కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు.. పిటిషన్‌ కొట్టివేత | Telangana High Court Pronounce KCR Power Commission Petition Verdict Updates | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ కమిషన్‌ విచారణ: కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు.. పిటిషన్‌ కొట్టివేత

Published Mon, Jul 1 2024 10:02 AM | Last Updated on Mon, Jul 1 2024 1:12 PM

Telangana High Court Pronounce KCR Power Commission Petition Verdict Updates

సాక్షి హైదారాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వేసిన రిట్‌ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. విద్యుత్‌ కమిషన్‌ విచారణను రద్దు చేయాలంటూ ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ వాదనలతోనే ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం.. కేసీఆర్‌ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు సోమవారం ఉదయం వెల్లడించింది. 

బీఆర్‌ఎస్‌ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్‌, జస్టిస్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ వేసింది. ఈ కమిషన్‌ మాజీ సీఎం కేసీఆర్‌కు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు సైతం జారీ చేసింది. దీంతో.. ఆయన హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేయగా, దీని విచారణ అర్హతపై ఇరు వర్గాలు వాదనలు వినిపించాయి. 

విద్యుత్‌ కొనుగోళ్లలో ఎక్కడా అవకతవకలు జరగలేదని.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్‌ ఏర్పాటైందని కేసీఆర్‌ తరఫు న్యాయవాది ఆదిత్య సోందీ వాదించారు. అయితే.. పద్దతి ప్రకారమే విచారణ జరగుతోందని, ట్రాన్స్‌కో జెన్‌కో అధికారుల్ని సైతం విచారించిందని,ఈ పిటిషన్‌కు అసలు విచారణ అర్హత లేదని ప్రభుత్వం తరుపున ఏజీ సుదర్శన్‌రెడ్డి  వాదనలు వినిపించారు. దీంతో ఏజీ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు కేసీఆర్‌ రిట్‌ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో గులాబీ బాస్‌ తర్వాత ఏం చేయబోతున్నారో? అనే ఆసక్తి నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement