస్.. కాజీపేట, హనుమకొండ, వరంగల్లు నీట మునిగాయి. భారీ వర్షాలు, వాగులు వంకు పొంగిపొర్లడంతో వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. కార్లు మునిగేంత నీరు వచ్చి చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాఘవాపూర్ వద్ద హైవేపై డివైడర్ కూల్చేసి నీటిని దిగువకు పంపిస్తున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే రాకపోకలు నెమ్మదిగా జరుగుతున్నాయి. మోంథా ధాటికి వరంగల్, హనుమకొండ జిలాలు ఆగమాగం అయ్యాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెట్లు కూలిపోయి.. రోడ్లు తెగిపోయి పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. వరంగల్-హనుమకొండకు రాకపోకలు నిలిచిపోయాయి. పలుకాలనీల్లో కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి.హంటర్ రోడ్డులో బొంది వాగు తీవ్ర ఉధృతితో ప్రవహిస్తోంది. మానుకోట, వరంగల్, హనుమకొండలోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలో ఉండిపోయాయి.హనుమకొండ-ములుగు రహదారి లోలెవ్ బ్రిడ్జి పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు వెళ్తున్నాయి. ముగ్దుంపురం చెరువు అలుగు పోస్తుండడంతో.. నర్సంపేట-చెన్నారావుపేట రహదారిపై లోలెవల్ కాజ్‌వేపై వరద ప్రవహిస్తోంది. దీంతో నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తుండగా.. 45 కాలనీలు నీట మునిగాయి. ఏడు ప్రత్యేక బృందాలు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి. ముంపు ప్రాంతాల ప్రజలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 1200 మందిని తరలించినట్లు సమాచారం. వేల ఎకరాల్లో పంట నీటి పాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరంగల్‌లో 9, హనుమకొండలో 3 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారువరద ప్రభావంతో భద్రకాళి ఆలయం నుంచి పాలిటెక్నిక్ కాలేజీ దాకా రోడ్డుపై నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో ఆలయం వైపు మార్గాన్ని మూసేశారు. ఉమ్మడి వరంగల్‌లో మొంథా తుపాను ప్రభావంతో భారీ వర్షం కురిసింది. హనుమకొండ భీమదేవరపల్లిలో 42.2 సెం.మీ వర్షం, వరంగల్ జిల్లా పర్వతగిరిలో 41.5 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. అలాగే హన్మకొండ జిల్లా ధర్మసాగర్లో 33.8 సెం.మీ వర్షం, వరంగల్ జిల్లా సంగెంలో 33.8 సెం.మీ, నెక్కొండలో 35 సెం.మీ వర్షం,ఖిలా వరంగల్‌లో 34.3 సెం.మీ వర్షపాతం కురిసింది. వర్ధన్నపేట్ లో 32.8 వర్షపాతం నమోదుకగా, జనగామ జిల్లా పాలకుర్తిలో 29.4 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 25.8 సెం.మీ వర్షం కురిసింది. -
తెలంగాణకు భారీ వర్ష సూచన.. అధికారుల కీలక హెచ్చరిక
-
ఓ వైపు బాబు పాలన.. మరోవైపు ప్రకృతి ప్రళయం.. కుదేలైన అన్నదాత
-
చంద్రబాబు నిజరూపాన్ని బయటపెట్టిన మొంథా తుఫాన్
-
ఏపీపై మోంథా పంజా.. అన్నదాత ఆశలను చిదిమేసిన భారీ తుపాను (ఫొటోలు)
-
ఏపీని వీడని మొంథా తుఫాన్
-
తెలంగాణను కుదిపేసిన మోంథా.. రోడ్లన్నీ జలమయం
-
ఇంతటి విపత్తులో కూడా నీ ప్రచార పిచ్చి ఏంటి బాబూ!
-
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం.. నిండా మునిగిన రైతులు
-
మొంథా ఎఫెక్ట్.. రంగంలోకి YS జగన్
-
అన్నదాతకు గుండె కోత
-
సముద్ర తీరంలో కనక వర్షం.. ఒక్కసారిగా ఎగబడ్డ జనం
-
#CycloneMontha : వరంగల్ ఉమ్మడి జిల్లాలో వర్షబీభత్సం (ఫొటోలు)
-
తీరమెక్కడో.. గమ్యమేమిటో...!
-
సీఎం సార్ బెస్ట్ పెర్ఫార్మెన్స్.. తుఫాన్ ఏరియాలో పబ్లిసిటీ పిచ్చి
-
మోంథా పోతూ పోతూ..
-
తెలంగాణను వీడని మోంథా
మోంథా తుపాన్ మొత్తానికి వాయుగుండంగా బలహీనపడింది. సాయంత్రం కల్లా దీని ప్రభావం పూర్తిగా పోతుందని భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. అయితే ఈ ప్రభావంతో రాగల కొన్ని గంటల్లో తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలే పడనున్నాయని హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం, అధికార యంత్రాగం అప్రమత్తమైంది. తెలంగాణలో మోంథా ఎఫెక్ట్‌తో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. 9 జిల్లాలకు ఆరెంజ్, మరో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. 35-45కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఆరు జిల్లాలకు సెలవులు.. భారీ వర్షాల నేపథ్యంతో వరంగల్, సిద్ధిపేట, ములుగు, ఉమ్మడి కరీంనగర్, హన్మకొండ, యాదాద్రి జిల్లాల్లో స్కూళ్లకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ఫ్లాష్‌ఫ్లడ్ హెచ్చరికజగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మోంథా ప్రభావం ఇలా.. మోంథా తుపాను వాయుగుండంగా బలహీనపడింది. భద్రాచలానికి 120కి.మీ... ఖమ్మంకు 180 కి.మీ... ఒడిశా మల్కన్‌గిరికి 130 కి.మీ. వాయుగుండంగా కేంద్రీకృతమైంది. సాయంత్రం కల్లా పూర్తి బలహీనంగా మారిపోనుంది.సీఎం సమీక్షతుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. -
లక్షల ఎకరాల పంటని మింగేసిన మోంథా
-
యాక్టింగ్ చాలు! అసలు కథ ఇప్పుడే మొదలైంది
-
తెలంగాణలో విధ్వంసం సృష్టించిన ‘మోంథా’... ఉమ్మడి వరంగల్‌పై తీవ్ర ప్రభావం
-
కాలజ్ఞాని నివాసంపై ‘మోంథా’ పడగ
సాక్షి ప్రతినిధి, కడప/బ్రహ్మంగారిమఠం: కాలజ్ఞాన ప్రబోధకర్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కందిమల్లాయపల్లె (బ్రహ్మంగారి మఠం)లో నివాసం ఉన్న మట్టి మిద్దె మోంథా తుపాన్ వర్షం ధాటికి బుధవారం తెల్లవారుజామున కూలిపోయింది. దీనిపై భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మంగారి ఆనవాళ్లను పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను మఠం నిర్వాహకులు విస్మరించడం, రాజకీయ ప్రయోజనాలు మినహా చరిత్రను పరిరక్షించుకోవాలనే స్పృహ ప్రభుత్వ పెద్దలకు లేకపోవడం ఈ దుస్థితికి కారణమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి 1693లో సజీవ సమాధి అయ్యారు. అటు తర్వాత గ్రామస్తులు, భక్తులు వీరబ్రహ్మేంద్రస్వామి నివాసమున్న రెండు కొట్టాల స్థానంలో మట్టి మిద్దె ఏర్పాటు చేశారు. 1982లో ముందు భాగంలో భక్తులు ఆధునికీకరణ చేపట్టారు. జగన్ ప్రభుత్వ హయాంలో పరిరక్షణచరిత్రాత్మక సంపద స్వామివారి మిద్దె, బావి పరిరక్షించుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. దాదాపు రూ.30లక్షలతో మిద్దెకు ప్రాకారం, చప్పట, స్వామివారు స్వయంగా తవ్విన బావి పరిరక్షణ చర్యలు చేపట్టింది. పనులు పూర్తి చేసి 2022 జూన్‌లో అప్పటి మైదుకూరు ఎమ్మెల్యే ఎస్. రఘురామిరెడ్డి ప్రారంభించారు. రెండేళ్లుగా మఠం నిర్వాహణ ప్రభుత్వ పరిధిలో ఉంది. బాబు ప్రభుత్వం నిర్లక్ష్యంస్వామివారు నివసించిన ఇంటి పరిరక్షణ చర్యలు బాబు ప్రభుత్వంలో శూన్యమయ్యాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం చరిత్రను పరిరక్షించుకోవాలనే చొరవ కంటే రాజకీయ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తుందని పలువురు వాపోతున్నారు. మరోవైపు శిథిలావస్థకు చేరిందంటూ పూజలు చేసుకునే అవకాశం లేకుండా నివాసానికి తాళాలు వేసిన నిర్వాహకులు, తదుపరి పరిరక్షణ చర్యలపై శ్రద్ధ చూపలేదని భక్తులు మండిపడుతున్నారు.ఇప్పుడు బ్రహ్మంగారి మఠం అప్పుడు కాశినాయన క్షేత్రం.. ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యానికి కాలజ్ఞాని నివాసం కూలిపోవడం తాజా ఉదాహరణ కాగా, ఇప్పటికే ఇలాంటి విమర్శలు వైఎస్సార్ కడప జిల్లాలో అవధూత కాశినాయన క్షేత్రం విషయంలోనూ వ్యక్తమయ్యాయి. ఈ క్షేత్రంలో భక్తులు స్వయంగా ఏర్పాటు చేసుకున్న నిర్మాణాలను కూటమి సర్కారు అటవీశాఖ అ«ధికారులతో కూలగొట్టించిన విషయాన్ని భక్తులు గుర్తుచేసుకుంటున్నారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో కూలగొట్టిన నిర్మాణాలను పునర్నిర్మించడంతో పాటు పెండింగ్ పనులన్నింటినీ చేయిస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించి ‘మమ’ అన్పించి చేతులు దులుపుకోవడం గమనార్హం.నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణం..మఠం నిర్వాహకులు, దేవదాయ శాఖ అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఈరోజు ఇలా జరిగేది కాదు. బ్రహ్మంగారి నివాసం కూలిపోయిందంటే, ఆయన భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నట్టే! – ప్రతాప్ ఆచారి, బ్రహ్మంగారిమఠం మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు తీవ్ర విచారకరంతీవ్ర విచారకరమైన ఘటన ఇది. అధికారుల నిర్లక్ష్యంతోనే స్వామి వారి నివాస గృహం కూలిపోయింది. దీనికి అధికారులు ఏమని సమాధానం చెబుతారు. – డాక్టర్ వేలు ఆనందచారి, పద్మశ్రీ అవార్డు గ్రహీతతక్షణం పునర్నిర్మించాలినిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఆధునీకరణ పనులు జరగలేదు. ఇప్పటికైనా ఎండోమెంట్ అధికారులు, మఠం నిర్వాహకులు శ్రద్ధ తీసుకొని కూలిన గృహాన్ని పునర్నిర్మించాలి. – విశ్వరూపచారి, స్థానికుడు, బ్రహ్మంగారిమఠం -
మోంథా బీభత్సం
సాక్షి నెట్వర్క్: మోంథా తుపాను పంట పొలాలను ముంచెత్తడమే కాకుండా ఇతరత్రా అపార నష్టం కలిగించింది. పలు జిల్లాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. వేలాది వృక్షాలు విరిగిపడ్డాయి. తీర ప్రాంతాలు కోతకు గురయ్యాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా చిగురుటాకులా వణికి పోయింది. సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. ఈదురుగాలులు, వర్షాలకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. 119 సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. సెల్ టవర్లు పనిచేయక ఫోన్లు మూగబోయాయి. నాగాయలంక మండలం ఎదురుమొండి మండలం దీవిలో జింకల పాలెం రోడ్డు పూర్తిగా కృష్ణా నదిలో కలిసిపోయింది. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఇద్దరు చంటి పిల్లలతో తలదాచుకున్న మహిళ బుధవారం వేకువజామున వాష్ రూంకు వెళ్లగా పాముకాటుకు గురైంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వన్‌టౌన్ పరిధిలోని విద్యాధరపురంలో రేకుల షెడ్‌పై కొండ చరియలు జారి పడటంతో ఇల్లు, అందులోని సామాన్లు ధ్వంసమయ్యాయి. ఆసమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తిరువూరు నియోజకవర్గంలో కట్టెలేరు, పడమటి వాగు, వెదుళ్లవాగు, గుర్రపువాగు, తిప్పలవాగు, అనురాధవాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నల్లవాగు పొంగడంతో నందిగామ–చందర్ల పాడు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పల్నాడు జిల్లాలో గుండ్లకమ్మ వాగు ఉగ్రరూపం దాల్చింది. ఫలితంగా వినుకొండ రూరల్ మండలంలోని అంధుగల కొత్తపాలెం, మదమంచిపాడు శ్రీప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం సమీపంలో వంతెన పైనుంచి ప్రమాదకర స్థాయిలో వరద ప్రవహిస్తోంది. దీంతో గుంటూరు–ప్రకాశం జిల్లాల మధ్య రాకపోకలు స్తంభించాయి. నక్కవాగు పొంగింది. నూజెండ్ల మండలం కొండల్రాయునిపాలెంలో 11 గొర్రెలు నీట కొట్టుకుపోయాయి. వెల్దుర్తి మండలం కుంకుడు చెట్టు తండాకు చెందిన చెంచు గిరిజనుడు గురవయ్యకు చెందిన 10 మేకలు వాగులో గల్లంతయ్యాయి. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు రహదారుల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. నీట మునిగిన వెలుగొండ సొరంగాలుప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలోని కొత్తూరు వద్ద పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణాల్లోకి వరద నీరు ప్రవేశించింది. రెండు సొరంగాలు పూర్తి స్థాయిలో నీట మునిగాయి. శ్రీశైలం రహదారిలోని గోర్లెస్ కాలువ, కర్నూలు రహదారిలోని దొంగలవాగు, మార్కాపురం రహదారిలోని తీగలేరు వాగులు పొంగి ప్రవహించాయి. శ్రీశైలం ఘాట్‌లోని తుమ్మలబైలు వద్ద కొండచరియలు విరిగి పడ్డాయి. ఫలితంగా బుధవారం సాయంత్రం వరకు శ్రీశైల పుణ్యక్షేత్రానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భక్తులు, యాత్రికులు రాత్రంతా చీకట్లోనే జాగారం చేశారు. పలు వాహనాలను దారి మళ్లించారు. తీగలేరు వాగు ఉధృతంగా ప్రవహించటంతో చిన్నదోర్నాల వద్ద మార్కాపురం–దోర్నాల మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యర్రగొండపాలెం–మాచర్ల హైవే రోడ్డు కోతకు గురికావండతో మంగళవారం అర్ధరాత్రి అటవీ ప్రాంతంలో 6 ఆర్టీసీ బస్సులు, 2 ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అట్లేరు వాగు పొంగడంతో కొండపి–అనకర్లపూడి మధ్య, కోయవాగు పొంగడంతో చిన్నకండ్లగుంట–తాటాకులపాలెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు గిద్దలూరు నియోజకవర్గంలో 27 ఇళ్లు, ఒక చర్చి నేలమట్టమయ్యాయి. ఒంగోలు శివారు ప్రాంత కాలనీలన్నీ ముంపులో చిక్కుకున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పలు రహదారుల్లో రాకపోకలు స్తంభించాయి. కొత్తవలస–కిరండోల్ రైల్వేలైన్‌లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. డుంబ్రిగుడ మండలంలోని వంతరాడలో ప్రాథమిక పాఠశాల కుప్పకూలింది. సెలవు కావడంతో చిన్నారులకు పెద్ద ప్రమాదమే తప్పింది. నంద్యాలలో చామకాల్వ, మద్దిలేరువాగు, కుందూ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నంద్యాల సమీపంలో కుందూ ఉధృతంగా ప్రవహిస్తోంది. పట్టణంలోని పలు కాలనీల్లో ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. తాడికొండ: మోంథా తుపాను ప్రభావంతో రాజధాని ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో గుంటూరు నుంచి రాజధానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తాడికొండ మండలం లాం వద్ద వంతెనపై కొండవీటి వాగుకు వరద పోటెత్తడంతో వాహనాలు నిలిచిపోయాయి. పెదపరిమి–తుళ్లూరు మధ్య కోటేళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బుధవారం సాయంత్రం వరకు రాకపోకలు మొదలవ్వలేదు. పాములపాడు–మండెపూడి గ్రామాల మధ్య కొండవీటి వాగు, తాడికొండ–కంతేరు మధ్య ఎర్రవాగు పొంగడంతో లెవల్ చప్టాపై నీరు చేరి వాహనాలు నిలిచిపోయాయి. పెదపరిమి–నెక్కల్లు గ్రామాల మధ్య వరద నీరు రోడ్డెక్కడంతో రాకపోకలు స్తంభించాయి. నీరుకొండ వద్ద కొండవీటి వాగు వరద నీరు భారీగా నిలిచి పోవడంతో ఎస్ఆర్ఎం వర్సిటీ చుట్టూ నీరు చేరింది. పంట పొలాలు పూర్తిగా నీట మునిగి సముద్రాన్ని తలపిస్తోంది. కాగా, అమరావతికి గుంటూరు నుంచి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైంది. పెదపరిమి–తుళ్లూరు మధ్య రోడ్డు ధ్వంసం కావడంతో బుధవారం ఒక్క రోజే 5 ఇసుక లారీలు రోడ్డుపై కూరుకుపోయాయి. -
చంద్రబాబు ప్రచార ‘విపత్తు’
సాక్షి, అమరావతి: ‘‘కుదర్లేదు కాని... కుదిరితే ఆ మోంథా తుపానును పట్టుకుని తిప్పికొట్టేవారు..!’’ ‘‘ఎన్నో తుపాన్లను సమర్థంగా అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది. ఆయన సలహా కోసం ఇతర రాష్ట్రాల సీఎంలే సంప్రదించేవారు..’’ ఇదీ సీఎం చంద్రబాబు గురించి ఎల్లో మీడియాలో సాగుతున్న భజన. విపత్తులను కూడా రాజకీయ మైలేజీకి వాడుకోవడంలో దిట్ట అయిన చంద్రబాబు ఇప్పుడు తుపానును అవకాశంగా తీసుకున్నారు. విదేశాల నుంచి చేరుకున్న బాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ క్షేత్రస్థాయికి వెళ్లకుండా ఆర్టీజీఎస్ కేంద్రం నుంచే హడావుడి చేశారు. ప్రకృతి వైపరీత్యాన్ని తండ్రీకొడుకులే అడ్డుకున్నారన్న స్థాయిలో ప్రచారం హోరెత్తించారు. దీన్నంతటినీ గమనిస్తున్న ప్రజలు విపత్తు సమయంలో కూడా ఈ ప్రచార యావ ఏంటి బాబూ? అని మండిపడుతున్నారు. » మోంథా తుపాను ప్రళయం సృష్టిస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి సమయంలో మంత్రులు సొంత జిల్లాల్లో ఉండి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయ చర్యలను పర్యవేక్షించాలి. స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. ఇలాగైతే తమకు క్రెడిట్ దక్కదనుకున్నారో ఏమో? చంద్రబాబు, లోకేశ్. విదేశాల నుంచి వచ్చాక మోంథాను మొత్తం వారే పర్యవేక్షించినట్టు హైప్ సృష్టించి మిగిలినవారిని డమ్మీలను చేశారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్లనే తుపాను ప్రభావిత జిల్లాల్లో చాలా మంది మంత్రులు ఫోన్లలో ఆదేశాలు, అడపాదడపా పర్యటనలకే పరిమితం అయ్యారని గుసగుసలాడుతున్నారు. ఈ విషయాన్ని టీడీపీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు సైతం అంగీకరిస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తోపాటు మరో ముగ్గురు మంత్రులు అమరావతి నుంచే హడావుడి చేశారు. కానీ, తండ్రీకొడుకులే అంతా పర్యవేక్షిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఈ మేరకు ఎల్లో మీడియా సైతం విపరీతంగా ప్రచారం చేసింది. దీన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్దఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. » మోంథా తుపానుతో పెను ముప్పు అని ప్రజలు ఆందోళన చెందినా కొద్దిపాటి ప్రభావంతో తీరం దాటింది. ప్రభుత్వ పెద్దలు ప్రచారం ఊదరగొట్టినా పలుచోట్ల పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి సకాలంలో ఆహారం కూడా అందించలేకపోయారు. అయినా, ఎంతో చేసేసినట్టు అదే పనిగా ప్రచారం ఊదరగొట్టడంపై బాధితులు మండిపడుతున్నారు. భారీ వర్షాలు లేనప్పుడు నీరు వస్తుందా? వ్యవస్థలను మేనేజ్ చేయడంలో, వాస్తవాలకు మసిపూయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబుతో పాటు పచ్చ పత్రికలు మోంథా వేళ కూడా అదే పంథాలో నడిచాయి. అయితే, గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా దానికీ పెద్ద కలరింగ్ ఇచ్చారు. వర్షాలకు బుడమేరు ప్రాంతం మునిగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇక్కడ ఇలాంటి పరిస్థితి లేదంటూ ఓ పత్రికలో పెద్ద ఫొటోతో వార్త ప్రచురించారు. ఇది చూసిన పాఠకులు అసలు భారీ వర్షాలు లేకుండా ఎలా నీరు చేరుతుంది? ఈ రాతలు ఎవరి మెప్పు కోసం? అని చర్చించుకోవడం కనిపించింది. ‘ఆయన రెండు చేతుల్తో పట్టుకొని ఈ తుపాన్‌ను వెనక్కు పంపేవాడే.. ఆ రోజులుకూడా వస్తాయి.. ‘!! మహాటీవీ బిల్డప్..!! నిజమే కదా.! ఆయన వేసవికాలంలో టెంపరేచర్ తగ్గిస్తాడు. ఎద్దులతో విద్యుత్ ఉత్పత్తి చేస్తాడు. సముద్రాన్ని వెనక్కు పంపుతాడు అసలాయన తలుచుకుంటే కానిదేముంది బాబు.!! – ఓ నెటిజన్ -
నేడు తుపానుపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: మోంథా తుపాను నేపథ్యంలో వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో గురువారం ఉ.11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తుపాను తర్వాత జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, పంట నష్టం వంటి వివరాలను పార్టీ కేడర్‌ను ఆయన అడిగి తెలుసుకోనున్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలన్న వైఎస్ జగన్ పిలుపు మేరకు పార్టీ నాయకులు, శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేశారు. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకూ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ కార్యకర్తలు తుపాను బాధితులకు బాసటగా నిలిచారు. ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించడంలో, వారికి ఆహారం అందించడంలో సేవలందించారు. తుపానువల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన బాధితులకు భరోసా ఇవ్వడంతో పాటు వివరాలను సేకరించారు. వాటిని వీడియో కాన్ఫరెన్స్‌లో వైఎస్ జగన్‌కు వివరించనున్నారు. -
రైతులకు నష్టం జరగొద్దు
సాక్షి, హైదరాబాద్: మోంథా తుపాను ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను బుధవారం ఆరా తీశారు. వరి కోతల సమయం,.. పలుచోట్ల కళ్లాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మోంథా ప్రభావం ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో అధికంగా ఉండటం.. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం నిర్దేశించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్, గుండ్రాతిమడుగు స్టేషన్లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోవడం.. పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు దారి మళ్లించిన నేపథ్యంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మోంథా ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయం చేసుకోవాలని.. జిల్లా కలెక్టర్లు మార్గదర్శకత్వం వహించాలని సూచించారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని చెప్పారు. నీటిమట్టాలను పరిశీలించండి నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని చెప్పారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవల్ బ్రిడ్జిలు, కాజ్‌వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. తుపాను ప్రభావంతో వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు, ఇతర క్రిమికీటకాలు విజృంభించి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున పురపాలక, గ్రామాల పారిశుధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. వైద్యారోగ్య శాఖ తగినన్ని మందులను అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రాణ, ఆస్తి నష్టం, పశు నష్టం జరగకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్వయంతో సాగాలని చెప్పారు. హైదరాబాద్‌లో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, అగి్నమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. -
పంటలపై 'మోంథా' తాండవం!
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ‘మోంథా’ తుపాను రైతుల ఆశలను చిదిమేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎటు చూసినా లక్షలాది ఎకరాల్లో పంటలు నేలకొరిగాయి. వరి, మొక్క జొన్న, పత్తి, అరటి ఇలా ఏ పంట చూసినా ముంపు నీటిలో నానుతున్నాయి. కోతకొచ్చే దశలో తుపాను బారిన పడడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలపై తీవ్ర ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది. తుపాను ప్రభావం వల్ల 30 శాతం మేర దిగుబడులు తగ్గిపోనున్నాయని ప్రాథమిక అంచనా. తుపాను ప్రశాంతంగానే తీరం దాటినప్పటికీ, కుండపోత వర్షాలతో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలను అతలాకుతలం చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాంధ్ర మొదలు బాపట్ల వరకు.. ఒంగోలు నుంచి తిరుపతి వరకు వ్యవసాయ, ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. తీర ప్రాంత జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. పలు జిల్లాల్లో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. కోతకొచ్చిన పంట ఇలా నీటి పాలవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. భారీగా తగ్గనున్న దిగుబడులతో వందల కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తి నష్టం రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో నీటమునిగిన మొక్కజొన్న రాశులు ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి.. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి అడుగడుగునా కూటమి ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యానికి తోడు అతివృష్టి–అనావృష్టి వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులకు ఎదురొడ్డి రైతులు పంటలు సాగు చేశారు. ప్రభుత్వం అదునుకు విత్తనాలతోపాటు యూరియా అందించలేకపోయింది. ఆగస్టు 7వ తేదీ వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, ఆ తర్వాత కురిసిన అధిక వర్షాలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఓ వైపు పెట్టుబడులు తడిసి మోపెడైనా.. మరోవైపు ప్రభుత్వం పట్టించు కోకపోయినా మొక్కవోని పట్టుదలతో ఖరీఫ్ సాగు చేశారు. ఈ ఏడాది సాగు లక్ష్యం 86.32 లక్షల ఎకరాలు కాగా, అతికష్టమ్మీద 72.90 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. లక్ష్యానికి మించి ఇప్పటి వరకు వరి, మొక్కజొన్న పంటలు మాత్రమే సాగయ్యాయి. 38.97 లక్షల ఎకరాల్లో వరి, 11 లక్షల ఎకరాల్లో పత్తి, 5 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 4.67 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగయ్యాయి. వరి, మొక్కజొన్నకు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు, పత్తికి రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టారు. అయితే మోంథా తుపాను వల్ల దాదాపు 8 లక్షల ఎకరాలకు పైగా వరి, 1.14 లక్షల ఎకరాల్లో పత్తి, 1.15 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.9 లక్షల ఎకరాల్లో ఉద్యాన.. ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. వరి పంటపై 30 శాతం ప్రభావం సాగైన వరి విస్తీర్ణంలో 30 శాతం పంటను తుపాను దెబ్బ తీసిందని తెలుస్తోంది. తుపాను ప్రభావిత జిల్లాల్లో దాదాపు 6–10 లక్షల ఎకరాలకు పైగా పంట ముంపునకు గురైనట్టుగా అంచనా. ఇతర పంటలన్నీ కలిపి మరో నాలుగైదు లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నట్టు సమాచారం. లేటుగా నాట్లు వేసిన చోట పంట నిలదొక్కుకున్నప్పటికీ ముందుగా సాగైన చోట మాత్రం పంట చాలా వరకు దెబ్బతిన్నట్టు రైతులు చెబుతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని సెంట్రల్–ఈస్ట్రన్ డెల్టా పరిధిలో పంటలు ఎక్కువగా దెబ్బతినగా, ఉత్తరాంధ్ర, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కుండపోత వర్షాల వల్ల అపార నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. నంద్యాల జిల్లా పాములపాడు మండలంలోని భవనాశి వాగు వెంట నీట మునిగిన మొక్కజొన్న తోట కృష్ణా, గోదావరి లంకల్లో అరటి, బొప్పాయి పంట దెబ్బతినగా.. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మిరప పంట దెబ్బతింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అధికారికంగా 396 మండలాల పరిధిలో 2,320 గ్రామాల్లో 1.38 లక్షల మంది రైతులకు సంబంధించి 2.82 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగాప్రాథమికంగా అంచనా వేసింది. దాంట్లో ప్రధానంగా 1.79 లక్షల ఎకరాల్లో వరి, 75 వేల ఎకరాల్లో పత్తి, 15 వేల ఎకరాల్లో మినుము, 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్టుగా చెబుతోంది. నంద్యాల యార్డులో కొనేవారు లేక విక్రయానికి సిద్ధంగా ఉంచిన మొక్క జొన్న రాసులు తడిసిపోవడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. తగ్గనున్న దిగుబడులపై అన్నదాత గుబులు అధిక వర్షాల కారణంగా లక్షలాది ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైంది. వర్షాలు పూర్తిగా తెరిపినిచ్చి, ముంపు నీరు కాస్త దిగినా ముంపునకు గురైన ప్రాంతాల్లోని పంట ఆశించిన దిగుబడి వచ్చే అవకాశాలు ఎంతమాత్రం లేవంటున్నారు. గతేడాది హెక్టారుకు 5,578 కిలోలు చొప్పున దిగుబడి రాగా, ఈ ఏడాది 5,543 కిలోలకు మించి రాదని మొదటి ముందస్తు అంచనాలను బట్టి లెక్కగట్టారు. కానీ ఈ తుపాను ప్రభావం వల్ల దిగుబడి కాస్త 4,000–4,500 కిలోలకు పడిపోతుందని తాజా అంచనా. మొదటి ముందస్తు అంచనా ప్రకారం 81.87 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయగా, తుపాను ప్రభావం వల్ల 65 లక్షల టన్నులకు మించదని తెలుస్తోంది. మరొక వైపు గతేడాది పత్తి హెక్టార్‌కు 442 కిలోలు రాగా, ఈ ఏడాది 357 కిలోలు, మొక్కజొన్న గతేడాది 4,710 కిలోలు రాగా, ఈసారి 4,259 కిలోలు, కంది గతేడాది 171 కిలోలు రాగా, ఈసారి 117 కిలోలు, వేరుశనగ గతేడాది 258 కిలోలు రాగా, ఈ ఏడాది 149 కిలోల చొప్పున దిగుబడులొస్తాయన్నది మొదటి ముందస్తు అంచనా. అయితే తుపాను ప్రభావంతో కనీసం 20–30 శాతం మేర పంటల దిగుబడులు తగ్గి పోతాయని తెలుస్తోంది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు గ్రామంలో నేలకొరిగిన వరి పైరును నిలబెడుతున్న రైతు పంట నష్ట పరిహారం పరిస్థితీ అంతే వైఎస్ జగన్ ప్రభుత్వం ఉండగా ఏ సీజన్‌కు సంబంధించిన పంట నష్టపరిహారాన్ని అదే సీజన్ ముగిసేలోగా అందజేసేవారు. ఇప్పుడా పరిస్థితి మచ్చుకైనా కన్పించడం లేదు. నిర్ణీత గడువులోగానే వ్యవసాయ, ఉద్యాన శాఖలు తుది అంచనాలు తయారు చేస్తున్నప్పటికీ పరిహారం మంజూరు విషయంలో మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కరువు సాయంతో పాటు పంట నష్ట పరిహారాన్ని కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎగ్గొడుతూనే వస్తోంది. గడిచిన 17 నెలలుగా పెండింగ్ ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు 5.50 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.595 కోట్లకు పైగానే ఉన్నాయి. వీటిలో గతేడాది వరదలతో పాటు అకాల వర్షాలకు సంబంధించి 76.75 కోట్లు ఉండగా, ఖరీఫ్ 2024, రబీ 2024–25 సీజన్లకు సంబంధించి దాదాపు రూ.100 కోట్లకు పైగా కరువు సాయం రూ.వంద కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. సాంకేతిక కారణాలతో నిలిచిన ఖరీఫ్ 2023, రబీ 2023–24 సీజన్లకు సంబంధించి మరో రూ.311.39 కోట్లు కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం గాజుల్లంక–పోతార్లంక రోడ్డులో నేలమట్టమైన అరటి తోట కదిలిస్తే కన్నీరే.. మోంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దాదాపు రాష్ట్రంలోని సగం జిల్లాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. రైతులను కదిలిస్తే చాలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒక్క నంద్యాల జిల్లాలోనే 1.05 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు స్పష్టమవుతోంది. కర్నూలు జిల్లాలో వేలాది ఎకరాల్లో వాణిజ్య, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో వేలాది ఎకరాల్లో వేరుశనగ, వరి, టమాటా, ఉద్యాన పంటలు నీట మునిగాయి. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా దాదాపు 33వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. పల్నాడు జిల్లాలో ప్రధానంగా 43,375 ఎకరాల్లో పత్తి, 5,250 ఎకరాల్లో వరి, 3,048 ఎకరాల్లో మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. బాపట్ల జిల్లాలో వరి, పత్తి, మినుము, సోయాబీన్, మిర్చి, అరటి, బొప్పాయి పంటలు.. మొత్తంగా 12,293 ఎకరాల్లో నెలకొరిగాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరి పంటతోపాటు బొప్పాయి, అరటి, కూరగాయ పంటలకు అపార నష్టం వాటిల్లింది. 1,15,892 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది. ఉద్యాన పంటలకు రూ.73.45 కోట్ల నష్టం జరిగినట్టు అంచనా. ఎన్టీఆర్ జిల్లాలోని 17 మండలాల్లో 42,483 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది. విజయనగరం జిల్లాలో రూ.60 కోట్ల మేర పంట నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం జిల్లాలో 6 వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. వేలాది కొబ్బరి చెట్లు పడిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 10,309 ఎకరాల్లో పంట నీట మునగ్గా, ఈదురు గాలుల ధాటికి 16,072 ఎకరాల్లో వరి పంట నేలవాలింది. వేలాది ఎకరాల్లో ఆక్వా పంటకు నష్టం వాటిల్లింది. నల్లి క్రిక్ సముద్రపు ఆటుపోట్లతో చెరువుల గట్లు తెగి ముంపు బారిన పడ్డాయి. ఏలూరు జిల్లాలో 15 వేల ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. వర్షాలు, చలిగాలుల ప్రభావంతో చెరువుల్లో ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతుండటం ఆక్వా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో 16,092 హెక్టార్లలో వరి నేలకొరిగింది. వేలాది హెక్టార్లలో ఇతర పంటలు దెబ్బతిన్నాయి. నెల్లూరు జిల్లా పాతదేవరాయపల్లిలో నీటిలో తేలియాడుతున్న వరి పైరు ఉచిత పంటల బీమా ఉండి ఉంటే..⇒ కూటమి ప్రభుత్వంలో పంటలకు ఈ–క్రాప్ లేదు.. ఇన్సూ్యరెన్సూ లేదు.. ఇన్పుట్ సబ్సిడీ అంతంతే.. పెట్టుబడి సాయం రూ.40 వేలకు గాను తూతూ మంత్రంగా కొద్ది మందికే రూ.5 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఉల్లి, టమాటా పంటలకు కూలి కూడా దక్కక పశువులకు వదిలేస్తున్న దీన స్థితి. కూటమి ప్రభుత్వం ఆర్బీకేలను పూర్తిగా నిర్వీర్యం చేసి రైతులకు తీవ్ర అన్యాయం చేసింది. రైతులకు విత్తనాలు, ఎరువులు అందకుండా చేసింది. ⇒ ఉచిత పంటల బీమా పథకం ఉండి ఉంటే ఇలాంటి విపత్తు వేళ రైతులకు అక్కరకొచ్చేది. నూరు శాతం కవరేజీతో నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతి ఎకరాకు బీమా రక్షణ లభించేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేకుండాపోయింది. కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అటకెక్కించి స్వచ్ఛంద నమోదు పద్ధతిన పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ప్రీమియం భారం కావడంతో ఈ పథకంలో చేరేందుకు రైతులెవ్వరూ ముందుకు రాలేదు. ⇒ ఉచిత పంటల బీమా పుణ్యమా అని ఖరీఫ్–2024లో 84.80 లక్షల మంది రైతులు 69.51 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటలకు బీమా రక్షణ పొందగలిగారు. ఉచిత పంటల బీమాను ఎత్తివేయడంతో రబీ 2024–25 సీజన్లో 9.93 లక్షల ఎకరాలకే పరిమితం కాగా, 7.65 లక్షల మంది రైతులు మాత్రమే బీమా కవరేజ్ పొందలిగారు. ఖరీఫ్ 2024–25 సీజన్లో 19.60 లక్షల ఎకరాల్లో మాత్రమే బీమా కవరేజ్ లభించగా, 19.51 లక్షల మంది బీమా చేయించుకోగలిగారు.⇒ 2024 జూన్‌లో చెల్లించాల్సిన రూ.930 కోట్ల ప్రీమియం బకాయిలను కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టడంతో 2023–24 సీజన్‌కు సంబంధించి రూ.1,385 కోట్లు నేటికీ రైతులకు అందని పరిస్థితి నెలకొంది. మరొక వైపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖరీఫ్ 2024 సీజన్‌కు రూ.894.62 కోట్లు, రబీ సీజన్‌కు రూ.758.74 కోట్లు, ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రూ.774.87 కోట్లు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ప్రీమియం చెల్లించాల్సి ఉండగా, ఒక్క పైసా కూడా చెల్లించిన పాపాన పోలేదు. ఫలితంగా పంటల బీమా పరిహారం అందని ద్రాక్షగా మారింది.తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి– పట్లంట్ల రోడ్డులోని ఓ తోటలో విరిగిపడిన బొప్పాయి చెట్లు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలిపంట నష్టం అంచనాలు పక్కాగా రూపొందించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో మాదిరిగా తూతూ మంత్రంగా చేపట్టడం కాకుండా, పక్కాగా చేపట్టి సాధ్యమైనంత త్వరగా రైతుల ఖాతాకు పరిహారం జమ చేయాలని, పెండింగ్ బకాయిలు కూడా చెల్లించాలని కోరుతున్నాయి. ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా విపత్తుల్లో దెబ్బతిన్న వరి పంటకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారని, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆ మాటను నిలబెట్టు కోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఉచిత పంటల బీమాను కొనసాగించి, నూరు శాతం పంటల బీమా వర్తింప చేయాలని, దెబ్బతిన్న ప్రతి ఎకరాకు ప్రభుత్వమే బాధ్యతగా తీసుకొని పంటల బీమా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. తుపాను అనంతరం పంటలను కాపాడుకునేందుకు పంటను బట్టి ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు రైతులకు ఖర్చవుతుందని అంచనా. ఇందు కోసం ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి, లేబరు ఖర్చును పూర్తిగా ఈ పథకం కింద ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.గుంటూరు జిల్లా తాడికొండలో పత్తి పొలంలోకి చేరిన వరద నీరు ప్రభుత్వం ఆదుకోకపోతే మేం బతకలేంనాలుగెకరాల్లో పత్తి, రెండెకరాల్లో కంది పంటలను సాగు చేశాను. పత్తి తీతలు ప్రారంభమయ్యే దశలో తుపాను కారణంగా కాయలు కుళ్లిపోయాయి. ఎకరాకు 3–5 క్వింటాళ్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కంది పంట పూర్తిగా నేలవాలింది. తీవ్రంగా నష్టపోయాను. నాలాంటి రైతులు ఎంతో మంది నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకోకపోతే మేం బతకలేం. – బొల్లా మాలకొండయ్య, నాదెండ్ల, పల్నాడు జిల్లాపంట పూర్తిగా నేలకొరిగింది నాకు ఉన్న రెండు ఎకరాలతో పాటు మరో ఎనిమిది ఎకరాల భూమి కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాను. రూ.3 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాను. తుపాను వల్ల పంట పూర్తిగా నేలకొరిగింది. ప్రభుత్వం న్యాయం చేసి మాలాంటి రైతులను ఆదుకోవాలి. – కాళా వెంకటరావు, ఊలపల్లి గ్రామం, బిక్కవోలు మండలం, తూర్పుగోదావరి జిల్లానారుమళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి వరి పంట సాగు చేయడానికి పోసుకున్న నారుమళ్లు తుపానుతో పూర్తిగా దెబ్బతిన్నాయి. మరో 20 రోజుల్లో నాట్లు వేయాల్సి ఉంది. అయితే పూర్తిగా దెబ్బతింది. మళ్లీ నార్లు పోసుకోవాల్సి ఉంది. మరోసారి విత్తనాలు కొనుగోలు చేయడానికి ఆర్థిక స్తోమత లేదు. ప్రభుత్వం విత్తనాలు రైతులకు ఉచితంగా అందించాలి. – కృష్ణయ్య, రైతు, వాకాడు మండలం, తిరుపతి జిల్లా పంట పూర్తిగా నానిపోయింది ఈ ఏడాది చోడి (రాగులు) పంట వేసిన సమయంలో విపరీతమైన ఎండ వల్ల పంట ఎండిపోయింది. కొద్దోగొప్ప మిగిలిన పంట చేతికందే సమయంలో తుపాను కారణంగా చేనంతా నేలకొరిగింది చోడి కంకులు పూర్తిగా నానిపోయాయి. ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వం ఆదుకోవాలి. – పి.విశ్వనాథ్, గిరిరైతు, బోసుబెడ గ్రామం, అరకులోయ చివరికి కన్నీళ్లే మిగిలాయిమూడు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాం. పంట బాగా పండిందని సంబరపడ్డాం. తుపాను ఉందని తెలియడంతో కల్లాల్లో ఉంచితే మొక్కజొన్నలు తడిచి పోతాయని భయపడ్డాం. వ్యవసాయ మార్కెట్ యార్డులో నిల్వ ఉంచితే తడవకుండా గట్టెక్కుతామని కూలీలను పిలిపించుకుని మొక్కజొన్నను ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్‌కు తరలించాం. గంట గంటకు వరద నీరు వచ్చి చేరింది. కళ్ల ముందే మొక్కజొన్నలు కొట్టుకుపోతుంటే కాపాడుకోలేకపోయాం. ఏడు రోజులు తిప్పలు పడుతూ పంటను కాపాడుకుంటే కష్టమంతా వర్షం పాలైంది. – శ్రీదేవి, క్రిష్ణాపురం, ఆత్మకూరు మండలం, నంద్యాల జిల్లాఈ అప్పు ఎలా తీర్చుకోవాలయ్యా?కూలీనాలీ చేసుకుంటూ మాకున్న పొలంతో పాటు మరికొంత పొలం కౌలుకు తీసుకుని మూడు ఎకరాల్లో వరి పంట సాగు చేశాం. నారు పోసిన సమయం నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.1.30 లక్షలు అప్పు చేసి పెట్టుబడి పెట్టాం. తీరా‡ కోతకు వచ్చి కోసుకునే సమయంలో తుపాను దెబ్బకు పైరు మొత్తం నేలకు వాలిపోయింది. వర్షం అలానే కురుస్తుండడంతో ధాన్యానికి మొలకలు వచ్చాయి. ప్రస్తుతం కోసుకునే పరిస్థితులు కనిపించడం లేదు. చేసిన అప్పు ఎలా తీర్చాలో దిక్కు తోచడం లేదు. – పి.రాజమ్మ, ఉప్పలపాడు , నెల్లూరు జిల్లా -
రైతన్న వెన్ను విరిచిన వాన
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ మొత్తాన్ని అతలాకుతలం చేస్తూ వచ్చిన వర్షాలు ‘మోంథా’తుపానుతో రైతుల నడ్డి విరిచాయి. గత సెప్టెంబర్ నుంచి కురుస్తున్న అకాల వర్షాలతో పత్తి పంట ఇప్పటికే చాలా వరకు దెబ్బతింది. చేలల్లో నీరు నిలిచి పత్తి గింజలు బలహీనంగా ఎదిగాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మొదటి విడత పత్తి ఏరడం పూర్తయ్యింది. రెండోదశ పత్తి ఏరేందుకు సిద్ధమవుతున్న చేలకు ‘మోంథా’తుపాను తీవ్ర నష్టం కలిగించింది. పత్తి గింజలు విచ్చుకుంటున్న సమయంలో కురిసిన వర్షాలతో పత్తి మరింత దెబ్బతింది. పత్తి అధికంగా సాగయ్యే ఆదిలాబాద్‌లో వర్ష ప్రభావం అధికంగా లేకపోవడంతో ఇక్కడ నష్టం కొంత తక్కువగానే ఉంది. వరి పంట చేతికి వస్తున్న సమయంలో కురిసిన వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతలు పూర్తయిన రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పోయగా, చాలా ప్రాంతాల్లో ధాన్యం తడిసిపోయింది. ఇక కోతకు వచ్చిన వరి వర్షాలకు చాలా జిల్లాల్లో నేలకొరిగింది. పొట్టకొచ్చిన వరి నేలరాలడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏపీ సరిహద్దు జిల్లాల్లో అధిక నష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆనుకొని ఉన్న జిల్లాల్లో మోంథా తుపానుతో నష్టం ఎక్కువగా ఉంది. నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో పత్తి పంట నష్టం అధికంగా ఉన్నట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది. మహబూబాబాద్, వరంగల్, భూపాలపల్లి, వికారాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాల్లో కూడా పత్తి దెబ్బతింది. వరంగల్ ప్రధాన వ్యవసాయ మార్కెట్లో వడ్లు, మక్కలు వర్షం నీటిలో నానిపోయాయి. ఖమ్మం, మహబూబాబాద్, భద్రాచలం, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులు నివేదికలు ఇచ్చినట్టు సమాచారం. మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర నష్టం మహబూబాబాద్ జిల్లాలో పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి 2,15,723 ఎకరాల్లో సాగు కాగా, ప్రస్తుతం పొట్ట దశలో ఉంది. ఈ వర్షాల కారణంగా 50 శాతానికిపైగా నష్టం వాటిల్లింది. మొక్కజొన్న 62,751 ఎకరాల్లో సాగు చేసి, కంకులను కోసి రైతులు విక్రయించేందుకు కల్లాలు, అనువుగా ఉన్న ప్రాంతాల్లో ఆరబోసుకు న్నారు. మొక్కజొన్నలకు 70 నుంచి 80 శాతానికిపైగా నష్టం వాటిల్లింది. పత్తి 86,224 ఎకరాల్లో సాగు కాగా, పంట కోతదశకు చేరుకున్న సందర్భంలో 60 శాతానికి పైగా నష్టం చేకూర్చనుంది. మిర్చి 38,289 ఎకరాల్లో సాగు చేయగా, పూత 40% వరకు రాలిపోతున్నట్టు ప్రాథమికంగా అంచనా. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో... ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఈసారి అత్యధికంగా 6,85,262 ఎకరాల్లో పత్తి సాగైంది.భారీ వర్షాల కారణంగా పత్తి పంట దిగుబడి సగానికి పడిపోవడం, ప్రస్తుత తుపాను కారణంగా పంట మరింత దెబ్బతినడంతో ఎకరానికి ఐదు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు చేతికంది వచ్చిన పంట ఆగమైందిరెండున్నర ఎకరాల్లో వరిసాగు చేయగా రూ.లక్షకుపైగా ఖర్చు అయ్యింది. ప్రస్తుతం వరి పొట్టదశకు చేరుకుంది. కొద్దిరోజుల్లో వరి కోతలు అనుకున్నాం. అంతలోనే తుపాను కారణంగా చేతికి అంది వచ్చిన పంటకు నష్టం వాటిల్లింది. –భూక్యా శాంతి, సోమ్ల తండా మహబూబాబాద్ పత్తి ఏరకుండా వదిలేశానునాకున్న 3 ఎకరాల్లో పత్తి పంట వేశా. ఇప్పటివరకు ఎకరాకు రూ.30 వేల చొప్పున ఖర్చు అయ్యింది. ఈసారి భారీ వర్షాలకు పత్తి దిగుబడి సగానికి తగ్గింది. కూలీలతో పత్తి ఏరేందుకు సిద్ధమవుతున్న సమయంలో తుపాను కారణంగా పంట మరింత దెబ్బతింది. కూలీల ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడం పత్తి తీయడం మానేశాను. – లాల్యా, పోచమ్మతండా, వెల్దండ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా) రైతులు అప్రమత్తంగా ఉండాలిమోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో ఆరెంజ్ హెచ్చరిక జారీ అయ్యింది. రైతులు అప్రమత్తంగా ఉండాలి. కోసిన వరి, మొక్కజొన్న, పత్తిని సురక్షిత ప్రాంతాల్లో దాచుకోవాలి. వరి, మొక్కజొన్నను తుపాను ప్రభావం తగ్గిన తర్వాత కోయాలి. పత్తి ఏరవద్దు. తొందరపడి కోస్తే తడిసే అవకాశం ఉంది.అధిక నీటి నిల్వతో ఎండుతెగులుతో పాటు ఇతర చీడపీడలు సోకే అవకాశాలు ఉన్నందున పలు జాగ్రత్తలు పాటించాలి. – శ్రీనివాస్, డీఏవో పెద్దపల్లి -
ముంచేసిన మోంథా
సాక్షి, నెట్వర్క్: మోంథా తుపాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బుధవారం అనేక జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. చాలాచోట్ల రహదారులు తెగిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. చెరువులు, కుంటలు తెగిపోగా... కాల్వలు, వాగులు ఉప్పొంగాయి. వరదనీరు పొలాలను ముంచేసింది. పంటలు నేలకొరిగాయి. కాలనీలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరడంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. నాగర్‌కర్నూల్, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని చాలాచోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. 29 ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిశాయి. ఈ ప్రాంతాల్లో 12 గంటల్లోనే 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. 105 ప్రాంతాల్లో ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 10 సెంటీమీటర్లకు పైబడి వర్షపాతం నమోదైంది. గత ఐదేళ్లలో ఈ స్థాయిలో భారీ వర్షాలు నమోదు కావడం ఇదే ప్రథమం. మంగళవారం రాత్రి ఏపీలోని నర్సాపురం వద్ద తీరం దాటిన మోంథా తీవ్ర తుపాను ప్రభావం తెలంగాణపై తీవ్రంగా పడింది. బుధవారం సాయంత్రానికి మోంథా బలహీనపడి వాయుగుండంగా మారింది. గురువారం మధ్యాహ్నం కల్లా దీని ప్రభావం పూర్తిగా తగ్గనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండ్రోజులు మోస్తరు వర్షాలు... ⇒ ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ⇒ నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ⇒ ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ 29 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 82.90 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 110.87 సెంటీమీటర్లు నమోదైంది. సాధారణం కంటే 34 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. 5 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 20 జిల్లాల్లో అధికం, 8 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఓరుగల్లు అతలాకుతలం ఉమ్మడి వరంగల్ జిల్లాను మోంథా తుపాను కుదిపేసింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు దంచికొట్టిన వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ప్రధానంగా వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది. కోతకొచ్చిన వరి పంట నేలరాలింది. ఇప్పటికే కోతలు పూర్తయి కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం కల్లాల్లోనే తడిసింది. మిర్చి, మొక్కజొన, పత్తి రైతుల పరిస్థితి ఆగమాగమైంది. 30 శాతమే వరికోతలు పూర్తి కాగా, సుమారు 4.50 లక్షల ఎకరాల్లో కోతలకు సిద్ధమయ్యాయి. పత్తి ఏరడానికి సిద్ధమైన తరుణంలోనే తుపాను రావడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని సుమారు 71 కాలనీల్లో వరద నీరు చేరినట్లు సమాచారం. గురువారం కూడా తుపాను కొనసాగుతుందన్న వాతావరణశాఖ హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా> ఆరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. జలదిగ్బంధంలో ‘గ్రేటర్ వరంగల్’... భారీ వర్షాలకు వరంగల్ నగరంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. హనుమకొండ బస్టాండ్‌లోకి భారీగా వరద చేరి చెరువును తలపించింది. ఎస్ఆర్ నగర్, వివేకానందనగర్, సాయిగణేశ్కాలనీ, లక్ష్మీ గణపతి కాలనీ, మధురానగర్, గిరిప్రసాద్‌నగర్, గాం«దీనగర్, మైసయ్యనగర్, భద్రకాళినగర్, పోతననగర్, రాజీవ్‌నగర్, సమ్మయ్యనగర్, వాజ్‌పేయి కాలనీ, విద్యానగర్, పోచమ్మకుంట, ఇంద్రానగర్, దీన్‌దయాళ్‌నగర్, కాజీపేట ప్రశాంత్‌నగర్, బ్యాంక్ కాలనీల్లోకి వరద నీరు చేరింది. ప్రధాన నాలాలు పొంగిపొర్లాయి. హనుమకొండ, నయీంనగర్, కేయూ క్రాస్‌రోడ్డు, ములుగు క్రాస్‌రోడ్డు, హంటర్‌రోడ్డు, ఎన్జీవోస్ కాలనీ, అంబేడ్కర్ స్టేడియం తదితర ప్రాంతాల్లో వరదనీరు రోడ్లపైకి రావటంతో గంటలపాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఏజేన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. రైల్వే స్టేషన్లు, రైలు పట్టాలపైకి వరద చేరడంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్ల రాకపోకలను నిలిపి వేసింది. వరంగల్‌లో ఇంటర్సిటీ, ఈస్ట్‌కోస్ట్, మహబూబాబాద్‌లో కృష్ణ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపి వేసినట్లు అధికారులు తెలిపారు. వరంగల్ మీదుగా వెళ్లే పలు రైళ్లు షాలిమార్, టాటా నగర్, షిరిడీ, కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ను వయా కాజీపేట మీదుగా దారి మళ్లించి భాగ్యనగర్, శాతవాహనను కూడా రద్దు చేశారు. అంతటా అప్రమత్తం... జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నంబర్ 7981975495, టోల్ ఫ్రీ నంబర్ 1800–425–1115 ఏర్పాటు చేశాం. అధికారులు ఎవరూ జిల్లా కేంద్రాన్ని వదిలి వెళ్లరాదని, సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయరాదని ఆదేశాలు జారీచేశాం. – స్నేహ శబరీష్, హనుమకొండ జిల్లా కలెక్టర్ రంగారెడ్డిలో పొంగుతున్న వాగులు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో బుధవారం కుండపోత వర్షం కురిసింది. తలకొండపల్లిలో అత్యధికంగా 11.72 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పంట పొలాలు నీట మునిగాయి. కల్లాలు, మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన ధాన్యం తడిపోయింది. పత్తి, వరి, కూరగాయలు, పూల తోటలకు తీరని నష్టం వాటిల్లింది. మూసీ, ఈసీ, కాగ్నా సహా పలు చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం వీర్‌శెట్టిపల్లి గ్రామానికి చెందిన యువకులు కాగ్నా వాగులో కొట్టుకుపోతున్న యాలాల మండలం అగ్గనూరుకు చెందిన పెద్దింటి నర్సింలు అనే వ్యక్తిని కాపాడారు. అతడు కొద్ది రోజులుగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నట్లు సమాచారం. సిద్దిపేట జిల్లాలో వర్ష బీభత్సం సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం కుండపోత వర్షం కురిసింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో 21.28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొనుగోలు కేంద్రాల్లో, మార్కెట్ యార్డుల్లోని ధాన్యం కుప్పలు తడిసిముద్దయ్యాయి. హుస్నాబాద్ పట్టణంలోని దుకాణాల్లోకి వరద నీరు చేరింది. ఆర్టీసీ బస్టాండ్‌లోని ప్లాట్‌ఫాంల పైకి నీరు రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఖమ్మం జిల్లాను వణికించిన మోంథా మోంథా తుపాను ఉమ్మడి ఖమ్మం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించింది. భారీ వర్షాలకు చేతికందే దశలో ఉన్న పంటలు నాశనమయ్యాయి. బోనకల్ మండలంలో 9.34 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పాలేరు, వైరా, లంకాసాగర్, కిన్నెరసాని రిజర్వాయర్లలో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. కొణిజర్ల మండలం అంజనాపురం సమీపంలో నిమ్మవాగు బ్రిడ్జి పైనుంచి వెళ్లటానికి ప్రయతి్నంచిన డీసీఎం వరద నీటిలో కొట్టుకుపోయింది. డీసీఎంను నడిపిన భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మోతీనగర్ కాలనీకి చెందిన ఆరేపల్లి మురళి (32) నీటిలో గల్లంతయ్యాడు. మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతాల్లో రైల్వేట్రాక్‌పైకి వరద చేరడంతో ఖమ్మం మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దుచేసి, ఇంకొన్నింటిని దారి మళ్లించారు. ఖమ్మంలోని మున్నేటి వరద ఉధృతిని కలెక్టర్ అనుదీప్ పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. కలెక్టరేట్లు, పోలీసు కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం నిమ్మవాగులో కొట్టుకుపోతున్న డీసీఎం వాహనం నాగర్‌కర్నూల్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షం ఉమ్మడి పాలమూరు జిల్లాలో బుధవారం భారీ వర్షం కురిసింది. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలో అత్యధికంగా 18.22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అచ్చంపేట, చారకొండ, ఊర్కొండ, తెలకపల్లి, బల్మూర్ మండలాల్లో 12 సెం.మీ. వర్షం కురిసింది. నల్లమలలోని ఉమామహేశ్వర దేవాలయం సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట వాగులో కారు కొట్టుకుపోయింది. నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లోకి వరద నీరు చేరింది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని హజికన్పేటలో ఓ ఇళ్లు కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకున్న చింతామణి అనే మహిళలను పోలీసులు కాపాడారు. మహబూబ్‌నగర్‌లో ఎర్రకుంట, కొత్తచెరువు ఉధృతంగా ప్రవహించడంతో పలు కాలనీలు నీట మునిగాయి. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబోసిన మొక్కజొన్న కొట్టుకుపోయింది. హైదరాబాద్–శ్రీశైలం హైవేపై రాకపోకలు నిలిపివేత నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టుకు వరద భారీగా వచ్చి అలుగు ఉధృతంగా పారుతోంది. ప్రాజెక్టుకు కుడి భాగాన నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ గ్రామ శివారులో ఉన్న రెండో అలుగు దిగువన హైదరాబాద్ – శ్రీశైలం రహదారి బ్రిడ్జి వరద ధాటికి దెబ్బతింది. దీంతో ఈ మార్గం గుండా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో హైదరాబాద్–శ్రీశైలం వైపు వెళ్లే వాహనాలను తెలకపల్లి– లింగాల– బల్మూర్– అచ్చంపేట మీదుగా దారి మళ్లించారు. చెట్టు కూలి వ్యక్తి మృతి సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రానికి చెందిన కోట లక్ష్మీనారాయణ (45) చెట్టు కూలిపడి మరణించాడు. నూతనకల్ మండల పరిధిలోని తానంచర్ల గ్రామంలో మెడికల్‌షాపు నిర్వహిస్తున్న అతడు.. సొంత గ్రామంలోని పామాయిల్ తోటను చూసేందుకు బుధవారం వెళ్తుండగా చందుపట్ల గ్రామ శివాలో భారీ వృక్షం మొంథా తుపాన్ ధాటికి కూలి ద్విచక్ర వాహనంపై పడింది. దీంతో లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతిచెందాడు. కామారెడ్డి, నిజామాబాద్‌లో అప్రమత్తం కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి. రైతులు కల్లాల్లోని ధాన్యం కుప్పలు తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడవకుండా కుప్పలు చేసి బుధవారం రోజంతా టార్పాలిన్లు కప్పి ఉంచారు. ఇటు కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్లను నిలిపేశారు. వ్యవసాయ అధికారుల సూచనతో రైతులు పంట కోతలను కూడా ఆపేశారు. ఉమ్మడి కరీంనగర్లో పంటలకు తీవ్ర నష్టం ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలకు వరి పంట నేలవాలింది. పలు చోట్ల కొనుగోలు కేంద్రాల్లో, మార్కెట్ యార్డులలోని ధాన్యం తడిసిపోయింది. కరీంనగర్, సిరిసిల్ల, హుజూరాబాద్ పట్ణణాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రామగుండం రీజన్‌లోని సింగరేణి ఓసీపీలో 1.5 లక్షల ఓబీ తవ్వకాలు, 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. నక్కవాగు, బిక్కవాగు, గంజివాగు, మానేరు, గోదావరి నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 1.60 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండటంతో 11 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీరును దిగువకు వదులుతున్నారు. నల్లగొండ జిల్లా అతలాకుతలం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బుధవారం వర్షం బీభత్సం సృష్టించింది. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని కొమ్మేపల్లి వద్ద గిరిజన బాలుర గురుకుల ఆశ్రమ పాఠశాల వరద నీటిలో చిక్కుకుంది. దీంతో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్ ఇతర అధికారులు అక్కడికి చేరుకుని 500 మంది విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని వరదనీరు చుట్టముట్టింది. తుంగతుర్తి మండలంలో సంగెం– వెంకేపల్లి – కోడూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట పట్టణంలోని 16వ వార్డులో వరద నీరు ఇళ్లలోకి చేరింది. పెన్‌పహాడ్ మండలం గాజులమల్కాపురం, ధర్మాపురం గ్రామాల్లో విద్యుత్ తీగలపై చెట్ల విరిగిపడి స్తంభాలు నేలకూలాయి. కోదాడ పట్టణంలో ఉలకవాగు అలుగుపోయడంతో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రామాపురం ఊర చెరువుకు గండి పడి వరిపొలాలు నీట మునిగాయి. వర్షానికి వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. గుండాల మండలం మాసాన్‌పల్లి, నారాయణపురంలో పలువురి ఇళ్లు కూలాయి. యాదాద్రి భువనగిరి జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. గురువారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విశాఖ పట్నం నుంచి తిరిగొచ్చిన విమానం హైదారాబాద్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం విశాఖపట్నం బయలుదేరి వాతావరణం అనుకూలించకపోవటంతో తిరిగి వచ్చింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రె 2885 విమానం బుధవారం ఉదయం 6.57 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. తుపాను కారణంగా విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో విమానం దిగేందుకు ప్రతికూల వాతావరణం ఉడడంతో దానిని తిరిగి హైదారాబాద్‌కు మళ్లించడంతో 9.57 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. విజయవాడకు బయలుదేరాల్సిన ఇండిగో 6ఈ 7201 విమానాన్ని కూడా ప్రతికూల వాతావరణం కారణంగా రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. -
పార్టీ నేతలతో వైఎస్ జగన్ జూమ్ మీటింగ్
తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(గురువారం, అక్టోబర్ 30వ తేదీ) పార్టీ నేతలతో జూమ్ మీటింగ్‌లో పాల్గొనున్నారు. మోంథా తుపానుకు సంబంధించి పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్‌లో వైఎస్ జగన్ పాల్గొనున్నారు. మోంథా తుపాను ప్రభావంతో ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై పార్టీ నేతలతో చర్చించనున్నారు వైఎస్ జగన్. రేపు ఉదయం 11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు వైఎస్ జగన్.తుపాను తర్వాత ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను జిల్లా అధ్యక్షులు ఈ కాన్ఫరెన్స్‌లో వివరించనున్నారు. తుపాను కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని, తాము క్షేత్రస్థాయిలో పరిశీలించిన వివరాలను తెలియజేయనున్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై పార్టీ నాయకులకు .జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.కాగా, మోంథా తుపాను నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. తుపాను నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు, సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.జగన్ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ నాయకులు, శ్రేణులు గడచిన మూడు నాలుగు రోజులుగా చురుగ్గా పనిచేశారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించడంలో, వారికి ఆహారం అందించడంలో చొరవచూపారు. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకూ పలు జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ కార్యకర్తలు బాసటగా నిలిచారు. తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి తుపాను మిగిల్చిన నష్టాన్ని స్వయంగా చూసి, బాధితులకు భరోసా ఇచ్చారు. -
వణికించిన మోంథా.. స్తంభించిన జనజీవనం (ఫొటోలు)
-
వర్షాలు, వణికించే చలిగాలులు : ఈ హెల్త్ టిప్స్ పాటించండి!
మోంథా తుఫాను ప్రభావం బాగా కనిపిస్తోంది. వర్షం, చల్లటి గాలులు కూడా వణికిస్తున్నాయి. మరోవైపు చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వర్షంలో తడవడం వల్ల జలువు, జ్వరం గొంతు నొప్పి లాంటి వ్యాధులు ముసిరే అవకాశం ఉంది. వ్యాధి నిరోధకశక్తి తగ్గుతుంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవాల్టీ టిప్ ఆఫ్ ది డేలో భాగంగా అలాంటి జాగ్రత్తలు కొన్ని చూద్దాం.చలికాలంలో ఫ్లూ, సైనసైటిస్, ఊపిరితిత్తుల్లో వైరల్ ఇన్ఫెక్షన్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి(సీవోపీడీ), ఆస్తమా వంటి సమస్యలు తలెత్తుతాయి. హైపోథెర్మియా, చర్మం లోపలి కణజాలం గడ్డ కట్టి గాయాలు కావటం, పెర్నియో, ఇమ్మర్షన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.చలిగాలులు అనేక రకాల వ్యాధులను మోసుకొస్తాయి. వైరస్లు వృద్ధి చెందే ప్రమాదం ఉంది. దగ్గు, జలుబు, గొంతునొప్పి, తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఆయాసం, న్యూమోనియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. గొంతు ఇన్ఫెక్షన్స్, గతంలో కీళ్ల నొప్పులు ఉన్నవారిలో కీళ్ల నొప్పులు పెరుగుతాయి. కొందరిలో తలనొప్పి వస్తుంది. గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కనీస జాగ్రత్తలువర్షంలో తడవకుండా జాగ్రత్త పడాలి. పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రాలను ధరించాలి. రెయిన్ కోట్లు, గొడుగులు, చలికి తట్టుకునేలా స్వెట్లర్లు, చెవులు కవర్ అయ్యేలా టోపీలు తప్పనిసరిగా వాడాలి. ఒకవేళ వర్షంలో తడిచినా, వెంటనే వేడినీటితో స్నానం చేయడం, జుట్టు తడిలేకుండా పూర్తిగా ఆరబెట్టుకోవడం తప్పనిగా పాటించాలి.చలి ఎక్కువగా ఉన్న సమయాల్లో మాస్కులు ధరించాలి. దీంతో వైరస్ సోకదు. వేరేవారికి సోకకుండా ఉంటుంది. చలితీవ్రత అధికంగా ఉంటే బయటకు రాకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడేవారు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారు ఇన్హేలర్లను అందుబాటులోఉంచుకోవాలి. ఫ్రిజ్‌లో పెట్టిన చల్లటి ఆహారం కాకుండా, అప్పటికప్పుడు వండుకున్నది వేడి, వేడిగా భుజించాలి.చల్లని డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీంలకు పిల్లల్ని ఎంత దూరంగా పెడితే అంత మంచిది.నిల్వ పదార్థాలను జోలికి వెళ్లవద్దు. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి.వ్యాధి నిరోధకశక్తి పెంచుకునేలా చలికాలంలో వ్యాధి నిరోధకతను పెంచుకోవాలి పౌష్టికాహారం తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన ఉసిరి, నిమ్మకాయల రసం తీసుకోవాలి. ఎక్కువగా నీటిని తాగాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడం మరింత మంచిది. శరీరంలో వేడి ఉత్పత్తి అయ్యేలా జీర్ణవ్యవస్థ నిరంతరం పనిచేస్తుండాలి. ప్రోటిన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. గుడ్లు, పనీర్ లాంటివి తీసుకోవాలి. అలాగే ఈ చలిగాలులు చర్మాన్ని, జుట్టును కూడా ఇబ్బంది పెడతాయి. వాతావరణం చల్లగా ఉన్నా గాలిలో తేమశాతం తక్కువగా ఉంటుంది. శరీరంలోని తేమ బయటికి పోవడంతో చర్మం పొడిబారుతుంది. అందుకే వాటర్ ఎక్కువగా తీసుకుంటూ, చర్మంపైన ఉండే నూనె పొరను కాపాడుకునేలా మంచి మాయిశ్చరైజర్‌ను వాడాలి. ఇదీ చదవండి: గర్ల్ ఫ్రెండ్‌తో బ్రేకప్ సార్... లీవ్ ప్లీజ్! వైరల్ మెయిల్ -
భారీ గాలులతో వర్షాలు.. హైదరాబాద్ ప్రజలకు హెచ్చరిక
-
Montha Cyclone : వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందించిన గంగుల బ్రిజేంద్ర రెడ్డి
-
APSRTCపై మోంథా పంజా.. ప్రయాణికుల కష్టాలు
-
Montha Cyclone: 60 ఏళ్ల వయసులో ఇలాంటి ఉప్పెన చూడలేదు
-
బాబు వద్దనుకున్న గ్రామ సచివాలయ సిబ్బందే కీలక పాత్ర పోషించారు..
-
తీరం దాటిందని లైట్ తీసుకోకండి.. ఈరోజు కూడా ప్రమాదంలోనే AP..
-
భయంకరంగా వైజాగ్ RK బీచ్..
-
పట్టాలపైకి వరద.. పలు రైళ్ల రద్దు
సాక్షి, డోర్నకల్: మోంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షం కారణంగా రైలు పట్టాలపైకి వరద నీరు చేరింది. దీంతో, డోర్నకల్ రైల్వేస్టేషన్లో పట్టాల పైనుంచి వరదనీరు ప్రవహిస్తోంది.పట్టాలపైన నీరు చేరడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. డోర్నకల్ రైల్వేస్టేషన్లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్, మహబూబాబాద్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లను అధికారులు నిలిపివేశారు. కొండపల్లిలో సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ను ఆపేశారు. అలాగే రాష్ట్రంలోని పలు స్టేషన్లలో 12 గూడ్స్ రైళ్లు తుపాను ఎఫెక్ట్ దాటికి నిలిచిపోయాయి. కాజీపేట-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు.. వర్షాల కారణంగా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఇందులో 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయగా, మరో 14 రైళ్లను దారి మళ్లించింది. ఫలక్నామా, ఈస్ట్ కోస్ట్, గోదావరి, విశాఖ, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు అయ్యాయి. వర్షాల కారణంగా పలుచోట్ల రైల్వేస్టేషన్లలో ఎక్కడికక్కడే రైళ్లు నిలిచిపోయాయి.Bulletin No.17 dt.29.10.25Due to Cyclone Montha effectCancellation of Trains:1) https://t.co/EMHwado7vJ. 22204 Secunderabad - Visakhapatnam Express is cancelled on 29/10/20252) Tr. No. 12703 Howrah - Secunderabad Falaknuma Express is cancelled on 30/10/2025— South Central Railway (@SCRailwayIndia) October 29, 2025ఇదిలా ఉండగా.. రానున్న మూడు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో సహా, హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. HyderabadRains ALERT 2 ⚠️🌧️ STEADY MODERATE RAINS to continue in entire city for next 2-3hrs, thereafter STEADY LIGHT RAINS will continue till late evening in the cityGRADUAL REDUCTION IN RAINS EXPECTED IN HYDERABAD CITY FROM LATE EVENING AS CYCLONE MONTHA GRADUALLY MOVING UP— Telangana Weatherman (@balaji25_t) October 29, 2025 -
తూఫాన్ అంటే..? వెన్నులో వణుకుపుట్టించే నిజాలు
-
Montha Cyclone: తాగడానికి నీళ్లు కూడా లేవు.. ఒకే గదిలో 20 మంది..ప్రభుత్వంపై ఫైర్
-
రైతులను నిండా ముంచిన మోంథా తుఫాన్
-
తెలుగు రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్స్.. IMD హెచ్చరిక
Cyclone Montha.. మోంథా తుపాను ప్రభావంతో దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను నేపథ్యంలో తెలంగాణ, ఏపీ సహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న కొన్ని గంటల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం.. రానున్న కొన్ని గంటల్లో ఏపీలోని తీవ్ర ప్రాంతాలు, తెలంగాణ, మహారాష్ట్రలోని విదర్భా ప్రాంతాల్లో తక్కువ నుండి మధ్యస్థ స్థాయి ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలకు చేసింది. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని తెలిపింది. వాగులు, కాల్వలు, చెరువుల దగ్గరకు వెళ్లరాదని హెచ్చరించింది. ప్రయాణం ముందు వాతావరణ సమాచారం తెలుసుకోవాలి. రైతులు పంటను, పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించండి. స్థానిక అధికారులు అత్యవసర సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా డిజాస్టర్ కంట్రోల్ రూమ్ లేదా స్థానిక సహాయ కేంద్రానికి సమాచారం ఇవ్వాలని తెలిపింది. IMD, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (SDMA) ఇచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాటించాలని సూచనలు చేసింది.హెచ్చరిక జారీ చేసిన జిల్లాలు ఇవే..ఏపీలో.. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం, యానం, గుంటూరు, ప్రకాశం జిల్లాలు.తెలంగాణలో.. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్–మల్కాజ్గిరి, పెద్దపల్లి జిల్లాలు.మహారాష్ట్రలో.. మరఠ్వాడ సమీప ప్రాంతాలు, నాందేడ్, హింగోలి, పర్బణీ, బుల్దానా, అకొలా, అమరావతి, వార్ధా, యవత్మాల్, నాగపూర్ జిల్లాలు. Weather warning ⚠️ #TelanganaNow I'm warning once again for North East Central TG see heavy during next 24 hours stay safe 🚨 Flash floods possible 🌧️🌀⚠️ https://t.co/5PvVp8klDy— Warangal Weatherman (@tharun25_t) October 29, 2025 -
శాంతించిన మోంథా.. APకి తప్పిన పెను ప్రమాదం
-
ఈ రాత్రికే భారీ వర్షం.. తెలంగాణలో ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్
-
శ్రీశైలం ఘాట్ రోడ్డు.. విరిగిపడిన కొండచరియలు
సాక్షి, శ్రీశైలం: ఏపీలో మోంథా తుపాను కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. మరోవైపు.. ఎడతెరిపిలేని వర్షాలతో శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడిన భారీ కొండచరియలు పడ్డాయి. దీంతో, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.మోంథా తుపాను ప్రభావంతో శ్రీశైలంలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా డ్యామ్ ఘాట్ రోడ్డుపై భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో, హైదరాబాద్-శ్రీశైలం బస్సుల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు జేసీబీ సాయంతో వాటిని తొలగిస్తున్నారు. లింగాలగట్టు చెక్ పోస్ట్ వద్ద వాగు ఉప్పొంగి ప్రవహించడంతో భవనం కోతకు గురైంది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.Andhra Pradesh Cyclone Montha hits Srisailam, Nandyal District. Landslides on Patalaganga steps destroy 3 shops. Continuous rain halts normal life, devotees confined to shelters. Floodwaters erode roads, locals fear further damage. #CycloneMontha #Srisailam #Nandyal pic.twitter.com/Ar2EKsXEeH— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) October 29, 2025ఇదిలా ఉండగా.. పాతాళగంగ (Paathal Ganga)కు వెళ్లే దారిలో కొండచరియలు విరిగిపడ్డియాయి. ఈ దుర్ఘటనలో మొత్తం మూడు షాపులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు భక్తులను అటువైపు వెళ్లేందుకు అనుమతించడం లేదు. పుష్కరిణికి వెళ్లే మార్గం పూర్తిగా శిథిలాలతో మూసుకుపోగా పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు టూరిజం శాఖ ఆధ్వర్యలోని రోప్ వే (Rope Way) సర్వీసును కూడా తాత్కాలికంగా మూసివేశారు.తుపాను ప్రభావంతో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు నగరం సహా కొత్తపల్లి, మహానంది, ఆత్మకూరు మండలాల్లో ఎడతెరిపి లేకుండా ముసురు పడుతోంది. మహానంది మండలం నందిపల్లి వద్ద పాలేరు వాగు వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. కొత్తపల్లి మండలంలో శివపురం పెద్దవాగు పొంగిపోర్లుతుండటంతో సమారు 11 గ్రామాల రాకపోకలకు అంతరాయం తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
తీరం దాటినా తగ్గని ప్రభావం.. మరో 48గంటలపాటు..
-
ఆ జిల్లాలకు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
-
మమ్మల్నెవరూ పట్టించుకోవటం లేదు.. విజయవాడలో మహిళ ఆవేదన
-
సీఎం, డీసీఎం లేకపోయినా అధికారుల పనితీరుకు హ్యాట్సాఫ్
-
తీర ప్రాంత వాణిజ్యం, స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంతంటే..
Cyclone Montha Impact On Stock Market: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో మోంథా తుపాను ఉగ్రరూపం దాల్చింది. మంగళవారం అర్థరాత్రి తర్వాత నరసాపురం సమీపంలో తీరం దాటిన ఈ తుపాను.. తీర ప్రాంతాన్ని కల్లోలంలో ముంచెత్తింది. ప్రస్తుతం సుమారు రెండు మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడుతుండగా, రాబోయే ఆరు గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ పరిణామం భారీ వర్షాలకు దారితీసి, సాధారణ జనజీవనాన్ని, తీరప్రాంత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేయనుంది.పారిశ్రామిక, పోర్ట్‌లపై ప్రభావంమోంథా ధాటికి తీరప్రాంతంలో లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. బలమైన గాలులు, వర్షాల కారణంగా రోడ్డు, రైలు మార్గాలు దెబ్బతినడం, వంతెనలు కొట్టుకుపోవడం వంటివి జరిగి రవాణా వ్యవస్థ స్తంభిస్తుంది. ముఖ్యంగా ఓడరేవుల కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోవడం వల్ల సరుకుల రవాణాకు (లాజిస్టిక్స్) తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.మోంథా తుపాను కారణంగా విశాఖపట్నం (వైజాగ్) పోర్ట్, మచిలీపట్నం, కాకినాడ పోర్ట్ల్లో షిప్పింగ్, లాజిస్టిక్స్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ ప్రభావం చాలా స్పష్టంగా ఉంటుంది. తుపాను తీవ్రతను బట్టి పోర్ట్ కార్యకలాపాలు మూడు ప్రధాన అంశాలలో ప్రభావితమవుతాయి.పోర్ట్ కార్యకలాపాల నిలిపివేతతీవ్ర తుపాను హెచ్చరికల నేపథ్యంలో నష్టం జరగకుండా పోర్ట్ అధికారులు తక్షణమే అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తారు. బంగాళాఖాతంలో అలలు తీవ్రంగా ఎగసిపడుతుండటం (2 మీటర్ల ఎత్తు), బలమైన గాలుల కారణంగా నౌకల రాకపోకలు పూర్తిగా రద్దు చేస్తారు. పోర్టులో ఉన్న నౌకలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం లేదా లంగరు వేసి నిలిపేస్తారు.కార్గో నిలిపివేతకంటైనర్లు, బల్క్ కార్గో, ఇతర సరుకులను ఎగుమతి/దిగుమతి చేసే ప్రక్రియలు పూర్తిగా నిలిచిపోతాయి. కాకినాడ పోర్ట్ ఎక్కువగా బల్క్ కార్గో (ముడిసరుకు, వ్యవసాయ ఉత్పత్తులు)ను హ్యాండిల్ చేస్తుంది కాబట్టి, సరుకు పాడయ్యే ప్రమాదం ఉంది.పోర్టులలోని భారీ క్రేన్లు, కన్వేయర్ బెల్ట్‌లు, ఇతర కార్గో హ్యాండ్లింగ్ పరికరాలు తీవ్రమైన గాలులు, ఉప్పెన వల్ల దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.సప్లై-చెయిన్ అంతరాయంపోర్ట్ గేట్లు మూసివేయడం, రోడ్డు రవాణా దెబ్బతినడం వల్ల పూర్తి లాజిస్టిక్స్ సరఫరా గొలుసు దెబ్బతింటుంది. తుపాను ప్రభావంతో రోడ్లు, రైలు మార్గాలు దెబ్బతినడం లేదా వరదలకు గురికావడం వల్ల పోర్ట్ నుంచి లోతట్టు ప్రాంతాలకు, లోతట్టు ప్రాంతాల నుంచి పోర్ట్‌లకు సరుకుల రవాణా పూర్తిగా ఆగిపోతుంది. దీనివల్ల ఎగుమతి చేసేందుకు సరుకు పోర్టుకు చేరదు, దిగుమతి సరుకు బయటకు వెళ్లదు.స్టోరేజ్ సమస్యలుపోర్ట్ టెర్మినల్స్‌లో లేదా చుట్టుపక్కల నిల్వ ఉన్న కంటైనర్లు, వ్యవసాయ ఉత్పత్తులు (మచిలీపట్నం, కాకినాడ పోర్ట్‌లలో) నీటిలో మునిగి లేదా గాలులకు పడిపోయి నష్టపోతాయి. దీనివల్ల సరుకు యజమానులకు భారీ నష్టం వాటిల్లుతుంది. పోర్ట్ కార్యకలాపాలు సాధారణ స్థితికి రావడానికి, రవాణా మార్గాలను పునరుద్ధరించడానికి కొన్ని రోజులు పట్టవచ్చు. దీనివల్ల సరఫరా గొలుసులో ఆలస్యం ఏర్పడి, పరిశ్రమలకు ముడిసరుకు కొరత ఏర్పడవచ్చు.ఆర్థిక, దీర్ఘకాలిక ప్రభావాలుపోర్ట్ కార్యకలాపాల నిలిపివేత వల్ల ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయి. ప్రతి పోర్ట్‌లో రోజువారీ కార్యకలాపాల విలువ కోట్లాది రూపాయల్లో ఉంటుంది. ఈ కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల ఆయా పోర్ట్‌లకు, కస్టమ్స్ రెవెన్యూకు భారీ నష్టం వాటిల్లుతుంది. తుపాను వల్ల దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను (డాక్స్, జెట్టీలు, రోడ్లు), క్రేన్లను మరమ్మతు చేయడానికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. పోర్ట్ టెర్మినల్స్, నౌకలు, సరుకుపై (కార్గో) నష్ట పరిహారం కోసం భారీగా బీమా క్లెయిమ్‌లు పెరుగుతాయి.మౌలిక సదుపాయాలుమోంథా తుపాను వల్ల భారీ గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, టవర్లు, టెలిఫోన్ లైన్లు కూలిపోయి కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటుంది. తాగునీటి సరఫరా వ్యవస్థలు కలుషితం కావచ్చు. పారిశ్రామిక భవనాలు, గిడ్డంగులకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వీటితోపాటు తీర ప్రాంతంలోని వైజాగ్ ఎయిర్పోర్ట్ ద్వారా రాకపోకలు సాగిస్తున్న అంతర్జాతీయ, దేశీయ విమాన ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. కోస్తా జిల్లాల్లోని మత్స్య పరిశ్రమ, నౌకాశ్రయ ఆధారిత పరిశ్రమలు, వ్యవసాయ రంగం భారీ నష్టంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లలేని పరిస్థితి వల్ల ఉపాధి కోల్పోతారు.గత తుపానుల ప్రభావం ఇలా..గతంలో వచ్చిన తిత్లీ వంటి తీవ్ర తుపానులు తీర ప్రాంతంలో పెను విధ్వంసం సృష్టించాయి. ఆ సమయంలో ఇళ్లు, పశువులు, పెంపుడు జంతువులు, పంటలకు భారీగా నష్టం జరిగింది. సముద్రపు నీరు లోతట్టు ప్రాంతాల్లోకి రావడం వల్ల వ్యవసాయ భూములు దీర్ఘకాలికంగా పంటలు పండించడానికి పనికిరాకుండా పోయాయి. కొన్ని రోజుల పాటు విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి.తుపాను నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలుప్రస్తుత మోంథా తుపాను తీవ్రతను తగ్గించడానికి ప్రభుత్వం తక్షణ సహాయ చర్యలు చేపట్టాలి. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలి. నిత్యావసర సరుకులు, తాగునీరు, మందులు సిద్ధంగా ఉంచాలి. వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు రియల్‌టైమ్‌లో తెలియజేయాలి. విద్యుత్ అంతరాయం కలగకుండా మొబైల్ టవర్ల వద్ద పవర్ బ్యాకప్(జనరేటర్లు) ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలి. రైతుల కోసం టార్పాలిన్లు సిద్ధం చేయాలి.తక్షణ, సహాయ చర్యలువిద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థ పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. NDRF, SDRF బృందాలను రంగంలోకి దించి సహాయక చర్యలను వేగవంతం చేయాలి. పారిశుద్ధ్యంపై దృష్టి సారించి వ్యాధులు(మలేరియా, డయేరియా) వ్యాప్తిని అరికట్టాలి. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి 108, 104 వంటి అత్యవసర సేవలను అప్రమత్తం చేయాలి.స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎలా?మోంథా తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాలు ఇండియన్ స్టాక్ మార్కెట్‌పై తాత్కాలికంగా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. పారిశ్రామిక కార్యకలాపాలు ఆగిపోవడం, రవాణా అంతరాయం, ఆస్తుల నష్టం వంటి అంశాల వల్ల ఈ విభాగంలో సర్వీసులు అందించే కంపెనీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇన్సూరెన్స్, సిమెంట్, లాజిస్టిక్స్, పోర్ట్ సంబంధిత స్టాక్స్ ప్రభావితం కావొచ్చు.పెట్టుబడి విధానం - దీర్ఘకాలిక లక్ష్యాలుతుపాను వల్ల ఏర్పడే పరిస్థితులు తాత్కాలికమే అని గమనించాలి. దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్న పెట్టుబడిదారులు ఈ తాత్కాలిక పతనంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఇలాంటి సందర్భాల్లో షేర్లను హడావిడిగా అమ్మడం వల్ల నష్టపోతారు. తుపాను వంటి సంఘటనల ప్రభావం కొన్ని రోజుల్లో సద్దుమణుగుతుంది. బేసిక్ ఫండమెంటల్స్ బలంగా ఉన్న నాణ్యమైన కంపెనీల షేర్లు మార్కెట్ అస్థిరత కారణంగా తక్కువ ధరలో లభించినప్పుడు కొనుగోలు చేయడానికి మంచి అవకాశం. మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గించడానికి, స్థిరమైన మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి క్రమానుగుత పెట్టుబడి విధానాన్ని(సిప్) అనుసరించడం ఉత్తమం.ఒకే రంగంలో కాకుండా నష్టాలను తట్టుకోగల ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆటో, టెక్నాలజీ, ఇన్ప్రా.. వంటి ఇతర రంగాలతో పాటు దీర్ఘకాలికంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ వల్ల లాభపడే రంగాల్లో పెట్టుబడిని వైవిధ్యపరచాలి.ఇదీ చదవండి: ఆర్బీఐ ఖజానాలో బంగారం ధగధగలు -
హైదరాబాద్-విశాఖ విమానం ‘యూటర్న్’
సాక్షి, విశాఖ: మోంథా తుపాను(Cyclone Montha) ప్రభావంతో ఏపీ అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా జనజీవనం స్థంభించిపోయింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం రవాణా వ్యవస్థపైన కూడా ప్రభావం చూపింది. ప్రతికూల వాతావరణం కారణంగా ఇప్పటికే పలు విమాన సర్వీసులు నిలిచిపోగా.. తాజాగా హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ కాకుండానే తిరిగి వచ్చేసింది.వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియా విమానం బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖ బయలుదేరింది. ఈ క్రమంలో విశాఖలో ల్యాండింగ్ కావాల్సి ఉండగా.. ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్ కాలేదు. దీంతో, ఎయిర్‌పోర్టు అధికారులు విమానాన్ని తిరిగి హైదరాబాద్‌కు పంపారు. అనంతరం, హైదరాబాద్ విమానం సేఫ్‌గా ల్యాండింగ్ అయ్యింది. ఈ క్రమంలో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు.. విజయవాడ నుంచి విశాఖ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు.ఇదిలా ఉండగా.. మోంథా తుపాను (Cyclone Montha) ప్రభావం నేపథ్యంలో శంషాబాద్ నుంచి ఏపీకి వెళ్లాల్సిన 18 విమాన సర్వీసులు రద్దయ్యాయి. వాతావరణం అనుకూలించని కారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరానికి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం నుంచి శంషాబాద్ రావాల్సిన 17 విమాన సర్వీసులను కూడా రద్దు చేసినట్లు చెప్పారు. రద్దయిన వాటిలో విశాఖపట్నం నుంచి 9, రాజమహేంద్రవరం నుంచి 5, విజయవాడ నుంచి 3 విమానాలు ఉన్నాయి. -
మోంథా ముప్పు.. అధికారుల అప్రమత్తంతో తప్పిన పెను ప్రమాదం
-
తెలంగాణపై మోంథా.. స్కూల్స్ బంద్, రెడ్ అల్టర్
సాక్షి, హైదరాబాద్: మోంథా తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలంగాణ పైనా కూడా తుపాను ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.తుపాను ప్రభావం ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలపై అధికంగా ఉంటుందని హెచ్చరించింది. మూడు జిల్లాల్లో గంటకు 50-60 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, నాగర్ కర్నూల్, వికారాబాద్, జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఈ జిల్లాల్లో గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేస్తూ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.VERY HEAVY RAINS ALERT - CYCLONE MONTHA PEAK IMPACT ⚠️ As Cyclone Montha moving inland, VERY HEAVY DOWNPOURS ahead in RED MARKED DISTRICTS with few places to get 80-180mm rains causing FLOODS in few places. STAY ALERT ⚠️🌧️BLUE MARKED districts will get MODERATE RAINS today… pic.twitter.com/vMGDKP2eqy— Telangana Weatherman (@balaji25_t) October 29, 2025హైదరాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి, జనగాం, జోగులాంబ గద్వాల్, మేడ్చల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ విధించింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, వరంగల్, మహబూబాబాద్, నిజామాబాద్, హైదరాబాద్‌లో కూడా వర్షం కురుస్తోంది.మరోవైపు.. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో కూడా ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు యాజమాన్య విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. అలాగే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. సూర్యాపేట జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.DELUGE RAINS IN SOUTH TG ⚠️🌧️CYCLONE MONTHA CORE BANDS are just stuck and NON STOP HEAVY RAINS keep on pouring all over Nagarkurnool, Nalgonda, Suryapet, Khammam, Wanaparthy, Mahabubnagar, Rangareddy for NEXT SEVERAL HOURS ⚠️⚠️200mm event for Nagarkurnool ⚠️⚠️— Telangana Weatherman (@balaji25_t) October 29, 2025 #29OCT 7:30AM⚠️CYCLONE MONCHA is moving slower than expected and is currently around KHAMMAM DistrictVERY HEAVY to HEAVY RAINS will continue over Nagarkurnool, Nalgonda, Suryapet, Khammam, Mahabubabad, Ranga Reddy, Vikarabad, and Sangareddy districts for the next 3 hours.… pic.twitter.com/TBEhgamFJp— Hyderabad Rains (@Hyderabadrains) October 29, 2025 -
కూలిన భారీ వృక్షాలు.. మునిగిన రోడ్లు, పంట పొలాలు
-
ఒంగోలులో ఈదురుగాలులతో కూడిన వర్షం..రోడ్లు జలమయం (ఫొటోలు)
-
తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరిక.. ముంచుకొస్తున్న మోంథా ముప్పు
-
తీరం దాటిన తుఫాన్.. నేడు ఏపీలో భారీ వర్షాలు
-
తుఫాన్ బీభత్సం.. 30మంది విద్యార్థులకు కరెంట్ షాక్?
-
భారీ గాలులతో అర్ధరాత్రి అల్లకల్లోలం
-
ఏపీలో తీరం దాటిన మోంథా తుఫాను
-
AP: తుపాను నష్టంపై అధికారుల ప్రాథమిక నివేదిక
AP Cyclone Montha Live News Updates Telugu: ఆంధ్రప్రదేశ్ తీరం సైక్లోన్ మోంథా ధాటికి తల్లడిల్లిపోయింది. భారీ నష్టాన్ని కలగజేసి తీరం దాటిన తీవ్ర తుపాన్ కాస్త తుపానుగా మారిపోయి తన ప్రభావం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో దిశ మార్చుకుని తెలంగాణ వైపు దూసుకొస్తోంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. తుపాన్ నష్టంపై అధికారుల ప్రాథమిక నివేదికవిజయవాడ:రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1,825 గ్రామాల్లో 87 వేలహెక్టార్లలో పంటకు నష్టం.59 వేలకు పైగా హెక్టార్లలో నీట మునిగిన వరి పంట, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలకు నష్టం.భారీ వర్షాలతో నష్టపోయిన 78,796 మంది రైతులు.రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన 42 పశువులు.రాష్ట్రంలో దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లు, 14 బ్రిడ్జిలు, కల్వర్టులుదెబ్బతిన్న 2,294 కి.మీ. పొడవున ఆర్ అండ్ బీ రహదారులు... రూ.1,424 కోట్ల నష్టం.రూరల్ వాటర్ సప్లయ్‌కు సంబంధించి రూ.36 కోట్లు వరకు, ఇరిగేషన్ పనుల్లో రూ.16.45 కోట్ల మేర నష్టం.సురక్షిత ప్రాంతాలకు 3,175 మంది గర్భిణీల తరలింపు... 2,130 మెడికల్ క్యాంపుల నిర్వహణ.297 రహదారులపై వరద నీరు పొంగి ప్రవహిస్తుండగా, వాటిని దారి మళ్లించేలా చర్యలు.రాష్ట్రంలో మొత్తం 380 చెట్లు రహదారులపై విరిగిపడగా, అన్నింటినీ తొలిగించామని చెప్పిన యంత్రాంగం.బాపట్ల:రేపల్లె నియోజకవర్గంలో ఇంకా పునరుద్ధరణ కానీ విద్యుత్ సరఫరాఅంధకారంలో ఇంకా నియోజకవర్గంలోని చాలా గ్రామాలు24 గంటల నుంచి కరెంట్ లేక ఇబ్బంది పడుతున్న ప్రజలుఅల్లూరి జిల్లా :మోంథా తుఫాన్ ఎఫెక్ట్..రేపు కేకే లైన్ లో రైళ్ళ రాకపోకలు బంద్కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో రైల్వే అధికారుల నిర్ణయం..కిరండూల్ ప్యాసింజర్ రైలు రద్దు.. వరంగల్- ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా వరదనీరురేపు (గురువారం) వరంగల్ జిల్లాలో పాఠశాలలకు సెలవునీట మునిగిన వరంగల్ రైల్వే స్టేషన్ ఆలస్యంగా నడుస్తున్న రైళ్లుప్రయాణికుల ఇక్కట్లుశ్రీశైలం - హైదరాబాద్ రాకపోకలకు అంతరాయంనాగర్ కర్నూల్ జిల్లా, ఉప్పునుంతల మండలం, లత్తిపూర్ సమీపంలో వరదకు కోతకు గురైన బ్రిడ్జి. డిండి వాగుపై నిర్మించిన బ్రిడ్జిపై శ్రీశైలం-హైదరాబాద్ మధ్య నిలిచిన రాకపోకలు.వరంగల్‌లో కుండపోత వర్షంపలు కాలనీల్లో ఇళ్లల్లోకి చేరిన వర్షపు నీరుహన్మకొండ బస్టాండ్ ఆవరణలోకి భారీగా వరదవరంగల్ అండర్ రైల్వే గేట్‌తో పాటు హన్మకొండ, భవానీ నగర్లో భారీగా వరదఅంబేద్కర్ భవన్ రహదారి జలమయంఅంబేద్కర్ భవన్లో చిక్కుకున్న పెళ్లి బృందంచెరువులను తలపిస్తున్న రైలు పట్టాలుమహబూబాబాద్ జిల్లాలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లుడోర్నకల్ రైల్వే ట్రాక్‌పైకి భారీగా వరద, నిలిచిన రైళ్లువరంగల్, హన్మకొండలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుకలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు: 18004253424, 9154225936 తెలంగాణలో ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్మహబూబ్నగర్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్9 జిల్లాలకు ఆరెంజ్, మరో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ వరంగల్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతంపర్వతగిరిలో 34 సెం.మీ వర్షపాతంనెక్కొండలో 24 సెం.మీ వర్షపాతం నమోదుసంగెం మండలంలో 25 సెం.మీ వర్షపాతంఖిలావరంగల్లో 23, ాపాలకుర్తిలో 23 సెం.మీ వర్షపాతంతూ.గో.జిల్లా:నల్లజర్ల లో ముందా తుఫాన్ వలన నేలకొరిగిన పంటలను పరిశీలించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ , నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ హోం మంత్రి తానేటి వనితపంట పాలు పోసుకునే దశలో నేలకి ఒరిగి పోయాయిగడచిన ప్రభుత్వం రైతుల పక్షాన ఏ విధంగా చేసిందో ప్రజలు ఆలోచించాలిరైతుకు జరిగిన నష్టాన్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా పూడ్చాలో ఆలోచించాలిగత ప్రభుత్వం పంట వేసే ముందు పెట్టుబడి సహాయం ఇచ్చేదిఅన్నదాత సుఖీభవ పేరుమీద ప్రతి రైతుకు ఎకరానికి రూ. 20,000 రూపాయలు ఇస్తానన్నారు18 నెలల కాలం గడిచిన కేవలం రూ.5000 రూపాయలు మాత్రమే ఇచ్చారుపంట పెట్టుబడి సహాయం లేదు కానీ ఒక పంటకు నష్టపోయిన రైతు అధిక వడ్డీలకు రుణాలు పొందుతున్నారు రైతులకు పంటలకు ఇన్సూరెన్స్ చెల్లించిన ఘనత జగన్ ప్రభుత్వానిదేపంట నష్టం వస్తే సబ్సిడీ కూడా చెల్లించిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఖమ్మం:మధిర రైల్వే స్టేషన్ లో నిలిచిపోయిన సాయి నగర్ శిరిడి ఎక్స్ ప్రెస్..డోర్నకల్ రైల్వేస్టేషన్లో పట్టాలపై వరద నీరు చేరటంతో మధిర స్టేషన్ లో నిలిపివేసిన రైల్వే అధికారులు..మోంథా తుపాను నేపథ్యంలో ఖమ్మం రైల్వే స్టేషన్ లో నిలిచిపోయిన వందే భారత్ ట్రైన్...డోర్నకల్ జంక్షన్ వద్ద రైలు పట్టాలపై నీరు ప్రవహించడంతో వందే భారత రైలును ఖమ్మం రైల్వే స్టేషన్ లో నిలుపు వేశారు...భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -జిల్లా కలెక్టర్ అనుదీప్...అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో జనం ఏదైనా అత్యవసరం అవుతేనే ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలి - జిల్లా కలెక్టర్ఖమ్మం:మోoథా తుపాను ఎఫెక్ట్ తో జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు...స్తంభించిన జన జీవనంజన్నారం వద్ద నిమ్మవాగు లో కొట్టుకుపోయిన డీసీఎం వ్యాన్.వరంగల్ నుంచి ఎన్కుర్ వస్తు ఉండగా జన్నారం వద్ద నిమ్మ వాగు ఉధృతిని అంచనా వేయలేక ముందుకు వెళ్లిన వ్యాన్ డ్రైవర్...అందరు చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయిన వ్యాన్...గల్లంతయిన డ్రైవర్ కోసం గాలిస్తున్న ఎన్డీఆర్ ఆప్ సిబ్బంది...మళ్లీ భారీ వర్షం కురుస్తుండడంతో రెస్క్ ఆపరేషన్ కు అంతరాయం...జూలూరుపాడు మండలం పెద్ద వాగు పొంగి కాజ్ వే పైకి ప్రవహిస్తున్న వరద నీరు...పడమటి నర్సాపురం, భేతాళుడు వైపు వెళ్లే 20 గ్రామాలకు నిలిచిన రాకపోకలు...చింతకాని మండలం నాగులవంచ -పాతర్లపాడు మధ్య రహదారిపై ప్రవహిస్తున్న బండి రేవు వాగు వరద.. జగ్గంపేట(కాకినాడ జిల్లా ):కిర్లంపూడి మండలం పాలెం గ్రామంలో మోంథా తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలకు కూలిన పెంకుటిల్లుబాధితులను పరామర్శించి రూ.5,000 రూపాయలు నగదు, బియ్యం బస్తా అందజేసిన జగ్గంపేట వైఎస్సార్సీపీ ఇంచార్జ్ తోట నరసింహం.హైదరాబాద్ : 135 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు.మరో 31 రైలను దారి మళ్ళించాం: దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్మోంథా తుపాను ప్రభావం తగ్గిన తర్వాతనే రైళ్లను పునరుద్ధరిస్తాం.మోంథా ప్రభావంతో డోర్నకల్ రైల్వే స్టేషన్ దగ్గర ట్రాకులు పాక్షికంగా దెబ్బతిన్నాయి.ప్రకాశం: సంతనూతలపాడు నియోజకవర్గంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మంత్రి మేరుగు నాగార్జునమోంథా తుపాను కారణంగా నాగులుప్పలపాడు మండలం మట్టిగుంట, ఈదుముడి మద్దిరాల ముప్పాళ గ్రామాలలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ మేరుగు నాగార్జున ,ప్రభుత్వం వెంటనే స్పందించి తుపాను కారణంగా నీట మునిగిన పంట పొలాలను అధికారులు పరిశీలించి రైతులకు తగిన సహాయం అందించి వారికి కొంత ఉపశమనం కలిగించేల చర్యలు చేపట్టాలని కోరిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ మేరుగు నాగార్జునప్రకాశం జిల్లా: ఒంగోలులో ముంపు ప్రాంతాలను పరిశీలించిన వైఎస్సార్సీపీ ఇంఛార్జి చుండూరి రవిబాబుపునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు సరిగా లేవుముంపు బాధితులకు భోజనాలు సరిగా ఏర్పాటు చేయకపోవడం దారుణం కలెక్టర్ తక్షణమే స్పందించి ముంపు బాధితులకు భోజన వసతి చూడాలి..; చుండూరి రవిబాబుకాకినాడఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తీరుకు నిరసనగా కొత్తపట్నం మత్స్యకారుల ఆందోళనఉప్పాడలో పర్యటించిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్తమ సమస్యలు చెప్పుకునేందుకు కారు వద్దకు వచ్చిన మత్స్యకారులుకారు ఆపకుండా వెళ్ళిపోవడం పై గంగపుత్రుల ఆగ్రహంఓట్లు అవసరం ఐనప్పుడు మాత్రమే మేము కావాలా అంటూ అసహనంవిజయనగరం జిల్లా.మోంథా ప్రభావంతో 50 గ్రామాల రాకపోకలు అంతరాయం.సంతకవిటి మండలం సిరిపురం వద్ద పొంగిపొర్లుతున్న రెల్లిగెడ్డ.సిరిపురం నుండి పొందూరు, మండవకురిటి నుండి జి.సిగడాం రహదారులపై ఉప్పొంగుతున్న వరద నీరు.రాకపోకలను నిలిపివేయాలని ఆదేశించిన ఆర్డీవో. పోలీసుల పర్యవేక్షణలో రహదారులకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు.పశ్చిమగోదావరి జిల్లా.ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలో మోంథా తుపాను ప్రభావంతో 250 ఎకరాల వరిచేలు మునక.ఎకరాకు 25 వేల రూపాయలు పెట్టుబడి పెట్టామంటూ రైతుల ఆవేదన.అధికారులు కన్నెత్తి చూడలేదంటూ రైతుల అసహనం తుపానుపశ్చిమగోదావరి జిల్లా:మోంథా తుపాను ప్రభావంతో పాలకొల్లు, యలమంచిలి,పోడూరు మండలాల్లోని పలు గ్రామాలు దొడ్డిపట్ల, అబ్బురాజు పాలెం,లంక గ్రామాల్లో అరటి, తమలపాకు తోటలకు తీవ్ర పంట నష్టంరైతులు తీవ్ర ఆందోళనతుపాను తో నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం తక్షణమే ఆదుకునీ నష్టపరహం చెల్లించాలని కోరుతున్న రైతులుఏలూరు జిల్లా: మోంథా తుపాను ప్రభావంతో ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు మండలాల్లో పలు చోట్ల నెలకొరిగిన వరి క్షేత్రాలు,స్వర్ణరకం వరి వంగడం వేసిన రైతులు పంట నెలకొరిగి తీవ్రనష్టం,ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్న రైతులుతూర్పుగోదావరి జిల్లా:నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో మోంథా ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి చెల్లు బోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడుపంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్నల్లగొండ జిల్లా:గుర్రంపోడు మండల కేంద్రంలో ఇళ్లలోకి చేరిన వరద నీరువర్షపు నీరు వెళ్లడానికి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో జనాల అవస్థలుకృష్ణా జిల్లాకంకిపాడు మండలం ఉప్పులూరులో తుపాను ప్రభావంతో పల్లపు తిరుపతమ్మ ఇల్లు నేలమట్టం.విషయం తెలుసుకున్న YSRCP పెనమలూరు నియోజకవర్గం ఇంచార్జ్ దేవభక్తుని చక్రవర్తి.స్వయంగా వెళ్లి బాధిత కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం అందించిన దేవభక్తుని చక్రవర్తి.కాకినాడతాళ్ళరేపు మండలం పిల్లిలంకలో తుపాను భాధితులకు బిర్యాణీ ప్యాకెట్లు అందజేసిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి చింతలపాటి శ్రీనివాసరాజు అనకాపల్లి :శారాధ నదికి పెరుగుతున్న వరద ఉదృతి..ప్రమాద స్థాయికి చేరుకున్న నీటిమట్టం..రహదారుల మీద నుంచి ప్రవహిస్తున్న వరద నీరు..పలు గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం..అప్రమత్తమైన అధికారులు..యలమంచిలి - గాజువాక రహదారిలో రాకపోకలు నిలిపేసిన పోలీసులు..తెలంగాణకు మోంథా ముప్పు!తెలంగాణ వైపు కదులుతున్న మోంథాఇప్పటికే ఏపీలో తీరని నష్టంఇంకా కురుస్తున్న వానలుమరో గంటలో ఖమ్మంను తాకనున్న మోంథాహనుమకొండ, వరంగల్, మహబూబాద్ జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.. ఆరెంజ్ హెచ్చరికలుసిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.. ఆరెంజ్ హెచ్చరికలుహైదరాబాద్ వర్షాలపై.. అధికారుల్ని అప్రమత్తం చేసిన జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నంరైళ్లపై మోంథా ప్రభావంతెలంగాణపై మోంథా తుపాను ఎఫెక్ట్మోంథా ప్రభావంతో దక్షిణ మద్య రైల్వే పరిధిలో రైళ్ల రాకపోకలకు అంతరాయంమహబూబాబాద్లో ఆగిపోయిన కృష్ణా ఎక్స్ప్రెస్నీట మునిగిన డోర్నకల్ రైల్వే స్టేషన్డోర్నకల్లో ఆగిపోయిన గోల్కొండ ఎక్స్ప్రెస్వరంగల్లోనే ఆగిపోయిన ఇంటర్ సిటీమధిర స్టేషన్లో ఆగిన షిరిడి ఎక్స్ప్రెస్ఆలస్యంగా నడుస్తున్న రైళ్లుసంబంధిత కథనం: మోంథా ఎఫెక్ట్.. రద్దైన రైళ్ల వివరాలు ఇవిగో ఖమ్మం జిల్లాలో మోంథా తుపాను బీభత్సంకొణిజర్ల మండలం జన్నారం వద్ద నిమ్మవాగులో బ్రిడ్జి పైనుంచి పడిపోయిన డీసీఎంనిమ్మవాగులో డ్రైవర్ గల్లంతు, గాలింపు చర్యలు చేపట్టిన అధికారులుమోంథా తుపాను.. తెలంగాణ సర్కార్ హైఅలెర్ట్ మోంథా ప్రభావంతో తెలంగాణకు భారీ వర్షాలు ఆర్ అండ్ బీ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిఫీల్డ్ లెవెల్ లో హై అలెర్ట్ గా ఉండాలని సూచనఅత్యవసరం ఐతే తప్పా.. ఎవరూ సెలవు పై వెళ్లొద్దని ఆదేశంమాన్సూన్ సీజన్ లో చేపట్టిన జాగ్రత్త చర్యలు.. అదే స్పూర్తితో కొనసాగించాలి: మంత్రి కోమటి రెడ్డిప్రజలను అప్రమత్తం చేయడానికి పోలీసు,రెవెన్యూ,విద్యుత్,ఇరిగేషన్,పిఆర్ శాఖలతో సమన్వయం చేసుకోవాలి: మంత్రి కోమటి రెడ్డిలో కాజ్ వే లు,కల్వర్టులు వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలి: మంత్రి కోమటి రెడ్డిఆర్ అండ్ బి ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ సెంటర్ అన్ని జిల్లాలతో అనుసంధానం చేయాలి: మంత్రి కోమటి రెడ్డిఅత్యవసరమైతేనే ప్రజలు రోడ్ల పైకి రావాలి,అధికారులు సూచించే జాగ్రత్తలు పాటించాలి: మంత్రి కోమటి రెడ్డికరీంనగర్ జిల్లాలో.. నిండుకుండలా లోయర్ మానేరు డ్యామ్మోంథా తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలు2 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులుఇన్ ఫ్లో: 1277 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో: 4 వేల క్యూసెక్కులుప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం: 24.034 టీఎంసీలుప్రస్తుత నిల్వ 24.034 టీఎంసీలుదిగువ నది పరిసర ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచన పశువుల కాపర్లు,మత్స్య కారులు,రైతులు నది దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరికలుతెలంగాణ భారీ వర్షాలపై మంత్రి పొంగులేటి అప్రమత్తంభారీ వర్షాల వల్ల ప్రజా జీవనానికి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలురెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షరాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై సమీక్ష నిర్వహించిన మంత్రిఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలురాగల 24 గంటల్లో అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట, వరంగల్, యాదాద్రి, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలువాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలిలోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలుపోలీసులతో కలసి వాగులు, కాల్వలు, చెరువుల దగ్గర పర్యవేక్షణ చేయాలని ఆదేశాలుఅత్యవసర సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి ఆదేశాలువిద్యుత్, పంచాయతీ రాజ్, ఆర్ & బి శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచనలుప్రాణనష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి సూచనలుప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రాధాన్యం – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డినాగర్ కర్నూలు జిల్లాలో.. ఉప్పునుంతల మండలం మొల్గర గ్రామం వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న దుందుభి వాగు, ఉప్పునంతల వంగూరు మండలాలకు రాకపోకలు బంద్తాడూరు మండలంలో భారీ వర్షంపొంగిపొర్లుతున్న వాగులు వంకలుఐతోలు, గోవిందాయపల్లి మధ్య రోడ్డుపై పారుతున్న వాగు నిలిచిపోయిన రాకపోకలునల్లగొండ జిల్లాలో..తిరుమలగిరి (సాగర్)లో పొంగిపొర్లుతున్న బర్ల బంధంరోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీరుబడాయిగడ్డ గ్రామ సమీపంలో కల్వర్టు పైనుంచి ప్రవహిస్తోన్న వరద నీరుతిరుమలగిరి- రాజవరం మధ్య రాకపోకలు నిలిపివేతమండల వ్యాప్తంగా నీట మునిగిన పత్తి, వరి పొలాలుబలహీనపడి తెలంగాణ వైపు దూసుకొస్తున్న మోంథాతీరం దాటాక దిశ మార్చుకున్న మోంథాతెలంగాణ వైపు దూసుకొస్తున్న తుపానుభద్రాచలానికి 50కి.మీ. ఖమ్మంకు 110కి.మీ. దూరంలో కేంద్రీకృతంభారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖఇప్పటికే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షాలుహైదరాబాద్లోనూ దంచికొడుతున్న వర్షంతెలంగాణలో 14 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్ జారీవాయవ్య దిశగా ప్రయాణించి రాబోయే ఆరుగంటల్లో బలహీనపడే అవకాశంఒంగోలు జలమయం..మోంతా తుపాను దాడికి ఒంగోలులోని లోతట్టు కాలనీలు జలమయంఒంగోలు నగరంలోని వెంకటేస్వరా కాలనీ, నేతాజీ కాలనీ,నెహ్రూ కాలనీ ,బిలాల్ నగర్,పాపకాలని ,బలరాం కాలనీ ,మథర్ తెరిశా కాలనీలు జలమయంసముద్రాన్ని తలపిస్తున్న రోడ్లునేతాజీ కాలనీ,వెంకటేస్వరా కాలనీల ప్రజల జలదిగ్బంధంకోనసీమ.. ఇళ్లలోకి పాములు!కోనసీమ అంబాజి పేటను ముంచెత్తిన వర్షపు నీరుఇళ్లలోకి చేరుకున్న వర్షపు నీరురోడ్ల పై మోకాలు లోతు నీరు చేరుకోవడంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలుసరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక పోవడంతో చిన్న చినుకు పడితే రోడ్లు అన్ని జలమయం అవుతాయి అంటున్న గ్రామస్థులునాగబాత్తుల వారి పాలెం లో వర్షపు నీరు ఇంట్లోకి చేరుకోవడంతో ఇళ్లలోకి వస్తున్న పాములు.. ఆందోళనలో ప్రజలు మోంథా ధాటికి భారీగా పంట నష్టం మోంథా ప్రభావంతో శ్రీకాకుళం నుంచి తిరుపతి దాకా అన్నిచోట్లా దెబ్బ తిన్న పంటలుతుపాను ప్రబావంతో చేతికందిన పంట నీటిపాలుకోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో వేల ఎకరాలల్లో భారీగా పంట నష్టంకృష్ణా జిల్లాలో నేలకొరిగిన అరటి బొప్పాయి తోటలు శ్రీకాకుళంలో 350 హెక్టార్లలో పంట నష్టంగాలులకు అరటి, కంద, బొప్పాయి తోటలు నష్టంవిజయనగరంలో 7 వేల ఎకరాలు నేలవాలిన వరిప్రకాశం జిల్లాలో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టంగుంటూరు, బాపట్ల, పల్నాడులో తడిసి ముద్దైన పత్తికన్నీరు పెడుతున్న ఏపీ రైతాంగంపిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో నీట మునిగిన వరి పంటతెలంగాణ ఖమ్మంలో.. మోంథా తుపాను కారణంగా ఉమ్మడి ఖమ్మంలో కురుస్తున్న భారీ వర్షాలుస్తంభించిన జనజీవనంబోనకల్ లో అత్యధికంగా 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుతల్లాడ లో 9 సెం.మీ, వైరా లో 8 సెం. మీ, పెనుబల్లి లో 7 సెం. మీ, మధిర 7 సెం. మీ, కల్లూరు 7 సెం.మీ వర్షపాతం నమోదు....భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్ అనుదీప్...అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో జనం ఏదైనా అత్యవసరం అవుతేనే ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలని సూచనఅనకాపల్లి జిల్లాలో..విజయరామరాజు పేట దగ్గర ఉధృతంగా తాచేరు నదితాత్కాలిక కాజ్ వే మునిగిపోయే ప్రమాదంఅల్లూరి - అనకాపల్లి జిల్లాల మధ్య వాహనాలు రాకపోకలకు విఘాతంప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు నంద్యాల జిల్లాలో..ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రభావం చూపిన మోంథా తుపానుసిరివెళ్ల నుండి రుద్రవరం వెళ్లే రోడ్డు మార్గం జలమయం, నిలిపివేసిన ఏపీఎస్ఆర్టీసీ సేవలు.ఆళ్లగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాల వల్ల ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు...రోడ్డుపై ఆరబెట్టిన మొక్కజొన్న మొత్తం నీటిమయం ఆదుకోవాలని కోరుతున్న రైతులుప్రమాద ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి న రెవెన్యూ అధికారులు పోలీసులు రెవెన్యూ అధికారులు పోలీసులునంద్యాల టౌన్‌ను ముంచెత్తిన తుపానులోతట్టు కాలనీలు జలమయం,ఇళ్లల్లోకి చేరిన వర్షపునీరుతీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలుతుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలుఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీరుఉదృతంగా ప్రవహిస్తున్న కుందు నది , వెక్కిలేరు , పాలేరు వాగులువరద హెచ్చరికలు జారీ చేసిన రెవెన్యూ , మున్సిపల్ అధికారులుమహానంది - నంద్యాల మధ్య , మహానంది - గాజులపల్లి మధ్య వరద కారణంగా నిలిచిన రాకపోకలుశ్రీశైలంలో..శ్రీశైలం మండలంలో అల్లకల్లోలం చేసిన మోంథా తుపానుశ్రీశైలంలో అర్ధరాత్రి నుంచి భీభత్సం సృష్టించిన కుండపోత వర్షంశ్రీశైలంలోని పలు కాలనీలోకి మోకాళ్ళ లోతుకు చేరిన వరద నీరుశ్రీశైలం డ్యాం వద్ద విరిగిపడిన భారీ కొండ చరియలు,కొండచరియలు రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఆటంకం,లింగాలగట్టులో మత్స్యకారుల ఇళ్లల్లోకి చేరిన వరద నీరు,లింగాలగట్టులో వర్షం భీభత్సం ధాటికి కొట్టుకుపోయిన మత్స్యకారుల ఇల్లులుఅర్థరాత్రి నుంచి నిద్ర లేకుండా బిక్కుబిక్కుమంటూ గడిపిన మత్స్యకారులుఅనకాపల్లి జిల్లాలో..ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఉడేరు నదికి పెరిగిన వరద నీరు వరద నీరు తాకిడి కారణంగా ఉడేరు నదికి పడిన గండిఉడేరు నదికి గండి పడడంతో పంట పొలాల్లోకి వస్తున్న వరద నీరుఆందోళన చెందుతున్న భోగాపురం చాకిపల్లి రైతులువరద నీరు మరింతగా బయటకు వస్తే గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశంపల్నాడు జిల్లాలో..చిలకలూరిపేట నియోజకవర్గం అర్ధరాత్రి నుంచి భారీ వర్షంపసుమర్రు సబ్ స్టేషన్ లోకి భారీ స్థాయిలో వచ్చిన వర్షపునీరుతెలంగాణలో దంచి కొడుతున్న వానలుమోంథా ప్రభావంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వానలుశ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారి బ్రాహ్మణపల్లి వద్ద బ్రిడ్జిపైనుంచి పొంగిపొర్లుతున్న చంద్రవాగురంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం సుద్ధపల్లి గ్రామవాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో నిలిచిపోయిన రాకపోకలునాగర్ కర్నూల్-- బల్మూరు మండలం మైలారం గ్రామంలో అలుగుపారుతున్న చెరువు నిలిచిపోయిన రాకపోకలుహనుమకొండ జిల్లా ఎల్కతుర్తి,భీమదేవరపల్లి,కమలాపూర్ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వానహన్మకొండ జిల్లా పరకాల డివిజన్ వ్యాప్తంగా ఉరుములు. మెరుపు ల తో కురుస్తున్న మోస్తారు వర్షంసూర్యాపేట జిల్లాలో మోంథా ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలుకలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. కంట్రోల్ రూమ్ నెంబర్: 6281492368హుజూర్నగర్ మండలం వేపల సింగారం వద్ద ఈదురుగాలుల ప్రభావంతో రోడ్డుపై కూలిన భారీ వృక్షంవనపర్తి జిల్లా మదనాపురం మండలం సరళ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరదరావడంతో ఆటో మేటిక్ గా తెరుచుకున్న రెండు సైపన్స్బాపట్ల జిల్లాలో.. కొల్లూరు మండలం లో రాత్రి నుంచి ఈదురుగాయలతో కురిసిన భారీ వర్షంఈదురు గాలులు దెబ్బకు భారీగా పంట నష్టంనేలకొరిగిన తమలపాకు అరటి పంట పొలాలుకంద పొలాల్లోకి భారీగా వర్షపు నీరు రావడంతో రైతులకు తీవ్ర నష్టంప్రకాశం జిల్లాలో.. చీమకుర్తి నుండి కొండేపి వెళ్లే రోడ్డు మార్గం నిలిపివేసిన సచివాలయ సిబ్బందికేవీ పాలెం గ్రామంలో చెరువు నిండి రోడ్డుపైకి బారీగా నీరు రావడంతో చిల్లకంప వేసి రాకపోకలు ఆపివేసిన సచివాలయ సిబ్బందిఏడు గ్రామాలకు రాకపోకలు నిలిపివేతగూడు ఏమైందో?కాకినాడ పునరావాస కేంద్రాల వద్ద దయనీయమైన పరిస్థితులుచలికి వణికిపోతున్న పిల్లలు, వృద్ధులుబిక్కుబిక్కుమంటూ గడుపుతున్న తుపాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలుఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో అని గుబులు పడుతున్న వైనంమోంథా ప్రభావం..తీరం దాటినా గట్టి ప్రభావం చూపుతున్న మోంథానేడు ఆరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశంమరో ఆరు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ఈదురు గాలుల తీవ్రత నేడంతా ఉండే అవకాశంఇప్పటికీ అంధకారంలోనే కోస్తాంధ్ర జిల్లాలుకరెంటు స్తంభాల పునరుద్ధరణ పనులు ఆలస్యంకొనసాగుతున్న విరిగి పడిన చెట్ల తొలగింపుక్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలుఎన్టీఆర్ జిల్లా..చందాపురం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న నల్లవాగుచందర్లపాడు నందిగామ మండలాల మధ్య రాకపోకలకు బంద్కృష్ణా జిల్లాలో..రైతులను నిండా ముంచేసిన తుపానుఅవనిగడ్డ నియోజకవర్గంలో బీభత్సం సృష్టించిన ఈదురుగాలులు,వర్షంరైతుల పాలిట శాపంగా మారిన మోంథా తుపానుఈదురు గాలుల ధాటికి నేలకొరిగిన వరి పైరుపూర్తిగా దెబ్బతిన వాణిజ్య పంటలుతీవ్రంగా నష్టపోయిన వరి, అరటి, కంద, కూరగాయ పంటలుఆందోళనలో రైతులు తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లాలో.. ఉప్పునుంతల మండలంలో అచ్చంపేట వెళ్లే దారులు నాలుగు వైపులా జల దిగ్బంధం బృందంకొల్లాపూర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించిన అధికారులుఅచ్చంపేట శ్రీశైలం ఉత్తర ద్వారం ఉమామహేశ్వర ఆలయం మూసివేత నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా భారీగా కురుస్తున్న వర్షం కొండలపై నుండి జలపాతం ఎక్కువ రావడంతో ముందుజాగ్రత్తగా ఆలయం మూసివేతప్రకాశం జిల్లాలో.. పొదిలి మండలం బట్టువారి పల్లె దగ్గర ఒంగోలు శ్రీశైలం జాతీయ రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తున్న వాగురాకపోకలు బంద్ ఇబ్బందులు పడుతున్న వాహనదారులుఖాళీగా విజయవాడ బస్టాండ్ప్రజా రవాణా వ్యవస్థపై మోంథా ప్రభావందూరప్రాంతాలకు వెళ్లాల్సిన 161 ఏసి,సూపర్ లగ్జరీ, అల్ట్రాడీలక్స్,ఎక్స్ ప్రెస్,నాన్ స్టాప్ బస్సులు రద్దువెలవెలబోతున్న విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్శ్రీకాకుళం,విజయనగరం,విశాఖ,కాకినాడ,కోనసీమ,పశ్చిమగోదావరి,బాపట్ల,ప్రకాశం,నెల్లూరు జిల్లాలకు నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులుతుపాను ప్రభావం తగ్గే వరకూ డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితంరైతులకు కన్నీళ్లు మిగిల్చిన మోంథాఏపీలో పంటలపై మోంథా తుపాను ప్రభావంనేలకొరిగిన వరి, మినుము, వేరుశనగ, మొక్కజొన్న పంటలుకృష్ణా జిల్లాల్లో అత్యధికంగా నీట మునిగిన పంట! శ్రీశైలం పాతాళ గంగ వద్ద తప్పిన ప్రమాదంశ్రీశైలంలో తప్పిన ఘోర ప్రమాదంపాతాళ గంగ విరిగిపడ్డ కొండచరియలుమూడు తాత్కాలిక దుకాణాలు ధ్వంసంభక్తులెవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం మరో 24 గంటలు వర్షాలే!మోంథాపై భారత వాతావరణ శాఖ(IMD) తాజా ప్రకటనఛత్తీస్గడ్ దిశగా పయనించి ఈ మధ్యాహ్నానికి బలహీనపడిపోతుందిమోంథా ప్రభావంతో గంటకు 85-95 కిలోమీటర్ల వేగంతో గాలులుఏపీ, తెలంగాణ తోపాటు దక్షిణ ఒడిషా తీర ప్రాంతాలకు మరో 24 గంటలు వర్షాలేవాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగంపూర్తిగా నిండిన ఆసియా లోనే రెండో పెద్దది అయిన కంభం చెరువు, కాసేపట్లో కంభం చెరువు నుండి భారీగా కిందకు పారనున్న అలుగు. చెరువు దగ్గరకి ఎవరు వెళ్లకూడదని పోలీసులు కాపలా.కంభం చెరువు కి రికార్డు స్థాయి లో 20 వేల క్యూసెక్కుల వరద https://t.co/tHpVDoQGfq pic.twitter.com/LeLKJWTW4x— Telugu_Weatherman (@Weather_AP) October 29, 2025క్రమంగా బలహీనపడుతున్న మోంథాక్రమంగా బలహీనపడుతున్న సైక్లోన్ మోంథాఇప్పటికే ఈ తీవ్ర తుపాను.. తుపానుగా బలహీనపడిందిరానున్న 4 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశంఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలుఇటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశంవిమాన సర్వీసుల పునరుద్ధరణమోంథా కారణంగా నిన్న నిలిచిపోయిన 56 సర్వీసులుఇవాళ విశాఖ-విజయవాడ ఇండిగో సర్వీసు మాత్రమే రద్దుమిగతావి యధాతథంఇంకా భయం గుప్పిట యానాంయానాంలో తుపాను ప్రభావం24 గంటలుగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరాఉదృతంగా ప్రవహిస్తున్న గౌతమి గోదావరిభారీ ఈదురుగాలులు ప్రవాహంతో కుప్పకూలిన 20 వృక్షాలుసముద్రపు అలలు తలిపించేలా ప్రవహిస్తున్న గౌతమి గోదావరినిన్న మధ్యాహ్నం నుంచే వ్యాపార సముదాయాలు మూసివేతఈదురు గాలులు ప్రభావంతో బయటకి రాని యానాం ప్రజలుఅనకాపల్లి జిల్లాలో.. మాడుగుల. పెద్దేరు రైవాడ జలాశయాలకు వరద ఉధృతి.ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు జలాశయాలకు చేరిక.పెద్దేరు జలాశయం నుంచి 750 న్యూ సెక్యుల నీరు విడుదల.తమతబ్బ వంతెనపై నుంచి కొనసాగుతున్న ప్రవాహం.తమతబ్బ చింతలపూడి పంచాయతీల్లో 12 గ్రామాల రాకపోకలకు అంతరాయం.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశం.తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాల్లో.. మోంథా తుపాను కారణంగా జిల్లాలో విస్తారంగా కురస్తున్న వర్షాలుకాకినాడలో.. మోంథా తుపాను ఎఫెక్ట్‌తో తొండంగి, ఉప్పాడ మండలాల పరిధిలో పలు గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరానిన్న ఉదయం నుండి కరెంటు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలుకొనసాగుతున్న పునరుద్దరణ పనులుతెలంగాణ మహబూబాబాద్ జిల్లాలో.. మహబూబాబాద్, ఇనుగుర్తి కేసముద్రం మండలాల్లో కురుస్తున్న భారీ వర్షండోర్నకల్ నియోజక వర్గ వ్యాప్తంగా కురుస్తున్న మోస్తరు వర్షంప్రకాశం జిల్లాలో.. ఒంగోలు నవోదయ స్కూల్ లోకి భారీగా చేరిన నీరుక్యాంటీన్ లోకి సైతం వర్షపు నీరు రావడంతో వంట కు ఇబ్బందిగా మారింది సిబ్బందివిద్యార్థులు కు ఆహారం ఇవ్వాలా వండడం కష్టం అంటున్న సిబ్బందిఎన్టీఆర్ జిల్లాలో.. కొనసాగుతున్న మోంథా తుపాను ప్రభావంతిరువూరులో భారీ వర్షంభారీ వర్షం కారణంగా చెరువును తలపిస్తున్న ఆర్టీసీ బస్టాండ్, రోడ్లుఇబ్రహీంపట్నంలో భారీగా వీస్తున్న ఈదురుగాలులువిజయవాడ సిటీలో ఈదురు గాలులతో కురుస్తున్న మోస్తరు వర్షంనందిగామలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంనందిగామ పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయంరోడ్ల పై భారీగా నిలిచిన వర్షపు నీరుపార్వతీపురం మన్యం జిల్లాలో.. తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల పూరి ఇల్లు పాక్షికంగా ధ్వంసం.గడిచిన 24 గంటలుగా కురుస్తున్న వానలకు 118.70 హెక్టార్ల లో వ్యవసాయ పంటలకు నష్టం.జిల్లా కలెక్టర్ కార్యాలయం నివేదికనెల్లూరు జిల్లాలో..సంగం పెన్నా వారధి వద్ద తప్పిన పెను ప్రమాదంపెన్నా నది నుండి ఇసుక తరలించేందుకు నిల్వ ఉంచిన మూడు పడవలుభారీగా నీరు రావడంతో తాళ్ళు తెంచుకొని పెన్నా నది గట్టున నిలిచిన బోట్లుపెన్నా వారధి గేట్లకు కు తగలకపోవడంతో ఊపిరిపించుకున్న అధికారులుకృష్ణా జిల్లాలో..మోంథా తుపాను ప్రభావంతో గన్నవరం నియోజకవర్గం వ్యాప్తంగా కురుస్తున్న వర్షంభారీ ఈదురు గాలులకు బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో నేలకొరిగిన వరి పంటనల్లగొండ జిల్లాలో..వర్షం నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించిన అధికారులువిశాఖపట్నంలో.. తుపాను తీరం దాటిన విశాఖలో కొనసాగుతున్న ఈదురు గాలులు.ఇంకా అల్లకల్లోలంగా సముద్రం.మత్స్యకారులు మరో మూడు రోజులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు.ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ ప్రైవేటు స్కూలుకు సెలవు.భారీ గాలులకు అనకాపల్లి నేషనల్ హైవే పై కూలిని చెట్టు.ఈదురు గాలులకు శంకరమఠం రోడ్ లో ఇంటిపై పడ్డ చెట్టు.అనకాపల్లి జిల్లాలో పంట మునిగిన పొలాలు..ఈరోజు భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన.ఈరోజు బీచ్, పర్యాటక ప్రాంతాలకు అనుమతి నిరాకరణ నెల్లూరు జిల్లాలో..ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయంకు వరద ప్రవాహం.జలాశయం ఇన్ ఫ్లో 40,784 క్యూసిక్కులు..జలాశయం అవుట్ ఫ్లో 33,460 క్యూసిక్కులు..జలాశయం ప్రస్తుతం నీటి సామర్థ్యం 67.647 టీఎంసీలు..జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 78 టీఎంసీలు అనకాపల్లిలో..గాలులకు అనకాపల్లి హైవే కూలిన భారీ వృక్షంతొలగించిన ఫైర్ సిబ్బందితిరుపతిలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు!తిరుపతి జిల్లాలో ఇవాళ తెరుచుకోనున్న విద్యాసంస్థలు అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఈరోజు నుండి యథావిధిగా పనిచేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాలుమోంథా ప్రభావంతో తిరుపతిలో వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖప్రకాశం జిల్లాలో.. మోంతా తుపాను ప్రభావంతో జిల్లా అతలాకుతలంభారీ వర్షాల ఈదురు గాలులతో చిగురుటాకుల వణికిన ఉమ్మడి ప్రకాశం జిల్లాపొంగిపొల్లిన వాగు లు, వంకలునిండు కుండాలా తయారైన పలు చెరువులుపలుచోట్ల రాకపోకలకు అంతరాయంరహదారులపై వాగులు పొంగిన చోట పోలీస్ పికెటింగ్కందుకూరులో ఎర్రవాగు ఉగ్రరూపం.రాళ్లపాడు ప్రాజెక్టుకు పోటెత్తిన వరద నీరుసింగరాయకొండ పోలీస్ స్టేషన్ నీటిమనకకూచిపూడి చెరువుకు గండి భారీగా గ్రామం మీద పడ్డ వరదనీరుకొండేపి వద్ద పొంగిపొర్లను అట్లేరుకొండేపి ఒంగోలు మధ్య రాకపోకలకు అంతరాయంఒంగోలు ఎర్రజర్ల మధ్య పొంగిపొర్లిన నల్లవాగుఒంగోలు ఎర్రజర్ల మధ్య నిలిచిన రాకపోకలుఅదే ప్రాంతంలో నిన్న కొట్టుకుపోయినఒక కారు కనిగిరిలో సరిగా వర్షంపోటెత్తిన భైరవకోన జలపాతం Bhairavakona Watefalls after heavy rain from cyclone 🌀 #Montha. This is in Seetharamapuram region of Prakasam district, Coastal AP close Kadapa, Nellore and Prakasam districts border. Prakasam, Nellore and Adjoining Badvel Taluk in Kadapa district received heavy to very heavy… pic.twitter.com/XqyQ22ZvV1— Naveen Reddy (@navin_ankampali) October 28, 2025 ఒంగోలు పొదిలి మధ్య వర్షం దాటికి దెబ్బతిన్న రహదారితీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులుఒంగోలులో పల్చోట్ల కాలనీలు జలమయంఒంగోలు నగరంలోని కర్నూల్ రోడ్డు, ట్రంక్ రోడ్లో సైతం భారీగా నిలిచిన వర్షపు నీరుశివారు కాలనీలో ఇళ్లలోకి చేరిన నీరుతీర ప్రాంత మండలాల్లో భారీ వర్షం ఈదురు గాలులుపునరావాస కేంద్రాలకు పలువురు తరలింపుమార్కాపురం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గుండ్లకమ్మ నదిమార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం- కొండేపల్లి మార్కాపురం -నాగులవరం గ్రామాల మధ్య రాకపోకలకు బంద్జిల్లాలో భారీగా నష్టపోయిన మిర్చి మొక్కజొన్న కంది మినుము సజ పంట రైతులుపుల్లలచెరువు మండలం చౌటపచర్ల చెరువుకు గండి వంద ఎకరాలలో ఉరి మొక్కజొన్న పంట నష్టందర్శి మండలం వెంకటాచలపల్లి వద్ద పొంగిపొర్లుతున్న పులి వాగుకొట్టుకుపోయిన రోడ్లుగ్రామ శివారులో ఉన్న గుడిలో రోడ్డు కొట్టుకుపోవడంతో అక్కడ ఇరుక్కుపోయిన 30 మంది స్వాములుచీరాలలో భారీ వర్షాలతో రోడ్లు జలమయం అర్ధవీడు మండలం నల్లమల అటవీ ప్రాంతంలో భారీ వర్షాలుఉప్పొంగిన జంపలేరు వాగుబొల్లు పల్లె అచ్చంపేటకు రాకపోకలు బంద్భారీ వర్షాల కారణంగా నిన్నటి నుంచి దోర్నాల శ్రీశైలం మధ్య నిలిచిన రాకపోకలుగుండ్లకమ్మ రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు ఏపీని నిండా ముంచిన మోంథామోంథా తుపానుతో ఏపీకి తీవ్ర నష్టంఓవైపు భీకరగాలులు.. మరోవైపు భారీ వర్షాలువిరిగిన స్థంభాలు, నేలకొరిగిన వృక్షాలుపొంగిపొర్లుతున్న వాగులురోడ్లు, రైల్వే ట్రాక్‌లు దెబ్బతినడంతో రవాణా వ్యవస్థకూ అంతరాయంలోతట్టు ప్రాంతాల జలమయంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు20 గంటలుగా అంధకారంలోనే పలు ప్రాంతాలుసెల్ టవర్లు దెబ్బ తినడంతో పని చేయని సెల్‌ఫోన్ సేవలుతీవ్రంగా దెబ్బ తిన్న పంటలుఐదు రోజులుగా వేటకు దూరమైన మత్య్సకారులుమోంథా ప్రభావంతో ఈ నెల 31 దాకా విద్యాసంస్థలకు సెలవులు పొడిగించిన పలు జిల్లా కలెక్టర్లుA new waterfall has formed in Poolikuntla village, Velgandla Mandal, Kanigiri Taluk of Prakasam district, following the impact of #CycloneMontha. Nellore and Prakasam districts, along with Nandyal, are among the worst affected areas so far. Now it’s Telangana time, by morning… pic.twitter.com/LlEfh2A1sD— Naveen Reddy (@navin_ankampali) October 28, 2025క్రమంగా బలహీనపడుతున్న మోంథాతీవ్ర తుపాను ప్రస్తుతం తుపానుగా బలహీనపడ్డ మోంథారానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీన పడే అవకాశందీని ప్రభావంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుకోస్తాంధ్రలో ఈదురుగాలులుఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశంఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలుకాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశంనెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశంతెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్మెంథా ఎఫెక్ట్‌తో తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ఆరు జిల్లాలకు ఆరెంజ్, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్భద్రాద్రి, ఖమ్మం, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్హైదరాబాద్, జనగాం, గద్వాల, మేడ్చల్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నారాయణపేట, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి.. ఆరెంజ్ అలర్ట్కృష్ణా జిల్లా..దివి సీమలో మోంథా తుపాను ప్రభావంతో కొనసాగుతున్న ఈదురు గాలులునిన్న మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బంది పడుతున్న ప్రజలుఅవనిగడ్డ నియోజకవర్గం వ్యాప్తంగా ఈదురుగాలుల కారణంగా విద్యుత్ పునఃరుద్ధరణకు అంతరాయంగాలుల తీవ్రత తగ్గిన తర్వాత విద్యుత్‌ను పునఃరుద్ధరించే అవకాశంతెలంగాణ ఖమ్మం జిల్లాలో.. తెలంగాణపై మోంథా ప్రభావంపలు జిల్లాలకు వర్ష సూచనమొoథా తూఫాను దృష్ట్యా (బుధవారం) జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రకటనప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన కలెక్టర్తెలంగాణ వికారాబాద్ జిల్లాలో.. మోంథా ఎఫెక్ట్ జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షంపూడూరు లో 6.1 cmమోమిన్ పేట లో 6 cmధారూర్ లో 4.6cmపరిగిలో 4.5cmకిరండోల్ రైల్వే లైన్ ధ్వంసంమోంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు వాల్తేరు రైల్వే డివిజన్లో కొత్తవలస-కిరండోల్ సింగిల్ రైల్వే లైన్ ధ్వంసం అరకు రైల్వే టన్నెల్ నెంబర్ 32, చిమిడిపల్లి, బొర్రా గుహల మధ్య రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వంసం ట్రాక్‌పై చేరిన మట్టి, బండరాళ్లు వరద నీరు నిలవకుండా ఏర్పాట్లు చేసిన సిబ్బందిఎన్టీఆర్ జిల్లాలో..తిరువూరు నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షంనీట మునిగిన ఆర్టీసీ బస్టాండ్, ప్రధాన రహదారిపలు లోతట్టు ప్రాంతాలు జలమయంకృష్ణా జిల్లాలో.. ఉయ్యూరు మండలం గండిగుంట పంచాయతీ కాకాని నగర్ లో మూడు రేకుల షెడ్లు ఇళ్ల పై పడిన చెట్లు.పూర్తిగా ధ్వంసం అయిన ఒక ఇల్లు,పాక్షికంగా మరో రెండు ఇల్లు ధ్వంసం.సహాయ చర్యలు చేపట్టిన అధికారులునంద్యాల జిల్లాలో..మోంథా తుపాను కారణంగా ఆత్మకూరు రెవిన్యూ డివిజన్ లోని పాములపాడు, కొత్తపల్లి, వెలుగోడు మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంనల్లమలలో కురుస్తున్న భారీ వర్షానికి ఎగువ నుంచి భవనాసివాగు కు చేరుతున్న వరద నీరు.ఉప్పొంగిన వక్కిలేరు, భవనాసి వాగులు..ఆత్మకూరు పట్టణ శివారులోని భవనాసి వాగుపొంగి పొర్లుతుండడంతో సుమారు 22గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలుజలదిగ్బంధంలో ఆత్మకూరు పట్టణం.కర్నూలు -గుంటూరు జాతీయ రహదారిపై మోకాలికి పైగా పారుతున్న వర్షపు నీరు..వెలుగోడు మండలంలోని మాధవరం వద్ద పొంగిపొర్లుతున్న గాలేరు వాగు, సుమారు 8 గ్రామాలకు నిలిచిపోయిన ప్రజా రవాణా సంబంధాలులోతట్టు కాలనీలు జలమయం, నిద్రాహారాలు మాని అవస్థలు పడుతున్న ప్రజలు..విశాఖపట్నంలో..విశాఖ నగరం పై కొనసాగుతున్న తుపాను ప్రభావం. .నిన్న రాత్రి విశాఖలో భారీగా ఈదురు గాలులుగాలులకు శంకరమఠం రోడ్ లో ఇంటిపై కూలిన భారీ వృక్షం.తూటిలో తప్పిన ప్రమాదంపాక్షికంగా ఇల్లు ద్వసం.చెట్టును తొలగిస్తున్న ఫైర్ సిబ్బంది.జోన్ 3 లో ఇప్పటివరకు పడిన 72 నుండి చెట్లును తొలగించిన అధికారులువిజయవాడలో.. మోంథా తుపాను ఎఫెక్ట్‌తో విజయవాడలో అర్ధరాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షంగుంటూరులో.. గుంటూరు జిల్లాలో భారీ వర్షంఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంగుంటూరులో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంనగరంలోని అన్ని ప్రధాన రహదారులు జలమయంపొంగిపొర్లుతున్న ట్రైన్లుబ్రాడీపేట ,అరండల్ పేట, మహిళా కాలేజ్, గుజ్జునుకుంట్ల, ఏటి అగ్రహారంతో పాటు ప్రధాన రోడ్లన్నీ జలమయంRUB తోపాటు 3 వంతెన కిందకు భారీ స్థాయిలో వర్షపునీరుభారీ వర్షాలు ఎక్కడంటే..శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశంకాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశంకోనసీమ జిల్లా..అంతర్వేది పాలెం వద్ద తీరం దాటిన మోంథా తుపానుతీరం దాటే సమయంలో 70 నుంచి 80 కిలోమీటర్ల మేర ఈదురు గాలులుకోనసీమలో భారీగా కూలిన చెట్లుపలుచోట్ల ధ్వంసమైన విద్యుత్ లైన్లురోడ్డుకు అడ్డంగా భారీ వృక్షాలు కోవడంతో నిలిచిపోతున్న రాకపోకలుపలు ప్రాంతాల్లో కురుస్తున్న చిరుజల్లులుజిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో దెబ్బతిన్న వరి పంటపెద్ద సంఖ్యలో కూలిన కొబ్బరి చెట్లుతీర ప్రాంతంలో కొనసాగుతున్న ఈదురు గాలులుఅంతర్వేది, ఉప్పలగుప్తం ఓడలరేవు ప్రాంతాల్లో అలకల్లోలంగా ఉన్న సముద్రంఎగసిపడుతున్న అలలువిజయవాడ..ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి దంచికొడుతోన్న భారీ వర్షంపలుచోట్ల అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేతవిజయవాడలో భారీ వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయంఆర్టీసీ బస్టాండ్ వద్ద సబ్ వేలోకి చేరిన వర్షపు నీరుసబ్ వే వైపు వాహనాలు వెళ్లకుండా బారికేడ్లు పెట్టిన పోలీసులుకనకదుర్గ ఫ్లై ఓవర్ వైపు వాహనాల రాకపోకలు నిలిపివేతవిజయవాడ..ప్రకాశం బ్యారేజ్ కు పెరుగుతున్న వరదఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 82,675 క్యూసెక్కులువచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదలకాలువలకు పూర్తిగా నీటి విడుదలను నిలిపివేసిన అధికారులు మోంథా ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కావలిలో అత్యధికంగా 22 సెం.మీ. వర్షం కురిసింది. With 207 mm of rain recorded today, Ongole city has witnessed one of its heaviest single-day downpours in recent years. The situation across Prakasam district is equally severe.🎥Rekha pic.twitter.com/jqKkqQosKA— Naveen Reddy (@navin_ankampali) October 29, 2025మోంథా తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. పలు చోట్ల విద్యుత్ స్థంబాలు, చెట్లు నేలకొరిగాయి. జాతీయ రహదారిపై రాత్రంతా వాహనాలను ఎక్కడిక్కడే నిలిపేశారు. మచిలీపట్నంలో.. తుపాను ధాటికి మచిలీపట్నంలో విద్యుత్ వ్యవస్థ ధ్వంసమైంది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.నెల్లూరు, బోగూరులో తుపాను ధాటికి గుడిసెలు కుప్పకూఇపోయి ప్రజలు గజగజ వణికిపోయారుప్రకాశంలో.. 10 అడుగుల మేర అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయిందిపలు జిల్లాలోనూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగి రాత్రంతా ప్రజలు అంధకారంలోనే ఉండిపోయారు. పలు జిల్లాల్లో రోడ్లు జలమయమయ్యాయి. తీవ్ర తుపాన్‌గా తీరం దాటే కోనసీమలో సముద్రం ఉప్పొంగింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో సముద్రం ముందుకొచ్చింది. మామిడికుదురు మండలం కరవాక, గొగన్నమఠం దగ్గరా ముందుకు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో మత్స్యకార కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాన్ ప్రభావంతో.. ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, విశాఖ.. ఇలా 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాల ఉంటాయంది. -
రాష్ట్రవ్యాప్తంగా భీకర ప్రళయాన్ని సృష్టిస్తున్న మోంథా
-
తీరాన్ని తాకిన తుఫాన్.. ఏపీ అల్లకల్లోలం !
-
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, అమరావతి: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమతంగా ఉండాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. తుపాను ముప్పు తగ్గే వరకు ప్రతి ఒక్కరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు.తుపాను సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తోడుగా నిలవాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. -
ధాన్యం రైతు గుండెల్లో ‘మోంథా’ గుబులు
సాక్షి, అమరావతి: ధాన్యం రైతు గుండెల్లో ‘మోంథా’ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు కోతదశకు చేరుకున్న పంటచేలు నేలకొరిగాయి. తుపాను ప్రభావిత జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరికంకులు దెబ్బతింటున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద తీరాన్ని తాకిన ఈ తుపాను ప్రభావం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర, కోస్తాం«ధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. తుపాను తర్వాత దాదాపు మూడురోజులు కురిసే వర్షాల ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో పంటలపై ఉంటుందని చెబుతున్నారు. ప్రధానంగా వరితోపాటు మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, పెసర పంటలకు అపారనష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది 72.87 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగవగా, అందులో 38.96 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. సాగైన వరి విస్తీర్ణంలో దాదాపు 31.14 లక్షల ఎకరాలు తుపాను ప్రభావిత జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. ఇందులో సుమారు 15 లక్షల ఎకరాల్లో పంట తీవ్ర ప్రభావానికి గురవుతుందని వ్యవసాయశాఖ ముందస్తు అంచనా వేసింది. ఇతర పంటలన్నీ కలుపుకొంటే 20 లక్షల ఎకరాల్లో పంటలపై తుపాను ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. దిగుబడులపై ప్రభావం తుపాను ప్రభావంతో భారీ వర్షాలకు ఈదురుగాలులు తోడవడంతో వరిపైరు తీవ్రంగా దెబ్బతింటుంది. ముంపునీరు దిగిపోయిన తర్వాత సత్వర యాజమాన్య పద్ధతులు పాటించినప్పటికీ తుపాను ప్రభావం దిగుబడులపై ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఎకరాకు కనీసం 5 నుంచి 8 బస్తాలు దిగుబడి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ధాన్యం రంగుమారడం, తేమశాతం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అయితే మొలకలొచ్చే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. బిహార్ ఎన్నికల విధుల్లో వ్యవసాయశాఖ డైరెక్టర్ వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ బిహార్‌లో ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లారు. గతంలో ఉన్నతాధికారులు ఎన్నికలతోపాటు ఇతర సేవల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లినప్పుడు వారి బాధ్యతలను ఇతర అనుబంధ శాఖల అధికారులకు అప్పగించేవారు. ఇప్పుడు వ్యవసాయశాఖ డైరెక్టర్ బాధ్యతల్ని ఎవరికీ అప్పగించలేదు. దీంతో లాగిన్స్ అన్నీ ఆయన వద్దే ఉన్నాయి. విపత్తు వేళ ఆ శాఖలో విభాగాధిపతులు ప్రతి చిన్న విషయాన్ని బిహార్‌లో ఉన్న డైరెక్టర్‌కి ఫోన్ ద్వారా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
తుపాను సహాయక చర్యల్లో సచివాలయాలే కీలకం
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థే మోంథా తుపాను సహాయక కార్యక్రమాల్లో ఇప్పుడు కీలకంగా మారింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమ, మంగళవారాల్లో తుపాను ప్రభావిత మారుమూల ప్రాంతాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు 24 గంటలూ పనిచేశాయి. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులే ప్రభుత్వం అందించే తుపాను తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అక్కడి ప్రజలకు చేరవేశారు. చాలాచోట్ల సచివాలయాల ఉద్యోగులు తమ పరిధిలో వీధి వీధికీ వెళ్లి తుపాను సమాచారాన్ని నేరుగా అక్కడి ప్రజలకు తెలియజేశారు. తుపాను పరిస్థితులపై ప్రభుత్వం అధికారికంగా వెల్లడించే సందేశాల్ని గ్రామంలో యాక్టివ్‌గా ఉండే యువతకు వాట్సాప్ ద్వారా చేరవేశారు. ఐదారేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో తీవ్ర విపత్తులు తలెత్తిన సమయంలో క్షేత్రస్థాయిలో చాలా గ్రామ పంచాయతీల్లో రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శి కూడా ఉండని పరిస్థితి. అప్పట్లో ప్రభుత్వం చిన్నపాటి వరద సహాయక చర్యలు చేపట్టేందుకు ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగులను తరలించాల్సి వచ్చేది. ప్రస్తుతం ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో 6 నుంచి 10 మంది చొప్పున పనిచేస్తున్నారు. వారే మూడు షిప్టుల్లో రోజంతా సచివాలయంలోనే అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయి తుపాను పరిస్థితుల సమాచారాన్ని ప్రత్యేక యాప్‌ల ద్వారా ప్రభుత్వానికి చేరవేశారు. క్షేత్రస్థాయిలో తుపాను ప్రభావానికి గురైన గ్రామ వివరాలతో పాటు అక్కడ ఈదురు గాలులు, వర్షాల కారణంగా స్థానికంగా దెబ్బతిన్న ఇళ్లు, రోడ్లు వంటి వివరాలపై ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా ప్రభుత్వానికి తక్షణ నివేదికలు అందజేశారు. కరెంటు స్తంభాలు కూలినా, ఒరిగినా ఆ సమాచారాన్ని వెంటనే ప్రభుత్వానికి చేరవేశారు. సముద్ర తీర గ్రామాల్లో గత ఐదేళ్ల కాలంలో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయాల కార్యాలయాలపైనే తాత్కాలికంగా ప్రత్యేక మైక్‌లను ఏర్పాటు చేసి తుపాను తాజా సమాచారం ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం చేశారు. సర్కారు స్పందన అంతంత మాత్రమే క్షేత్రస్థాయిలో తుపాను ఇబ్బందులకు సంబంధించిన సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ప్రభుత్వం వేగంగా సేకరించగలిగినప్పటికీ.. సహాయక చర్యల విషయంలో సర్కారు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆన్లైన్ విధానంలో సైక్లోన్ మోంథా ప్రొఫార్మా–2 రూపంలో ప్రభుత్వానికి సమాచారాన్ని తెలియజేసింది. దాని ప్రకారం..మంగళవారం రాత్రి 8 గంటలకు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 419 చెట్లు కూలగా..రెండుచోట్ల మాత్రమే వాటిని తొలగించారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేయని గ్రామాల సంఖ్య 160కి పైగా ఉన్నట్టు సచివాలయాల సిబ్బంది రాష్ట్ర కార్యాలయానికి సమాచారమిచ్చారు. 37 ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నట్లు కూడా ఆ నివేదికల్లో వెల్లడించారు. -
సచివాలయాలు బేస్ క్యాంప్‌లుగా పని చేయాలి
సాక్షి, అమరావతి: మోంథా ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల విషయంలో క్షేత్ర స్థాయి సిబ్బంది గ్రామ, వార్డు సచివాలయాలు బేస్ క్యాంప్‌గా పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుపాను ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీఎస్ కేంద్రంగా మంగళవారం ఉదయం, సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద 3 వేల జనరేటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధిక వర్షపాతం మంగళవారం సాయంత్రం వరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. వర్షం వల్ల ఇప్పటి వరకు అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ప్రకాశం, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో 43వేల హెక్టార్లలో పంటలు నీట మునిగాయని అధికారులు తెలిపారు. పంట నష్టం వివరాలను రైతులు కూడా పంపేలా వ్యవసాయ శాఖ రూపొందించిన యాప్‌లో మార్పు, చేర్పులు చేయాలని సీఎం సూచించారు. వెంటనే పంటనష్టం అంచనాలు రూపొందించి కేంద్రానికి పంపాలని చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు బృందాన్ని పంపాలని ఆదేశించారు. కాగా, తుఫాను ప్రభావం ఉన్న గ్రామ,వార్డు సచివాలయాల సిబ్బందితో ఆర్టీజీఎస్ నుంచి సీఎం చంద్రబాబు మంగళవారం టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తుపాను ప్రభావంపై ఆరా తీసి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. జీఎస్ కేంద్రంగా మంగళవారం ఉదయం, సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద 3 వేల జనరేటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
3 జిల్లాలకు రెడ్.. 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: మోంథా తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. మంగళవారం సాయంత్రం ఏపీలోని అంతర్వేదిపాలెం వద్ద మోంథా తీరాన్ని తాకింది. ఈ తుపాను ప్రభావం తెలంగాణపైనా ఉంటుందని వాతావరణ శాఖ చెప్పింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. ఈమేరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లోని చాలాప్రాంతాల్లో భారీ వర్షాలు, అతిభారీ వర్షాలు, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని హెచ్చరించింది. రాష్ట్రంలో మరో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రెడ్ అలర్ట్ జిల్లాలో తక్షణ సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. బుధవారం కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.ఎక్కడెక్కడ ఏ అలర్ట్? రెడ్ అలర్ట్: ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంఆరెంజ్ అలర్ట్: మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, ఎల్లో అలర్ట్: కుమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్36 విమానాలు రద్దుశంషాబాద్: మోంథా తుపాను ప్రభావం విమానాల రాకపోకలపై పడింది. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి మంగళవారం రాకపోకలు సాగించే 36 విమానాలు రద్దయినట్లు ఎయిర్‌పోర్టువర్గాలు వెల్లడించాయి. ఎయిరిండియా, ఇండిగో విమానాలు సర్వీసులను రద్దు చేసినట్లు ముందస్తు సమాచారం ఇవ్వడంతో ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. మూసీకి పెరుగుతున్న వరదమణికొండ: హైదరాబాద్‌లో జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్సాగర్లకు పైనుంచి వరద పెరుగుతోంది. భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెండు జలాశయాల గేట్లు తెరచి మూసీనదికి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి గండిపేటకు పైనుంచి 1,600 క్యూసెక్కుల వరద వస్తుండగా 2,732 క్యూసెక్కుల నీటిని మూసీకి వదులుతున్నారు. హిమాయత్‌సాగర్‌కు పైనుంచి 1,600 క్యూసెక్కుల వరద వస్తుండటంతో 3,963 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. -
శాంతించిన మోంథా!
సాక్షి, విశాఖపట్నం: మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసింది.. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో జన జీవనాన్ని స్తంభింపజేసింది.. తుపాను సముద్రంలో ఉంటేనే ఇంత అలజడి సృష్టించిందే.. ఇక తీరం దాటే సమయంలో ఉప్పెనలా విరుచుకు పడుతుందంటూ వాతావరణ నివేదికలు హెచ్చరించాయి... తీరం సమీపిస్తున్న కొద్దీ అందర్లోనూ ఉత్కంఠ.. ఆందోళన.. రాకాసి మోంథా ఎలా ముంచేస్తుందో.. ఎక్కడ విరుచుకుపడుతుందోనని తీర ప్రాంత జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు.. పాములు పట్టేవాడు పాముకాటుకే బలయ్యారనే నానుడిలా... గాలులన్నింటినీ తనలో కలిపేసుకుంటూ బలంగా దూసుకొచ్చిన మోంథా.. చివరికి ఆ గాలుల కోత వల్లే బలహీన పడింది. తీరం దాటుతున్నా ప్రశాంత వాతావరణం.. కొద్దిపాటి బలమైన గాలులు.. మోస్తరు నుంచి భారీ వర్షాలతో సముద్రాన్ని వదిలి నేలమీదకి వచ్చింది. ముంచేస్తుందనుకున్న మోంథా.. మౌనంగా వెళ్లిపోవడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికార యంత్రాంగం ప్రభుత్వ హడావుడి నుంచి తేరుకున్నారు. అయితే వాయు, రైలు రవాణా స్తంభించిపోయింది. మొత్తంగా భయాందోళనలు సృష్టించిన తీవ్ర తుపాను మోంథా.. రాష్ట్రంపై మోస్తరు ప్రభావంతో వీడ్కోలు చెప్పేసింది. మోంథా ఎందుకు శాంతించిందంటే.. వాస్తవానికి మోంథా తుపాను వేగం, గమనం చూస్తే 2023లో బాపట్లలో తీరం తాకిన మిచాంగ్ తుపానును తలపించింది. సముద్రంలో తీవ్ర తుపానుగా బలపడటంతో గాలులన్నింటినీ తనలో చేర్చుకొని మరింత బలంగా మారింది. దీంతో మోంథా తుపాను.. రాష్ట్రంలోని అనేక తీర ప్రాంతాల్ని తుడిచి పెట్టుకుపోతుందని అంతా ఆందోళనకు గురయ్యారు. అయితే.. తీరానికి 70 నుంచి 100 కి.మీ. దూరంలో ఉన్న సమయంలో విండ్ షీర్ (గాలుల కోత) మొదలైంది. తుపాన్లో కీలకమైన సైక్లోన్ ఐ పై విండ్ షీర్ పంజా విసిరింది. దీంతో తుపాను గాలులు చీల్చుకుపోతూ కకావికలమైపోయాయి. దీంతో మోంథా తీరం దాటకముందే బలహీనపడిపోయింది. విండ్ షీర్ ప్రభావంతో తుపాను∙ప్రధాన కేంద్రం నుంచి చెల్లాచెదురైన గాలులు, మేఘాల ప్రభావం తీరం దాటే ప్రాంతంలో కాకుండా చుట్టుపక్కల జిల్లాలపై చూపించింది. దీంతో.. మోంథా తన శక్తిని కోల్పోయి.. తీరం దాటేందుకు సిద్ధమై.. కడలిని వదిలి భూమిని తాకింది. తీరం దాటే సమయంలో గరిష్టంగా 110 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నివేదికలు అంచనా వేసినా.. వాస్తవ స్థితిలో మాత్రం 70 నుంచి 80 కి.మీ. వేగంతో మోస్తరు వర్షాలకే పరిమితమవ్వడంతో తీర ప్రాంతమంతా ఊపిరి పీల్చుకుంది. కొన్ని ప్రాంతాల్లోనే ప్రభావం మోంథా తీవ్ర తుపాను తీరం తాకనంత వరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను వణికించింది. కానీ తీరానికి చేరుకోగానే పూర్తి నిశ్శబ్ధ వాతావరణాన్ని తలపించింది. ఉదయం 10 గంటల నుంచి మొదలైన గాలులు సాయంత్రం ఏడు గంటల వరకు జిల్లా వాసులను భయాందోళనలకు గురి చేశాయి. తీరానికి సమీపిస్తే తుపాను విరుచుకుపడుతుందనే ఆందోళన అందరి కంటి మీద కునుకులేకుండా చేసింది. భారీగా వీచిన ఈదురు గాలులకు పెద్ద సంఖ్యలో కొబ్బరి చెట్లు నేల కూలాయి. భారీ వృక్షాలు సైతం కూకటి వేళ్లతో సహా పడిపోయాయి. విద్యుత్ తీగలు తెగి పడడంతోపాటు పదుల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఉదయం 10 గంటల నుంచి జిల్లాలో పలు మండలాలకు విద్యుత్ లేకుండా పోయింది. సముద్ర అలలు మూడు మీటర్ల ఎత్తున ఎగిసిపడగా, 300 మీటర్లు ముందుకు చొచ్చుకు వచ్చాయి. తీరం భారీగా కోతకు గురైంది. తీరానికి చేరువయ్యే సమయంలో ప్రశాంతమే రాత్రి 8 గంటల తర్వాత మోంథా తుపాను ప్రభావం పూర్తిగా కనిపించలేదు. అసలు నిజంగా తుపాను∙ఇక్కడ తీరం దాటుతోందా.. లేదా దిశ మార్చుకుందా? అనే సందేహమే అందరిలోనూ మొదలైంది. అలజడి సృష్టించిన ఈదురు గాలులు నిలిచిపోయాయి. భారీ వర్షం సైతం తగ్గుముఖం పట్టింది. సముద్రంలో అలజడి కొనసాగుతున్నా భారీ వర్షం.. ఈదురు గాలులు లేకపోవడం జనాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. తుపాను అర్ధరాత్రి ఒంటి గంటకు నరసాపురం సమీపంలో తీరం దాటింది. ఈ సమయంలో 110 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ వర్షం కురుస్తుందని కోనసీమ వాసులు ఆందోళన చెందారు. కళ్ల ముందు 1996 పెను తుపాను విషాదం కదలాడింది. కాని అందుకు విరుద్ధంగా గాలులు నిలిచి పోవడంతో పాటు భారీ వర్షం తగ్గి కేవలం చినుకులు పడుతుండడంతో మోంథా తుపాను గమనం ఎవరికీ అంతుచిక్కలేదు. దీంతో తీర ప్రాంతవాసులు బతుకుజీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో... తొలుత కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసినా.. విండ్ షీర్ కారణంగా స్వల్పంగా దిశ మార్చుకొని అంతర్వేది పల్లిపాలెం వైపు వెళ్తుందన్న వాతావరణ శాఖ ప్రకటనతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం గంటకు 18 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన తుపాను వేగం మంగళవారం నాటికి 12 కిలోమీటర్లకు తగ్గిపోయింది. ఫలితంగా దీని దిశ మారిపోయి, జిల్లాకు ముప్పు తప్పింది. అయితే పెనుగాలులు, జోరు వానలతో ఈ తుపాను జిల్లాను అతలాకుతలం చేసింది. జిల్లావ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచీ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కాకినాడ తీరంలో బలమైన ఈదురు గాలులకు వర్షాలు కూడా తోడవ్వడంతో ప్రజలు భయకంపితులయ్యారు. పిఠాపురంలో 22.6 మిల్లీమీటర్లు, కాజులూరు మండలంలో అత్యల్పంగా 2.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అక్కడక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లోని కర్నూలు రోడ్డు, ఊరచెరువు రోడ్డులో నిలిచిపోయిన వర్షపునీరు ఉప్పాడ తీరానికి తప్పని ముప్పు తీరానికి మాత్రం ముప్పు తప్పలేదు. ఉప్పాడ, కోనపాపపేట గ్రామాల్లోని పలు ఇళ్లు సముద్ర కోతకు గురయ్యాయి. విద్యుత్ స్తంభాలు, వృక్షాలు సముద్రంలో కలసిపోయాయి. బీచ్ రోడ్డు ధ్వంసమైంది. సముద్రంపై వేటను నిషేధించడంతో మత్స్యకారులు ఇళ్ల వద్దనే ఉండిపోయారు. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న రాకాసి అలలు కాకినాడ – ఉప్పాడ బీచ్ రోడ్డును ముంచెత్తాయి. ముందు జాగ్రత్తగా బీచ్ రోడ్డుపై రాకపోకలను పోలీసులు నియంత్రించారు. సాధారణ ప్రయాణికులతో పాటు స్థానికులను సైతం ఆ రోడ్డు పైకి వెళ్లకుండా కట్టడి చేశారు. కోతకు గురి కాకుండా రక్షణగా వేసిన బండరాళ్లు సముద్ర అలల తాకిడికి రోడ్డు పైకి వచ్చిపడుతూ ప్రమాదకరంగా మారాయి. ముందుస్తు చర్యల్లో బాగంగా ఉప్పాడ, కోనపాపపేట, మూలపేట, ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలైన మాయాపట్నం, సూరాడపేట, జగ్గరాజుపేట, అమీనాబాద్, కొత్తపట్నం, గంగూలిపేట, పాత మార్కెట్ ప్రాంతాల్లోని సుమారు 8,200 మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు. కాకినాడ నగరంతో పాటు రూరల్, తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి, పిఠాపురం, గొల్లప్రోలు, తాళ్లరేవు తదితర మండలాల్లో మత్స్యకారులతో పాటు ఇతర నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. విశాఖపట్నంలో జలమయమైన వెలంపేటలోని రహదారి స్తంభించిన పోర్టు తుపాను ప్రభావంతో కాకినాడ డీప్ వాటర్, యాంకరేజ్ పోర్టుల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. బియ్యం, పంచదార, పామాయిల్, యూరియా తదితర ఎరువులు ఎగుమతి, దిగుమతులను నిలిపివేశారు. కాకినాడ పోర్టులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక ప్రకటించారు. గడచిన రెండు దశాబ్దాల్లో కాకినాడ పోర్టులో ఈ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారి. జిల్లా వ్యాప్తంగా 12 మండలాల పరిధిలో దాని ప్రభావం ఉందని చెబుతున్నా వాస్తవానికి కాకినాడ తీరంలోని తొండంగి, యు.కొత్తపల్లి.. కాకినాడ రూరల్ కాకినాడ సిటీ తాళ్ళరేవు మండలాలపైనే ప్రభావం కనిపించింది. ముందు జాగ్రత్త చర్యగా కాకినాడ, పిఠాపురం, తాళ్లరేవు ప్రాంతాల్లో హెలిప్యాడ్లు కూడా సిద్ధం చేశారు కానీ ఇంత వరకు వాటి అవసరం రాలేదు పంటలకు నష్టం విస్తారంగా కురుస్తున్న వర్షాలు, పెను గాలులకు అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. కరప, కాకినాడ రూరల్, పెద్దాపురం, సామర్లకోట, యు.కొత్తపల్లి, పిఠాపురం, గొల్లప్రోలు, కాజులూరు తదితర మండలాల్లో వరి పంట నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గొల్లప్రోలు మండలం దుర్గాడ, చేబ్రోలు, వన్నెపూడి తదితర ప్రాంతాల్లో మిరప, అరటి వంటి వాణిజ్య పంటలు దెబ్బ తిన్నాయి. ఏలేరు, పిఠాపురం బ్రాంచి కెనాల్ (పీబీసీ), సుద్దగెడ్డ పొంగి ప్రవహిస్తున్నాయి. ఏలేరు జలాశయానికి ఎగువ నుండి వరద నీరు పోటెత్తడంతో దిగువ ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏలేరు, పంపా, తాండవ రిజర్వాయర్లు పొంగి ప్రవహిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో.. మోంథా తుపాను పెద్దగా ప్రభావం చూపకపోవడం పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు ఊరటనిచ్చింది. నరసాపురం, భీమవరం, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లో అక్కడక్కడ జల్లులు మాత్రమే పడగా గాలుల తీవ్రత లేకపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. తీవ్ర తుపానుగా బలపడిన తర్వాత ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల సమయానికి జిల్లాలో 154 మి.మీ వర్షం కురవగా, సగటు వర్షపాతం 7.7 మి.మీ మాత్రమే నమోదైంది. ఆచంటలో 24 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 20 మండలాలకు గాను 15 మండలాల్లో 10 మి.మీ లోపు వర్షం మాత్రమే కురిసింది. జిల్లా వ్యాప్తంగా 3,581 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. తుపాన్‌ను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ఆర్అండ్బీ పరిధిలో 29, ట్రాన్స్పోర్ట్ పరిధిలో 40, మొత్తంగా 69 జేసీబీలు, 79 పవర్ సాలను, 96 డీజిల్ జనరేటర్లను అందుబాటులో ఉంచారు. నరసాపురంలో 34 మంది సభ్యులతో ఒక ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌ను, ఏపీఎస్పీ ప్లటూన్ ఒకటి భీమవరంలో మరొకటి నరసాపురంలో సిద్దంగా ఉంచారు. 60 మంది గ్రేహౌండ్ సిబ్బందిని ఉండిలో మోహరించారు. 150 వరకు వైర్లెస్ సెట్లను ఒక శాటిలైట్ ఫోన్‌ను, ఒక డ్రోన్‌ను అందుబాటులో ఉంచారు. జిల్లాలోని 37 పునరావాస కేంద్రాలకు 4,150 మందిని తరలించారు. ఏలూరు జిల్లాలో.. ఏలూరు జిల్లాలో ఉదయం 9.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు 310 మి.మీ. వర్షపాతం నమోదైంది. ద్వారకా తిరుమలలో 29.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలోని మెజార్టీ మండలాల్లో 10 మి.మీ. లోపు వర్షపాతం మాత్రమే నమోదైంది. తుపాను తీరం దాటాకా జిల్లాలోని ఏలూరు, కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు తదితర నియోజకవర్గాల్లో చెదురు మదురు జల్లులు మినహా భారీ వర్షాలు లేకపోవడం ఊరటనిచ్చింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లావ్యాప్తంగా 2,239 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. వరి పంట కోత దశకు చేరుకోగా, గాలుల తీవ్రత లేకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి 45 పునరావాస కేంద్రాలకు 1,203 మందిని తరలించారు. 2,000 విద్యుత్ స్తంభాలను సిద్ధం చేశారు. 59 జేసీబీలు, 37 పవర్‌సా, 10 బ్లేడ్ ట్రాక్టర్లు, 100 పోలీస్ వైర్లెస్ సెట్లను సిద్ధం చేశారు. 105 మంది స్విమ్మర్స్‌ను గుర్తించారు. 295 మంది గర్భిణులను ఆస్పత్రులకు తరలించారు. కేకే లైన్లో జారిపడిన కొండచరియలు అల్లూరి జిల్లాలో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొత్తవలస–కిరండూల్ రైల్వే లైన్లో చిమిడిపల్లి సమీపంలోని టన్నెల్ వద్ద కొండచరియలు ట్రాక్‌పై జారి పడ్డాయి. వరదనీరు ట్రాక్‌పై పొంగి ప్రవహించింది. ట్రాక్‌పై బండరాళ్లు, మట్టి తొలగించే పనుల్లో రైల్వే వర్గాలు నిమగ్నమయ్యాయి. ఈ మార్గంలో సోమవారం రాత్రి నుంచి అన్ని రైళ్ల రాకపోకలను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. అరకులోయ–అనంతగిరి ఘాట్‌లో సుంకరమెట్ట, బీసుపురం సమీప ప్రాంతాల్లో రోడ్డుపై వరదనీరు పొంగి ప్రవహించింది. ఘాట్ మార్గాల్లో రాత్రి పూట ప్రయాణాలను నిలిపివేశారు. బలిమెల జలాశయ నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది.అల్లూరి సీతారామరాజు జిల్లా కొత్తవలస–కిరండూల్ మార్గంలో చిమిడిపల్లి సమీపంలోని టన్నెల్ వద్ద రైల్వే ట్రాక్‌పై కూలిన కొండచరియలు నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో బుధవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ సహా విశాఖపట్నం, గంగవరం, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో పదో నంబర్ భారీ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు వైఎస్సార్సీపీ శ్రేణులు తోడుగా నిలవాలి మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు సాక్షి, అమరావతి: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమతంగా ఉండాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. తుపాను ముప్పు తగ్గే వరకు ప్రతి ఒక్కరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు. తుపాను సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తోడుగా నిలవాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లాలో కుంభవృష్టితుపాను ప్రభావం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాపై తీవ్రంగా పడింది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లా అంతటా కుండపోత వర్షం కురిసింది. కావలిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటీవల కాలంలో ఈ స్థాయి వర్షపాతం నమోదవ్వడం ఇదే ప్రథమం. దగదర్తి, ఉలవపాడు, కందుకూరు, జలదంకి, కొడవలూరు, కలిగిరి, లింగసముద్రం, అల్లూరు ప్రాంతాల్లో 15 నుంచి 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు తర్వాత ప్రకాశం జిల్లా సింగరాయకొండ, సంతనూతలపాడు, చీమకుర్తి, ఒంగోలు పట్టణంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. తుపాను తీరం దాటే అవకాశం ఉందనుకున్న కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ అంచిన వేసినా, అనూహ్యంగా తుపాను తీరం దాటే సమయంలో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురవడం గమనార్హం బాపట్ల, ఒంగోలు జిల్లాల్లో భారీ వర్షం బాపట్ల జిల్లా నగరం, చిన గంజాం మండలాల్లో భారీ వర్షం పడింది. తీర ప్రాంతంలో పలుచోట్ల చెట్లు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. బాపట్ల పట్టణంలో ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తెనాలి రేపల్లె మార్గంలో చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. గుంటూరు నగరంలో రాత్రి 10 గంటల తర్వాత వీచిన గాలులకు పలుచోట్ల చెట్లు పడిపోయాయి. కార్పొరేషన్ సిబ్బంది వాటిని తొలగించే పనుల్లో నిమగ్నం అయ్యారు. ఒంగోలు, కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో కుండపోత వర్షం కురిసింది. ఒంగోలు నగరంతో పాటు కొండపి, టంగుటూరు, సింగరాయకొండ, కొత్తపట్నం, నాగులుప్పలపాడు, పొన్నలూరు, చీమకుర్తి మండలాల్లో పది సెంటీమీటర్లు కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. రాత్రి 10 గంటలకు అందిన వివరాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఒంగోలు నగరంలో 15.50 సెంటీమీటర్ల వర్షం కురిసింది. టంగుటూరులో 15.74, కొత్తపట్నంలో 14.36, నాగులుప్పలపాడులో 14.58, పొన్నలూరులో 14.68, చీమకుర్తిలో 13, పామూరులో 11.6 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అర్ధరాత్రి కూడా భారీ వర్షం కురుస్తూనే ఉంది. తుపాన్లు.. ప్రభావాలు ⇒ 2014 అక్టోబర్‌లో అత్యంత భారీ తీవ్ర తుపాను ‘హుద్ హుద్’ విశాఖలో తీరం దాటింది. ఈ సూపర్ సైక్లోన్ తీరం దాటే సమయంలో 185 నుంచి 260 కి.మీ. వేగంతో రికార్డు స్థాయిలో గాలులు వీచాయి. ⇒ 2018లో తిత్లీ అత్యంత తీవ్ర తుపానుగా బలడుతూ శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో తీరం దాటింది. ఈ సమయంలో గంటకు 140 నుంచి 150 కిలో మీటర్ల వరకు గాలులు బీభత్సం సృష్టించాయి. ⇒ 2021లో జవాద్ తుపానుగా మారి తీరం దాటకుండానే సముద్రంలోనే బలహీన పడిపోయింది. ఈ కారణంగా గంటకు 45 కి.మీ.. గరిష్టంగా 65 కి.మీ. వేగంతో గాలులు వీచాయి.⇒ 2022 మే నెలలో ఏర్పడిన అసని తీవ్ర తుపాను కూడా తీరం వైపు వచ్చినట్లే వచ్చి దిశ మార్చుకొని తిరిగి సముద్రంలోకి వెళ్లిపోయి బలహీనపడింది. గాలుల తీవ్రత 75 నుంచి 85 కి.మీ.గా నమోదైంది. ⇒ 2023లో ఏర్పడిన మిచాంగ్ తీవ్ర తుపాన్ బాపట్ల వద్ద తీరం దాటింది. మిచాంగ్ తీరం దాటే సమయంలో 90 నుంచి 100 కి.మీ. వేగంతో గాలులు వీచి విధ్వంసం సృష్టించింది. ⇒ తాజాగా మోంథా తీవ్ర తుపాను కూడా తీరం దాటే సమయంలో 90 నుంచి గరిష్టంగా 110 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేశారు. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ఈ గాలుల వేగం 75 నుంచి 80 కి.మీ.కు పరిమితమైపోయింది. -
Cyclone Montha: తల్లడిల్లిన తీరం
సాక్షి, అమరావతి, సాక్షి, విశాఖపట్నం, నెట్వర్క్: ఏపీని వణికించిన పెను తుపాను మోంథా మంగళవారం రాత్రి కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో పెను గాలులు వీయగా కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. కాకినాడ, అమలాపురం, రాజోలు ప్రాంతాల్లో గాలుల తీవ్రత భారీగా పెరిగింది. సముద్రం పోటెత్తి విరుచుకుపడుతోంది. అలల తీవ్రతకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ పలు చోట్ల తీరం కోతకు గురైంది. పెను గాలుల ధాటికి విశాఖలో ఎనిమిది ప్రాంతాల్లో గోడలు కూలిపోయాయి. తుపాను పూర్తిగా తీరం దాటిన తర్వాత ఐదు జిల్లాలపై భారీగా ప్రభావం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉగ్రరూపంతో దూసుకొచ్చిన మోంథా ఆగుతూ.. దిశ మార్చుకుంటూ తీరం వైపు ప్రయాణించింది. మధ్యాహ్నం సమయంలో సముద్రంలో గాలుల తీవ్రత కాస్త తగ్గినా.. సాయంత్రం మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. కొన్ని ప్రాంతాల్లో ఎండ రావడంతో తుపాను ప్రభావం తగ్గుముఖం పట్టిందని భావించారు. అంతలోనే మళ్లీ భారీ వర్షాలతో విరుచుకుపడింది. మోంథా ప్రభావం తెలంగాణలోనూ ఉంటుందని వాతావరణ శాఖ చెప్పింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. చెట్టు కూలి మహిళ మృతి.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడటంతో జనజీవనం స్తంభించింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాలోనూ పలుచోట్ల జోరు వానలు పడడంతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. ఎడతెగని వర్షం, ఈదురు గాలులకు విశాఖ నగరంతోపాటు పరిసర ప్రాంతాలన్నీ స్తంభించాయి. పలు అండర్‌పాస్‌ల గుండా నీళ్లు ప్రవహించడం, జాతీయ రహదారిపైకి నీరు చేరుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈదురు గాలులకు పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగి రోడ్లపై పడడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. విశాఖలోని గాజువాక నుంచి యారాడ వెళ్లే మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆనందపురం మండలంలోని గంభీరం రిజర్వాయర్ ఉధృతి పెరిగింది. అరకులోయ, విశాఖపట్నం ఘాట్ రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు ఆగిపోయాయి. అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలకు శారద, వరాహ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మాకనపాలెంలో చెట్టు కూలి వీరవేణి అనే మహిళ మృతి చెందింది. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం గొట్లపాళానికి చెందిన కృష్ణమనేని జయమ్మ (65) గేదెలను మేపేందుకు వెళ్లి పొట్టేళ్ల కాలువలో గల్లంతయింది. ఈత గాళ్లను రంగంలోకి దించి గాలిస్తున్నారు. రాత్రి వరకు ఆమె జాడ తెలియరాలేదు. గుండ్లకమ్మ నది పోటెత్తడంతో ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ముష్ట గంగవద్ద చప్టా కోతకు గురైంది. దీంతో పదుల సంఖ్యలో గ్రామాల మధ్య రాకపోకలు తెగిపోయాయి. తుపాను ప్రభావంతో తిరుమలలో ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తున్న భక్తులు వర్షం, పొగమంచుతో ఇబ్బందిపడ్డారు. ఆకస్మిక వరదలు వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జాతీయ రహదారులు, పలు ప్రధాన రహదారులపై మంగళవారం రాత్రి నుంచి రాకపోకలను నిలిపివేశారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లోని కర్నూలు రోడ్డు, ఊరచెరువు రోడు జలమయం విరుచుకుపడి.. తీరం దాటి.. మోంథా తుపాను మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో కోనసీమ జిల్లాలోని అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని తాకింది. ఆ తర్వాత నాలుగైదు గంటలపాటు పెను గాలులు వీయగా భారీ వర్షాలు కురిశాయి. మచిలీపట్నం తీరానికి అత్యంత చేరువగా వచ్చిన తుపాను 17 కిలోమీటర్ల వేగంతో కాకినాడ వైపు కదులుతూ అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని దాటింది. రాత్రి సమయానికి మచిలీపట్నానికి 110 కిలోమీటర్లు, కాకినాడకు 100, విశాఖపట్నానికి 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. కదులుతున్న దిశ, వేగం ప్రకారం బుధవారం తెల్లవారు జామున తీరం దాటే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. కొద్ది గంటల్లో క్రమేపీ తుపానుగా ఆ తర్వాత వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో మచిలీపట్నం పరిసరాల్లో గంటకు 77 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో బుధవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ సహా విశాఖపట్నం, గంగవరం, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో పదో నంబర్ భారీ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. పల్నాడు జిల్లాలో భారీ వర్షాలతో పత్తి, వరికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. బాపట్ల జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వేమూరు నియోజకవర్గంలో వందల ఎకరాల్లో వరి నేలకొరిగింది. రేపల్లె, బాపట్ల నియోజకవర్గాల్లోనూ వరి దెబ్బతిందని రైతులు వాపోతున్నారు. బాపట్ల, చీరాల, రేపల్లెతోపాటు జిల్లావ్యాప్తంగా పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేకేలైన్‌లో జారిపడిన కొండచరియలు అల్లూరి జిల్లాలో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొత్తవలస–కిరండూల్ రైల్వే లైన్లో చిమిడిపల్లి సమీపంలోని టన్నెల్ వద్ద కొండచరియలు ట్రాక్‌పై జారి పడ్డాయి. వరదనీరు ట్రాక్‌పై పొంగి ప్రవహించింది. ట్రాక్‌పై బండరాళ్లు, మట్టి తొలగించే పనుల్లో రైల్వే వర్గాలు నిమగ్నమయ్యాయి. ఈ మార్గంలో సోమవారం రాత్రి నుంచి అన్ని రైళ్ల రాకపోకలను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. అరకులోయ–అనంతగిరి ఘాట్‌లో సుంకరమెట్ట, బీసుపురం సమీప ప్రాంతాల్లో రోడ్డుపై వరదనీరు పొంగి ప్రవహించింది. ఘాట్ మార్గాల్లో రాత్రి పూట ప్రయాణాలను నిలిపివేశారు. బలిమెల జలాశయ నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. -
తుఫాన్ బాధితులకు పునరావాసం కష్టాలు.. అండగా నిలిచిన వైసిపి
Cyclone Montha: మచిలీపట్నంలో "మోంథా" తుఫాన్ బాధితులకు పునరావాసం కష్టాలు. గాలుల ధాటికి 36వ డివిజన్ రాజుపేట మగ్గాల కాలనీలో దెబ్బతిన్న పూరిగుడిసెలు. దాంతో తల దాచుకునేందుకు ఆంధ్రజాతీయ కళాశాలకు వెళ్లిన బాధితులు. అయితే బాధితులకు పునరావాసం కల్పించేందుకు కళాశాల నిర్వాహకులు విముఖత వ్యక్తం చేశారు.ఇక గత్యంతరం లేక కళాశాల వరండాలోనే తలదాచుకున్న తుఫాన్ బాధితులు. విషయం తెలుసుకుని తుఫాన్ బాధితులకు వైసిపి కార్పొరేటర్ రాం ప్రసాద్ అండగా నిలిచారు. వారికి తాగునీరు , అల్పాహారం అందజేశారు. -
మోంథా బీభత్సం..30మంది విద్యార్థులకు కరెంట్ షాక్?
సాక్షి,విజయనగరం: ఏపీలో మోంథా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. మోంథా తీవ్రతతో భారీ వర్షాలు, వరదలు, కుండపోత వర్షం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గంటకు 90 నుంచి 100 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తుండటంతో విద్యుత్ స్తంభాలు నేలమట్టమవుతున్నాయి. చెట్లు కూలిపోతున్నాయి. సెల్ టవర్స్ దెబ్బతింటున్నాయి.ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని కస్తూర్బా హాస్టల్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ సంభవించింది. ఈదురు గాలుల కారణంగా విద్యుత్ స్తంభం పాఠశాల గోడపై పడింది. విద్యార్థులు గోడను పట్టుకోవడంతో విద్యుత్ ప్రసారం కావడంతో 30 మంది విద్యార్థులకు కరెంట్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన అధికారులు విద్యార్థులను అత్యవసర చికిత్స కోసం నెల్లిమర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. -
Cyclone Montha: మోంథా బీభత్సం.. (ఫొటోలు)
-
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
"మోంథా" తుఫాను కోస్తా తీర ప్రాంత వాసులను వణికిస్తోంది. భారీ వర్షాలు, ఈదురుగాలుతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు, ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన తుఫాను గత 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో ఉత్తర- వాయువ్య దిశగా కదిలి, కాకినాడ (ఆంధ్రప్రదేశ్)కి దక్షిణ-ఆగ్నేయంగా 240 కి.మీ., విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)కి దక్షిణ-నైరుతి దిశలో 320 కి.మీ., గోపాల్పూర్ (ఒడిశా)కి దక్షిణ-నైరుతి దిశలో 530 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో అప్పటికే అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ప్రజలు స్వయంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వాతావరణ అధికారుల సూచనలను ఎల్లపుడూ గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి. ఈ నేపథ్యంలో తుఫాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.పాటించాల్సిన జాగ్రత్తలు 🚨 Cyclone Alert!Severe Cyclonic Storm #Montha over west central Bay of Bengal is likely to cross Andhra Pradesh coast between Machilipatnam and Kalingapatnam around Kakinada during evening/night of 28th October, with a maximum sustained wind speed of 90-100 kmph gusting to 110… pic.twitter.com/ZD4WW6ik2k— PIB India (@PIB_India) October 28, 2025 తుఫాను లాంటి పరిస్థితులను నివారించడానికి ఉత్తమ మార్గం ఈ సమయాల్లో ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఉండటం అవసరం. ఆఫీసులోనో, బయటో ఉంటే, వర్షం ఆగే వరకు వేచి ఉండాలి.ఇంట్లో, ఫ్లాష్‌లైట్, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు ,ఇతర ఆహార పదార్థాలను దగ్గర్లో ఉంచుకోవాలిఅధికారుల సూచనలను పరిశీలిస్తూ ఉండాలి.భారీ వర్షాలు, ఈదురు గాలలనుంచి కాపాడుకునేలా ఇంటిలోపలే ఉండాలి. అత్యవసరమైతే తప్ప, కొన్ని జాగ్రత్తలో బయటికి రావాలి. ఇంటి లోపల కిటికీలకు దూరంగా ఉండాలి.కిటికీలు ,తలుపులను సురక్షితంగా మూసి ఉంచాలి. బలమైన గాలులకు కిటికీలుపడిపోకుండా తగిన జాగ్రత్తలుతీసుకోవాలి. గాజు కిటికీలైతే మరింత అప్రమత్తత అవసరం.భారీ వర్షాల సమయంలో ఇంట్లో విద్యుత్ సరఫరా నిలిపివేయాలి.విద్యుత్ పరికరాలను టీవీ, ఫ్యాన్, ఫ్రిడ్జ్‌లను ఆఫ్ చేయాలి. అవసరమైన మందులు, నిత్యావసర సరుకులు నిల్వ ఉంచుకోవాలి. -శిథిల భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడకుండా, జాగ్రత్తగా ఉండాలి.విలువైన పత్రాలు, నగదు భద్రంగా ఉండేలా చూసుకోవాలి.నిరంతరం అధికారులను సూచలను గమనిస్తూ, అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లండిఎవరైనా ఆపదలో ఉన్నట్టు గమనిస్తే తమను తాము కాపాడుకుంటే వారిని ఆదుకోడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు జాగ్రత్తగా ఉండాలి.చలిగాలులనుంచి కాపాడుకునేందుకు వెచ్చని రగ్గులు, స్వెట్లర్లు ధరించాలి. ముఖం , కళ్ళు కప్పి ఉంచుకోవడం చాలా అవసరం. వాహనంలో ఉంటే, ఎగిరే వస్తువుల ప్రమాదం లేని చోట దానిని పార్క్ చేయండి. తుఫాను సమయంలో వాహనం లోపల రేడియో ప్లే చేయవద్దు; అలా చేయడం వల్ల మీరు మెరుపులకు గురవుతారు.తుఫాను సమయంలో స్నానం చేయడం మానుకోండి. నీటిలో కరెంట్ వేగంగా వ్యాపిస్తుంది. (బిగ్‌బీ దివాలీ గిఫ్ట్ : నెట్టింట ట్రోలింగ్ మామూలుగా లేదుగా!) -
Montha Cyclone: ఆ 5 గంటలు జాగ్రత్త.! రాత్రి 11 గంటలకు పూర్తిగా తీరం దాటే అవకాశం
-
ఈరోజు రాత్రికే.. కాకినాడకు 270KMల దూరంలో తుఫాన్
-
మోంథా తుఫాన్‌తో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
-
Cyclone Montha: కాకినాడకు దక్షిణంగా తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం
-
APలో 17 జిల్లాల్లో రెడ్ అలర్ట్, తెలంగాణలో 8 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్
-
Montha Cyclone: మోంథా తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర అంతటా ఎడతెగని వర్షాలు
-
టాలీవుడ్‌పై 'మోంథా' ప్రభావం ఎంతవరకు?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలపై మోంథా తుపాన్ గట్టిగానే ప్రభావం చూపిస్తోంది. తెలంగాణలో అక్కడక్కడ ఓ మాదిరిగా వర్షాలు పడుతున్నాయి కానీ ఆంధ్రాలో మాత్రం ఎక్కడచూసినా సరే వానలు దంచికొడుతున్నాయి. తీరమంతా అల్లకల్లోలంగా ఉంది. ప్రభుత్వం కూడా ప్రజలు ఎవరినీ బయటకు రావొద్దని హెచ్చరిస్తోంది. అయితే మోంథా తుపాన్ ప్రభావం.. టాలీవుడ్‌పై ఎలా ఉండనుంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బోల్డ్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)మోంథా తుపాన్.. ఈ రోజు(అక్టోబరు 28) రాత్రికి కాకినాడ దగ్గర తీరదాటనుంది. దీంతో బుధవారం కూడా కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్ష ప్రభావం గట్టిగానే ఉండగా.. కొన్ని ప్రాంతాలు నీటమునిగే అవకాశం కూడా లేకపోలేదు. శుక్రవారానికి గానీ తుపాన్ ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.అయితే ఈ శుక్రవారం 'బాహుబలి' రీ రిలీజ్‌తో పాటు 'మాస్ జాతర' సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటిపై ఇప్పటికైతే ఓ మాదిరి బజ్ మాత్రమే ఉంది. ఇప్పుడు తుపాన్ ప్రభావం వల్ల జనాలు ఈ వీకెండ్.. మూవీస్ చూసేందుకు ఆంధ్రాలో థియేటర్లకు వస్తారా అంటే సందేహమే. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం రవితేజ, ప్రభాస్ చిత్రాలకు కలెక్షన్స్ పెద్దగా రాకపోవచ్చనే మాట వినిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి? (ఇదీ చదవండి: 'సౌందర్య'ను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న రమ్యకృష్ణ (వీడియో))'బాహుబలి' రీ రిలీజ్ విషయానికొస్తే.. గతంలో విడుదలైన రెండు భాగాల్ని కలిపి ఇప్పుడు 'ఎపిక్' పేరుతో ఒకే పార్ట్‌గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాడు. 3 గంటల 44 నిమిషాల నిడివితో ఇది ఉండనుంది. ఇప్పటికే బుకింగ్స్ కూడా మొదలుపెట్టారు. అయితే కొత్తగా ఓ సీన్ కూడా జోడిస్తున్నామని సినిమాటోగ్రాఫర్ సెంథిల్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.'మాస్ జాతర' విషయానికొస్తే.. రవితేజ చేసిన రెగ్యులర్ కమర్షియల్ మూవీ. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆయన గత చిత్రాల మాదిరిగా రొటీన్లానే అనిపించింది. ట్రైలర్ ఓకే ఓకే అనిపించుకున్నప్పటికీ.. మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి? రవితేజకు ఇది 75వ మూవీ కావడం విశేషం. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించగా.. భాను భోగవరపు దర్శకత్వం వహించాడు.శ్రీలీల హీరోయిన్. -
Cyclone Montha : ఉప్పాడ తీరంలో అల్లకల్లోలం.. వామ్మో.. రాకాసి అలలు
-
భార్యభర్తలిద్దరూ తుఫాన్ డ్యూటీలో
కోడూరు: ఒకరేమో కోడూరు పోలీస్‌స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ చాణిక్య.. మరొకరేమో పాలకాయతిప్ప మైరెన్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పూర్ణమాధురి. వీరిరువురు భార్యభర్తలు. ప్రస్తుతం ‘మోంథా’ తుఫాన్ నేపథ్యంలో భార్యభర్తలిద్దరికీ కోడూరు జెడ్పీ పాఠశాలలో ప్రభుత్వం తీర ప్రాంత ప్రజల కోసం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రంలో డ్యూటీ పడింది. అటు పోలీసు, ఇటు మైరెన్ శాఖలను భార్యభర్తలిద్దరు సమన్వయం చేసుకుంటూ తమ విధులు నిర్వర్తించారు. -
Montha Cyclone: ఏపీలో 17 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
-
Cyclone Montha: తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు!
సాక్షి, హైదరాబాద్: మోంథా తీవ్ర తుపాను కారణంగా సోమవారం నుంచి తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే రెడ్ అలర్ట్ జారీ చేసిన నాలుగు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మోంథా ప్రభావంతో ఇవాళ మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, జనగామ, ఖమ్మం, కొమురంభీం, మంచిర్యాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడొచ్చని, అలాగే.. సిద్ధిపేట, సూర్యాపేటలో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని అధికారులు అంటున్నారు. హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన నేపథ్యంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అలాగే రేపు(బుధవారం) నాలుగు జిల్లాలకు ఆరెంజ్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తుపాన్ తీరం దాటే సమయంలో.. ఇటు తెలంగాణలోనూ గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ చెబుతోంది. తుపాను ప్రభావంతో మరో మూడు రోజులు వర్షాలు తప్పవని అధికారులు అంటున్నారు.మోంథా నేపథ్యంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రైతులు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తూనే.. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.క్లిక్ చేయండి: కాకినాడకు చేరువలో మోంథా.. బీభత్సం చూశారా? -
స్టాక్ మార్కెట్‌పై 'మోంథా' ప్రభావం ఎంతంటే..
మోంథా తుఫాన్ విజృంభించింది. ఈ రోజు (మంగళవారం) తీరందాటే అవకాశం ఉంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కువగా ఉన్నప్పటికీ.. తెలంగాణాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే పలు విమానాలు, రైళ్లను నిషేధించారు. ఈ తుఫాన్ వ్యవసాయం, రవాణా వంటివాటిమీద ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్ కూడా పరోక్ష ప్రభావానికి గురికావాల్సి ఉంటుంది.నిజానికి స్టాక్ మార్కెట్లలో మార్పులు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. టారిఫ్స్ ప్రభావం, కొన్ని దేశాల కీలకనేతలు లేదా దిగ్గజ కంపెనీలు తీసుకునే నిర్ణయాలు స్టాక్ మార్కెట్ మీద ప్రత్యక్ష ప్రభావం చూపిస్తాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా స్టాక్ మార్కెట్ కుప్పకూలిన సందర్భాలను గతంలో మనం చాలానే చూశాము. కానీ మోంథా తుఫాన్ స్టాక్ మార్కెట్ మీద ఈ స్థాయిలో ప్రభావం చూపే అవకాశం లేదు.మోంథా తుఫాన్ ఎఫెక్ట్.. ప్రధానంగా వ్యవసాయ రంగం, గ్రామీణ ఆదాయం, కన్స్యూమర్ డిమాండ్ వంటి అంశాల ద్వారా మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంది. పోర్ట్స్ & లాజిస్టిక్స్, ఎనర్జీ (పవర్) సంబంధించిన రంగాలపై కూడా ఈ ప్రభావం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇలా..దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఉదయం 9:20 గంటలకు స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ.. ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్నాయి. 10:20 గంటలకు సెన్సెక్స్ 256.75 పాయింట్లు నష్టపోయి 84,522.09 పాయింట్లు వద్ద, 62.50 పాయింట్ల నష్టంతో 25,903.55 వద్ద సాగుతోంది. ఈ సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, టెక్ మహీంద్రా, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.ఆసియా మార్కెట్లుఆసియా మార్కెట్లు ఈ రోజు (అక్టోబర్ 28) ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. నికాయ్ 225 (జపాన్), హ్యాంగ్ సెంగ్ ఇండెక్స్ (హాంకాంగ్), కోస్పీ (సౌత్ కొరియా), జకార్తా కంపోసైట్ (ఇండోనేషియా), షాంఘై కంపోసైట్ (చైనా) వంటివి స్వల్ప నష్టాలను చవిచూడగా.. స్ట్రైన్ టైమ్స్, తైవాన్ వైటెడ్ లాభాల్లో ముందుకు సాగుతున్నాయి. ఆసియా మార్కెట్ల ప్రభావం.. దేశీయ స్టాక్ మార్కెట్ మీద కూడా ప్రభావము చూపుతుంది. దీంతో భారత స్టాక్ మార్కెట్లు మిశ్రమ సంకేతాలను సూచిస్తున్నాయి.ఇన్వెస్టర్లకు సూచనలుమోంథా తుఫాన్ స్టాక్ మార్కెట్లపై పెద్దగా ప్రభావం చూపనప్పటికీ.. ఇన్వెస్టర్లు తప్పకుండా కొంత జాగ్రత్త వహించాలి. ఎలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనే విషయాన్ని పరిశీలించాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ & లాజిస్టిక్స్, అగ్రికల్చర్, రియల్టీ, టూరిజం & హాస్పిటాలిటీ వంటి రంగాలకు కొన్ని రోజులు దూరంగా ఉండటం మంచిది. అయితే సిమెంట్, పెయింట్స్, బేవరేజెస్ రంగాల్లో తాత్కాలిక ఒత్తిడి ఉండే అవకాశం ఉన్నందున లాంగ్ టర్మ్ వ్యూహంతో ముందుకు వెళ్లాలి. వర్షపాతం గణాంకాలు, పంటల స్థితి వంటి అంశాలను నిరంతరం పరిశీలిస్తూ ఇన్వెస్టర్లు పెట్టుబడులు చేయాలి.తుఫాన్స్ ఎఫెక్ట్: గతంలో స్టాక్ మార్కెట్‌పై ఇలా2014లో వచ్చిన హుద్‌హుద్ (విశాఖపట్నం) తుఫాన్ కారణంగా.. పోర్ట్‌లు & ఇండస్ట్రీస్ 3-5 రోజులు నిలిచిపోయాయి. దీంతో మార్కెట్ తాత్కాలికంగా పడిపోయింది. 2019లో ఒడిశాలో వచ్చిన ఫణి తుఫాన్ దెబ్బకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఒత్తిడికి లోనయ్యాయి. 2021లో వచ్చిన తౌక్టే తుఫాన్ ఎనర్జీ, షిప్పింగ్ రంగాలు తాత్కాలిక ప్రభావం చూసాయి. దీన్నిబట్టి చూస్తే.. తుఫాన్ లేదా ప్రకృతి వైపరీత్యాలు స్టాక్ మార్కెట్ మీద తాత్కాలిక ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి చెప్పుకోదగ్గ స్థాయిలో స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూసే అవకాశం లేదు. -
#CycloneMontha : రాకాసి అలలు.. అత్యంత భారీ వర్షాలతో వైజాగ్ అతలాకుతలం (చిత్రాలు)
-
తీరాన్ని తాకిన మోంథా.. ఎగిసి పడుతున్న రాకాసి అలలు
తీరం వైపు దూసుకొస్తున్న మోంథా తుపాను ధాటికి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ జిల్లా తడిసి ముద్దవగా కాకినాడ తీరంలో రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. తీవ్ర వాయుగుండం నుంచి సోమవారం ఉదయానికి తుపానుగా మారింది. ఆగ్నేయ, పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తుపాను గంటకు 13 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో ఉత్తర, వాయవ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. -
కోస్తాకు ‘మోంథా’ తుపాను గండం..
-
తొలి రోజు మ్యాచ్‌లు రద్దు
చెన్నై: భారత్‌లో జరిగే ఏకైక మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) టూర్–250 లెవెల్ టోర్నీ చెన్నై ఓపెన్‌కు వర్షం అంతరాయం కలిగించింది. సోమవారం మొదలుకావాల్సిన మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు... ‘మోంథా’ తుపాను ప్రభావం కారణంగా నిలకడగా కురిసిన వర్షం కారణంగా సాధ్యపడలేదు. షెడ్యూల్ ప్రకారం సోమవారం 10 మ్యాచ్‌లు (2 డబుల్స్, 8 సింగిల్స్) జరగాల్సింది. అయితే వరుణ దేవుడి ప్రతాపంతో ఒక్క మ్యాచ్ కూడా ప్రారంభంకాలేదు. ఫలితంగా నిర్వాహకులు ఈ మ్యాచ్‌లను మంగళవారానికి వాయిదా వేశారు. -
విమాన ప్రయాణాలపై ‘మోంథా’ ఎఫెక్ట్
గోపాలపట్నం/విమానాశ్రయం(గన్నవరం): మోంథా తుపాను కారణంగా మంగళవారం బెంగళూరు, విశాఖ నుంచి రాకపోకలు సాగించే అన్ని విమానాలు రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు ఇన్చార్జ్ డైరెక్టర్ పురుషోత్తం తెలిపారు. సోమవారం ఢిల్లీ నుంచి విశాఖ రావాల్సిన ఇండిగో విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో భువనేశ్వర్‌కు మళ్లించారు. వాతావరణం అనుకూలించిన కొద్ది గంటల తర్వాత ఈ విమానం విశాఖ చేరుకుంది. సోమవారం విజయవాడ–విశాఖ–హైదరాబాద్, బెంగళూరు–విశాఖ–బెంగళూరు ఎయిరిండియా విమానాలు రద్దయినట్లు పురుషోత్తం చెప్పారు.అలాగే, గన్నవరం విమానాశ్రం నుంచి రాకపోకలు సాగించే అన్ని ఎయిరిండియా విమాన సర్విస్లను కూడా మంగళవారం రద్దు చేశారు. రెండు న్యూఢిల్లీ సర్వీస్‌లతోపాటు ముంబయి సర్విస్ రద్దయినట్లు ఎయిరిండియా ప్రతినిధులు తెలిపారు. ఇండిగో విమాన సంస్థ కూడా మంగళవారం ఉదయం సర్వీస్‌లు మినహా అన్ని విమానాలను రద్దు చేసింది. ఉదయం 10.35 గంటలలోపు హైదరాబాద్, చెన్నైతోపాటు న్యూఢిల్లీ సర్విస్లు మాత్రమే నడుస్తాయని ఇండిగో ప్రతినిధులు తెలిపారు. ఆ తర్వాత అన్ని విమాన సర్వీస్‌లను రద్దు చేసినట్లు పేర్కొంది. -
రైల్వే వ్యవస్థ అప్రమత్తం
సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): మోంథా తుపాను నేపథ్యంలో రైల్వేశాఖ ముందస్తు భద్రత చర్యలు చేపట్టిందని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సోమవారం విజయవాడకు చేరుకుని డీఆర్ఎం మోహిత్ సోనాకియా, కోఆర్డినేషన్ అండ్ సెక్యూరిటీ డీజీఎం శ్రీనివాస మల్లాది, ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్ కె.పద్మజ, పలు బ్రాంచ్‌ల అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాత్మకంగా ప్రణాళికలను మార్చుకుని అధికారులు, సిబ్బంది చురుగ్గా వ్యవహరించాలని జీఎం సూచించారు.డీఆర్ఎం మాట్లాడుతూ విజయవాడ డివిజన్లో ప్రయాణికులు, సిబ్బంది, రైల్వే ఆస్తుల భద్రత కోసం ఆపరేటింగ్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్, మెకానికల్, కమర్షియల్, మెడికల్ విభాగాలను హై అలర్ట్‌లో ఉంచామని చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలు, రైలు పట్టాలు, వంతెనల పరిస్థితులు, కాలువలు, నదుల్లో నీటి ప్రవాహాన్ని 24 గంటలు పర్యవేక్షించేందుకు పెట్రోలింగ్ బృందాలు, కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యుత్ సమస్యలు తలెత్తితే ప్రత్యామ్నాయంగా డీజిల్ ఇంజిన్లు, మొబైల్ రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచామని వివరించారు. హెల్ప్‌డెస్క్ ల ఏర్పాటు ప్రయాణికులు రైళ్ల సమాచారం తెలుసుకునేందుకు విజయవాడతోపాటు రాజమండ్రి, కాకినాడ, భీమవరం, తెనాలి తదితర ముఖ్య స్టేషన్లలో 24 గంటలు సేవలు అందించేలా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశామని డీఆర్ఎం తెలిపారు. రద్దయిన రైళ్లకు చెందిన, ప్రయాణాలను రద్దు చేసుకున్న ప్రయాణికుల కోసం రిఫండ్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ అథారిటీ(ఏపీఎస్డీఎంఏ)ని సమన్వయం చేసుకుంటూ రైల్వేశాఖ నిరంతరం కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేసుకుంటోందని వివరించారు. 97 రైళ్ల రద్దు తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మంగళవారం, బుధవారం ప్రయాణించాల్సిన 54 రైళ్లను రద్దు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో 43 రైళ్లను రద్దు చేశారు. మొత్తం 97 రైళ్లను రద్దు చేసినట్లు ఆయా డివిజన్ల అధికారులు ప్రకటించారు. విజయవాడ డివిజన్ పరిధిలోని విజయవాడ, భీమవరం, నిడదవోలు, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నరసాపూర్, ఒంగోలు, రాజమహేంద్రవరం నుంచి బయలుదేరే రైళ్లను రద్దు చేసినట్లు డివిజనల్ అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు ఎంఎస్ఎస్ ద్వారా సమాచారం పంపామని, టికెట్ల డబ్బును వారి ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. పలు ఆర్టీసీ సర్వీసులు రద్దుసాక్షి, అమరావతి: తుపాను హెచ్చరికల వల్ల పలు బస్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. తుపాను నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు సోమవారం ఆర్టీసీ ఈడీలు, ఆర్ఎంలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్టీసీ చేపట్టాల్సిన ముందస్తు చర్యలను నిర్దేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బస్సుల రాత్రి హాల్ట్‌ను రద్దు చేసింది. సోమవారం రాత్రి 9గంటల నుంచి తుపాను ప్రభావం తగ్గేంతవరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రయాణికులకు సమాచారం అందించేందుకు కమ్యూనికేషన్ సెల్‌లను ఏర్పాటు చేసింది. అత్యవసర సేవల కోసం ప్రతి డిపోలో కనీసం 10 మంది డ్రైవర్లు, 10 మంది కండక్టర్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. -
‘మోంథా’ పెను ముప్పు!
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉగ్రరూపం దాల్చుతూ.. సాగరాన్ని చీల్చుకుంటూ.. రాష్ట్రంపై విరుచుకుపడేందుకు మోంథా తుపాను పెను ఉప్పెనలా దూసుకొస్తోంది. ఓవైపు బలమైన ఈదురు గాలులు కకావికలం చేస్తుండగా.. జడివానలు జడిపిస్తున్నాయి. రోడ్డు మార్గాలు జలమయమయ్యాయి.. రైలు మార్గాలను ముంపు ముప్పు భయపెడుతోంది. భీకర గాలులు వాయుమార్గాన్ని సైతం స్తంభింపజేస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతికి వచ్చే పలు విమానాలను పెను తుపాను కారణంగా రద్దు చేశారు. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే జోన్ల పరిధిలో 97 రైళ్లను రద్దు చేశారు. సముద్రం అల్ల కల్లోలం కావడంతో జల రవాణా స్తంభించిపోయింది. పోర్టుల్లో సరుకు రవాణా కార్గో షిప్పులకు లంగరు వేశారు. నౌకాదళానికి చెందిన నౌకలు ప్రధాన కేంద్రాలకు చేరుకున్నాయి. కాకినాడ తీరంలో రాకాసి అలల హోరు.. తీరం వైపు దూసుకొస్తున్న మోంథా తుపాను ధాటికి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ జిల్లా తడిసి ముద్దవగా కాకినాడ తీరంలో రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. తీవ్ర వాయుగుండం నుంచి సోమవారం ఉదయానికి తుపానుగా మారింది. ఆగ్నేయ, పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తుపాను గంటకు 13 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో ఉత్తర, వాయవ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి సమయానికి విశాఖకు 460 కిలోమీటర్లు, కాకినాడకు 410, చెన్నైకి 400 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుపానుగా మారి ముందుకు కదలనుంది. బుధవారం తెల్లవారు జామున కాకినాడ– అమలాపురం మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రచండ వేగంతో.. తుపాను తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ వేగం పెరుగుతోంది. తుపాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. విశాఖపట్నం జిల్లాలో ఎడతెగని వర్షం.. మోంథా తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర అంతటా ఎడతెగని వర్షాలు కురవగా మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. విశాఖ నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో పలుచోట్ల చెట్లు విరిగి రోడ్డుపై కూలిపోయాయి. విశాఖ రూరల్ పరిధిలోని జాతర ప్రాంగణం వద్ద 9.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మధురవాడ, కాపులుప్పాడ, పెందుర్తి, సీతమ్మధార, ఎండాడ, సాగర్ నగర్, మహారాణిపేట, గోపాలపట్నం, గాజువాక, సబ్బవరం ప్రాంతాల్లో 6 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. అనకాపల్లి జిల్లా గంధవరంలో 5.8, శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం విజయరాంపురంలో 5.7 సెంటీమీటర్ల వర్షం పడింది. అంబేడ్కర్ కోనసీమ, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అన్నమయ్య జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కాకినాడ సముద్ర తీరంలో రెండు మీటర్లపైగా ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. విశాఖ బీచ్‌లో కోస్టల్ బ్యాటరీ వద్ద ఎగసిపడుతున్న అలలు నేడు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. తుపాను ప్రభావంతో మంగళవారం ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు (20 సెంటీ మీటర్లకుపైగా), కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు (15 నుంచి 20 సెంటీ మీటర్లు) కురిసే అవకాశం ఉంది. తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు, నంద్యాల, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు కూడా కుండపోతే..! ఈ నెల 29వ తేదీన బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నంద్యాల, ప్రకాశం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీనివల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు, కమ్యూనికేషన్ వ్యవస్థకు ఆటంకం, వరదలు, పిడుగులు, నేల కోతకు గురి కావడం, రోడ్లు దెబ్బతినడం, బలహీనమైన నిర్మాణాలు, గుడిసెలు నేలమట్టమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు ఉప్పొంగి ఆకస్మిక వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని అప్రమత్తం చేసింది. అందుకనుగుణంగా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ నెల 30వ తేదీ వరకు మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సరఫరాను పునరుద్ధరించేందుకు సంసిద్ధంగా ఉండాలని విద్యుత్ సంస్థలతో నిర్వహించిన సమీక్షలో సీఎస్ కె.విజయానంద్ ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలిలో కురుస్తున్న వర్షం ప్రాణనష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు సహాయక చర్యలపై ఉత్తరాంధ్ర జిల్లాల జోనల్ ఇన్చార్జి అజయ్‌జైన్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే 32,400 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని.. ఐదు ఎన్డీఆర్ఎఫ్, ఆరు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో 2,914 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 233 మండలాల్లోని 1,419 గ్రామాలు, 44 మున్సిపాలిటీల్లో తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నదాతల్లో ఆందోళన.. అన్నదాత చివరి ఆశలపై మోంథా తుపాను నీళ్లు జల్లింది. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా 1.63 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌లో వరి సాగు చేపట్టగా ప్రస్తుతం గింజ గట్టి పడుతున్న దశలో ఉంది. గత వారం అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు వరి చేలల్లో ముంపు నీరు చేరింది. కొబ్బరి రైతుల్లోనూ తుపాను తీవ్ర కలవరం రేపుతోంది. 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని హెచ్చరిస్తుండటంతో 1996 తుపాను గుర్తు చేసుకుని ఆందోళన చెందుతున్నారు. నేడు, రేపు 17 జిల్లాల్లో రెడ్ అలెర్ట్..ముంచుకొస్తున్న తుపాను ముప్పుతో అంతటా అప్రమత్తత నెలకొంది. మంగళ, బుధవారం 17 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలుండటంతో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో ముందస్తు చర్యలు చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో హై అలెర్ట్ ప్రకటించారు. పలు జిల్లాల్లో నాలుగు రోజులపాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులకు మూడు రోజుల పాటు సెలవులు రద్దు చేసి సహాయక చర్యల్లో నిమగ్నం చేశారు. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలుతుపాను నేపథ్యంలో కాకినాడ పోర్టులో 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ, గంగవరం పోర్టుల్లో 6వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేయగా మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 5వ నంబర్ ప్రమాద హెచ్చరికలు వెలువడ్డాయి. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు ఎగుర వేశారు. తీర ప్రాంతాలకు సందర్శకులు రాకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు. ప్రధాన బీచ్‌లలో పోలీసులు, మెరైన్ సిబ్బంది పహారా కాస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కాగా రెడ్ అలెర్ట్ జారీ చేసిన జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు... ఆరెంజ్ అలెర్ట్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.తుపాను కారణంగా అలల తాకిడి పెరగడంతో విశాఖ బీచ్ రోడ్డులో కృష్ణ మందిర్ వద్ద కోతకు గురైన తీరం కోనసీమకు పెను గండం..!సాక్షి, అమలాపురం: పెను తుపాను గండం కోనసీమను వణికిస్తోంది. సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో రాకాసి అలలు రెండు, మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. ఓడలరేవు వద్ద ఓఎన్జీసీ వశిష్ట టెర్మినల్ ప్రధాన గోడను అలలు తాకుతున్నాయి. సరుగుడు తోటలు సముద్రంలో కలసిపోతున్నాయి. కాట్రేనికోన మండలం నదీపాయల మధ్య ఉన్న మగసానితిప్ప గ్రామంలోని మత్స్యకారులను బలుసుతిప్పకు తరలించి పునరావాసం కల్పించారు. లంక గ్రామాల రైతులు పాడి పశువులను మైదాన ప్రాంతాలకు తరలించారు. జిల్లాలో 120 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. భయం గుప్పెట్లో కాకినాడసాక్షి ప్రతినిధి, కాకినాడ: మోంథా తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటనుందనే భారత వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లాలోని తీర ప్రాంత మండలాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. జిల్లాలోని 12 మండలాలపై ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ నేపథ్యంలో కాకినాడ డీప్ వాటర్ పోర్టు, యాంకరేజ్ పోర్టుల్లో కార్యకలాపాలను నిలిపివేశారు. కాకినాడ–ఉప్పాడ బీచ్ రోడ్డు, బీచ్ పార్కులలో రాకపోకలను ఆపేశారు. కాకినాడ జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 29వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సోమవారం కాకినాడ రూరల్‌లోని పర్ర కాలువ వంతెనపై ప్రవహిస్తున్న నీటిలో పడి 12 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. రెడ్ అలెర్ట్ జిల్లాలివే..శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం.ఆరెంజ్ అలెర్ట్ జిల్లాలుశ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, నంద్యాలఎల్లో అలెర్ట్ జిల్లాలుచిత్తూరు, కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురంతెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు మొంథా తుఫాను ప్రభావం తెలంగాణపైనా ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని హెచ్చరించింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. తీవ్ర తుపాను కారణంగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈమేరకు జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. 8 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, నిర్మల్, మహబూబాబాద్... భద్రాద్రి కొత్తగూడెం,ఈ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. విమానాల రద్దు మోంథా తుపాను ప్రభావంలో విజయవాడ, విశాఖపట్నం నుంచి హైదరాబాద్, తిరుపతితోపాటు దేశంలోని వివిధ గమ్యస్థానాలకు రాకపోకలు సాగించే విమానాలను కొన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు ఇప్పటికే రద్దు చేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 30కి పైగా విమానాల రాకపోకలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉందని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. అలాగే, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మంగళవారం, బుధవారం ప్రయాణించాల్సిన 54 రైళ్లను రద్దు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో 43 రైళ్లను రద్దు చేశారు. మొత్తం 97 రైళ్లను రద్దు చేసినట్లు ఆయా డివిజన్ల అధికారులు ప్రకటించారు. విజయవాడ డివిజన్ పరిధిలోని విజయవాడ, భీమవరం, నిడదవోలు, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నరసాపూర్, ఒంగోలు, రాజమహేంద్రవరం నుంచి బయలుదేరే రైళ్లను రద్దు చేసినట్లు డివిజనల్ అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు ఎంఎస్ఎస్ ద్వారా సమాచారం పంపామని, టికెట్ల డబ్బును వారి ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. కాగా, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో లోకల్ వార్నింగ్ సిగ్నల్–4 ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తమిళనాడు, ఒడిశాలో.. తమిళనాడు, ఒడిశాలోనూ మోంథా ప్రభావం చూపుతోంది. చెన్నైతోపాటు ఉత్తర తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసనట్లు ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. మోంథా నేపథ్యంలో ఒడిశా కూడా అప్రమత్తమైంది. దక్షిణ ఒడిశాలో 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీచేశారు. మూడువేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
మోంథా తుపాన్‌పై తెలంగాణ సర్కారు హై అలర్ట్.
Cyclone Montha: మోంధా తుపాను నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల. ప్యాడీ రక్షణకు అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్యాడీ రక్షణపై దృష్టి పెట్టీ - వర్షాలతో ధాన్యం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ ఆదేశాలు జారీ చేశారు. రైతు ప్రాధాన్యాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ధాన్యం పై కప్పేందుకు తార్పాలిన్లు ఉపయోగించాలి, నిల్వ ఉన్న ధాన్యాన్ని తక్షణమే రైస్ మిల్లులకు తరలించాలి. పంట కోత నిలిపివేయాలి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. 22,433 మంది రైతులకు రూ.431 కోట్లు చెల్లించాం.రాష్ట్ర వ్యాప్తంగా 4,428 కేంద్రాలు ఇప్పటికే ప్రారంభించాం. ప్యాడీ కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు చేస్తే కఠిన చర్యలు. రైతు నష్టపోకూడదు, ప్రభుత్వ ప్రతిష్ట దానిపైనే ఆధారపడింది. అత్యవసర పరిస్థితుల్లో తాను అందుబాటులో ఉంటాం’ అని మంత్రి ఉత్తమ్ భరోసా ఇచ్చారు. -
1996 ప్రళయం.. కోనసీమ వాసుల భయం
మోంథా తుపాను కాకినాడ జిల్లా వాసుల్లో భయాందోళన రేపుతోంది. పెను తుపానుగా మారి ఊహించని రీతిలో విధ్వంసం కలిగిస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా ప్రజలు భీతిల్లుతున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. పెను తుపానుగా మారిపోయి, కాకినాడ సమీపంలో తీర దాటుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. తుపాను తీరం దాటే సమయంలో సుమారు 110 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీస్తాయని, కుండపోతగా వర్షం పడుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో 1996 నాటి ప్రళయాన్ని గుర్తు చేసుకుని కాకినాడ జిల్లా వాసులు కంపితులవుతున్నారు.1996 ప్రళయం 1996 నవంబరు 6న కాకినాడ – యానాం మధ్య తీరం దాటిన ప్రపంచ తుపాను కోనసీమను కకావికలం చేసింది. సుమారు 215 కిలోమీటర్ల వేగంతో వీచిన పెను గాలులు ధాటికి కోనసీమ ప్రాంతం చిన్నాభిన్నమైంది. సముద్ర తీరంలో అలలు భారీ ఎత్తున అలలు ఎగసిపడి ఉప్పెన ముంచెత్తడంతో కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో సముద్ర తీర మత్స్యకార గ్రామాలు ధ్వంసమయ్యాయి. కాట్రేనికోన మండలం భైరవపాలెం, బలుసుతిప్ప గ్రామాలు నామరూపాల్లేకుండా పోయాయి.భారీగా ప్రాణ, ఆస్తి నష్టంఅధికారిక లెక్కల ప్రకారం.. నాటి తుపాను బీభత్సానికి 1,077 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 2.25 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 6.47 లక్షల ఇళ్లు దెబ్బ తిన్నాయి. వీటిలో 40 వేల ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. వేలాది పశువులు, మూగ ప్రాణులు మృత్యువాత పడ్డాయి. 5.97 లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. 20 లక్షలకు పైగా కొబ్బరి చెట్లు నేల కూలాయి. ఆ తుపాను వచ్చి సుమారు 30 ఏళ్లవుతున్నా నాటి విషాదం ఈ ప్రాంత వాసులకు ఇప్పటికీ కళ్ల ముందే కదలాడుతోంది.ప్రభుత్వ వైఫల్యం1996 నాటి తుపాను నుంచి కోలుకునేందుకు కోనసీమ (Konaseema) వాసులకు పదేళ్ల సమయం పట్టిందంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నాటి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి చంబ్రాబు నాయుడు సీఎంగా ఉన్నారు. తుపాను ముందు హెచ్చరికలు చేయకపోవడంతో పాటు కనీస జాగ్రత్తలు తీసుకోలేకపోవడంతో కోనసీమకు తీరని నష్టం జరిగింది.ప్రస్తుతం.. అప్రమత్తంనాటి అనుభవాలను గమనంలోకి తీసుకుని కాకినాడ జిల్లా (Kakinada District) అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మోంథా తుపాను (Cyclone Montha) నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఉప్పాడ రోడ్డును ముందు జాగ్రత్తగా మూసివేశారు. జిల్లాలోని స్కూల్స్, కాలేజీలు అన్నింటికీ నాలుగు రోజులు సెలువులు ప్రకటించారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లకుండా కట్టడి చేశారు. అలాగే పొలం పనులను వాయిదా వేసుకోవాలని రైతులకు సూచించారు.చదవండి: కాకినాడ తీరానికి ఉప్పెన ముప్పు!గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులందరినీ అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొవడానికి సిద్ధం చేశారు. కలెక్టర్ షణ్మోహన్ సగిలితో పాటు జిల్లా ప్రత్యేక అధికారి మైలవరపు కృష్ణతేజ (Krishna Teja Mylavarapu) ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, కిందిస్థాయి అధికారులకు తగువిధంగా ఆదేశాలిస్తున్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సహాయక చర్యలను అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా వైద్యపరంగా అన్ని జాగ్రత్తలు చేపడుతున్నారు. -
బలపడిన వాయుగుండం.. జల ప్రళయంగా దూసుకొస్తున్న తుఫాన్!


