సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. మే 1 నుంచి 19 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. మే 2 నుంచి 20 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ ఉండనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఏప్రిల్ 3న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఒకేషనల్ కోర్సులకు కూడా ఇదే షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
(చదవండి: సిలబస్ సర్దుబాట)
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష షెడ్యూల్
మే 1న ఇంటర్ ఫస్టియర్ పేపర్-2
మే 3న ఇంగ్లిష్ పేపర్-1
మే 5న మ్యాథ్స్ పేపర్-1ఏ,
బోటనీ-1,
సివిక్స్-1
మే 7న మ్యాథ్స్ పేపర్-1బీ,
జువాలజీ-1,
హిస్టరీ-1
మే 10న ఫిజిక్స్ పేపర్-1,
ఎకనామిక్స్-1
మే 12న కెమిస్ట్రీ,
కామర్స్,
సోషియాలజీ
ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్
మే 2న ఇంటర్ సెకండయర్ పేపర్-2
మే 4న ఇంగ్లిష్ పేపర్-2
మే 6న మ్యాథ్స్ పేపర్-2ఏ,
బోటనీ-2,
సివిక్స్-2
మే 8న మ్యాథ్స్ పేపర్-2బీ,
జువాలజీ-2,
హిస్టరీ-2
మే 11న ఫిజిక్స్ పేపర్-2,
ఎకనామిక్స్-2
మే 13న కెమిస్ట్రీ పేపర్-2,
కామర్స్-2,
సోషియాలజీ పేపర్-2
Comments
Please login to add a commentAdd a comment