AP: తుపాను నష్టంపై అధికారుల ప్రాథమిక నివేదిక | Andhra Pradesh Cyclone Montha October 29th Live News Updates In Telugu, Breaking News Headlines, Cyclone Videos | Sakshi
Sakshi News home page

Cyclone Montha Live Updates: తుపాను నష్టంపై అధికారుల ప్రాథమిక నివేదిక

Oct 29 2025 6:49 AM | Updated on Oct 29 2025 8:59 PM

Cyclone Montha On AP Oct 29 News Updates

AP Cyclone Montha Live News Updates Telugu: ఆంధ్రప్రదేశ్‌ తీరం సైక్లోన్‌ మోంథా ధాటికి తల్లడిల్లిపోయింది. భారీ నష్టాన్ని కలగజేసి తీరం దాటిన తీవ్ర తుపాన్‌ కాస్త తుపానుగా మారిపోయి తన ప్రభావం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో దిశ మార్చుకుని తెలంగాణ వైపు దూసుకొస్తోంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. 

తుపాన్ నష్టంపై అధికారుల ప్రాథమిక నివేదిక

విజయవాడ:

  • రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1,825 గ్రామాల్లో 87 వేలహెక్టార్లలో పంటకు నష్టం.
  • 59 వేలకు పైగా హెక్టార్లలో నీట మునిగిన వరి పంట, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలకు నష్టం.
  • భారీ వర్షాలతో నష్టపోయిన 78,796 మంది రైతులు.
  • రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన 42 పశువులు.
  • రాష్ట్రంలో దెబ్బతిన్న  పంచాయతీరాజ్ రోడ్లు, 14 బ్రిడ్జిలు, కల్వర్టులు
  • దెబ్బతిన్న 2,294 కి.మీ. పొడవున ఆర్ అండ్ బీ రహదారులు... రూ.1,424  కోట్ల నష్టం.
  • రూరల్ వాటర్ సప్లయ్‌కు సంబంధించి రూ.36 కోట్లు వరకు, ఇరిగేషన్‌ పనుల్లో రూ.16.45 కోట్ల మేర నష్టం.
  • సురక్షిత ప్రాంతాలకు 3,175 మంది గర్భిణీల తరలింపు... 2,130 మెడికల్ క్యాంపుల నిర్వహణ.
  • 297 రహదారులపై వరద నీరు పొంగి ప్రవహిస్తుండగా, వాటిని దారి మళ్లించేలా చర్యలు.
  • రాష్ట్రంలో మొత్తం 380 చెట్లు రహదారులపై విరిగిపడగా, అన్నింటినీ తొలిగించామని చెప్పిన  యంత్రాంగం.

బాపట్ల:

  • రేపల్లె నియోజకవర్గంలో ఇంకా పునరుద్ధరణ కానీ విద్యుత్ సరఫరా
  • అంధకారంలో ఇంకా నియోజకవర్గంలోని చాలా గ్రామాలు
  • 24 గంటల నుంచి కరెంట్ లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు


అల్లూరి జిల్లా :

  • మోంథా తుఫాన్ ఎఫెక్ట్..
  • రేపు కేకే లైన్ లో రైళ్ళ రాకపోకలు బంద్
  • కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో రైల్వే అధికారుల నిర్ణయం..
  • కిరండూల్ ప్యాసింజర్ రైలు రద్దు..
     

వరంగల్‌- ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా వరదనీరు

  • రేపు (గురువారం) వరంగల్‌ జిల్లాలో పాఠశాలలకు సెలవు
  • నీట మునిగిన వరంగల్‌ రైల్వే స్టేషన్‌ 
  • ఆలస్యంగా నడుస్తున్న  రైళ్లు
  • ప్రయాణికుల ఇక్కట్లు

శ్రీశైలం - హైదరాబాద్ రాకపోకలకు అంతరాయం

  • నాగర్ కర్నూల్ జిల్లా, ఉప్పునుంతల మండలం, లత్తిపూర్ సమీపంలో వరదకు కోతకు గురైన బ్రిడ్జి. 
  • డిండి వాగుపై నిర్మించిన బ్రిడ్జిపై శ్రీశైలం-హైదరాబాద్ మధ్య నిలిచిన రాకపోకలు.

వరంగల్‌లో కుండపోత వర్షం

  • పలు కాలనీల్లో ఇళ్లల్లోకి చేరిన వర్షపు నీరు
  • హన్మకొండ బస్టాండ్‌ ఆవరణలోకి భారీగా వరద
  • వరంగల్‌ అండర్‌ రైల్వే గేట్‌తో పాటు హన్మకొండ, భవానీ నగర్‌లో భారీగా వరద
  • అంబేద్కర్‌ భవన్‌ రహదారి జలమయం
  • అంబేద్కర్‌ భవన్‌లో చిక్కుకున్న పెళ్లి బృందం
  • చెరువులను తలపిస్తున్న రైలు పట్టాలు
  • మహబూబాబాద్‌ జిల్లాలో ఎక్కడికక్కడ  నిలిచిపోయిన రైళ్లు
  • డోర్నకల్‌ రైల్వే ట్రాక్‌పైకి భారీగా వరద, నిలిచిన రైళ్లు
  • వరంగల్‌, హన్మకొండలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు
  • కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు: 18004253424, 9154225936

 

  • తెలంగాణలో ఆరు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌
    మహబూబ్‌నగర్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌
  • 9 జిల్లాలకు ఆరెంజ్‌, మరో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
     

వరంగల్‌ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం

  • పర్వతగిరిలో 34 సెం.మీ వర్షపాతం
  • నెక్కొండలో 24 సెం.మీ వర్షపాతం నమోదు
  • సంగెం మండలంలో 25 సెం.మీ వర్షపాతం
  • ఖిలావరంగల్‌లో 23, ాపాలకుర్తిలో 23 సెం.మీ వర్షపాతం

తూ.గో.జిల్లా:

  • నల్లజర్ల లో ముందా తుఫాన్ వలన నేలకొరిగిన పంటలను పరిశీలించిన   వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ , నియోజకవర్గ ఇంచార్జ్‌
  • , మాజీ హోం మంత్రి తానేటి వనిత
  • పంట పాలు పోసుకునే దశలో నేలకి ఒరిగి పోయాయి
  • గడచిన ప్రభుత్వం రైతుల పక్షాన ఏ విధంగా చేసిందో ప్రజలు ఆలోచించాలి
  • రైతుకు జరిగిన నష్టాన్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా పూడ్చాలో ఆలోచించాలి
  • గత ప్రభుత్వం పంట వేసే ముందు పెట్టుబడి సహాయం ఇచ్చేది
  • అన్నదాత సుఖీభవ పేరుమీద ప్రతి రైతుకు ఎకరానికి రూ. 20,000 రూపాయలు ఇస్తానన్నారు
  • 18 నెలల కాలం గడిచిన కేవలం రూ.5000 రూపాయలు మాత్రమే ఇచ్చారు
  • పంట పెట్టుబడి సహాయం లేదు కానీ ఒక పంటకు నష్టపోయిన రైతు అధిక వడ్డీలకు రుణాలు పొందుతున్నారు  
  • రైతులకు పంటలకు ఇన్సూరెన్స్ చెల్లించిన ఘనత జగన్ ప్రభుత్వానిదే
  • పంట నష్టం వస్తే సబ్సిడీ కూడా చెల్లించిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం 

ఖమ్మం:

  • మధిర రైల్వే స్టేషన్ లో నిలిచిపోయిన   సాయి నగర్ శిరిడి ఎక్స్ ప్రెస్..
  • డోర్నకల్ రైల్వేస్టేషన్లో పట్టాలపై వరద నీరు చేరటంతో మధిర స్టేషన్ లో నిలిపివేసిన రైల్వే అధికారులు..
  • మోంథా తుపాను నేపథ్యంలో  ఖమ్మం రైల్వే స్టేషన్ లో నిలిచిపోయిన వందే భారత్ ట్రైన్...
  • డోర్నకల్ జంక్షన్ వద్ద రైలు పట్టాలపై నీరు ప్రవహించడంతో వందే భారత రైలును ఖమ్మం రైల్వే స్టేషన్ లో నిలుపు వేశారు...
  • భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -జిల్లా కలెక్టర్ అనుదీప్...
  • అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో జనం ఏదైనా అత్యవసరం అవుతేనే ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలి - జిల్లా కలెక్టర్

ఖమ్మం:

  • మోoథా తుపాను ఎఫెక్ట్ తో జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు...
  • స్తంభించిన జన జీవనం
  • జన్నారం వద్ద నిమ్మవాగు లో కొట్టుకుపోయిన  డీసీఎం వ్యాన్.
  • వరంగల్ నుంచి ఎన్కుర్ వస్తు ఉండగా జన్నారం వద్ద నిమ్మ వాగు ఉధృతిని అంచనా వేయలేక ముందుకు వెళ్లిన వ్యాన్ డ్రైవర్...
  • అందరు చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయిన వ్యాన్...
  • గల్లంతయిన డ్రైవర్ కోసం గాలిస్తున్న ఎన్డీఆర్ ఆప్ సిబ్బంది...
  • మళ్లీ భారీ వర్షం కురుస్తుండడంతో రెస్క్ ఆపరేషన్ కు  అంతరాయం...
  • జూలూరుపాడు మండలం పెద్ద వాగు పొంగి కాజ్ వే పైకి ప్రవహిస్తున్న వరద నీరు...
  • పడమటి నర్సాపురం, భేతాళుడు వైపు వెళ్లే  20 గ్రామాలకు నిలిచిన రాకపోకలు...
  • చింతకాని మండలం నాగులవంచ -పాతర్లపాడు మధ్య రహదారిపై ప్రవహిస్తున్న బండి రేవు వాగు వరద..‌
     

జగ్గంపేట(కాకినాడ జిల్లా ):

  • కిర్లంపూడి మండలం పాలెం గ్రామంలో మోంథా తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలకు కూలిన పెంకుటిల్లు
  • బాధితులను పరామర్శించి రూ.5,000 రూపాయలు నగదు, బియ్యం బస్తా అందజేసిన జగ్గంపేట వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్‌
     తోట నరసింహం.

హైదరాబాద్ : 

  • 135 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు.
  • మరో 31 రైలను దారి మళ్ళించాం: దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్
  • మోంథా తుపాను ప్రభావం తగ్గిన తర్వాతనే రైళ్లను పునరుద్ధరిస్తాం.
  • మోంథా ప్రభావంతో డోర్నకల్ రైల్వే స్టేషన్ దగ్గర ట్రాకులు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

ప్రకాశం: 

  • సంతనూతలపాడు నియోజకవర్గంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున
  • మోంథా తుపాను కారణంగా నాగులుప్పలపాడు మండలం మట్టిగుంట, ఈదుముడి మద్దిరాల ముప్పాళ గ్రామాలలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ మేరుగు నాగార్జున ,
  • ప్రభుత్వం వెంటనే స్పందించి తుపాను కారణంగా నీట మునిగిన పంట పొలాలను అధికారులు పరిశీలించి రైతులకు తగిన సహాయం అందించి వారికి కొంత ఉపశమనం కలిగించేల చర్యలు చేపట్టాలని కోరిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ మేరుగు నాగార్జున

ప్రకాశం జిల్లా: 

  • ఒంగోలులో ముంపు ప్రాంతాలను పరిశీలించిన వైఎస్సార్‌సీపీ  ఇంఛార్జి చుండూరి రవిబాబు
  • పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు సరిగా లేవు
  • ముంపు బాధితులకు  భోజనాలు  సరిగా ఏర్పాటు చేయకపోవడం దారుణం  
  • కలెక్టర్ తక్షణమే స్పందించి ముంపు బాధితులకు భోజన వసతి చూడాలి..; చుండూరి రవిబాబు

కాకినాడ

  • ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తీరుకు నిరసనగా కొత్తపట్నం మత్స్యకారుల ఆందోళన
  • ఉప్పాడలో పర్యటించిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్
  • తమ సమస్యలు చెప్పుకునేందుకు కారు వద్దకు వచ్చిన మత్స్యకారులు
  • కారు ఆపకుండా వెళ్ళిపోవడం పై గంగపుత్రుల ఆగ్రహం
  • ఓట్లు అవసరం ఐనప్పుడు మాత్రమే మేము కావాలా అంటూ అసహనం

విజయనగరం జిల్లా.

  • మోంథా ప్రభావంతో  50 గ్రామాల రాకపోకలు అంతరాయం.
  • సంతకవిటి మండలం సిరిపురం వద్ద పొంగిపొర్లుతున్న రెల్లిగెడ్డ.
  • సిరిపురం నుండి పొందూరు, 
    మండవకురిటి నుండి జి.సిగడాం రహదారులపై  ఉప్పొంగుతున్న వరద నీరు.
  • రాకపోకలను నిలిపివేయాలని ఆదేశించిన ఆర్డీవో.  
  • పోలీసుల పర్యవేక్షణలో రహదారులకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు.

పశ్చిమగోదావరి జిల్లా.

  • ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలో మోంథా తుపాను ప్రభావంతో 250 ఎకరాల వరిచేలు మునక.
  • ఎకరాకు 25 వేల రూపాయలు పెట్టుబడి పెట్టామంటూ రైతుల ఆవేదన.
  • అధికారులు కన్నెత్తి చూడలేదంటూ రైతుల అసహనం 

తుపాను

పశ్చిమగోదావరి జిల్లా:

  • మోంథా తుపాను ప్రభావంతో  పాలకొల్లు, యలమంచిలి,పోడూరు మండలాల్లోని పలు గ్రామాలు దొడ్డిపట్ల, అబ్బురాజు  పాలెం,లంక  గ్రామాల్లో అరటి, తమలపాకు తోటలకు తీవ్ర  పంట నష్టం
  • రైతులు తీవ్ర ఆందోళన
  • తుపాను తో నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం తక్షణమే ఆదుకునీ నష్టపరహం చెల్లించాలని  కోరుతున్న రైతులు

ఏలూరు జిల్లా: 

  • మోంథా తుపాను ప్రభావంతో ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు మండలాల్లో పలు చోట్ల నెలకొరిగిన వరి క్షేత్రాలు,
  • స్వర్ణరకం వరి వంగడం వేసిన రైతులు పంట నెలకొరిగి తీవ్రనష్టం,
  • ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్న రైతులు

తూర్పుగోదావరి జిల్లా:

  • నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో  మోంథా  ప్రభావంతో  దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన మాజీ  మంత్రి చెల్లు బోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు
  • పంట నష్టపోయిన రైతులకు  నష్టపరిహారం అందించాలని డిమాండ్

నల్లగొండ జిల్లా:

  • గుర్రంపోడు మండల కేంద్రంలో ఇళ్లలోకి చేరిన వరద నీరు
  • వర్షపు నీరు వెళ్లడానికి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో జనాల అవస్థలు

కృష్ణా జిల్లా

  • కంకిపాడు మండలం ఉప్పులూరులో తుపాను ప్రభావంతో పల్లపు తిరుపతమ్మ ఇల్లు నేలమట్టం.
  • విషయం తెలుసుకున్న YSRCP పెనమలూరు నియోజకవర్గం ఇంచార్జ్ దేవభక్తుని చక్రవర్తి.
  • స్వయంగా వెళ్లి బాధిత కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం అందించిన దేవభక్తుని చక్రవర్తి.

కాకినాడ

  • తాళ్ళరేపు మండలం పిల్లిలంకలో తుపాను  భాధితులకు బిర్యాణీ ప్యాకెట్లు అందజేసిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి చింతలపాటి శ్రీనివాసరాజు
     

అనకాపల్లి :

  • శారాధ నదికి పెరుగుతున్న వరద ఉదృతి..
  • ప్రమాద స్థాయికి చేరుకున్న నీటిమట్టం..
  • రహదారుల మీద నుంచి ప్రవహిస్తున్న వరద నీరు..
  • పలు గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం..
  • అప్రమత్తమైన అధికారులు..
  • యలమంచిలి - గాజువాక రహదారిలో రాకపోకలు నిలిపేసిన పోలీసులు..

తెలంగాణకు మోంథా ముప్పు!

  • తెలంగాణ వైపు కదులుతున్న మోంథా

  • ఇప్పటికే ఏపీలో తీరని నష్టం

  • ఇంకా కురుస్తున్న వానలు

  • మరో గంటలో ఖమ్మంను తాకనున్న మోంథా

  • హనుమకొండ, వరంగల్, మహబూబాద్ జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ 

  • ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.. ఆరెంజ్ హెచ్చరికలు

  • సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.. ఆరెంజ్ హెచ్చరికలు

  • హైదరాబాద్‌ వర్షాలపై.. అధికారుల్ని అప్రమత్తం చేసిన జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం

రైళ్లపై మోంథా ప్రభావం

  • తెలంగాణపై మోంథా తుపాను ఎఫెక్ట్‌

  • మోంథా ప్రభావంతో దక్షిణ మద్య రైల్వే పరిధిలో రైళ్ల రాకపోకలకు అంతరాయం

  • మహబూబాబాద్‌లో ఆగిపోయిన కృష్ణా ఎక్స్‌ప్రెస్‌

  • నీట మునిగిన డోర్నకల్‌ రైల్వే స్టేషన్‌

  • డోర్నకల్‌లో ఆగిపోయిన గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌

  • వరంగల్‌లోనే ఆగిపోయిన ఇంటర్‌ సిటీ

  • మధిర స్టేషన్‌లో ఆగిన షిరిడి ఎక్స్‌ప్రెస్‌

  • ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు

సంబంధిత కథనం: మోంథా ఎఫెక్ట్‌.. రద్దైన రైళ్ల వివరాలు ఇవిగో

 

  • ఖమ్మం జిల్లాలో మోంథా తుపాను బీభత్సం

  • కొణిజర్ల మండలం జన్నారం వద్ద నిమ్మవాగులో బ్రిడ్జి పైనుంచి పడిపోయిన డీసీఎం

  • నిమ్మవాగులో డ్రైవర్‌ గల్లంతు, గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు

మోంథా తుపాను.. తెలంగాణ సర్కార్‌ హైఅలెర్ట్‌ 

  • మోంథా ప్రభావంతో తెలంగాణకు భారీ వర్షాలు 
  • ఆర్ అండ్ బీ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
  • ఫీల్డ్ లెవెల్ లో హై అలెర్ట్ గా ఉండాలని సూచన
  • అత్యవసరం ఐతే తప్పా.. ఎవరూ సెలవు పై వెళ్లొద్దని ఆదేశం
  • మాన్సూన్ సీజన్ లో చేపట్టిన జాగ్రత్త చర్యలు.. అదే స్పూర్తితో కొనసాగించాలి: మంత్రి కోమటి రెడ్డి
  • ప్రజలను అప్రమత్తం చేయడానికి పోలీసు,రెవెన్యూ,విద్యుత్,ఇరిగేషన్,పిఆర్ శాఖలతో సమన్వయం చేసుకోవాలి: మంత్రి కోమటి రెడ్డి
  • లో కాజ్ వే లు,కల్వర్టులు వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలి: మంత్రి కోమటి రెడ్డి
  • ఆర్ అండ్ బి ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ సెంటర్ అన్ని జిల్లాలతో అనుసంధానం చేయాలి: మంత్రి కోమటి రెడ్డి
  • అత్యవసరమైతేనే ప్రజలు రోడ్ల పైకి రావాలి,అధికారులు సూచించే జాగ్రత్తలు పాటించాలి: మంత్రి కోమటి రెడ్డి

కరీంనగర్ జిల్లాలో.. 

  • నిండుకుండలా లోయర్ మానేరు డ్యామ్
  • మోంథా తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలు
  • 2 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు
  • ఇన్ ఫ్లో: 1277 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో: 4 వేల క్యూసెక్కులు
  • ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం: 24.034 టీఎంసీలు
  • ప్రస్తుత నిల్వ 24.034 టీఎంసీలు
  • దిగువ నది పరిసర ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచన 
  • పశువుల కాపర్లు,మత్స్య కారులు,రైతులు నది దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరికలు

తెలంగాణ భారీ వర్షాలపై మంత్రి పొంగులేటి అప్రమత్తం

  • భారీ వర్షాల వల్ల ప్రజా జీవనానికి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు
  • రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష
  • రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి
  • ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
  • రాగల 24 గంటల్లో అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట, వరంగల్, యాదాద్రి, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు
  • వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి
  • లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు
  • పోలీసులతో కలసి వాగులు, కాల్వలు, చెరువుల దగ్గర పర్యవేక్షణ చేయాలని ఆదేశాలు
  • అత్యవసర సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి ఆదేశాలు
  • విద్యుత్, పంచాయతీ రాజ్, ఆర్ & బి శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచనలు
  • ప్రాణనష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి సూచనలు
  • ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రాధాన్యం – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

నాగర్ కర్నూలు జిల్లాలో..  

  • ఉప్పునుంతల మండలం మొల్గర గ్రామం వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న దుందుభి వాగు, 
  • ఉప్పునంతల వంగూరు మండలాలకు రాకపోకలు బంద్
  • తాడూరు మండలంలో భారీ వర్షం
  • పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
  • ఐతోలు, గోవిందాయపల్లి మధ్య రోడ్డుపై పారుతున్న వాగు నిలిచిపోయిన రాకపోకలు

నల్లగొండ జిల్లాలో..

  • తిరుమలగిరి (సాగర్)లో పొంగిపొర్లుతున్న బర్ల బంధం
  • రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీరు
  • బడాయిగడ్డ గ్రామ సమీపంలో కల్వర్టు పైనుంచి ప్రవహిస్తోన్న వరద నీరు
  • తిరుమలగిరి- రాజవరం మధ్య రాకపోకలు నిలిపివేత
  • మండల వ్యాప్తంగా నీట మునిగిన పత్తి, వరి పొలాలు

బలహీనపడి తెలంగాణ వైపు దూసుకొస్తున్న మోంథా

  • తీరం దాటాక దిశ మార్చుకున్న మోంథా

  • తెలంగాణ వైపు దూసుకొస్తున్న తుపాను

  • భద్రాచలానికి 50కి.మీ. ఖమ్మంకు 110కి.మీ. దూరంలో కేంద్రీకృతం

  • భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ

  • ఇప్పటికే ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షాలు

  • హైదరాబాద్‌లోనూ దంచికొడుతున్న వర్షం

  • తెలంగాణలో 14 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్‌ అలర్ట్‌ జారీ

  • వాయవ్య దిశగా ప్రయాణించి రాబోయే ఆరుగంటల్లో బలహీనపడే అవకాశం

ఒంగోలు జలమయం..

  • మోంతా తుపాను దాడికి ఒంగోలులోని లోతట్టు కాలనీలు జలమయం
  • ఒంగోలు నగరంలోని వెంకటేస్వరా కాలనీ, నేతాజీ కాలనీ,నెహ్రూ కాలనీ ,బిలాల్ నగర్,పాపకాలని ,బలరాం కాలనీ ,మథర్ తెరిశా కాలనీలు జలమయం
  • సముద్రాన్ని తలపిస్తున్న రోడ్లు
  • నేతాజీ కాలనీ,వెంకటేస్వరా కాలనీల ప్రజల జలదిగ్బంధం


కోనసీమ.. ఇళ్లలోకి పాములు!

  • కోనసీమ అంబాజి పేటను ముంచెత్తిన వర్షపు నీరు
  • ఇళ్లలోకి చేరుకున్న వర్షపు నీరు
  • రోడ్ల పై మోకాలు లోతు నీరు చేరుకోవడంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు
  • సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక పోవడంతో చిన్న చినుకు పడితే రోడ్లు అన్ని జలమయం అవుతాయి అంటున్న గ్రామస్థులు
  • నాగబాత్తుల వారి పాలెం లో వర్షపు నీరు ఇంట్లోకి చేరుకోవడంతో ఇళ్లలోకి వస్తున్న పాములు.. ఆందోళనలో ప్రజలు

 

మోంథా ధాటికి భారీగా పంట నష్టం 

  • మోంథా ప్రభావంతో శ్రీకాకుళం నుంచి తిరుపతి దాకా అన్నిచోట్లా దెబ్బ తిన్న పంటలు

  • తుపాను ప్రబావంతో చేతికందిన పంట నీటిపాలు

  • కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో వేల ఎకరాలల్లో భారీగా పంట నష్టం

  • కృష్ణా జిల్లాలో నేలకొరిగిన అరటి బొప్పాయి తోటలు 

  • శ్రీకాకుళంలో 350 హెక్టార్లలో పంట నష్టం

  • గాలులకు అరటి, కంద, బొప్పాయి తోటలు నష్టం

  • విజయనగరంలో 7 వేల ఎకరాలు నేలవాలిన వరి

  • ప్రకాశం జిల్లాలో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం

  • గుంటూరు, బాపట్ల, పల్నాడులో తడిసి ముద్దైన పత్తి

  • కన్నీరు పెడుతున్న ఏపీ రైతాంగం

  • పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో నీట మునిగిన వరి పంట

తెలంగాణ ఖమ్మంలో.. 

  • మోంథా తుపాను కారణంగా ఉమ్మడి ఖమ్మంలో కురుస్తున్న భారీ వర్షాలు
  • స్తంభించిన జనజీవనం
  • బోనకల్ లో అత్యధికంగా 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
  • తల్లాడ లో 9 సెం.మీ, వైరా లో 8 సెం. మీ, పెనుబల్లి లో 7 సెం. మీ, మధిర 7 సెం. మీ, కల్లూరు 7 సెం.మీ వర్షపాతం నమోదు....
  • భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్ అనుదీప్...
  • అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో జనం ఏదైనా అత్యవసరం అవుతేనే ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలని సూచన

అనకాపల్లి జిల్లాలో..

  • విజయరామరాజు పేట దగ్గర ఉధృతంగా తాచేరు నది
  • తాత్కాలిక కాజ్ వే మునిగిపోయే ప్రమాదం
  • అల్లూరి - అనకాపల్లి జిల్లాల మధ్య వాహనాలు రాకపోకలకు విఘాతం
  • ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు

 

నంద్యాల జిల్లాలో..

  • ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రభావం చూపిన మోంథా తుపాను
  • సిరివెళ్ల నుండి రుద్రవరం వెళ్లే రోడ్డు మార్గం జలమయం, నిలిపివేసిన ఏపీఎస్ఆర్టీసీ సేవలు.
  • ఆళ్లగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాల వల్ల ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు...
  • రోడ్డుపై ఆరబెట్టిన మొక్కజొన్న మొత్తం నీటిమయం  ఆదుకోవాలని కోరుతున్న రైతులు
  • ప్రమాద ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి న రెవెన్యూ అధికారులు పోలీసులు రెవెన్యూ అధికారులు పోలీసులు
  • నంద్యాల టౌన్‌ను ముంచెత్తిన తుపాను
  • లోతట్టు కాలనీలు జలమయం,ఇళ్లల్లోకి చేరిన వర్షపునీరు
  • తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు
  • తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
  • ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీరు
  • ఉదృతంగా ప్రవహిస్తున్న కుందు నది , వెక్కిలేరు , పాలేరు వాగులు
  • వరద హెచ్చరికలు జారీ చేసిన రెవెన్యూ , మున్సిపల్ అధికారులు
  • మహానంది - నంద్యాల మధ్య , మహానంది - గాజులపల్లి మధ్య వరద కారణంగా నిలిచిన రాకపోకలు

Landslide In Srisailam Ghat Road

శ్రీశైలంలో..

  • శ్రీశైలం మండలంలో అల్లకల్లోలం చేసిన మోంథా తుపాను
  • శ్రీశైలంలో అర్ధరాత్రి నుంచి భీభత్సం సృష్టించిన కుండపోత వర్షం
  • శ్రీశైలంలోని పలు కాలనీలోకి మోకాళ్ళ లోతుకు చేరిన వరద నీరు
  • శ్రీశైలం డ్యాం వద్ద విరిగిపడిన భారీ కొండ చరియలు,
  • కొండచరియలు రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఆటంకం,
  • లింగాలగట్టులో మత్స్యకారుల ఇళ్లల్లోకి చేరిన వరద నీరు,
  • లింగాలగట్టులో వర్షం భీభత్సం ధాటికి కొట్టుకుపోయిన మత్స్యకారుల ఇల్లులు
  • అర్థరాత్రి నుంచి నిద్ర లేకుండా బిక్కుబిక్కుమంటూ గడిపిన మత్స్యకారులు

అనకాపల్లి జిల్లాలో..

  • ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఉడేరు నదికి పెరిగిన వరద నీరు  
  • వరద నీరు తాకిడి కారణంగా ఉడేరు నదికి పడిన గండి
  • ఉడేరు నదికి గండి పడడంతో పంట పొలాల్లోకి వస్తున్న వరద నీరు
  • ఆందోళన చెందుతున్న భోగాపురం చాకిపల్లి రైతులు
  • వరద నీరు మరింతగా బయటకు వస్తే గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశం

పల్నాడు జిల్లాలో..

  • చిలకలూరిపేట నియోజకవర్గం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం
  • పసుమర్రు సబ్ స్టేషన్ లోకి భారీ స్థాయిలో వచ్చిన వర్షపునీరు

తెలంగాణలో దంచి కొడుతున్న వానలు

  • మోంథా ప్రభావంతో హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో వానలు
  • శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారి బ్రాహ్మణపల్లి వద్ద  బ్రిడ్జిపైనుంచి పొంగిపొర్లుతున్న చంద్రవాగు
  • రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం సుద్ధపల్లి గ్రామవాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో నిలిచిపోయిన రాకపోకలు
  • నాగర్ కర్నూల్-- బల్మూరు మండలం మైలారం గ్రామంలో అలుగుపారుతున్న చెరువు నిలిచిపోయిన రాకపోకలు
  • హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి,భీమదేవరపల్లి,కమలాపూర్ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన  వాన
  • హన్మకొండ జిల్లా పరకాల డివిజన్ వ్యాప్తంగా ఉరుములు. మెరుపు ల తో కురుస్తున్న మోస్తారు వర్షం
  • సూర్యాపేట జిల్లాలో మోంథా ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలు
  • కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. కంట్రోల్ రూమ్ నెంబర్:  6281492368
  • హుజూర్‌నగర్ మండలం వేపల సింగారం వద్ద ఈదురుగాలుల ప్రభావంతో రోడ్డుపై కూలిన భారీ వృక్షం
  • వనపర్తి జిల్లా మదనాపురం మండలం సరళ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరదరావడంతో ఆటో మేటిక్ గా తెరుచుకున్న రెండు సైపన్స్

బాపట్ల జిల్లాలో.. 

  • కొల్లూరు మండలం లో రాత్రి నుంచి ఈదురుగాయలతో కురిసిన భారీ వర్షం
  • ఈదురు గాలులు దెబ్బకు భారీగా పంట నష్టం
  • నేలకొరిగిన తమలపాకు అరటి పంట పొలాలు
  • కంద పొలాల్లోకి భారీగా వర్షపు నీరు రావడంతో రైతులకు తీవ్ర నష్టం

ప్రకాశం జిల్లాలో.. 

  • చీమకుర్తి నుండి కొండేపి  వెళ్లే రోడ్డు మార్గం నిలిపివేసిన సచివాలయ సిబ్బంది
  • కేవీ పాలెం గ్రామంలో చెరువు నిండి  రోడ్డుపైకి బారీగా నీరు రావడంతో చిల్లకంప వేసి రాకపోకలు ఆపివేసిన సచివాలయ సిబ్బంది
  • ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిపివేత

గూడు ఏమైందో?

  • కాకినాడ పునరావాస కేంద్రాల వద్ద దయనీయమైన పరిస్థితులు

  • చలికి వణికిపోతున్న పిల్లలు, వృద్ధులు

  • బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల ప్రజలు

  • ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో అని గుబులు పడుతున్న వైనం

మోంథా ప్రభావం..

  • తీరం దాటినా గట్టి ప్రభావం చూపుతున్న మోంథా
  • నేడు ఆరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • మరో ఆరు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్
  • ఈదురు గాలుల తీవ్రత నేడంతా ఉండే అవకాశం
  • ఇప్పటికీ అంధకారంలోనే కోస్తాంధ్ర జిల్లాలు
  • కరెంటు స్తంభాల పునరుద్ధరణ పనులు ఆలస్యం
  • కొనసాగుతున్న విరిగి పడిన చెట్ల తొలగింపు
  • క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు

ఎన్టీఆర్ జిల్లా..

  • చందాపురం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న నల్లవాగు
  • చందర్లపాడు నందిగామ మండలాల మధ్య రాకపోకలకు బంద్

కృష్ణా జిల్లాలో..

  • రైతులను నిండా ముంచేసిన తుపాను
  • అవనిగడ్డ నియోజకవర్గంలో బీభత్సం సృష్టించిన  ఈదురుగాలులు,వర్షం
  • రైతుల పాలిట శాపంగా మారిన మోంథా తుపాను
  • ఈదురు గాలుల ధాటికి నేలకొరిగిన వరి పైరు
  • పూర్తిగా దెబ్బతిన వాణిజ్య పంటలు
  • తీవ్రంగా నష్టపోయిన వరి, అరటి, కంద, కూరగాయ పంటలు
  • ఆందోళనలో రైతులు

 

తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లాలో.. 

  • ఉప్పునుంతల మండలంలో అచ్చంపేట వెళ్లే దారులు నాలుగు వైపులా జల దిగ్బంధం బృందం
  • కొల్లాపూర్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు 
  • ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించిన అధికారులు
  • అచ్చంపేట శ్రీశైలం ఉత్తర ద్వారం ఉమామహేశ్వర ఆలయం మూసివేత 
  • నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా భారీగా కురుస్తున్న వర్షం 
  • కొండలపై నుండి జలపాతం ఎక్కువ రావడంతో ముందుజాగ్రత్తగా ఆలయం మూసివేత

Cyclone Montha : Heavy Rainfall in Ongole1

ప్రకాశం జిల్లాలో.. 

  • పొదిలి మండలం బట్టువారి పల్లె దగ్గర ఒంగోలు శ్రీశైలం జాతీయ రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు
  • రాకపోకలు బంద్ ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

ఖాళీగా విజయవాడ బస్టాండ్‌

  • ప్రజా రవాణా వ్యవస్థపై మోంథా ప్రభావం
  • దూరప్రాంతాలకు వెళ్లాల్సిన 161 ఏసి,సూపర్ లగ్జరీ, అల్ట్రాడీలక్స్,ఎక్స్ ప్రెస్,నాన్ స్టాప్ బస్సులు రద్దు
  • వెలవెలబోతున్న విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్
  • శ్రీకాకుళం,విజయనగరం,విశాఖ,కాకినాడ,కోనసీమ,పశ్చిమగోదావరి,బాపట్ల,ప్రకాశం,నెల్లూరు జిల్లాలకు నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు
  • తుపాను ప్రభావం తగ్గే వరకూ డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితం

రైతులకు కన్నీళ్లు మిగిల్చిన మోంథా

  • ఏపీలో పంటలపై మోంథా తుపాను ప్రభావం

  • నేలకొరిగిన వరి, మినుము, వేరుశనగ, మొక్కజొన్న పంటలు

  • కృష్ణా జిల్లాల్లో అత్యధికంగా నీట మునిగిన పంట!
     

శ్రీశైలం పాతాళ గంగ వద్ద తప్పిన ప్రమాదం

  • శ్రీశైలంలో తప్పిన ఘోర ప్రమాదం

  • పాతాళ గంగ విరిగిపడ్డ కొండచరియలు

  • మూడు తాత్కాలిక దుకాణాలు ధ్వంసం

  • భక్తులెవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
     

మరో 24 గంటలు వర్షాలే!

  • మోంథాపై భారత వాతావరణ శాఖ(IMD) తాజా ప్రకటన

  • ఛత్తీస్‌గడ్‌ దిశగా పయనించి ఈ మధ్యాహ్నానికి బలహీనపడిపోతుంది

  • మోంథా ప్రభావంతో గంటకు 85-95 కిలోమీటర్ల వేగంతో గాలులు

  • ఏపీ, తెలంగాణ తోపాటు దక్షిణ ఒడిషా తీర ప్రాంతాలకు మరో 24 గంటలు వర్షాలే

  • వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం

క్రమంగా బలహీనపడుతున్న మోంథా

  • క్రమంగా బలహీనపడుతున్న సైక్లోన్‌ మోంథా
  • ఇప్పటికే ఈ తీవ్ర తుపాను.. తుపానుగా బలహీనపడింది
  • రానున్న 4 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం
  • ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
  • ఇటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం

విమాన సర్వీసుల పునరుద్ధరణ

  • మోంథా కారణంగా నిన్న నిలిచిపోయిన 56 సర్వీసులు
  • ఇవాళ విశాఖ-విజయవాడ ఇండిగో సర్వీసు మాత్రమే రద్దు
  • మిగతావి యధాతథం

ఇంకా భయం గుప్పిట యానాం

  • యానాంలో తుపాను ప్రభావం
  • 24 గంటలుగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
  • ఉదృతంగా ప్రవహిస్తున్న గౌతమి గోదావరి
  • భారీ ఈదురుగాలులు ప్రవాహంతో కుప్పకూలిన 20 వృక్షాలు
  • సముద్రపు అలలు తలిపించేలా ప్రవహిస్తున్న గౌతమి గోదావరి
  • నిన్న మధ్యాహ్నం నుంచే వ్యాపార సముదాయాలు మూసివేత
  • ఈదురు గాలులు ప్రభావంతో బయటకి రాని యానాం ప్రజలు

అనకాపల్లి జిల్లాలో.. 

  • మాడుగుల. పెద్దేరు రైవాడ జలాశయాలకు వరద ఉధృతి.
  • ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు జలాశయాలకు చేరిక.
  • పెద్దేరు జలాశయం నుంచి 750 న్యూ సెక్యుల నీరు విడుదల.
  • తమతబ్బ వంతెనపై నుంచి కొనసాగుతున్న ప్రవాహం.
  • తమతబ్బ చింతలపూడి పంచాయతీల్లో 12 గ్రామాల రాకపోకలకు అంతరాయం.
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశం.

తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాల్లో.. 

  • మోంథా తుపాను కారణంగా జిల్లాలో విస్తారంగా కురస్తున్న వర్షాలు

కాకినాడలో.. 

  • మోంథా తుపాను ఎఫెక్ట్‌తో తొండంగి, ఉప్పాడ మండలాల పరిధిలో పలు గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరా
  • నిన్న ఉదయం నుండి కరెంటు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు
  • కొనసాగుతున్న పునరుద్దరణ పనులు

తెలంగాణ మహబూబాబాద్ జిల్లాలో.. 

  • మహబూబాబాద్, ఇనుగుర్తి కేసముద్రం మండలాల్లో కురుస్తున్న భారీ వర్షం
  • డోర్నకల్ నియోజక వర్గ వ్యాప్తంగా కురుస్తున్న మోస్తరు వర్షం

ప్రకాశం జిల్లాలో.. 

  • ఒంగోలు నవోదయ స్కూల్ లోకి భారీగా చేరిన నీరు
  • క్యాంటీన్ లోకి సైతం వర్షపు నీరు రావడంతో వంట కు ఇబ్బందిగా మారింది సిబ్బంది
  • విద్యార్థులు కు ఆహారం ఇవ్వాలా వండడం కష్టం అంటున్న సిబ్బంది

ఎన్టీఆర్ జిల్లాలో.. 

  • కొనసాగుతున్న మోంథా తుపాను ప్రభావం
  • తిరువూరులో భారీ వర్షం
  • భారీ వర్షం కారణంగా చెరువును తలపిస్తున్న ఆర్టీసీ బస్టాండ్, రోడ్లు
  • ఇబ్రహీంపట్నంలో భారీగా వీస్తున్న ఈదురుగాలులు
  • విజయవాడ సిటీలో ఈదురు గాలులతో కురుస్తున్న మోస్తరు వర్షం
  • నందిగామలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
  • నందిగామ పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయం
  • రోడ్ల పై భారీగా నిలిచిన వర్షపు నీరు

పార్వతీపురం మన్యం జిల్లాలో.. 

  • తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల పూరి ఇల్లు పాక్షికంగా ధ్వంసం.
  • గడిచిన 24 గంటలుగా కురుస్తున్న వానలకు 118.70 హెక్టార్ల లో వ్యవసాయ పంటలకు నష్టం.
  • జిల్లా కలెక్టర్ కార్యాలయం నివేదిక

నెల్లూరు జిల్లాలో..

  • సంగం పెన్నా వారధి వద్ద తప్పిన పెను ప్రమాదం
  • పెన్నా నది నుండి ఇసుక తరలించేందుకు నిల్వ ఉంచిన  మూడు పడవలు
  • భారీగా నీరు రావడంతో తాళ్ళు తెంచుకొని పెన్నా నది గట్టున నిలిచిన  బోట్లు
  • పెన్నా వారధి  గేట్లకు కు తగలకపోవడంతో ఊపిరిపించుకున్న అధికారులు

కృష్ణా జిల్లాలో..

  • మోంథా తుపాను ప్రభావంతో గన్నవరం నియోజకవర్గం వ్యాప్తంగా కురుస్తున్న వర్షం
  • భారీ ఈదురు గాలులకు బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో నేలకొరిగిన వరి పంట

నల్లగొండ జిల్లాలో..

  • వర్షం నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించిన అధికారులు

విశాఖపట్నంలో.. 

  • తుపాను తీరం దాటిన విశాఖలో కొనసాగుతున్న ఈదురు గాలులు.
  • ఇంకా అల్లకల్లోలంగా సముద్రం.
  • మత్స్యకారులు మరో మూడు రోజులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు.
  • ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ ప్రైవేటు స్కూలుకు సెలవు.
  • భారీ గాలులకు అనకాపల్లి నేషనల్ హైవే పై కూలిని చెట్టు.
  • ఈదురు గాలులకు శంకరమఠం రోడ్ లో ఇంటిపై పడ్డ చెట్టు.
  • అనకాపల్లి జిల్లాలో పంట మునిగిన పొలాలు..
  • ఈరోజు భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన.
  • ఈరోజు బీచ్, పర్యాటక ప్రాంతాలకు  అనుమతి నిరాకరణ
     

నెల్లూరు జిల్లాలో..

  • ఎగువ  ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయంకు వరద ప్రవాహం.
  • జలాశయం ఇన్ ఫ్లో 40,784 క్యూసిక్కులు..
  • జలాశయం అవుట్ ఫ్లో 33,460 క్యూసిక్కులు..
  • జలాశయం ప్రస్తుతం నీటి సామర్థ్యం 67.647 టీఎంసీలు..
  • జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 78 టీఎంసీలు
     

అనకాపల్లిలో..

  • గాలులకు అనకాపల్లి హైవే కూలిన భారీ వృక్షం
  • తొలగించిన ఫైర్ సిబ్బంది

తిరుపతిలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు!

  • తిరుపతి జిల్లాలో ఇవాళ తెరుచుకోనున్న విద్యాసంస్థలు 
  • అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఈరోజు నుండి యథావిధిగా పనిచేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాలు
  • మోంథా ప్రభావంతో తిరుపతిలో వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ

ప్రకాశం జిల్లాలో.. 

  • మోంతా తుపాను ప్రభావంతో జిల్లా అతలాకుతలం
  • భారీ వర్షాల ఈదురు గాలులతో చిగురుటాకుల వణికిన ఉమ్మడి ప్రకాశం జిల్లా
  • పొంగిపొల్లిన వాగు లు, వంకలు
  • నిండు కుండాలా తయారైన పలు చెరువులు
  • పలుచోట్ల రాకపోకలకు అంతరాయం
  • రహదారులపై వాగులు పొంగిన చోట పోలీస్ పికెటింగ్
  • కందుకూరులో ఎర్రవాగు ఉగ్రరూపం.
  • రాళ్లపాడు ప్రాజెక్టుకు పోటెత్తిన వరద నీరు
  • సింగరాయకొండ పోలీస్ స్టేషన్ నీటిమనక
  • కూచిపూడి చెరువుకు గండి భారీగా గ్రామం మీద పడ్డ వరదనీరు
  • కొండేపి వద్ద పొంగిపొర్లను అట్లేరు
  • కొండేపి ఒంగోలు మధ్య రాకపోకలకు అంతరాయం
  • ఒంగోలు ఎర్రజర్ల మధ్య పొంగిపొర్లిన నల్లవాగు
  • ఒంగోలు ఎర్రజర్ల మధ్య నిలిచిన రాకపోకలు
  • అదే ప్రాంతంలో నిన్న కొట్టుకుపోయిన
  • ఒక కారు కనిగిరిలో సరిగా వర్షం
  • పోటెత్తిన భైరవకోన జలపాతం

 

 

  • ఒంగోలు పొదిలి మధ్య వర్షం దాటికి దెబ్బతిన్న రహదారి
  • తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
  • ఒంగోలులో పల్చోట్ల కాలనీలు జలమయం
  • ఒంగోలు నగరంలోని కర్నూల్ రోడ్డు, ట్రంక్ రోడ్లో సైతం భారీగా నిలిచిన వర్షపు నీరు
  • శివారు  కాలనీలో ఇళ్లలోకి చేరిన నీరు
  • తీర ప్రాంత మండలాల్లో భారీ వర్షం ఈదురు గాలులు
  • పునరావాస కేంద్రాలకు పలువురు తరలింపు
  • మార్కాపురం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గుండ్లకమ్మ నది
  • మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం- కొండేపల్లి మార్కాపురం -నాగులవరం గ్రామాల మధ్య రాకపోకలకు బంద్
  • జిల్లాలో భారీగా నష్టపోయిన మిర్చి మొక్కజొన్న కంది మినుము సజ పంట రైతులు
  • పుల్లలచెరువు మండలం చౌటపచర్ల చెరువుకు గండి వంద ఎకరాలలో ఉరి మొక్కజొన్న పంట నష్టం
  • దర్శి మండలం వెంకటాచలపల్లి వద్ద పొంగిపొర్లుతున్న పులి వాగు
  • కొట్టుకుపోయిన రోడ్లు
  • గ్రామ శివారులో ఉన్న గుడిలో రోడ్డు కొట్టుకుపోవడంతో అక్కడ ఇరుక్కుపోయిన 30 మంది స్వాములు
  • చీరాలలో భారీ వర్షాలతో రోడ్లు జలమయం  
  • అర్ధవీడు మండలం నల్లమల అటవీ ప్రాంతంలో భారీ వర్షాలు
  • ఉప్పొంగిన జంపలేరు వాగు
  • బొల్లు పల్లె అచ్చంపేటకు రాకపోకలు బంద్
  • భారీ వర్షాల కారణంగా నిన్నటి నుంచి దోర్నాల శ్రీశైలం మధ్య నిలిచిన రాకపోకలు
  • గుండ్లకమ్మ రిజర్వాయర్కు భారీగా వరద నీరు
     

ఏపీని నిండా ముంచిన మోంథా

  • మోంథా తుపానుతో ఏపీకి తీవ్ర నష్టం

  • ఓవైపు భీకరగాలులు.. మరోవైపు భారీ వర్షాలు

  • విరిగిన స్థంభాలు, నేలకొరిగిన వృక్షాలు

  • పొంగిపొర్లుతున్న వాగులు

  • రోడ్లు, రైల్వే ట్రాక్‌లు దెబ్బతినడంతో రవాణా వ్యవస్థకూ అంతరాయం

  • లోతట్టు ప్రాంతాల జలమయంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు

  • 20 గంటలుగా అంధకారంలోనే పలు ప్రాంతాలు

  • సెల్‌ టవర్లు దెబ్బ తినడంతో పని చేయని సెల్‌ఫోన్‌ సేవలు

  • తీవ్రంగా దెబ్బ తిన్న పంటలు

  • ఐదు రోజులుగా వేటకు దూరమైన మత్య్సకారులు

  • మోంథా ప్రభావంతో ఈ నెల 31 దాకా విద్యాసంస్థలకు సెలవులు పొడిగించిన పలు జిల్లా కలెక్టర్లు

క్రమంగా బలహీనపడుతున్న మోంథా

  • తీవ్ర తుపాను ప్రస్తుతం తుపానుగా బలహీనపడ్డ మోంథా
  • రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీన పడే అవకాశం
  • దీని ప్రభావంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
  • కోస్తాంధ్రలో ఈదురుగాలులు
  • ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం
  • ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు
  • కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం
  • నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం

తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్‌

  • మెంథా ఎఫెక్ట్‌తో తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్‌
  • ఆరు జిల్లాలకు ఆరెంజ్‌, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
  • భద్రాద్రి, ఖమ్మం, నాగర్‌కర్నూల్‌, నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌
  • హైదరాబాద్‌, జనగాం, గద్వాల, మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, నారాయణపేట, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి.. ఆరెంజ్‌ అలర్ట్‌

కృష్ణా జిల్లా..

  • దివి సీమలో మోంథా తుపాను ప్రభావంతో కొనసాగుతున్న ఈదురు గాలులు
  • నిన్న మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు
  • అవనిగడ్డ నియోజకవర్గం వ్యాప్తంగా ఈదురుగాలుల కారణంగా విద్యుత్ పునఃరుద్ధరణకు అంతరాయం
  • గాలుల తీవ్రత తగ్గిన తర్వాత విద్యుత్‌ను పునఃరుద్ధరించే అవకాశం

తెలంగాణ ఖమ్మం జిల్లాలో.. 

  • తెలంగాణపై మోంథా ప్రభావం
  • పలు జిల్లాలకు వర్ష సూచన
  • మొoథా తూఫాను దృష్ట్యా (బుధవారం) జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రకటన
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన కలెక్టర్

తెలంగాణ వికారాబాద్ జిల్లాలో.. 

  • మోంథా ఎఫెక్ట్ జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం
  • పూడూరు లో 6.1 cm
  • మోమిన్ పేట లో 6 cm
  • ధారూర్ లో 4.6cm
  • పరిగిలో 4.5cm

కిరండోల్‌ రైల్వే లైన్‌ ధ్వంసం

  • మోంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు 
  • వాల్తేరు రైల్వే డివిజన్‌లో కొత్తవలస-కిరండోల్‌ సింగిల్‌ రైల్వే లైన్‌ ధ్వంసం 
  • అరకు రైల్వే టన్నెల్‌ నెంబర్‌ 32, చిమిడిపల్లి, బొర్రా గుహల మధ్య రైల్వే ట్రాక్‌ పూర్తిగా ధ్వంసం 
  • ట్రాక్‌పై చేరిన మట్టి, బండరాళ్లు 
  • వరద నీరు నిలవకుండా ఏర్పాట్లు చేసిన సిబ్బంది

ఎన్టీఆర్ జిల్లాలో..

  • తిరువూరు నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షం
  • నీట మునిగిన ఆర్టీసీ బస్టాండ్, ప్రధాన రహదారి
  • పలు లోతట్టు ప్రాంతాలు జలమయం

కృష్ణా జిల్లాలో.. 

  • ఉయ్యూరు మండలం గండిగుంట పంచాయతీ కాకాని నగర్ లో మూడు రేకుల షెడ్లు ఇళ్ల పై పడిన చెట్లు.
  • పూర్తిగా ధ్వంసం అయిన ఒక ఇల్లు,
  • పాక్షికంగా మరో రెండు ఇల్లు ధ్వంసం.
  • సహాయ చర్యలు చేపట్టిన అధికారులు

నంద్యాల జిల్లాలో..

  • మోంథా తుపాను కారణంగా ఆత్మకూరు రెవిన్యూ డివిజన్ లోని పాములపాడు, కొత్తపల్లి, వెలుగోడు మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
  • నల్లమలలో కురుస్తున్న భారీ వర్షానికి ఎగువ నుంచి భవనాసివాగు కు చేరుతున్న వరద నీరు.ఉప్పొంగిన వక్కిలేరు, భవనాసి వాగులు..
  • ఆత్మకూరు పట్టణ శివారులోని భవనాసి వాగుపొంగి పొర్లుతుండడంతో సుమారు 22గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
  • జలదిగ్బంధంలో ఆత్మకూరు పట్టణం.
  • కర్నూలు -గుంటూరు జాతీయ రహదారిపై మోకాలికి పైగా పారుతున్న వర్షపు నీరు..
  • వెలుగోడు మండలంలోని మాధవరం వద్ద పొంగిపొర్లుతున్న గాలేరు వాగు, సుమారు 8 గ్రామాలకు నిలిచిపోయిన ప్రజా రవాణా సంబంధాలు
  • లోతట్టు కాలనీలు జలమయం, నిద్రాహారాలు మాని అవస్థలు పడుతున్న ప్రజలు..

విశాఖపట్నంలో..

  • విశాఖ నగరం పై కొనసాగుతున్న తుపాను ప్రభావం. .
  • నిన్న రాత్రి విశాఖలో భారీగా ఈదురు గాలులు
  • గాలులకు శంకరమఠం రోడ్ లో ఇంటిపై కూలిన భారీ వృక్షం.
  • తూటిలో తప్పిన ప్రమాదం
  • పాక్షికంగా ఇల్లు ద్వసం.
  • చెట్టును తొలగిస్తున్న ఫైర్ సిబ్బంది.
  • జోన్ 3 లో ఇప్పటివరకు పడిన 72 నుండి చెట్లును తొలగించిన అధికారులు

విజయవాడలో.. 

  • మోంథా తుపాను ఎఫెక్ట్‌తో విజయవాడలో అర్ధరాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షం

గుంటూరులో.. 

  • గుంటూరు జిల్లాలో భారీ వర్షం
  • ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
  • గుంటూరులో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం
  • నగరంలోని అన్ని ప్రధాన రహదారులు జలమయం
  • పొంగిపొర్లుతున్న ట్రైన్లు
  • బ్రాడీపేట ,అరండల్ పేట, మహిళా కాలేజ్, గుజ్జునుకుంట్ల, ఏటి అగ్రహారంతో పాటు ప్రధాన రోడ్లన్నీ జలమయం
  • RUB తోపాటు 3 వంతెన కిందకు భారీ స్థాయిలో వర్షపునీరు

భారీ వర్షాలు ఎక్కడంటే..

  • శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం
  • కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం

Cyclone Montha Slams AP Coast Photos13

కోనసీమ జిల్లా..

  • అంతర్వేది పాలెం వద్ద తీరం దాటిన మోంథా తుపాను
  • తీరం దాటే సమయంలో 70 నుంచి 80 కిలోమీటర్ల మేర ఈదురు గాలులు
  • కోనసీమలో భారీగా కూలిన చెట్లు
  • పలుచోట్ల ధ్వంసమైన విద్యుత్ లైన్లు
  • రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షాలు కోవడంతో నిలిచిపోతున్న రాకపోకలు
  • పలు ప్రాంతాల్లో కురుస్తున్న చిరుజల్లులు
  • జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో దెబ్బతిన్న వరి పంట
  • పెద్ద సంఖ్యలో కూలిన కొబ్బరి చెట్లు
  • తీర ప్రాంతంలో కొనసాగుతున్న ఈదురు గాలులు
  • అంతర్వేది, ఉప్పలగుప్తం ఓడలరేవు ప్రాంతాల్లో అలకల్లోలంగా ఉన్న సముద్రం
  • ఎగసిపడుతున్న అలలు

విజయవాడ..

  • ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి దంచికొడుతోన్న భారీ వర్షం
  • పలుచోట్ల అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేత
  • విజయవాడలో భారీ వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయం
  • ఆర్టీసీ బస్టాండ్ వద్ద సబ్ వేలోకి చేరిన వర్షపు నీరు
  • సబ్ వే వైపు వాహనాలు వెళ్లకుండా బారికేడ్లు పెట్టిన పోలీసులు
  • కనకదుర్గ ఫ్లై ఓవర్ వైపు వాహనాల రాకపోకలు నిలిపివేత

విజయవాడ..

  • ప్రకాశం బ్యారేజ్ కు పెరుగుతున్న వరద
  • ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 82,675 క్యూసెక్కులు
  • వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల
  • కాలువలకు పూర్తిగా నీటి విడుదలను నిలిపివేసిన అధికారులు

 

  • మోంథా ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కావలిలో అత్యధికంగా 22 సెం.మీ. వర్షం కురిసింది. 

  • మోంథా తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది.  పలు చోట్ల విద్యుత్‌ స్థంబాలు, చెట్లు నేలకొరిగాయి. జాతీయ రహదారిపై రాత్రంతా వాహనాలను ఎక్కడిక్కడే నిలిపేశారు. 

  • మచిలీపట్నంలో.. తుపాను ధాటికి మచిలీపట్నంలో విద్యుత్‌ వ్యవస్థ ధ్వంసమైంది. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

  • నెల్లూరు, బోగూరులో తుపాను ధాటికి గుడిసెలు కుప్పకూఇపోయి ప్రజలు గజగజ వణికిపోయారు

  • ప్రకాశంలో.. 10 అడుగుల మేర అప్రోచ్‌ రోడ్డు కొట్టుకుపోయింది

  • పలు జిల్లాలోనూ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగి రాత్రంతా ప్రజలు అంధకారంలోనే ఉండిపోయారు. పలు జిల్లాల్లో రోడ్లు జలమయమయ్యాయి. 

  • తీవ్ర తుపాన్‌గా తీరం దాటే  కోనసీమలో సముద్రం ఉప్పొంగింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో సముద్రం ముందుకొచ్చింది. మామిడికుదురు మండలం కరవాక, గొగన్నమఠం దగ్గరా ముందుకు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో మత్స్యకార కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

  • తుపాన్‌ ప్రభావంతో.. ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, విశాఖ.. ఇలా 14 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాల ఉంటాయంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement